Previous Page Next Page 
విరాజి పేజి 10

   

  ఆ వయసులో వున్న ఆడపిల్లలనీ పెళ్ళిళ్ళుకాక వాళ్ళుపడే మానసిక వేదనను ,నలుగురిలో పొందే నగుబాట్లనూ, ఆ తల్లి పడే నరకబాధనూ గౌతమ్ గమనించినప్పుడు  అతని హృదయం కలచి వేయబడుతూ వుండేది.

    జ్యోతి వెళ్ళిపోయాక చాలాసేపు స్తబ్దుగా వుండిపోయాడు.

    ఈపూట టీ త్రాగటానికి కూడా డబ్బులు లేవు. భైజనం విషయమాలావుంచి సాయంత్రం లోపున గదికి అద్దేయివ్వాలి.

    మనసంతా వ్యాకుల పాటుగా వుంది.

    ఈ పేదరికంనుండి , ఈ కాస్త ఆసక్తినుండి తానేమి బాపుకుంటున్నట్లని ఈ చీకటి వలయంలో కూర్చుని కాంతి కిరణాలను చూడటానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడు.

    అసలేమి సాధిద్దామని తన తపన్? తనకు తాను అర్దమవుతున్నాడా? తన జీవితానికి దూరంగా వున్న బాటను కాకుండా , తనదైన బాటలో ప్రయాణం చేద్దామని యిల్లువిడిచి వొచ్చాడు. అది తనకు సార్ధమవుతుందా?

    "ఏదో రాయాలి.

    "ఏం రాయాలి?

    ఒక్కోసారి తనకు తెలసిన ఏ సంఘటనలనుంచీ ఏరుకాకుండానే రకరకాల యిత్తివృత్తాలు, మలుపుల మెరుపులున్నవి స్పురిస్తూ వుంటాయి. వాటికి ఆలోచనే పదునుపెడుతూ ఉంటుంది. తనకు తెలీకుండానే తన ప్రమేయం లేకుండానేఆలోచన సక్రమంగా సాగుతూ ఉంటుంది.

    ఇది రచయితకు దివ్యమైన అనుభూతి. దీన్నే పొయటిక్ ట్రూత్ అనవచ్చు.

    ఇంచుమించు పదిగంటలవేళ జ్యోతి వొచ్చి అడిగింది. "అంకుల్ టీ తాగటానికి వెళ్ళలేదే?"

    "ఇవేళ వెళ్ళాలనించలేదమ్మా"                 

    "డబ్బులు లేవా అంకుల్."

    గౌతమ్ ఉలికి పడ్డాడు. "అబ్బే అదేమి కాదమ్మా  ఊరికినే బద్దకంగా వుంది."

    "కాదులే అంకుల్. నీ మోహం చూస్తే తెలుస్తోంది" __ అంటూ జ్యోతి అతను వెనకనుంచి పిలుస్తొన్నా వినిపించుకోకుండా యింట్లోకి పరిగెత్తింది.

    పది నిముషాల్లో జ్యోతి ఓ గాజుగ్లాసుల్లో టీ తీసుకొచ్చింది.

    "ఎందుకు పాపా తీసుకొచ్చావు?" అని గౌతమ్ మోహమాట పడ్డాడు.
   
    "అమ్మ యిమ్మంది."

    గ్లాసందుకుంటూ జ్యోతి ముఖంలోకి చూశాడు. పెద్ద పెద్ద కళ్ళు. ఎర్రని లేత పెదిమొలు, సాదాగౌను వేసుకుంది. అతడికి ఆ పిల్లనిచూస్తె జాలేసింది.

    మిగతా పిల్లలంతా వయసొచ్చిన పిల్లలు కావటంచేత బజారుపని అంతా జ్యోతి చేస్తోంది. ఎప్పుడూ ఏదో పని. తిరిగింది తిరిగినట్లేవుంటుంది.

    కొంతమంది కష్టాలను భరించటానికి, చాకీరి చెయ్యడానికే పుడతారనిపిస్తుంది.

    టీ త్రాగాక గ్లాసు తీసుకుని జ్యోతి వెళ్ళిపోయింది.

    ఓ అరగంట తర్వాత అతను స్నానంచేసి బట్టలు మార్చుకుని , కాగితాలు ముందేసుకుని చేతిలో పెన్ను పట్టుకుని కూర్చున్నాడు.

    రచయితగా జీవించదలచిన వాడికి స్పందన అవసరం. ఇమ్తరులకు మామూలుగా కనిపించిన సంఘటనలోంచి అతను కదా వస్తువు ఎంచుకోవాలి. అసలు చాలామంది రచయితలను తామెందుకు రాస్తున్నారో తెలుసా?

    అసలు రచయిత రచనలూ, అతని స్వభావమూ ఒకటయివుంటాయా? వేరువేరుగావుంటాయా? ఒక మనిషిలోని లోపాలూ, స్వార్ధాలూ కష్టాలూ , బలహీనతలూ రచయితలో కూడా అదే స్థాయిలో వుంటాయా?

    తాను కాలేజిలో చదువుకునే రోజుల్లో అనుకోకుండా ఓ మహపండితుండి దగ్గరకు వెళ్ళవల్సివొచ్చింది. ఆ పండితుడుసంస్కృతంలోంచి అనేక గ్రంధాలు తెనిగించాడు. రామాయణాన్ని కూడా తెలుగులో అద్భుతంగా రాశాడు.

    ఇంట్లోకి వెళ్ళేసరికి ఓ అసహ్యకరమైన దృశ్యం కనిపించింది. అరవాయియేళ్ళ ఆ పండితుడు ఏనాభయేళ్ళ వృద్దురాల్ని పట్టుకుని చావబాదుతున్నాడు. గౌతముని చూసి గబగబ లోపలకు వెళ్ళిపోయాడు.

    గౌతమ్ వెళ్ళి ఆ వృద్దురాల్ని లేవదేశాడు . "తల్లికిచ్చిన మాటకోసం ఓ జీవితాన్నంతా త్యాగం చేసిన రామచంద్రమూర్తి కథని రచించిన మహాపండితుడు నాయనా వీడు. నా కుమారుడు . తల్లిని ఎలా హింసిస్తు న్నాడో చూశావా?" అంది ఆ వృద్ధురాలు కళ్ళ నీళ్ళు కారుస్తూ.

    గౌతమ్ హృదయమంతా కలచివేసినట్లయింది. ఆ పండితుడ్ని కలవ కుండానే బయటకి వెళ్ళిపోయాడు.

    ఒక రచయిత కథ రాస్తూవుంటారు సమాజంలో ఆడవాళ్ళకి జరిగే అన్యాయాలని గురించి, కుటుంబ వ్యవస్థలో ఇల్లాలికి ఎదురవుతున్న అవమానాల గురించి హృదయవిదారకంగా వర్ణిస్తూ వుంటారు. మధ్యలో అతని భార్యవొచ్చి సిస్టర్స్ చేస్తుంది. అదయినా ఆమె సొంత సమస్య గురించికాదు. ఇంట్లో వెచ్చాలు అయిపోయాయి. ఆ పూట గడపటం కష్టం అన్న సంగతి గుర్తుచేయటం గురించి, రచయితకు కోపమోస్తుంది. తన మూడ పాడుచేసినందుకు కాగితం కాలం ప్రక్కనపెట్టి పెళ్ళాన్ని ఆ చెంపా యీ చెంపా వాయిస్తున్నాడు. మళ్ళీ కాసేపటికి ఘాడ్ తెచ్చుకుని ఓ బిచ్చగాడి కరుణా మాయమైన జీవితాన్ని గురించి గుండెలు తరిగేలా వర్ణిస్తూ వుంటాడు. అదే సమయానికి ఓ బిచ్చగాడు వొచ్చి అమ్మా! ఆకలేస్తుంది.అన్నం మొహంచూసి రెండురోజులయింది. రెండు ముద్దలు పెట్టించు తల్లీ అని అరుస్తాడు. రచయిత "పోపో " అని అరుస్తాడు. వోణికే  శరీరంతో , దీనమైన చూపులతో బిచ్చగాడు  కదల్లేని స్థితిలో వుంటాడు. రచయిత 'పొమ్మంటే' నీక్కాదూ చెప్పేది ' అని అరుస్తాడు. బిచ్చగాడు  ఇంకోసారి "అమ్మా" అని అరిచాడు రచయితకోపం హద్దులు మీరింది. టేబుల్ మీదవున్న పేపర్ వెయిట్ తీసి బలంగా విసురుతాడు,. అది వెళ్ళి బిచ్చగాడి నుదుట కొట్టుకుని నెత్తురు జలజల కారింది.

    అంతవరకూ రాశాడు. మనసులో ఎయోచ్చూర్క్ గా లేదుకదా అన్న ఆలోచన తెలుస్తుంది.

    రాయటం ఆపి చాపమీద నీరసంగా పడుకున్నాడు.

    కడుపులో ఆకలి బాధ రగులతో౦ది.

    బయటనుంచి పోస్టు మెన్ కేక వినిపించింది . లేచి ఆతృతగా వెళ్ళి తలుపు తీశాడు.

    మనిఆర్డర్. "జర" కధకు యాభయిరూపాయలు పంపించారు పత్రిక వాళ్ళు.

    వోణికే చేత్తో సంతకంపేట్టి ఆ డబ్బు అందుకున్నాడు గౌతమ్.

                                                                 *    *    *

    నాలుగైదు రోజులు గడచిపోయాయి. ఈలోగా రెండు కథలు రాసి పత్రికలను పంపించాడు.

    ఆ సాయంత్రం విరాజిని చూడాలిపించింది. ఆమె చెప్పిన అడ్రస్ మననంచేసుకుంటూ బయల్దేరాడు.

    చాలాదూరం. తీరా ప్రయాసపడివెడితే వుంటుందో, వుండదో ఐనా సరే వెళ్ళాలనిపించింది.

    ఆమె చెప్పిన లోకాలిటీకి వెళ్ళేసరికి గంటన్నరపైగా పట్టింది. ఆ ప్రాంతంలో అన్నీ పూరిళ్ళు , అక్కడక్కడకు కొన్ని పెంకుటిళ్ళు, మధ్య మధ్య చిన్న చిన్న డాబాలు.

    ఆమె ఇల్లు కనిక్కోవటం పెద్ద కష్టం కాలేదు. గౌతంకు .

    అది కూడా పూరిల్లే , గోడలమీద తాటాకు కప్పబడి వుంది. లోపలకు పోయేందుకు చిన్న తలుపు వుంది. తలుపుతీసి వుంచటంవల్ల ఆమె ఇంట్లోనే ఉందనుకుంటూ గుమందగ్గర నిలబడి "ఏమండీ" అని పిలిచాడు.    

    లోపలేదో అలికిడయింది. ఒక్కక్షణం తర్వాత గుమందగ్గర విరాజి ప్రత్యక్షమయింది.

    అప్పటికింకా చీకటిపడలేదు. తనని చూడగానే ఆమె ముఖంలో కనిపించిన మెరుపు అతను గమనించలేకపోలేదు.

    "అరె గొప్పగా వొచ్చశారే" అంది అనందాతి రేకంతో.

    అతనలా నిలబడి వుండటం చూసి, "ఏమిటలా వుండిపోయారు? రండి లోపలకు" అంది.

    గౌతం లోపలకు అడుగుపెట్టాడు.

    అవటానికి పూరిల్లే అయినా లోపల శుభ్రంగా, నీట గా ఉన్నది. ఒకే ఒక కుర్చీ . ఒక మంచంమీద దుప్పటి పాతదే అయినా ఎప్పటికప్పుడు ఉతుకుతూ వుండటంవల్ల కావచ్చు స్వచ్చంగా వున్నది. దిండుకూడా పొందికగా అమరివుంది. ఇంట్లో పెద్దసామానేమీ లేదు. ఒకమూల కొద్దిగా వంట పాత్రలు , కిరోసిన్ స్టవ్ వున్నాయి.

    "కూచొండి" అంది విరాజి.

    అతను కుర్చీలో కూర్చున్నాడు.

    ఇంట్లో ఎలక్టసిటీకి లేదు ఒక మూలవున్న స్టూల్ మీద హరికేన్ లాంతరుంది. ఇంకా వెళ్తురుండటంవల్ల వెలిగించబడలేదు.

    "నడిచి వొచ్చారా? బస్సులో వొచ్చారా?"

    "నడిచినంత సేపూ అతనికి శ్రమ తెలియలేదుగాని, లోపల ఎక్కువ గాలి రాకపోవటంవల్ల ముఖానికి బాగా చెమటపట్టింది."

    "అయ్యో మీకు బాగా చెమటపట్టింది అంటూ చెక్కబీరువా తెరచి ఓ టవల్ తీసుకొచ్చింది. చేతికి అందిస్తుందేమో అనుకుని చెయ్యి జాపబోయాడు.

    "ఉండండి_" అంటూ అతని చేతిని మృదువుగా ప్రక్కకునెట్టి తానె స్వయంగా అతని ముఖాన్ని తుడిచింది.

 Previous Page Next Page