10
రవీస్ కాలువ..... ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది.
అక్కడ ట్రాఫిక్ బీటు పాయింటు వుంది. కానీ బీటులో ఉండాల్సిన హొమ్ గార్దో, కానిస్టేబుల్స్ లేరు. ట్రాఫిక్ జామ్ అయింది. జనం కలువగట్టుకేసి పరుగు పెడుతున్నారు.
అటుగా వస్తున్న అధికారికి విషయం అర్ధంగాక తనూ కాలువగట్టు కేసి పరిగెత్తాడు.
అక్కడ దృశ్యం చూడగానే ముందు వెనుక ఆలోచించకుండా అధికారి కాలువలోకి దూకాడు.
ఆ ప్రవాహ వేగంలో కొట్టుకుపోతున్న లేడి కానిస్టేబుల్ వరలక్ష్మి జుట్టు అందుకోగలిగాడు. ఎంతో ప్రాయాసకోర్చి ఆమె ప్రాణాలు కాపాడగలిగాడు.
వరలక్ష్మి ఎక్కి ఎక్కి ఏడుస్తోంది. జనం నోళ్ళు నొక్కుకుంటున్నారు. "ఏం జరిగింది? అసలేం జరిగి౦దమ్మా" అధికారి అత్రుతుగా అడిగాడు. ఆమె సమాధానం చెప్పకుండా కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. "పాపం కాలు జారిందేమో!" "అయితే నేల తప్పిందంటారా ?"
"అటువంటిని కాకపొతే మరేమిటీ పనులు! "
"అయినా పోలీసు ఉద్యోగం చేస్తున్న దానికి ఆ మాత్రం ఆలోచన ఉండనక్కరలా!ముందే జాగ్రత్త పడివుంటే బావుండేది అయినా ఇప్పుడు మాత్రం జాగ్రత్త పడివుంటే బావుండేది అయినా ఇప్పుడు మాత్రం జాగ్రత్త పడాలంటే అనేక మార్గాలున్నాయి. చావటం దేనికి చేతకాక."
"స్టాఫ్ ..... ఐ సే స్టాఫిట్ ...." వరలక్ష్మి హిత్రికల్ గా అరిచింది. ఆ అరుపులకు జనం బెంబేలెత్తాడు.
"ఆడపిల్ల ఆత్మహత్యకు ప్రయత్నిస్తే ఆలోచన కడుపు కాలు జారడం వేపే పోతుందా? మీరు బాగుపడరు. ఈ దేశాన్ని సర్వ నాశనం చేసేదాకా మీరు నిద్రపోరు" ఆవేశంతో వాళ్ళమీద విరుచుకుపడింది.
"ప్లీజ్.... వరలక్ష్మిగారు నా మాటవినండి...... మీరు యూనిఫారంలో వున్నారు. మీరు పోలీసు సంగతి మరచిపోకండి."
"నేనేమి మరచిపోలేదు. ఐనో దట్"
"అబ్బా ముందు మీరు ఇక్కడినుంచి పదండి. ఫోటోగ్రాఫర్లు విలేఖర్లు వస్తున్నారు. ప్లీజ్ పదండి....." హడవిడిగా ఆమెను రిక్షా ఎక్కించాడు అధికారి.
రిక్షా కదిలింది.
"ఆమెకు మీరేమవుతారు?" మఫ్టి డ్రెస్ లో ఉన్న అధికారిని జనం అంతా అనుమానంగా చూశారు.
అధికారి వాళ్ళవైపు సీరియస్ గా చూసి సైకిలేక్కాడు. వరలక్ష్మి సరాసరి కమిషనర్ ఆఫీసు ముందు రిక్షా దిగింది. సైకిల్ మీద ఫాలోఅవుతున్న అధికారి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయ్యింది. తన రిక్షాను వరలక్ష్మి ఇంటికి మాట్లాడాడు. తీరా ఆమె కమిషనర్ ఆఫీసులో వెళ్ళింది. ఏం జరిగితే అది జరుగుతుందని సైకిల్ స్టాండ్ లో ఉంచి కమిషనర్ ఆఫీసులోకి తను బయలు దేరాడు.
తడిచిన బట్టలతో వస్తున్న లేడీ కానిస్టేబుల్ వరలక్ష్మిని, సరాసరి తడిచిన మఫ్టీ బట్టల్లో వస్తున్న అధికారిని అక్కడవున్న సిబ్బంది చూసిమక్కువ వేలు వేసుకున్నారు.
సరాసరి వరలక్ష్మి గన్ మెన్ అడ్డుపడుతున్నా ఆగకుండా కమీషనర్ గారి ఛాంబర్ లోకి వెళ్ళింది.
ఓ పదినిముషాలు గడిచాయి. కమిషనర్ గన్ మెన్ ని పిలిచి అధికారిని తన ఛాంబర్ లోకి పంపమని ఉత్తర్వులిచ్చాడు.
గన్ మెన్ తనని రమ్మన్న విషయం చెప్పగానే తను యూనిఫాం వేసుకు రాకపోవడం పోరాపాటేనని గ్రహించాడు అధికారి. ఇప్పుడు తను చేయగలిగింది ఏమీ లేదు. తనకు తెలిసి తనే తప్పు చేయలేదు. అయినా తను యిప్పుడు డ్యూటీలో లేడు. ధైర్యంగా అడుగు లోపలకు పెట్టాడు.
"కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ నీ ధైర్యసాహసాల గురించి ఇప్పటి వరకు గుక్క తిప్పకుండా వరలక్ష్మి చెప్పింది. ఇందాక ఈ ఐదువందల రివార్డు యిస్తున్నారు. లైఫ్ సేవింగ్ మెడల్ కి నీ పేరును సిఫార్సు చేస్తాను ఓ.కే యూకేన్ గో నౌ."
"సార్..... ఆమె మరల ఆత్మహత్యకు ప్రయత్నిస్తే...."
"చేసుకోదు, ఇప్పుడు చేసుకోమని బ్రతిమిలాడినా చేసుకోదు" కమిషనర్ జోక్ చేస్తూ అన్నాడు.
"ఆ....." అధికారి తెల్లమోహం వేశాడు.
"ఓ.కే వరలక్ష్మి నువ్వుకూడా వెళ్ళొచ్చు....."
ఇద్దరు కమిషనర్ కి సెల్యూట్ కొట్టి బయటపడ్డారు.
అధికారి స్టాండులో సైకిల్ తీశాడు.
"ఏమండోయ్ కనీసం నాకు మీరు థాంక్సు కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు?" వరలక్ష్మి పిలుపుకి సైకిల్ దిగాడు అధికారి.
"థాంక్సు చెప్పాలా? ఎందుకు చెప్పాలి? ఆమాటకొస్తే మీప్రాణాలు కాపాడినందుకు మీరే నాకు రుణపడి వున్నారు! ఇప్పుడు చెప్పండి థాంక్సు మీకు నేను చెప్పాలా లేక మీరే నాకు చెప్పాలా?"
"ఓరి దేవుడో! పొరపాటున అడిగారండీ ! మీ లాజిక్ కి హేట్స్ ఆఫ్. ఇంతకీ పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు."
"పార్టీయా?" అర్ధంకాక అయోమయంలో పడ్డాడు అధికారి.
"అదేనండి. కమిషనర్ దగ్గర 500 రూపాయలు కొట్టేసినందుకు, ఆ తరువాత లైఫ్ సేవింగ్ మెడల్ కొట్టేయబోతున్నందుకు."
అమెవేపు సూటిగా చూశాడు. ఆమె కిలకిల నవ్వుతోంది. ఆమె కళ్ళలో ఆకర్షణ, ముత్యాల్లాంటి పలువరుస, తడిచిన బట్టల్లో కనీ కనిపించినట్టు వున్న ఆమె దేహా సౌ౦దర్యం చూసిన అధికారి కొన్ని క్షణాలు నోటమాటలు రాక గుతకులు మ్రింగాడు.
"డ్రీమ్ బోయ్..... ఏమిటి పగటి కళలు కంటున్నారా?"
"ఆ..... ఆఆ .......కాదు.....లేదు...... ఏమన్నారు" అధికారి తడపడ్డాడు..
"సరిపోయారు..... క్లీన్ బౌల్డ్ "
ఆమె బాష అధికారికి ఇప్పుడు అర్త్ధం అయింది. సిగ్గుపడుతున్న ట్టుగా తల ప్రక్కకు తిప్పుకున్నాడు. అయినా క్రీగంట ఆమెను చూస్తూనే వున్నాడు. ఇద్దరు పక్కే నడుస్తున్నారు. వరలక్ష్మి ఇళ్ళు రానే వచ్చింది. "రండి లోపలకు" ఆమె అధికారిని ఆహ్వానించింది.