8
పోలీసు కమిషనర్ ఛాంబర్.
సబ్ ఇన్స్ స్పెక్టర్ నుంచి పై రాంకు ఆఫీసర్లు అంతా మీటింగులో ఉన్నారు. గదిలో ఎ.సి. రన్ అవుతున్న శబ్దమినామరే శబ్దం వినిపించడం లేదు. ఎవరికీ వాళ్ళు తెలు కుట్టిన దొంగల్లా తల వొంచుకుని చూపులు, ఫైల్స్ మీద ఉంచారు.
"షేమ్! షేమ్! బ్లడీ షెమ్ అన్ యువర్ పార్ట్...... ఇదేమన్నా పంజాబా, కాశ్మీరా! ఛ! ఛ! పట్టపగలు రెండు హత్యలు .... సిగ్గు, సిగ్గు!"
చంపింది ఎవరో తెలుసా?"
ఒక్కరుకూడా నోరు మెదపలేదు.
"చంపింది బెనర్జీ ..... బెనర్జీ మనుషులు.... బ్లడీ రౌడీ షిటర్స్ యూనో...... బ్లడీ రౌడీ షీటర్స్...... యాయ్ సౌత్ ఇన్స్ స్పెక్టర్ .....
"సార్ ..."
"నీకు ..... తెలుసా?"
"సార్...." అతని నోటివెంట సార్ తప్పించి మరోమాట రావడం లేదు.
"నీకేం తెలుసు _ వంకాయ పులుసు. రెండుపూటలు మేక్కడం అప్పనంగా దొరికితే మందుకొట్టిగుర్రుపేట్టి నిద్రపోవటం, ఏవయ్యా...... ఏ ఏరియాలో రెండు హత్యలు జరిగితే నీకు చీముకుట్టినట్టు కూడా లేదే! రెండు నిండు ప్రాణాలు బలైపోయారయ్యా!"
"సార్ వాళ్ళు..... వాళ్ళు...." ఎ.జి.ఏస్. ఇన్స్ స్పెక్టర్ నోరు పెగలడం లేదు.
"యస్..... వాళ్ళు..... ఏస్.....వాళ్ళు రౌడీలు, గూండాలు, వెధవలు అంటావు _ అంటే ఈ దేశంలో రౌడీలు, గూండాలు, వెధవలు జీవిందాడానికి వీల్లేదనా నీ అభిప్రాయం ...."
"సార్.... సార్" ఎజీఎస్ సిబి ముఖం పాలిపోయింది.
"యస్..... చనిపోయింది రౌడీలే.... చంపింది రౌడీలే ...... కానీ మీ డ్యూటీ మీరు చేశారా?"
కమిషనర్ ముఖంలో రంగులు మరాతున్నాయి. గొంతు స్థాయి పెరుగుతోంది. అపీసర్లలో ఎవరు బలిపోతారోనన్న భయంతో అంతా బిక్కుబిక్కుమంటున్నారు.
ఏయ్..... యాంటీ గూండా స్క్వాడ్ .... ఏమయింది. మీ స్క్వాడ్ నిద్రపోయారా? మీ డ్యూటీ ఏమిటి? రౌడీలను అదే చచ్చిన వాళ్ళను చంపినా వాళ్ళని ఒక్కసారి అయినా చెక్ చేశావా? నీ అఫీసుకు రప్పించావా? కోటింగ్ ఇచ్చావా?......
ఊ.... హు.... అదీ నువ్వు చేసివుంటే ఈరోజు వాళ్ళు అంత బరితెగించి నరికేవాళ్ళు కాదు.....
అంతా ఊపిరి పీల్చుకున్నారు. తప్పంతా యాంటీగూండా స్క్వాడ్స్ ఇన్ స్పెక్టర్ మీదకు పోయినందుకు అంతా మనసులోనే దేవుళ్ళకి దందాలపెట్టుకున్నారు. అంటే ఆ స్క్వాడ్ ప్రత్యక్షంగా కమిషనర్ కంట్రోలు లోనేవుంటుంది. బాధ్యతానంతా అంతా తెలివితక్కువుగా కమిషనర్ తనమీద వేసుకున్నట్టూ? అలా అలోచించగానే ముఖాల్లో అందోళన చోటుచేసుకుంది.
"సౌత్ ఇన్స్ స్పెక్టర్" కమిషనర్ గొంతు ఖంగుమంది. "అయిపోయాడు...... సౌత్ ఇన్స్ స్పెక్టర్ దొరికిపోయాడు...." హమ్మయ్య అనుకున్నారు మిగతా అపీసార్లు యాంటీగూండా ఇన్స్ స్పెక్టర్ బ్రతుకు జీవుడాఅన్నట్టు ఊపిరి పీల్చుకుని చతికిల బడ్డాడు.
"హత్య జరిగింది నీ ఏరియాలో? చచ్చింది నీ ఏరియాలో ఉంటున్న రౌడీలు! చంపింది నీ ఏరియాలో ఉంటున్న రౌడీలే ? కానీ హత్యలు జరిగేవరకు, రిపోర్టు వచ్చేవరకూ నీకు వాళ్ళా గురించి, వాళ్ళా వ్యూహం గురించి తెలియదు. నువ్వు సౌత్ లో సంవత్సరంనుంచి పనిచేస్తున్నావు. కనీసం వాళ్ళ ముఖాలను ఒక్కసారి అన్నా చూశావా? చూసి ఉండవు! కానీరికార్డుల్లో మాత్రం చెక్ చెసినట్టు ఉంటుంది. ఇంట్లో కూర్చుని లంచాలు తేసుకుంటున్న నీకు స్టేషన్లో ఏం జరుగుతుంది, నీ ఏరియాలో ఏం జరుగుతుంది పట్టాడు. ఇక నీ సిబ్బంది ఎస్ ఐలు, నీ మాటేం వింటారు నీకన్నా రెండాకులు ఎక్కువ చదివినట్టు ఏకంగా స్టేషన్ రైటర్లకు స్టేషను అప్పగించి ప్రైవైటు పంచాయితీలు, సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు...."
"సార్.... ఎ.సి.పి. సుధాకర్ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు.
"నువ్వు.... నువ్వొక వేస్ట్.... అమాయకలను గుండుగీయించి మీసాలు మేలేస్తావు. అయిపోయిందీ నీ పని అయిపోయింది సస్పెన్షన్ ఆర్డర్స్ తీసుకోవడానికి ధైర్యంగా వుండు! అంతటిలో పొతే ఫరవాలేదు. నువ్వు గుండు గీయించిన విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పోయిపోయిస్టూడెంట్స్ తో పెట్టుకున్నావు. వాళ్ళ డిమాండ్ ప్రకారం మీ మీద రేపో మాపో కేసు పెట్టాల్సివచ్చినా రావొచ్చు. పో! పో! పోయి యాంటీ పేటరీ బెయిల్ కు ప్రయత్నించు....."
అంతే "సారీ సార్....." అంటూ ఎసిపి సుధాకర్ కుర్చీలో కూలబడ్డాడు.
"ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయకపోవడం వల్లనే ఈ హత్యలు జరిగాయి. పొండి.... ఇప్పటికైనా ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమమగా చేయండి. జరిగినదానికి యాక్షన్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ సివియర్ గానే వుంటుంది." మీటింగు నుంచి కమిషనర్ వెళ్ళిపోయాడు.
9
హొటల్ రంభ ఇంటర్నేషనల్
ఎ.సి. రూం నెంబర్ 209 డోర్ కి బోర్డు తగిలించివుంది.
దానిమీద "హానీమూన్ _డోంట్ డిస్టర్బ్స్ " అని రాసి వుంది.
గదిలో....
"అబ్బా..... చిలిపి"
"అమ్మో! నా వీపు అంతా పచ్చి పుండయిపోయింది. ఇక మీరు గిచ్చడం ఆపుతారా...." తన వీపుచుట్టూవున్న ప్రియుడి చేతిని తీస్తూ అందా ప్రియురాలు.
"వాట్ వాట్ నేను గిచ్చుతున్నానా?'