విరాజిని చూస్తె ఆమె సోగ కన్నులు _ వాటిలో కాంతిరేఖలతో బాటు తెలియని నిషాదం బెంగాలీ కన్యలలో వుంటారేమో ననిపించింది.
"మీరా? అన్నాడు.
బస్ కోపం నిలబడ్డారా?
"ఉహూ"
"మరి?"
"బస్ ఎలా వొచ్చి వెళ్ళిపోతుందో చూద్దామని"
ఆమె కిలకిలమని నవ్వింది. నవ్వినప్పుడు తళుక్కుమని ఆమె తెల్లని పలువరుస లేత వెలుగు వ్యాపించినట్లు.........
ఆశ్చర్యంగా చూశాడు.
మీకోసం వొచ్చి పడిగాపులుకాసి మిమ్మల్ని కలుసుకోలేక పోయాను. ఇవేళ అ ప్రయత్నంగా మిమ్మల్నిని కలుసుకునే ఛాన్స్ కొట్టేశాను.
"అం అదేమంత గొప్పఛాన్సు కాదులెండి . నన్ను కాల్సుకోవటము చాలా సామాన్యమైన విషయం. అనండతాను లజ్జితుడై .
"ఇప్పుడో పని చేద్దామా?" అంది విరాజి .
"ఏమిటది!
ఎద్దరం కలసి కాఫీ త్రాగుదాం.
అతను త్రోటుపాటు పడ్డాడు. కాఫీనా?
ఇప్పుడెందుకు ? అన్నాడు అతని జేబులో డబ్బులు లేవు!
"అదేమిటండీ కాఫీ అంటే అంత కంగారుపడతారు. నాకు కాఫీ తాగడమంటే చాలా యిష్టము . కనీసం రోజుకు పదిపదిహేను సార్లయినా తాగుతూ వుంటాను రండీ.
అతను నిజం చెప్పెయ్యాలనుకున్నాడు.
"మీ దగ్గర డబ్బులేదు అవునా?
అమెకిలా తెలిసింది అన్నట్లు ఆశ్చర్యంగా చూశాడు.
"ఎలా తెలిసిందినా? కొంత మందిని చూస్తె కొన్ని విషయాలు తెలసిపోతుంటాయండి. మీకో గమట్టు చెప్పనా? నా దగ్గర కూడా రూపాయే వుంది. ఈ రూపాయి పేట్టి బస్సులో యింటికి వెళ్ళాలా లేక మీతో కలసి కాఫీతాగి నడుచుకుంటూ వెళ్ళాలా అని బేరీజు వేసుకుంటే రెండోదే శ్రేయస్క్రరమనిపిస్తు౦ది. ఎందుకంటే రవంత శరీర శ్రమకంటే అనుభూతి కాబట్టి"
గవుతమ్ ఏం చెప్పాలో తెలీక మౌరంగా ఊరుకున్నాడు.
"రండి" అంది విరాజి.
ఆమె చూపులోని ఆహ్వానాన్ని తిరస్కరించలేక ఆమెతో బాటు ముందుకు కదిలాడు.
దగ్గర్లో చిన్న కాఫీ హొటలుంది. ఇద్దరూ కొంతదూరం నడిచి అందులోకి వెళ్ళారు.
హొటల్లో జనం ఎక్కువగా లేరు.
లోపలకు అడుగు పెడుతుండగా గుమ్మ౦దగ్గర బ్లాక్ బోర్డుమీద మిగతా ఐటమ్సుతోబాటు కాఫీ అరవై పైసలు అన్న అక్షరాలు కనిపించాయి. విరాజి నవ్వింది.
ఇద్దరూ ఒక మూలకు వెళ్ళి ప్రక్క ప్రక్కన కుర్చీలలో కూర్చున్నారు.
సర్వరు వొచ్చాక ఒక కాఫీ ఆర్డర్ చేసింది. విరాజి. "పిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందాం" అన్నది. కాఫీ వొచ్చాక ఓ ఖాళీ కప్పు తెప్పించి రెండింటిలో సగం సగం కల్పింది.
"తీసుకొండి" అన్నది.
"పిఫ్టీ _ ఫిఫ్టీ ఈ పదానికి జీవితంలో చాలా విలువ ఉన్నది గావుతం అన్నది.
ఆమె గొంతులో ఒక అనిర్వచనమైన తియ్యదనం వున్నట్లు గమనించాడు.
గౌతమ్ మీరు కథలు రాయటం _ అదే రచనలు చెయ్యటం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? అనడిగింది విరాజి.
"బహుశా అయిదారేళ్ళ క్రితం."
"మీ మొదటి రచన ఎలా చేశారు? ఐమీన ఎందుకు చేయాలనిపించింది?"
గౌతమ్ అలోచించాడు. నిజాయితీగా ఆలోచించాడు. సరిగ్గా గుర్తులేదు.
విరాజి నవ్వింది.
"ఏ రచయితయినా _ నేనా ఫలానా ఆశయముతో లేక ఫలానా అవేశముతో కాలం పట్టుకున్నను అన్నాడూ అంటేదాదాపు అందమైన అబద్దాన్ని సృష్టంచినట్టే నాకు తెలిసినంత వరకూ.
ఏ రచయితమయినా అమాయకంగా తన సాహిత్య వ్యాసంగాన్ని మొదలు పెడతాడు. రానురానూ జీవితాన్ని, సాహిత్య, రంగాన్ని మధిస్తోన్న కొద్ది అతనికో స్పష్టత చేకూరి సంపూర్ణమైనా రూపాన్ని సంతరించుకుంటాడు. ఒకానొక దశలో అతను సాహిత్యాన్ని నడిపించడు. సాహిత్యమే అతనిని నడిపిస్తూ వుంటుంది.
గౌతమ్ ఆమెవంక ఆశ్చర్యంగా చూశాడు. మీరు ఒక ద్వాన్సర్ అయి సాహిత్యం మీద యింట ఆసక్తి ప్రదర్శిస్తు న్నారే అన్నాడు.
"నేను డ్వాన్సర్ అయినంత మాత్రాన యితర కలా ప్రక్రియలలో ఆసక్తి వుండకూడదనీ లేదుగా? ఒకరకముగా చేప్పాలంటే నాకు యిద్దరు భర్తలు.
"ప్రేమకాంతి" అని ఓ నవల చదివాను. అందులో లాగానా?
"ఆ నవల నేనూ చ్సదివాను. అలాగాదు. నా మొదటి భర్త నాట్యం , రెండోభర్త సాహిత్యం ."
"విశాలమైన జీవితము ఇది. ఎన్ని మెలికలు వుంటాయో, ఏ సందులోన దూసుకు వోస్తుందో చెప్పలేం కదా?"
కాఫీ త్రాగటం పూర్తయింది. ఇద్దరూ లేచి, ఆమె బిల్లు చెల్లించాక బయటకు వోచ్చారు.
"మీరు కేవలం డ్వాన్స్ టీచరేనా? ప్రదర్శనలు కూడా యిస్తూ వుంటారా?"
ప్రస్తుతం టీచరునే ఆరోఏట మొదలు పేట్టి ఎనిమిదేళ్ళు కఠోరమైన కృషిలో నేర్చుకున్నాను. అది ప్రస్తుతము నా కడుపు ఒక పూట నింపటానికి పనికి వొస్తుంది."
"అంటే?"
"నాదమునిగారి యిల్లుకూడా కలుపుకుని నాలుగయిదు ఇళ్ళు౦టాయి. . వాటిమీద వచ్చే డబ్బుతోనే జీవనము సాగించాలి. ఇహా ప్రదర్శనల విషయము. భరతనాట్యంగురించి నాకా కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. దళవతారాలు, నెత్తిమీద నీళ్ళచెంబు పెట్టుకుని అది పడిపోకుండా పళ్ళెంలో తిరుగుతూ సర్కస్ ఫీట్ చెయ్యటము, లేదా మధురానగరిలో చల్లనమ్మ బోను, లేకపోతే, శివతాండవం, లేకపోతే మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో, యీరోటీన్ చేసేవాళ్ళు అరంగే ట్రంయిచ్చినప్పుడు అశీస్సులందించి పొగిడేవాళ్ళు చాలామంది వున్నారు. నాట్యంలోని ఔచిత్యం చెడకుండా , కొత్తదానం సృష్టిస్తూ దాన్ని ప్రజలకు దగ్గరగా తీసుకురాగలగాలి ఉదయశంకర్ దేశదేశాలూ కూడా ఎందుకంత ప్రాచుర్యము పొందాడంటారు? వైవిధ్యం , ఔచిత్యం , ప్రజల గుండెల్లోకి దూసుకుపోయే యితి వృత్తాలతో కూడిన బ్యాలెట్ ...... ఎంత గొప్పకళాపస్వోఅతను? ఎవరెంత ప్రయత్నించినా అతని హైట్స్ కి రీచ్ కాలేకపోతున్నారు. ఎందుకంటె అలాంటి కళాతపస్విలు కోసికి ఒకరుంటారు."
ఇద్దరూ నడుస్తున్నారు.
"అలాంటి ప్రయోగం ఏదయినా చెయ్యగలిగి, కొత్తదనము సాదించినవాడునేను ప్రదర్శన లిస్తాను ఈ లాటివి వాళ్ళు ఎందరోవుంటారు.
గౌతమ్ ఎందుకో కొంచము భయము వేసింది. జీవితం మీద నిర్దుష్టమైన అభిప్రాయాలున్నవారు ఆ అభిప్రాయాలను స్పష్టంగా చాట గలిగిన వాళ్ళూ యితరులకు కొంచెము భయము కలిగిస్తూ వుంటారు.
"మీ రచనలన్నీ నేనెందుకు లైక్ చేసానో తెలుసా?" అంది విరాజి.
అతను ప్రశ్నార్ధకంగా చూశాడు.
"మీ కథల్లో నిజాయితీ వుంది నిరాడంబరత వుంది. ఒకచిన్న సంఘటనలోంచి అపారమైన జీవిత సత్యాన్ని చాటే శక్తి వుంది. ఈ మధ్య వస్తోన్న సాహిత్యములో చాలా కొద్దిమందిలో ఆ లక్షణం కనిపించింది నాకు. ప్రకరణకన్న రచయితా హృదయములోని సుతారమైన సంఘర్షణ ఎక్కువగా గోచరించింది. అందుకే అంతగా లైక్ చేసి మిమ్మల్ని చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చాను.
గౌతమ్ పులకించాడు. ఆప్రయత్నంగా ఆమె ముఖంలోకి చూశాడు. ఎండలో నడుస్తూ వుండటంవల్ల కందిపోయి ఎర్రబడిన ముఖంలోకి అ ముఖాన అలుముకున్న స్వేద బిందువులు.....
ఈ విరాజి ... ఎందుకో అపురూప వ్యక్తి అనిపిస్తోంది. ఆమె గురించి యింతవరకూ తనకేమీ తెలియదు. అంబానా ఏదో గొప్పతనం వుందనిపిస్తోంది.
అటువంటీ స్రీ తనను పొగిడినందుకు అతనికి మధురాను భూతి కలిగింది.
"థాంక్స్ " అన్నాడు చిన్నగా.
విరాజి ఆగింది "సరిగా ఇక ఇట్నుంచి మీ గదికి మా ఇంటికి నాలుగుమైళ్ళు దూరం వుంటుంది. కాకపొతే మీరు అటుపోవాలి, నేను ఇటు వైపు పోవాలి. ఈ ఎండలో యిద్దరం నడుస్తూ పోవాలని నాకు తెలుసు ఇహా విడిపోదా౦" అన్నది.
"మీ ఇళ్ళు ఎక్కడ?"
"ఏం? మీరు వస్తారా?"
"ఎప్పుడన్నా రావాలనిపిస్తే వస్తాను"
ఆమె తన అడ్రస్ వివరంగా చెప్పింది. అతను భద్రంగా మాన్సులో పదిలపరుచుకున్నాడు.
"ఓ.కే వస్తా ! ఆమె చెయ్యివూపి తన దారివైపు వెళ్ళిపోయింది.
రెండునిముషాలు అలాగే కదలకుండా నిలబడ్డారు. ఆ బజారు చాలా రద్దీగా వుంది. సాదానేతచీరే కట్టుకుని, పొడవాటి జడ అటూఇటూ కదులుతూండగా, ఆ జనసందోహం మధ్యనుంచి చకచక నడిచి వెళ్ళిపోతున్న విరాజివంక కనుమరుగయేదాకా చూసి, అతనూ కదిలాడు.
ప్రొద్దుట నిద్రలేస్తూనే ఇంటివల్లమ్మాయి జ్యోతి _ ఎనిమిదేళ్ళ పాప వొచ్చింది. నాన్నగారు అద్దే ఇమ్మన్నారని .
గౌతమ్ గుండెలో రాయిపడింది. ఏ జవాబు చెప్పాలో తెలీక సాయంత్రం లోపున పంపిస్తానమ్మా " అన్నాడు.
ఇంటి యజమాని బంగారయ్య. చాలా చిన్నయిల్లు సంసారం పెద్దది అయిదుగురు పిల్లలు పెద్దకూతురికి మాత్రం పెళ్ళయింది.
బంగారయ్య వడ్రంగి మేస్రీ వయసులో వున్న రోజుల్లో ఎలాగో డబ్బు దాచుకుని , అప్పోసప్పోచేసి యీ యిల్లు కట్టారు. అ అప్పులు తీర్చటానికి శక్తికి మించిన పనుల్నివొప్పుకుని ఆరోగ్యం గుల్లచేసుకున్నాడు. ఇప్పుడు డయా ఎటిస్ వల్ల బలం తగ్గిపోయి, క్యాటరాక్టువల్ల చూపు మందగించి చెబుతూ యాభయ్యోఏటకూడా పిల్లల్ని కనేశాడు. ఇప్పుడు పెళ్ళిచేయలేక పోతున్నాను _ అన్న దిగులుతో త్రాగుడుకు అలవాటుపడ్డాడు.
ఒకడే మొగపిల్లాడు. అతను చిన్న చిన్న పనులుచేసి నాలుగాయిదోందలదాకా తీసుకొస్తాడు అతన్ని పీడించి, పెళ్ళాన్ని తిట్టికొట్టి సతాయించి "ముందు" తీసుకోవడానికి డబులు పిండేవాడు.