Previous Page Next Page 
వరమివ్వని దేవత పేజి 11

    "వెరీసారీ  లతా! తప్పు చాలావరకూ నాదే. ముందుగానే అతని గురించి నీకు చెప్పాల్సింది ఇప్పుడైనా నీకో హామీ ఇస్తూన్నాను. నాకై నేను అతడ్ని మన మధ్యకు తీసుకురాను. కానీ అతడు వస్తానంటే వారించాను" అన్నాడు రామారావు.   
                                                                     5   
    "మీ కోసం ఎవరో వచ్చారండి" అన్నాడు ప్యూన్ .   
    "పేరు?"   
    "మోహనటండీ!   
    "లోపలికి పంపించు" అన్నాడు రామారావు.   
    మరోనిముషంలో మోహన్ లోపల ప్రవేశించాడు.   
    "కూర్చో!" అన్నాడు రామారావు.   
    "నన్ను చూస్తె నీ ఆశ్చర్యంగా లేదూ?" అన్నాడు మోహన్.   
    "ఎందుకు?" అన్నాడు రామారావు.   
    "మొన్నరాత్రి ఊరొవదలి  వెళ్ళిపోతున్నాను గదా" అన్నాడు.   
    "అవుననుకొ. కానీ  అందానికి బహుమతివ్వడం కోసం ప్రయాణం వాయిదా వేసుకున్నావు గదా" అన్నాడు మోహన్.
    "అయితే నీ భార్య నీకు అంతా చెప్పిందా?" అన్నాడు మోహన్. అతను కాస్త దెబ్బతిన్నట్లు కనబడ్డాడు.   
    "మాది దాపరికంలేని ప్రేమ" అని నవ్వాడు రామారావు.   
    "అయితే ఏం చెప్పిందో చెప్పు" అన్నాడు మోహన్. అతని కళ్ళలో కాస్త ఆశ ఉంది.   
    రామారావు తూచా తప్పకుండా జరిగినిదంతా వివరంగా చెప్పాడు. మోహన్ అంతావిని 'డామిట్ కధ అడ్డం తిరిగింది.' అనుకున్నాడు. ఇదివరలో ఒక స్నేహితుడ్ని భార్యనతనిలాగే లోమ్గాదీసుకున్నాడు.   
    ఎవరూలేని సమయంలో ఏదో వంకతో ఆమె ఇంటికివెళ్ళి కాసేపు అవీ ఇవీ మాట్లాడి, హఠాత్తుగా ఆవేశపడ్డట్లు నటించి ఆమెను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె విడిపించుకునెందుకు ప్రయత్నించేలోగా తనే విడిపించుకుని సారీ అని వెళ్ళి పోయాడు. ఆ తర్వాత ఆమె భర్తను కలుసుకున్నప్పుడు అతని మతాలణుబట్టి ఆమె భర్తకు ఏమీ చెప్పలేదని నిర్ణయించుకున్నాడు. మరోసారి ఏదో వంక పెట్టుకుని ఆమె ఇంటికి వెళ్ళి, కేవలం క్షమార్పణ చెప్పుకునేందుకు వచ్చానన్నాడు. ఆమె ఎంతో జాలిపడింది. ఆమె అందాన్ని అమితంగా పొగిడాడు. శ్రీరామచంద్రుడివంటి ఏకపత్నీ వ్రతుడ్నిక్కూడా మనసు చలిపజేసే ఆమె అందం చూసి ఏ మగవాడికైనా మతులు పోతాయన్నాడు. ఆమె కాస్త ఇబ్బందిగానూ, సంతోషంగానూ అ పొగడ్తలు వింది. వచ్చింది క్షమార్పణ చెప్పుకోడానికే అయినా మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండలేకపోతున్నానానంటూ మళ్ళీ కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె అంతగా అభ్యంతరంపెట్టినట్లు అతనికి అనిపించలేదు. అలా పరిచయం పెరిగింది. ఆమె లొంగిపోయింది.      
    ఇక్కడ ఆదిలోనే హంససాదు" అనుకున్నాడు మోహన్   
    "నేను చెప్పిందాట్లో ఏమైనా అబద్దముందా?" అన్నాడు రామారావు   
    మళ్ళీ మోహన్ కళ్ళు మెరిశాయి. "ఉందని నీ అనుమానమా?" అన్నాడు.   
    "లేదు. ఉందని నువ్వంటే నువ్వు అబద్దాలు కూడా చెబుతానని అనుకుంటాను,"   
    మోహన్ విషాదంగా తలాడించి, "నన్ను క్షమించు రామారావ్! నాలో ఆ బలహీనత వుంది. నిన్నూ, నీ భార్యానూ నేను మనసారా అభినందిస్తున్నాను. ఇక నే నెప్పుదోఒ మీ మధ్యకు తాను...." అన్నాడు.
    "లేదు మోహన్! నీకు మా ఆహ్వానం ఎప్పుడూ ఉంటుంది." అన్నాడు రామారావు.   
    "మీ మధ్యనేనుంటే  నా ప్రవర్తన మీకు బాధ కలిగించవచ్చు. " అన్నాడు మోహన్.   
    రామారావు జాలిగా మిత్రుడివంక చూసి, "క్రూరమృగాలని మనుషులు బోనులలో పెడతారు. నిన్ను నువ్వే బోనులో ఉంచుకోడానికి ప్రయత్నిస్తున్నావు. మావంటి మనుషుల మధ్య స్నేహిరుడిలా ఎందుకుండకూడదు?" అన్నాడు.   
    "అలా నాకు ఆకాశానమిచ్చిన వాళ్ళు తక్కువ. ఇచ్చిన వాళ్ళంతా దెబ్బతిన్నారు."   
    "పోనీ నేనిచ్చిన అవకాశం ఉపయోగించుకుని బుద్ధిగా ఉండరాదూ?"   
    "మీ శ్రీమతి నన్ను మళ్ళీ నీ ఇంటికి రానిస్తుందా?"   
    "తప్పకుండా?"   
    మోహన్ కళ్ళు మెరిశాయి. "ఆమె నాగురించి చెప్పి, నన్ను తిట్టలేదా?"   
    "తిట్టలేదు కానీ నీకు మంచి పేరు పెట్టింది."   
    "ఏమిటది?"   
    "రావణాసురుడు" అన్నాడు రామారావు నవ్వుతూ.   
    మోహన్ ముఖం పాలిపోయింది "ఎందుకని నాకా పేరు?"   
    రామారావు వివరించాడు.   
    "పోనీలేద్దూ, నాకా జీవితమే ఇష్టం! బ్రతినంత కాలమూ రావణాసురుడు విలాస జీవితాన్ననుభవించాడు" అన్నాడు మోహన్.   
    "కానీ రావణాసురుడికి పతనం తప్పలేదు."   
    మోహన్ ముఖంలో ఆవేశం కనబడింది. "రావణాసురుడికి పతనం ఎప్పటికి వచ్చింది? కొన్ని వేళ ఏండ్లపాటు తనకు తోచినరీతిని విలాసజీవితం అనుభవించేక. ఆ వయసులో ఎలాగూ చావుతప్పదు. ఏకపత్నీ వ్రతం నమ్ముతున్న రాముడికేంజరిగింది పెళ్ళి కాగానే అడవులపాటు. అక్కడ కొన్నాళ్ళుండేసరికి పెళ్ళాన్నేత్తుకుపోయాడు. యుద్ధం చేసి భార్యను సంపాదించుకుని అయోధ్యకు తిరిగివచ్చేక అపవాదు పేరుతో పెళ్ళాం మళ్ళీ అడవులపాలు, సీతా!" అని ఏడవడంతోటే అయన బ్రతుకు సరిపోయింది." 

 Previous Page Next Page