Previous Page Next Page 
అసురవేదం పేజి 10

 

     "రణధీర్ మీ ఎంప్లాయీయేనా?"
       
    "లేదంకుల్ ... ప్రస్తుతం మా అక్మ్పెనీ సర్వీస్ లో లేడు. ఏమైంది?" ఉత్కంఠతను అదిమిపెడుతూ అడిగింది.

    "ఈరోజు అప్సరా నిశ్శేష్టతతో అంది __ చనిపోయాడా? హౌ?"

    "హత్యా, ఆత్మహత్యా ఇంకా ఇదమిత్తంగా తేలలేదు. కాకపోతే అయన గ్దగ్గరున్న ఫ్యాక్టరీ ఐడెంటీటీ బాడ్జిని ఎంప్లాయీ అని తెలిసింది."

    హనిత పలభాగంమీద స్వేదం పేరుకుంటూ౦ది. సరిగ్గా నిన్న రాత్రే రణధీర్ ద్వారా చాలా వివరాల్ని సేకరించబోతున్ననూ అంది తక్కిన బోర్డు మెంబర్స్ తో. పన్నెండుగంటల వ్యవధిలో రణధీర్ చనిపోయాడు అంటే .....?

    "మిస్ హనితా .... రణధీర్ ప్రస్తుతం మీ కంపెనీ ఎంప్లాయీ కదూ అంటే అతను రిజైన్ చేశాడా .... టెర్మినెట్ చేశారా?"

    "టెర్మినేట్ చేశాము" ఓ క్షణం ఆగి మరో ప్రశ్నకి అవకాశమివ్వకుండానే అంది - "మిస్ ఎప్రాప్రియేషన్ అభియోగంపైన ...."

    "ఐసీ" రెండు సెకండ్ల నిశ్శబ్దం. "శత్రువులుండే అవకాశం వుందన్నమాట"

    "ఒక యూనిట్ హెడ్ గా కీ పొజిషన్ లో వుండేవాడు .... స్నేహితులతోపాటు శత్రువులూ ఉండటం సహజమే"

    "అతని గదిలో కొన్ని లెటర్స్ దొరికాయి. అవి తెలుగులో టైప్ చేసి వున్నాయి.

    హానిత భ్రుకుటి ముడిపడింది.

    "కౌంట్ డౌన్ ప్రారంభమయింది. ఇక రోజులు లెక్కపెట్టుకుంటూ వుండు _ ఇదీ ఆ ఉత్తరాల్లో సారాంశం."

    అంటే .... తనకోచ్చినట్టే రణధీర్ కీ ఉత్తరాలు వచ్చాయా?

    "వాటిని బట్టి అతను హత్యకు గురయ్యాడేమో అని మీరు అనుభవిస్తున్నారా అంకుల్?"

    "మూడో ఫ్లోర్ లోని తన గదిలోనుంచి నేలపైకి దూకి చనిపోయాడు రణధీర్ . అతను కావాలని దూకాడా లేక క్రిందికి మరెవరన్నా నేట్టారా ఆన్నది. ఇంక తేల్చాల్సిన విషయం .... బైదిబై మిస్ హనితా! మీకు అలాంటి ఉత్తరం ఏమన్నా ఇంతవరకూ అందిందా?"

    చాలా నిబ్బరమున్న హనిత స్వల్పంగా కదిలింది. "ఎస్ అంకుల్ నిన్న సాయంకాలం  నా కారులో పేట్టి వుంది. ప్రస్తుతం అది నా దగ్గరవుంది."

    "అది వెంటనే పోలీసులకి ఎందుకు హొండోవర్ చేయలేదు .....?" పరిచితుడయిన వ్యక్తయినా ఒక పోలీసాఫీసరు కొన్ని కొన్ని సందర్భాలలో ఎంత లాఘవంగా విషయ సేకరణచేసేదీ అమెకిప్పుడు అనుబవం మౌతుంది.

    ముందు రణధీర్ దగ్గర కొన్ని తిప్ద్ లేతర్సు దొరికాయీ అన్నాడు తరువాత తనకేమన్నా ఉత్తరం వచ్చిందా అంటూ అరా తీశాడు. ఇప్పుడుఉత్తరం పోలీసుల కెందుకు హొండోవర్ చేయలేదో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అసలు తనకి ఉత్తరం వచ్చినట్టు అయన ఎలా గెస్ చేశాడు రణధీర్ దగ్గర ఉత్తరంలో తన పేరూ మెన్షన్ చేసి ఉందా?

    "చూడు మిస్ హనితా! 'ఎక్స్' అనే వ్యక్తి 'వై' ని బెదిరిస్తూ ఉత్తరం రాస్తాడు. మోటివ్ ఏదన్నాకాని ఎక్స్ కన్నా వై బలవంతుడయితే లేదూ  ఎక్స్ మూలంగా తనకేదో అనర్ధం జరుగుతుందని అనిపిస్తే ముందు ఎందుకు కడతేర్చేస్తాడు. చాలా అర్ధం కాలేదు "యూ లాజిక్కిది." ఇదంతా ఎస్.పి. ఎందుకు చెబుతున్నదీ ఆమెకు అర్ధం కాలేదు. "యూ నో. రణధీర్ దగ్గరదొరికిన ఉత్తరాలు మీకు ఎడ్రస్ చేసి వున్నాయి."

    "అంటే ....."

    హనితగా తను 'వై' అయితే "ఎక్స్ ' అనే రణధీర్ హత్యలో తనకూ బాగాముందని పరోక్షంగా వ్యక్తం చేస్తున్నాడు యస్పీ.

    అసలు ఇలాంటి నిర్ణయానికి ఉత్తరాలే కారణమయ్యేయో లేక రాత్రి తను చూపించిన ఉత్తరాన్ని ఆధారం చేసుకుని తక్కిన బోర్డుమెంబర్స్ ఎవరన్నా అలా నూరిపోశారో ఆమె అలోచించడంలేదు.

    తన ప్రక్షాళన కార్యక్రమం మొదలు పెట్టిన యిరవై నాలుగు గంటల్లో ఇంతటితో ఇది ఆగిపొదని గ్రహించిన ప్రత్యర్ధ వర్గం బలంగా పోరాటం ప్రారంభించింది. అందులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తోంది.

    హనిత భావరహితంగా అంది మృదువుగానే __ "అంకుల్! ఎక్స్ బెదిరిస్తూ పైకి ఉత్తరాలు రాస్తాడు. వైతెలివయిన వ్యక్తి అయినపుడు వీటిని తేలిగ్గా తీసిపారేస్తుంది. అప్పుడు వైపైనద్వేషమున్న మరో 'జడ్' ఈ అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవాలని ఎక్స్ ని హత్య చేస్తాడు. ఎందుకంటే పోలీసులు వివి అనుమానించే అవకాశం వుంది కాబట్టి ఇదీ సింపుల్ లాజిక్కే."

    ఆమె వాక్యాలింకా పూర్తీకానేలేదు. అవతల ఫోన్ క్రేడిల్ చేసిన చప్పుడు.

    ప్రత్యర్ధులు హనిత విషయంలో పొరపాటు పడ్డారిక్కడే .

    హనిత తెలివయినదయినా ఓ ఆడపిల్ల! అందమయిన దైనా మగాడి పక్కలో పడుండాల్సిందే తప్ప మగవాడి శక్తియుక్తుల్నీ ప్రశ్నించకూడదు. అందుకే గోదాలోకిదిగి ఆమె ఉద్వేగాన్ని ఆదిలోనే తుంచేయాలనుకున్నారు.

    హనిత అనుమత్రమయినా జంకలేదు సరికదా మరింత పకడ్భందిగా పోరాటానికి సన్నద్ధం కవాలునుకుంది. అంతే .... ఆమె ఇప్పుడు పోలీసుల గురించీ, రణధీర్ హత్య గురించే ఆలోచించడం లేదు.

    త్వరలో తన చేతికందబొయే ఇంటలిజెన్స్ రిపోర్ట్ గురించీ, అది అందాక నేరస్థులుగా నిరూపింపబడే ఆ 'ప్రముఖుల' చివరి అట కట్టించే పద్దతుల గురించే మననం చేసుకూంటూ౦ది.
   
                                                               *    *    *    *   

            
    'వెల్' బోర్డు మీటింగ్ హల్లో తన కభిముఖంగా కూర్చున్న మెంబర్స్ వేపు చూస్తూ అంది హనిత .... "సాకేత అండ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టరు అనుమతితో ఏర్పాటు చేసిన మా అత్యవసార సమావేశం ఇప్పుడు మనం వెంటనే నిర్ణయించాల్సింది జాయింట్ జనరల్ మేనేజరు రిక్రూమెంట్ విషయం. ఇప్పటికే చాలా జాప్యం జరిగిపోయింది. ఆ మనందరికీ తెలిసిన వాస్తవమే!"

    కొన్ని గంతలక్రితం జరిగిన రణధీర్ హత్యగాని, ఇప్పుడు తన ముందు కూర్చున వ్యక్తుల్లో ఎవరో ఒకరు తనను తీవ్రంగా ద్వేషిస్తూన్నారనిగాని ఆలోచించకుండా చాలా మామూలుగానే చెప్పుకుపోతూంది.
   
    "ప్రేవైట్ యజమాన్యానికి  సంబంధించీ దేశంలో ఉన్న చాలా పరిశ్రమల్లో ఒక బలమయిన స్థాయిని ఏర్పరుచుకున్న మన బిజినెస్ గ్రూఫ్ జనరల్ మేనేజర్ రిజైన్ చేసి ఇప్పటికి సరిగ్గా రెండు నెలలు కావోస్తోంది. ఒక కంపెనీలో అతి కీలకమయిన స్థానంలో ఉన్న అప్పటి జరనరల్ మిస్టర్ మోహతా ఉద్యోగానికి రాజీనామా చేయటానికి కారణం మరో మంచి అవకాశం రాబట్టే అని మనం ఆ రోజు సరి పెట్టకున్నా కాదని తెలిసింది ఈ మధ్యనే!"

    మరేదో కోరని విషయం వింటున్నట్లు కట్రాడల్లా బిగుసుకుపోయారంతా. అయినా ఏ భావమూ వ్యక్తం కాకుండా అంతా జాగ్రత్తపడ్డారు.
   
    "సంస్థ పరంగా సరయిన మోటివేషన్ లభ్యం కానప్పుడు, లేక సంస్థ పోరోభివృద్ధికి సంబందించిన పాలసీ మేటర్స్ లో దారుణంగా హ్యూమిలియేట్ అయినప్పుడు తప్ప ఏ వ్యక్తి __ అందులో ఓ టాఫ్ ఎగ్జుక్యూటివ్ తన బాధ్యతనుంచి త్వరగా దూరంగా జరిగిపోతూ అన్న సత్యానికి సాక్ష్యం మిస్టర్ మోహతా రిజిఘ్నేషన్!"

    "అర్ధం కావడంలేదు" సత్యానంద్ జైక్యం చేసుకున్నాడు ఇక నిభాయించుకోలేనట్టు.

    "ఆ పాయింటుకే వస్తున్నాను. యజమాన్యానికి సంబంధించిన ముఖ్యులు కొందరు అతనిపైన దారుణ మయిన ఒత్తిడి తీసుకొచ్చారు."

    "ఏ విషయంలో ?" ఠక్కున అడిగాడు శివరావు.

    "రణధీర్ లాగే కొన్ని అక్రమాల్లో చేయూత నందించమని! ఒకవేళ అతను అందించివుంటే యిప్పటిదాకా కనీసం రణధీర్ లా పాక్ అయ్యేదాకా అయినా మిగిలేవాడు. కాని దానికి అతను సుముఖుడు కాలేకపోయాడు."

    "నాన్సెన్స్!" ప్రభంజనరావు విరుచుకుపడ్డాడు. "ఏ విషయాన్నీ సూటిగా చెప్పకుండా యిలా మనసులో గుద్దులాడుకుంటున్నట్టు స్టేట్ మెంటివ్వటం సమంజసంగా లేదు.

    అసలే రణధీర్ చావుతో మనశ్శాంతిని కోల్పోయి వున్నాడు ప్రభంజనరావు. తన పథకానికి పురిటిలోనే సంధికొట్టినట్టయిపోయింది..... "అదే నిజమయితే అతన్ని ఒత్తిడికి గురిచేసిన వ్యక్తుల్ని ఇక్కడే నిలదీయోచ్చుగా?"

    హనిత పెదవులపైన చెక్కుచెదరని చిరునవ్వు ఎప్పటిలాగే! "ఒక రణధీర్ ఓ మోహతా సమస్యలే కాదు అంకుల్! త్వరలో చాలా విషయాలు సేకరించి మీ ముందుంచబోతున్నాను తప్పదు. కాస్త ఓపిక పట్టాలి."

    ఎలిజిబెత్ మాట్లాడ్డంలేదు . ఒక వయసులో వున్న ఆడపిల్ల ఇందరుఅనుభవజ్ఞులయిన మగాళ్ళందర్నీ ఒకేసారి దాడిలో ఎదుర్కొని వయసుకు మించిన మెచ్యూరిటీని ప్రదర్శిస్తుంటే అబ్బురంగా చూస్తోంది. అంతకు మించి బెదిరిపోతూంది.

    "వెల్ .... ఈ సంస్థ బాగోగుల గురిమ్హి అహర్నిశలూ శ్రమించే మీరు న అప్రయత్నాల్ని ముందు ముందు సహృదయంతో అర్ధంచేసుకోగలరన్న నమ్మకం నాకుంది" తన మాటలు క్లిష్టమయిన భావోద్వేగాన్ని కలిగిస్తున్నాయని గ్రహించిన హనిత సునాయాసంగా 'సింప్లీఫై' చేస్తూ ఒకచేయి తిరిగిన పారిశ్రామికవేత్త కూతురిగా తన మేధసూ నిరూపించుకుంటూ౦ది "కమింగ్ టుది పాయింట్. ఒక ఆర్గనైజేషన్ లో పని చేసిన ఏ ఎగ్జిక్యూటివ్ అయినా రిజైన్ చేయడం అన్నది ఆ వ్యక్తికి  లాభసాటిగా ఉండోచ్చేమోగానీ సంస్థకి అది నష్టమే .... ఇక్కడ అనుభవం మరో సంస్థ పెట్టుబడి కాకూడదు . డివోషన్ సెల్స్!

    సంస్థ అభ్యున్నతకి సంబంధించిన అవగాహాన ఉన్న ఏ వ్యక్త్యినయినా చేజార్చుకోవటం మనం లక్షల ఖర్చుతో పరిశోధించిన ఓ పార్ములా రహస్యంగా మరో ప్రత్యర్ధి సంస్థకి అందజేయటంలాంటిది."

 Previous Page Next Page