"చెబితే మీరు తీరుస్తారా?" చాలా స్పాంటేనియస్ గా రియాక్టు అయ్యిఅంది వరలక్ష్మి.
"నా వల్ల తీరేసమస్య అయితే తప్పకుండా తీరుస్తాను. చెప్పండి మిస్."
"అలాగే! ఏది మాట తప్పనని ప్రామిస్ చేయండి చూద్దాం" అని వరలక్ష్మి చేయి ముందుకు చాపింది.
ఆ మాటతో అధికారి ఖంగుమన్నాడు. తనకే కావలసినవన్నీ సమస్యలు వున్నాయి. పైపెచ్చు తను దారేపోయే సమస్యలకు సైతం తన నెత్తిన వేసుకుంటాడు. కాకాపొతేమరి తను చేసిన పనేమిటి?
తన దేప్పుడూ తొందరపాటే! అన్నిటికీ ముందే కమిట్ అయిపోతాడు ఇప్పుడేం చేయాలి? వెనకడుగు వేయాలా? అంటే ఓ ఆడపిల్ల ముందు తను ఎర్రి వేంగళప్పాలా నీళ్ళు నమలాల్సిందేనా! పోనీ ఆమె ఆశించినట్లే ప్రామిస్ చేస్తే! తీరా ప్రామిస్ చేసి తను మాట తప్పాల్సి వస్తే! ఏమో! తన తొందరపాతుకు తనని తానె నిందించుకున్నాడు.
"అదిగో హీరోగారూ జావకారి పోయారు. కోరమీసాలు రోయ్యి మీసాల్లా క్రిందకి వంగిపోయాయి. ఇదిగొండి అద్దం ఓసారి మీ ముఖం అద్దంలో చూసుకోండి ...." వరలక్ష్మి ఉడికిస్తున్నట్టు అంది.
"నెవ్వర్ నేనేమి జారిపోలేదు. పారిపోలేదు. మీరు అడిగినట్టుగా నేను ప్రామిస్ చేస్తున్నాను. మాట తప్పనుగాక తప్పను" అంటూ తను కూడా చేయి ముందుకు చూపాడు.
ప్రామిస్ చేస్తున్నట్టు.
"థాంక్స్ ... బైదిబై మీకు పెళ్ళి అయిందా?"
"మిస్ మీ సమస్యలని వదిలిపేట్టి నా పెర్సనల్ విషయాలు అడుగుతారేమిటి?" కించిత్తు చిరాకు ప్రదర్శించాడు.
"ఆ! అక్కడేవుంది అసలు సమస్య. ఏమండోయ్ మీరు ప్రామిస్ చేశారు మాట తప్పనని, మరి మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి."
"చెప్పాల్సిందే నంటారు . అయితే చెవులు దగ్గర పెట్టుకుని మరీ వినండి నాకు పెళ్ళి అయింది."
"ఆ! అయ్యిందా? మీ.... మీకు పెళ్ళి అయ్యిందా?" వరలక్ష్మి ముఖంలో విషాదం చోటు చేసుకుంది.
"ఏమిటే ఆ పిచ్చి వాగుడు. ఇంకా నువ్వు చిన్న పిల్లలనుకుంటున్నావా? బాబు మీరు దాని వాగుడుని పట్టించుకోకండి. వసపోసిన పిట్టలా ఏదో ఒకటి వాగుతూనే వుంటుంది. ఎవరైనా కొత్త మనుషులయితే వాళ్ళని పూల్స్ ని చేసేదాకా దానికి కడుపునిండదు"
"నేను అంత ఈజీగా కానులెండీ!"
"ఐసీ ! మీరు ఎప్పుడో పూల్ అయ్యారుగా!" వరలక్ష్మి ఠక్కున అందుకుంది.
"ఆ..... నేను పూల్ అయ్యానా? నాన్ సెన్స్! నేనెప్పుడు పూల్ అయ్యాను!"
"యస్ సర్..... మీరే సర్ పూల్ అయింది."
"ఎప్పుడు? ఎక్కడ?"
"నేను కాలువలోకి దూకింది ఆత్మహత్య చేసుకోవడానికి కాదండీ హీరోగారు......."
"ఆ.... మరి దేనికో?"
"నీటిలో కొట్టుకుపోతున్న ఓ అబ్బాయిని రక్షించడానికి "
"కాలువలో మీరు తప్ప నాకు మరెవ్వరు మునిగిపోతూ కనిపించలేదే?"
"అదే మిస్టరీ ..... ఎవడో ఈడియట్ కాలువలో కొట్టుకుపోతూ రక్ష్మిచండి అంటూ అరిచాడు. అక్కడ డ్యూటీలో వున్న నేను నిజమే ననుకుని కాలువలోకి దూకాను. వాడు ఏంచక్కా ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. తీరా దూకిన తరువాత గానీ నాకు తెలియలేదు ఈతరాదని. ఆ తరువాత కధ మీకు తెలుసాగా....? థాంక్స్ నా ప్రాణం కాపాడారు. ప్రాణదాతలు పదికాలలపాటు సుఖంగా ఉండండి" వరలక్ష్మి ముఖం సీరియస్ అయింది.
"అంటే! మీకు సమస్యలేమీ లేనట్టేనా?" చిరునవ్వుతో అడిగాడు. అధికారి.
తలెత్తి అతనివైపు చూసింది. ఆమె కళ్ళల్లో నీలినీడలు చోటు చేసుకోవడం గమనించాడు అధికారి.
"థాంక్స్ . మీకు స్వీటు ఇచ్చినందుకు, థాంక్స్ మీరు టీ ఇచ్చి నందుకు మెనీ థాంక్స్. మీరు సిపినారికి నా పేరు రికమెండ్ చేసి రివార్డు ఇప్పించినందుకు......"
అధికారి సైకిల్ స్టాండ్ తీశాడు. వరలక్ష్మి అతనివైపు చూస్తుంది. కాని ఇదివరకటి చిలిపితనం, చలాకీతనం ఆమెలో ఇప్పుడు కనిపించలేదు అధికారికి.
"నాకింకా పెళ్ళికాలేదు " వరలక్ష్మికే వినిపించేటట్టు అని సైకిలేక్కాడు అధికారి.
ఆమె కళ్ళలో అనంద బాష్పాలు కిలకిల నవ్వింది. ఆ క్షణంలో నెమలిలా నాట్యం చేయాలనిపించింది. కోయిలిలా కుహురాగాలు తీయాలని వుంది కానీ తను పెళ్ళికానీ ఆడపిల్ల, అంతేకాదు లేది కానిస్టేబుల్ అందుకే అక్కడితో సెన్సార్ అయింది."
ఆమె మదిలో, ఊహల్లో , హృదయంలో అధికారి విహరిస్తున్నాడు. ఆ రోజు రాత్రి ఆమెకు శివరాత్రే అయ్యింది.
అధికారి తన గదికి వచ్చి ప్రశాంతంగా నిద్దరపోయాడు. తనకున్న అనేక సమస్యల్లో ఒక సమస్యకు పరిష్కారం దిరికినందుకు తను జీవిత భాగస్వామిని ఎన్నుకున్నందుకు.
11
ఊహా విందుగా, పసందుగా వుంటుంది.
వాస్తవం వికారంగా, పచ్చిగా వుంటుంది.
అయితే ఈ రెండు తారుమారయినప్పుడు పరిస్థితిఎలా ఉంటుందో.
ఆ గుడిగంటలు మ్రోతకు ఉలిక్కిపడ్డాడు సీతారామయ్య. తన షాపులో తన ముందున్న పాతపుస్తకాల దొంతరవైపు తన దృష్టి మార్చి మార్చి చూశాడు.