"నావీపు అంతా వదలకుండా గిచ్చిపైగా ఏం తెలియనట్టు ఫోజు?"
"ఛ! ఛ! నేను గిచ్చడం ఏమిటి డార్లింగ్"
"నమ్మకపోతే ఇదిగో చూడండి" అంటూ తన పమిటను నాజుగ్గా జార్చి తన వీపును అతని వైపుకి త్రిప్పింది చూడమన్నట్టు......
నిజమే తెల్లని ఆమె శరీరం అక్కడక్కడా ఎర్రగా కమిలిపోయివుంది. క్షణం అతని భ్రుకుటి ముడిపడింది. ఓ క్షణం ఆలోచించాడు.
అంతే వెంటనే అతడు ఆమెను రెండు చేతులతో ఎత్తి సోఫాలో కూర్చోబెట్టాడు. అతని చేష్టలకి ముసి ముసిగా నవ్వుతుందామె జారిపోయిన తన లుంగీని సరిచేసుకుని పరుపును ఎత్తి నేలకేసి కసిగా బాదాడు. అంతే పరువు అంచునుంచి టపటప నాలుగైదు నల్లులు కిందపడ్డాయి.
అతను కసిగా కళ్ళతో వాటిని నేలకేసి తోక్కేశాడు. తన ప్రియాతిప్రియమైన తన ప్రియురాలి శరీరాన్ని ముట్టుకున్నందుకాదు. కసుగా కాటేసినందుకు, ఆమె రక్తాన్ని జుర్రుతున్నందుకు. కసిగా మరింత కసిగా నేలకేసి కాళ్ళతో వాటిని నలిపి పారేశాడు. ఇప్పుడు ఏదో జయి౦చినట్టు గర్వంగా తలతిప్పి ఆమె వైపు చూశాడు. ఆ చూపుల్లో జాలివుంది అంతకుమించి ప్రేమ వుంది.
అంతే అతను ఒక్క ఉదుటున ఆమెను సమీపించి ఆమెను తిరిగి పరుపు మీదకు చేర్చాడు. జారిన పమిటని లాగాడు. ఆమె చేర కుచ్చీళ్ళు ఊడాయి.
బయట బజర్ మ్రోగింది. ఒకసారికాదు, రెండుసార్లు కాదు, కంటిన్యూగా మ్రోగుతూనే వుంది. ఆమె కంగారుగా లేచి చీర సరిచేసుకుంది. అతను లుంగీ కట్టుకుని, షర్టు వేసుకుని చిరాగ్గా వెళ్ళిడోర్ తెరిచాడు.
ఎదురుగుండా ఎ.సి.పి. శ్రీకళ, ఇన్స్ స్పెక్టర్, సిబ్బంది ఉన్నారు అతని ముఖంలో రంగులు మారాయి. అప్పటిదాకా త్రాగిన నిషా అంతా ఒక్కసారిగా దిగిపోయింది.
"మీరా.... మేడం మీరు ఈ సమయంలో ...." అప్పుడు సమయం అర్దరాత్రి దాటి రెండుగంటలు అవుతుంది......
"షటప్ .... యూ రాస్కెల్...." ఎ.సి.పి. శ్రీకళ అతని కాలర్ పట్టుకుని అతని
లెంపమీద కొట్టింది.
"మేడమ్ మీరు హద్దు మీరారు..... నేను చేసిన నేరం ఏమిటి? అయినా ఈ సమయ౦లో నన్నెందుకు డిస్టర్బ్స్ చేసినట్టు?" అతని కళ్ళు ఎర్ర చింతనిప్పుల్లా వున్నాయి.
"యూ బ్రూట్ నువ్వు చేసిన నేరం ఏమిటో నా నోటితో చెప్పాలా? ఇద్దరు గూండాలను నీ అనుచరులతో చంపించినందుకు నిన్ను అరెస్టు చేస్తున్నాను....."
"సారీ మేడమ్ నేను చంపినట్లు సాక్ష్యం వుందా?"
సాక్ష్యం ..... సాక్ష్యం కావాలా నీ మొహానికి, అదిగో అదిగో సాక్ష్యం నీ పక్కలో బరితెగించి పడుకుందే అదే సాక్ష్యం భర్తని, మరిదిని నమ్మకంగా వేయించిన వగల రాణి. రావే రా! ఇన్స్ స్పెక్టర్ వీళ్ళిద్దరికీ కలిపి చేతులకు బేడీలు వేయండి. అంతా వీళ్ళని చూసి 'ధూ' అని వాళ్ళు ముఖాన ఉమ్మివేయాలి."
"అమ్మా ఎ.సి.పి. తల్లీ నువ్వు కొత్తగా వచ్చావు నా గురించి నాకు హై కమాండ్ లో ఉన్న పరపతి గురించి నీకు తెలియకపొతే మీ ఇన్స్ స్పెక్టర్ ని అడిగి తెలుసుకో. లేకపోతె నాకు జరిగిన పరాభావానికి రాబోయే కాలంలో నువ్వు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది."
"పోరా! పోరా బేవార్సు నాయాలా నీ లాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నీ దిక్కున్నచోట చెప్పుకో....." అంటూ అతని మెడనుంచి మోచేత్తో వీపుమీద నాలుగు వడ్డించింది.
"అమ్మా...." అంటూ బెనర్జీ నేల కరుచుకుపోయాడు.
"మేడమ్ దెబ్బ గట్టిగా తగిలినట్టుంది. స్పృహా తప్పాడు. "ఇన్స్ స్పెక్టర్ కంగారుగా అన్నాడు.
"భయపడుతున్నారా? లాకప్ డెత్ అవుతుందేమోనని అందోళన చెందుతున్నారా? మీరేమీ భయపడనక్కర్లేదు. రేపు ఎదివచ్చినా చూసుకుంటాను. అన్నింటిని నేనే ఫేస్ చేస్తాను. వీళ్ళిద్దర్నీ నేనే అరెస్టు చేస్తాను.... కానిస్టేబుల్స్ ......"
కానిస్టేబుల్స్ అతని ముఖం మీద నీళ్ళు చల్లారు. బెనర్జీ స్పృహాలోకి వచ్చాడు. బెనర్జేకి అతడి ఉంపుడుగత్తెకు కలిపి బేడీలు వేసి జీపు ఎక్కించింది ఎ.సి.పి. శ్రీకళ.
జీపు కొండపల్లి అడవుల వైపు తిప్పింది ఎ.సి.పి శ్రీకళ . ఆమె చర్యలకి ఇన్స్ స్పెక్టర్ టో పాటు మిగిలిన సిబ్బంది అంతా అయోమయంలో పడిపోయారు.
బెనర్జీ అప్పటివార్కు హార్టు కంప్లయింట్ లేదు. కానీ ఎ.సి.పి స్పీడు చూశాక తనకి హర్తు కంప్లయింట్ కాక ఎకంగా గుండే ఆగిపోతుందన్న భయం పట్టుకుంది.
"అయిపోయింది. తన రౌడీ జేవితం, రాజకీయ చరిత్ర కొండపల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ పేరుతో ముగిసి పోతుందా?" బెనర్జీ ఆలోచనలో పడ్డాడు.
ఇప్పుడు తను ఎంత పెద్ద రౌడీ అన్నది ముఖ్యంకాదు. తన వెనుక పెద్ద పెద్ద రాజకీయ నాయుకులు ఉండొచ్చు. కానీ అవసరానికి ఇప్పుడు ఒక్కడు తన ప్రక్కన లేడు. కలసిరానప్పుడు వసుదేవుడంత వాడే గాడిదకాళ్ళు పట్టుకున్నాడు. తను ఇంకా ఆలోచించి లాభంలేదు.
"అమ్మా..... ఎ.సి.పి. తల్లీ నాకు ప్రాణ భిక్ష పెట్టామ్మా" బెనర్జీ బావురమన్నాడు.
ఊహించని ఆ పరిణామానికి సిబ్బంది అంతా ఆశ్చర్యపోయారు నడిరోడ్డుమీద ఇప్పటివరకు పది మర్డర్లు చేసిన పేరు మోసిన రౌడీ బెనర్జీ ఏనా చిన్నపిల్లాడిలా ఏడుస్తుంది!
"యస్.... ఇది కేవలం కొసరు మాత్రమె. అసలు, వడ్డీ ముందు వుంది......" ఎ.సిపి పకపకా నవ్వింది . ఆమె ఎంత ఆపుకుందామన్నా నువ్వు ఆగడంలేదు.
జీపు కొండపల్లి ఖిల్లా రోడ్డు ఎక్కింది. సరాసరి ఖిల్లా దాటి పాడుబడిన బంగ్లాముందు ఎ.సి.పి. జీపు ఆపింది.
అక్కడ సిటీ కమిషనర్ విక్రం ఎ.కె 47 రైఫిల్ తో వున్నాడు. కమిషనర్ చూడడంతోనే బెనర్జీ స్పృహా తప్పాడు.