"ఇప్పుడు కాదులెండి మరోసారి వస్తాను."
"అంటే నేను మరల కాలువలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించినప్పుడా......?" ఎవ్వరూ తనని గమనించలేదనుకుంటూ.
కానీ వరలక్ష్మి అతన్ని క్రీగంట చూస్తూనే వుంది.
"రండి.... "బుంగమూతి పేట్టి మరోసారి ఆహ్వానించింది.
అధికారి సైకిల్ స్టాండువేసి లోపలకు వెళ్ళాడు.
వరలక్ష్మి అధికారిని సోఫాలో కూర్చోబేట్టి తల తుడుచుకోమన్నట్టు చేతికి టవల్ ఇచ్చి వంటింట్లోకి వెళ్ళింది.
మని చేతికి టవల్ ఇచ్చి మరో రెండు నిముషాల్లోనే ఓ మధ్య వయస్సుగల అవిదవచ్చి టీపాయ్ మీద స్వీటు . హాటు, మంచినీళ్ళు పెట్టింది.
ఆమె లోపలోకి వెళ్ళిన రెండు నిముషాల్లోనే ఓ మధ్యవయస్సు గల ఆవిడవచ్చి టీపాయ్ మీద స్వీటు , హాటు మంచినీళ్ళు. పెట్టింది.
వరలక్ష్మి మరోరెండు నిమిషాల్లో తడిచిన యూనిఫారం మార్చిచీరకట్టుకుని వచ్చింది.
"అయ్యా మీరు మరీ మొహమాటస్థులా వున్నారు. ఏం తీసుకోలేదే."
"అబ్బే ఇవేమీ వద్దు. టీ ఇవ్వండి తాగి వెళ్ళిపోతాను."
"మొదటిసారి వచ్చారు తీసుకొండి బాబు" వరలక్ష్మి అమ్మగారు అంది.
"మా మమ్మీ....." వరలక్ష్మి అధికారికి తల్లిని పరిచయం చేసింది.
అధికారి ఆమె మాట కాదనలేక స్వీటు తీసుకున్నాడు.
"వరలక్ష్మిది చాలా సున్నిత హృదయం. ఆమెపట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి సుమా! ఆమె మనసును కష్టపెట్టె ఏ పనీ చేయకండమ్మా!" అధికారి వినీ వినిపించినట్టు ఆమెకు జాగ్రత్తలు చెప్పాడు.
"ఏమిటో బాబు, మీరు చెప్పేది నాకు ఏ మాత్రం అర్ధం కావడం లేదు_ ఎ విషయం గురించి మెరు చెబుతున్నారు?" తిరిగి ఆమె ఎదురు ప్రశ్న వేసింది.
ఇప్పుడు పరిస్థితి అధికారికి ముందు గొయ్యి, వెనుక నుయ్యిలా వుంది. తను అనవసరంగా వరలక్ష్మి విషయంలో తలదూర్చి తప్పుచేశాడా?
"ఏం బాబు చెప్పడం అపారే!"
"అది..... అదా౦డీ......."
వరలక్ష్మి మూడు కప్పుల టీతో వచ్చింది....
"మీరు యింకా చెప్పలేదా?" అధికారి కేసి క్రీంగంట చూస్తూ అంది వరలక్ష్మి.
"మిమ్మల్నే మహాశయా! మా మమ్మీకి విషయం యింకాచెప్పలేదా ?" అని అడుగుతున్నాను.
"ఆ.... అ.... అ చేబుదామనే అనుకున్నాను. కానీ ఈ లోగా మీరురానే వచ్చారు."
అంటే నేను రావడం వలన మొహమాటపడ్డాను అంటారు.".
"అవునండి...... అబ్బే కాదండి" అధికారి నీళ్ళు నలుముతున్నాడు.
"మీ కెందుకులేండి ఆ శ్రమ. నేను మా మమ్మీకి చెప్పేస్తాను. మీరు టీ త్రాగండి" టీ కప్పు అతని చేతికిచ్చింది.
"వరలక్ష్మి చాలా గడుసుపిల్లే . అవిలిస్తే పేగులు సైతం లెక్కపేట్టేయగలదు సుమా! ఆమెలో చలాకీతనంతోపాటు చిలిపితనం కూడా ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి మరి అంత తెలివిగలది ఆత్మ హత్యకు ఎందుకు పూనుకున్నట్టో!
అధికారి టీ త్రాగుతూ అలోచిస్తున్నాడు.
"మమ్మీ! ఈరోజు ఓ చిన్న తమాషా జరిగింది."
"చిన్న తమాషానా! ఈవిడగారూ ఆత్మహత్యకు పూనుకోవడం, నేను ప్రాణాలకు తెగించి కాలువలోకి దూకడం అంతా తమాషానూ?" అధికారి తనలో తానే గొణుక్కున్నాడు.
"ఏమిటో ఏదో మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు. అదేదో పైకి మాట్లాడితే విని మేమూ అనందిస్తాంగా!" వరలక్ష్మి చురకవేసింది.
"ఆ.... ఆ ఏమీ లేదండి నా డ్యూటీ ఎప్పుడాని షిప్టులు లెక్కపేడుతున్నాను."
"అబద్దం ఆడినా అతికినట్టు ఉండాలి సుమా!" వరలక్ష్మి వెంటనే మరో అటాక్ యిచ్చింది. హతోస్మీ మీ ముందు ఏం మాట్లాడినా తంటాలా వుంది!"
"అబ్బే ! ఎందుకయ్యా అబ్బాయిని ఏడిపిస్తావు. విషయం యింకా నాంచకుండా తొందరగా చెప్పు తల్లీ" వరలక్ష్మితల్లి ఆనందంతో అధికారి ఊపిరి పీల్చుకున్నాడు.
"నేను రవీస్ కాలువలోకి దూకాను."
"ఆ.... అదేమిటే తల్లీ..... నువ్వు కాలువలోకి దూకడమేమిటే!"
నువ్వు కంగారుపడకు మమ్మీ, నేను చెప్పేది పూర్తిగా వినుదూకానా, వెంటనే ఈయనగారు అదే మన కధకి హీరోగారు వెంటనే కాలువలోకి దూకి, ప్రవాహానికి ఎదురీది, చాలా వ్యయప్రయాసలకోర్చి, ప్రాణాలకు తెగించి నన్ను మోసుకు వచ్చి గుట్టున పడేశారు. నా ప్రాణంకాపాడిన ప్రాణదాతలు వీరే!"
"అదేమిటే కాలువలోకి దూకడమేమిటి నాకంతా అయోమయంగా వుంది." ఆమె కంగారు పడుతుంది.
"అదేనండి అంటీగారు మీ అమ్మాయి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకొబోయింది" అధికారి అసలు విషయం ఠక్కున ఆమె చెవినవేశాడు.
"అ.... అమ్మా! తల్లీ ! నీకేం కష్టం వచ్చిందని అంత పనిచేశావు తల్లీ" ఆమె కూతుర్ని కౌంగలించుకుని బావురుమంది.
అంటీ! మీరు కంగారుపడకండి. అయిపొయిందేదో అయిపోయింది. ఇక నుంచున్నా మీ అమ్మాయిని జాగ్రత్తగా ఉందమనండి.
పిరికివాళ్ళు.
మాత్రమె సమస్యలను పరిష్కరించుకునే ధైర్యం లేక ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంతకీ మీ అమ్మాయికి వచ్చిన సమస్య ఏమిటో కనుక్కోండి"