ఒక్క కుదుపుతో బాల్కానీపై నుంచి కిందికి పడిపోయిన రణధీర్ అర్తనాతం ఆ నీరవనిశీధిని దారుణంగా వణికించింది.
* * * *
ఉదయం ఎనిమిది గంటల సమయం.
కడలికి వీడ్కోలు చెప్పిన సూర్యుడు కళల పట్టుకుచ్చుల మధ్య నుంచి నింగి నేస్తం చేతినందుకుని కిరణాలను నెలకి ప్రసరింప చేస్తూ ప్రకృతికి తన ప్రేమను చెబుతున్నాడు.
బెడ్ పైన పడుకున్న సుదర్శనరావు రిటెన్ మెడికల్ చేకఫ్ పూర్తీ కాగానే పైకి లేవబోతుంటే "లాభంలేదు" అంటూ వారించాడు డాక్టరు దినకర్రావు తన అలవాటైన ధోరణీలో.
సుమారు అరవై ఏళ్ళు పైపడ్డ దినకర్రావు సిటీలో మంచి పేరున్న ఫిజిషియన్ మాత్రమె కాదు, సుఅద్ర్శనానికి రెండు దశాబ్దాలుగా ఫామిలీ డాక్టరూ., అంతకు మించి మంచి స్నేహితుడూను. ఆ వయసులో కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడే దినకర్రావు టెన్షన్ అన్నది ఆరోగ్యానికి మంచిది కాదంటూ తను చాలా టెన్షన్ కి గురవుతూ అతనికి తెలిసిన మెడికల్ సైన్సు గురించి అద్భుతంగా వుపన్యసిస్తు౦టాడు.
"మీరు మరో రెండు వారాలు రిలాక్స్ అవకుండా మళ్ళీ బిజినెస్ యావలో పడితే అస్సలు లాభంలేదు ....."
"దినకర్ ......" విస్సుగ్గా అన్నారు సుదర్శనరావుగారు. "ఒకపక్కనా ఆరోగ్యానికే ఢోకా లేదంటూనే నన్నిలా రేస్ట్రి చేయడం నాకేం నచ్చటం లేదు."
"అలా అంటే అస్సలు లాభం లేదు. మెడికల్ సైన్స్ ఏం చెబుతూంది? ఒకసారి గుండెకి ఏమాత్రం అనారిగ్యం కలిగినా సదరుపేషెంటు లైఫ్ ఫిలాసఫీలో మార్పు రావాలీ అంటుంది. ఇక్కడ మీలాంటి వాళ్ళు అర్జెంటుగా ఒత్తిడి చూపించాల్సింది బిజినెస్ వ్యవహారాల్లో కాదు. బరువు తగ్గించుకునే శారీరకమైన వ్యాయమంలో ..... హైపవర్ టెన్షన్ నియంత్రించుకోవడంలో."
రికార్డర్ అన్ చేసినట్టు దినకర్రావు మూడ్ లో కెళ్ళిపోతుంటే "మిస్టర్ దినకర్ ......" వారించబోయాడు సుదర్శరావుగారు.
"లాభంలేదు. మీ బిజినెస్ ఎంపైర్ లో ఎగ్జిక్యూటివ్స్ ను అదర గొట్టినట్టు నన్ను నిలదీయాలని ప్రయత్నిస్తే అస్సలు లాభంలేదు." అప్పటికే పూర్తిగా ఊపులో వున్నాడు డాక్టరు దినకర్రావు "అసలు ఈ గుండె జబ్బులకి మూలం ఎక్కడ? శారీరక మానసిక అలజడులు మనిషి ఆరోగ్యంపైన ఎలా పని చేస్తూంటాయి.? ఇది ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం."
సుదర్శనరావుగారు శాతించడంలో ఒక ఉత్తమశ్రోత లభ్యమైనంత ఆవేశంలో చెప్పుకుపోయాడు. "ఆవేశం భయం, ఉద్విగ్నత లాంటివి కలగ్గాన్నే సెరిబ్రల్ కార్దేక్స్ గ్రహించి వెంటనే "హైపోతాల మస్ ' కి సందేశాల్ని పంపుతుంది. ఇది కూడా మీ సంస్థలో కమ్యూనికేషన్ సిద్ధం లాంటిదే. వెంటనే అది ఎడ్రినల్ సర్క్యిలర్ అందిస్తుంది. సరిగ్గా అప్పుడు ఎడ్రినల్ గ్రంధినుంచి ఎడ్రినలిన్, నోరాడ్రినలిన్ అనబడే రెండు హార్మోన్స్ విడుదులవుతాయి రక్తంలో. ఇవి లివరులో గ్లూకోజ్ ని ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ రక్తం హఠాత్తుగా కండరాల్లోకి ఇంటర్నల్ అర్గాన్స్లోకి ప్రవహించటంతో శరీరం పాలిపాతోంది. కడుపులో జీర్ణశక్తి మందగిస్తుంది. గుండె కొట్టుకోవడం, బ్లడ్ ప్రెషర్ పెరగడం లాంటిది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అసలు గుండె స్థంభించింది. హృదయం భరమైంది' అంటూ రచయితలు రాస్తారే అది అబద్దం కానే కాదు. మనిషి కొన్ని ఎమోషనల్ స్టేట్స్ లో జరిగే ...."
"దినకర్!"
"రక్తంలోని కోరేస్టరాల్ కి పుట్టిల్లు లీవర్. అది రెండువందలనుంచిరెండు వందల ఏభై మీల్లీగ్రాముల దాకా రక్తంలో పెరిగిన నాడు ఈ హార్ట్ ఎటాక్......"
"అంకుల్ ....." ఈసారి వారించింది సుదర్శనరావుగారు కాదు. సమీపంలో నిలబడ్డ హనిత. "డాడీకి ఈపాటికి కంఠస్థంగా వచ్చేసివుంటుంది" మృదువుగా నవ్వుతూనే అంది.
"వట్టి కంఠస్థం అయితే లాభంలేదమ్మా! ఆచరణ కావాలి" ఈ అనుకొని అవంతరానికి దినకర్ బి.పి పెరిగిపోయింది. అందుకే మీ డాడీని ఇంతలా ఎడ్యుకేట్ చేస్తున్నది. కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోమంటే మీ డాడీ ఏమంటున్నారో తెలుసా?"
"నేన్నున్నానుగా అంకుల్! ఆయన్ని బెడ్ మీదనుంచి కదలకుండా చూస్తాను."
"అదొక్కటే అంటే అసలు లాభంలేదు" ఈసారి కిట్ తెరచిన దినకర్ అర్జెంటుగా ఓ తెబ్లేట్ తీశాడు.
"ఉదయాన్నే డాడీని వాకింగ్ కి పంపుతున్నాను. నేను డాడీతోపాటు టెన్నిస్ ఆడుతున్నాను."
"అప్పుడది కాస్త లభాసాటీగా ఉంటుంది" ఆ టేబ్లేట్ తనే ఠక్కున నోట్లో వేసుకుని మింగేశాడు డాక్టర్ దినకర్రావు. వెంటనే ఓ గ్లాసులో నీళ్ళు అందించింది హనిత. గటగటా తాగేసి పైకి లేచిన దినకరరావుని చూస్తూ నవ్వకుండా ఉండలేకపోయాడు. సుదర్శనరావుగారు.
"లాభంలేదు" సుదర్శనరావుగారు దినకర్రావుని అనుకరిస్తూఅన్నాడు "ఇలా తరచూ టెన్షన్ ఫీలవుతూ నాముందే నువ్వలా బి.పి.కి టేబ్లేట్ తీసుకోవటం అసలు బాగాలేదు"
ఈసారి దినకరరావు నవ్వకుండా ఉండలేకపోయాడు.
"దినకర్! ఇన్ని చెబుతున్న నువ్వు నీ లైఫ్ ఫిలాసఫీని మార్చుకోవడంలేదు" సుదర్శనరావు వేపు ఓ క్షణం పరిశీలనగా చూశాడు డా" దినకర్రావు.
భార్య మరణం దినకరావుని సగం కృంగదీస్తే, ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్ళయ్యాక భర్తతో విదేశాల్లో సెటిల్ కావడం మిగతాసగం మానసికంగా దెబ్బ తీసింది. అది కనిపించకుండా చాలా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటాడు డాక్టర్ ఆ విషయం సుదర్శనారావు గారికి తెలుసు"
"మనిషి తన ఆనందాన్ని మరొకరితో పంచుకుంటే అది రెట్టింపు అవుతుంది పరిష్కారంకాని విశాదమైనా ఆత్మీయతతో చెప్పుకుంటే అది సగంగా తరిగిపోతుంది"
దినకరరావు జవాబు చెప్పలేదు. నిశ్సబ్దంగా వెళ్ళిపోయాడు.
సుదర్శనరావుగారి ముఖకవళికలని బట్టి హనిత సునాయాసంగా అర్ధం చేసుకుంది ఇప్పుడు తండ్రి తనగురించి ఆలోచిస్తున్నాడని.
"రిలాక్స్ డాడీ!"
హనిత అన్యాపదేశంగా అన్నా అది మానసికంగా క్షణకాలమైనా ఆయన్ని వత్తిడికి గురి చేసింది పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఎన్నాళ్ళు తనమీద యిలా శ్రద్ద చూపించగలదు? తన కథా ఇంచుమించు దినకరరావు కథలాంటిదే. కాకపొతే హనితకింకా పెళ్ళి కాలేదు.
అంటే తేడా .
"నేను ఆఫీసుకి వెళుతున్నాను."
అప్పటికి తేరుకున్నారాయన.
"నేనూ బయలుదేరతాను"
"నో డాడీ .... అంత అవసరమనిపిస్తే నేను మీ గైడెన్స్ తీసుకుంటనుగా" హనిత మృదువుగా అంది.
"అదికాదు బేబీ"
"డాడీ" అర్ధోక్తిలోనే ఖండించింది. "ఇంతమంది స్థాఫ్ తో బాటు మేమంతా ఉన్నాంగా? కార్పోరేట్ లెవెల్లో కావాల్సిన సహాయానికి తప్ప ప్రస్తుతం మీరేం జైక్యం చేయనక్కర్లేదు. మరో వారం రోజులుదాకా మీరు ఇళ్ళు కదలకండి."
"అది కాదు హనితా .... బ్యాంక్ ఫినాస్ గురించి మాట్లాడాలి. ఎక్స్ ఫోర్ట్ మెటీరియల్స్ ఫినలైజ్ చేయాలి"
"డాడీ ... అవన్నీ మీరు యింటిదగ్గర వుండికూడా తెల్సుకోవచ్చు. డీల్ చేయొచ్చు. ఆ వివరాలన్నీ నేను మీకు చేబుతానుగా. పైగా ఫైనాన్స్ మినిష్టర్ డిలీల్లో లేరు" అయన ఫారెన్ టూర్ గురించి గుర్తు చేస్తున్నట్టుగా అంది. తమ బిజినెస్ గ్రూఫ్ కి సంబందించిన వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వపరమయిన సమస్య ఏదయినా పరిష్కరించగలిగేది అయనకున్న వ్యక్తిగతమైనా పరమతి తోనే అన్న విషయం ఆమెకు తెలీనది కాదు . కాని ఇప్పుడామె ఆలోచిస్తున్నదొకటే ....
అపారమయిన తన కృషితో పెరిగిన ఆ సంస్థ తిరోగమనానికి కారాణాలు వెదకడం లేదాయన. నిలదొక్కుకొని ఇంకా ఎదగడానికి ఏం చేయాలీ అని మాత్రమే అహర్నిశలూ శ్రమిస్తూ సంఘర్షణకు లోనిపోతూన్నారు.
ఏ విజయనికయినా ముందు కావలసింది సాదించాలానే సంకల్పమే అయినా తర్వాత అవసరమయ్యేది ఆ అసంకల్పాన్నిసిద్ధించుకునే సాధన. ఆ సాధనలో ముందు ఏకాగ్రత చూపించాల్సి౦ది ఏం జరగబోతూ౦ది అని కాదు, ప్రస్తుతం ఏం జరుగుతున్నదీ పరిశీలించడం బిజినెస్ లో అసాధారణ మయిన అనుభవంగల సుదర్శనరావుగారి కన్నా హనిత భిన్నంగా ఆలోచిస్తున్నదిక్కడే.
హనిత గదిలోనుంచి వెళ్ళబోతుంటే అన్నారాయన " జాయింట్ జనరల్ మేనేజర్ రిక్రూట్ మెంటు విషయం చూడాలి బేబీ"
ప్రతిక్షణమూ బిజినెస్ వ్యవహారాల్లో మునిగితేలే పారిశ్రామికవేత్త దినచర్యలో హఠాత్తుగా 'వెక్యూమ్' ఏర్పడితే మానసికంగా ఎంతటి'గ్లాని' గురయ్యేది ఆమె గ్రహిస్తూనే ఉంది.
"డాడీ .... 'బిజిఎం' రిక్రూటుమెంటుకు సంబంధించిన అభ్యర్ధులలిస్టు ఈ రోజు పైనలైజ్ చేసి ఇంటర్వ్యూలకు టెలిగ్రాంలిస్తాం. రెండు మూడు రోజుల్లో జరగబోయే ఇంటర్వ్యూ బోర్డుకి చైర్మెన్ గా వ్యవహరిస్తారు. ఓ.కే?"
ఆమె గదిదాటి బయటికి వచ్చింది సరిగా అప్పుడు ఫోన్ రింగ్ అయింది.
"హలో! హనిత హియర్"
"నేను ఎస్. పి. రామచంద్రుని మాట్లాడుతున్నాను. మే ఏడాడీ__"
"చేప్పండంకుల్ ....."