Previous Page Next Page 
వరమివ్వని దేవత పేజి 12

    రామారావు నిట్టూర్చి "నీ అభిప్రాయాలంత త్వరగా మారవు"  అన్నాడు.   
    మోహన్ లేచి నిలబడి, "వస్తాను" అన్నాడు.   
    "మా ఇంటికి వెళ్ళదల్చుకుంటే నేను లేనప్పుడు వెళ్ళాక  నే స్నేహం నాతోటిగానీ శ్రీమతితోటి కాదుగదా! నువ్వు పాటించగా పాటించకపోయినా నేను సమాజ న్యానాన్ని పాటిస్తున్నాను కాబట్టి నలుగురూ మెచ్చని పనులు నేను చేయను" అన్నాడు రామారావు.   
    మోహన్ మాట్లాడకుండా వెనక్కు తిరిగాడు.   
    "ఇదిగో __ అన్నట్లు మర్చిపోయాను" అన్నాడు రామారావు మోహన్ వెనక్కు తిరిగాడు. రామారావు చేతిలో చిన్న ప్యాకేజిఉంది.   
    "నువ్వెప్పుడైనా అఫీసీకు వస్తే శ్రీమతి నీ కిమ్మంది అంటూ రామారావు ఆ ప్యాకెట్ అతనికి అందించాడు.   
    మోహన్ ఆ ప్యాకెట్ అత్రుతుగా అందుకుని రామారావు కళ్ళముందే దానిని విప్పాడు. అందులో ఒక చిన్న కార్డు,  ఒక చిన్న భరణి ఉన్నాయి. భరిణి అతనిచ్చినదే! ఆ భరణిలో అతను లతకు బహుమతిగా ఇచ్చిన దుద్దులు ఉన్నాయి.
     కార్డుమీద రెండేరెండు వాక్యాలు వ్రాయబడి ఉన్నాయి "దాహంతో ఉన్నవారి వద్దనుంచి బహుమతి తీసుకోలేను.  నన్ను మన్నించగలరు."   
     మోహన్ ముఖంలో రంగులు మారాయి. భరిణను ప్యాంటుజేబులో తోసి, రామారావు వంక చూస్తూ, "ఈ కార్డుమీద అక్షరాలూ ముత్యాల్లా ఉన్నాయి" అంటూ పెదిమలతావు ఆ అక్షరాలను స్పృశించి ముద్దుపెట్టుకుని, నా ధన్యావాదాలు చెప్పు" అన్నాడు.   
    "నీ కాంప్లీ మెంట్స్ కు చాలా థాంక్సు ! శ్రీమతి కోరగా ఆ వాక్యాలు చింపి అవతల పడేశాడు.
    మోహన్ షరావేగంతో అక్కణ్ణుంచి బయటకు వెళ్ళిపోయి కార్డుని చింపి అవతల పడేశాడు.   
                                  6   
    మా అక్క వస్తోందండీ! ఉత్తరం వచ్చింది " అంది లత.
    రామారావు నిట్టూర్చాడు. లత అక్క మాధవి, లతకంతే  అందంగా ఉంటుంది, అమెదో విచిత్రమైన విషాదగాధ!   
    మాధవిని కాలేజీలో ఓ దామోదరం ప్రేమించాడు. మాధవికి అతడంటే అయిష్టం లేదు. అందువల్ల మాధవిని పెళ్ళి చేసుకుంటానన్నాడు.  తల్లితండ్రులను అడగమంది మాధవి. అతను అడిగాడు. కులంపేరు కాబట్టి  వీల్లేదన్నారు మాధవి తల్లిదండ్రులు ఈ పెళ్ళి జరిగితే లతకు వివాహం కాదని భయపడి, మాధవికూడా తల్లిదండ్రుల మాట కాదనలేదు.   
    దామోదరం మనిషి బాగుంటాడు. మాధవికి ఈడూ _ జోడూ బాగుంటుంది. అతనికి ఆర్ధిక పరమైన ఇబ్బందులు లేవు. లత పెళ్ళి బాధ్యత తనే తీసుకుంటానని అతను మాటిచ్చాడు. అయినా ఆ పెళ్ళి జరగడానికి వీల్లేదని మాధవి తల్లిదండ్రులు శాసించారు. అప్పుడు దామోదరం, మాధవిని రహస్యంగా పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. చేసుకుని ఆమె అతనికి సహకరించలేదు.   
    దామోదరం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని మాధవి తల్లిదండ్రులు గ్రహించారు. మాధవిమీద నమ్మకమున్నప్పటికీ ఆమెపై కట్టుదిట్టాలు పెంచారు. త్వరగా పెళ్ళి సంభందాలు  చూడనారంభించారు. ఆ విధంగా వెంకట్ వారి దృష్టిలో కి వచ్చాడు.   
    వెంకట్ మధ్యతరగతి ఇంత పుట్టి కష్టపడి చదువుకుని పైకోచ్చాడు. స్కాలర్ షిఫ్ మీద పై చదువులకోసంఅమెరికా వెళ్ళిపోతున్నాడు అక్కడ కనీసం మూడేళ్ళు గడపాలి. అందువల్ల అమెరికా వెళ్లేముందు పెళ్ళి చేసుకోవడం అతనికిష్టం లేదు అమెరికా వెళ్ళడానికి అతనికి ముందుగా ఏడెనిమిదివేల రొక్కము అవసరముంది. ఆ డబ్బు అప్పుగా తీసుకుని వెడితే ఏడెనిమిది నెలల్లో  తీర్చగాలనన్న ధైర్యంతో అతనున్నాడు.   
    విదేశాలు వెడుతున్న కొడుక్కి దేశంపట్ల బాధ్యత పెంచాలంటే అతనికి పెళ్ళి చేయాలనీ తల్లితండ్రులు అనుకున్నారు. పెళ్ళికాకుండా అక్కడికి వెడితే అక్కడి వాతావరణానికీ  అలవాట్లకు చెడిపోయి కొడుకు ఎప్పటికీ తమవాడు కాకుండా పోతాడేమోనని నా భయం. వారి ఈ భయానికి కారణంగా ఎన్నో ఉదాహారణలున్నాయి. అందువల్ల వాళ్ళు కొడుకు విదేశాలకు వెళ్ళేలోగా పెళ్ళి చేసుకోవాలని పట్టుబట్టారు.   
    ఈ పరిస్థితుల్లో వెంకట్ మాదివిని చూశాడు. మాధవి అపూరూపసౌ౦దర్యం తాత్కాలికంగా  అతన్ని పెళ్ళికి సుముఖణ్ణి చేసింది. పెళ్ళికి వచ్చిన కట్నం అతని ప్రయాణపుటేర్పట్లును సుకరం చేసింది. వెంకట్ కూ, మాధవికీ వివాహం జరిగిపోయింది. ఆరునెలలపాటు వాళ్ళు సుఖమైన దాంపత్య జీవితం అనుభవించా మాధవిని వదలలేక వదిలి విదేశాలకు వెళ్ళాడు. వెంకట్.
   
    అమెరికా చేరుకోగానే వెంకట్ మాధవికి ఉత్తరం రాశాడు. మాధవి అతనికి జవాబు రాస్తూ, తను నేలతప్పిందని, అనుమానం ఉన్నట్లు రాసింది. ఆ తర్వాత వారిద్దరిమధ్యా తరచుగా ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతూండేవి.
    వెంకట్ అమెరికాకు వెళ్ళిన ఎదినేలలకు కాబోలు మధావి పండంటి కొడుకు పుట్టాడు. ఈ వార్తావిని సూచిస్తూ ఉత్తరం రాశాడు వేరే పార్సిల్ లో కొన్ని బొమ్మలు కూడా పంపాడు. 

 Previous Page Next Page