Previous Page Next Page 
విరాజి పేజి 8

  

    గౌతమ్ ఆశ్చర్యంగా వింటున్నాడు.

    ఇప్పుడు నవలా ప్రపంచంలో నేను మకుటంలేని మహారాజుని. నా సీరియల్ లేకుండా ఏ పత్రికా వెలువడటానికి సాహసించదు. ఒకవేళ మొండితనం కొద్ది వెలువడటానికి సాహసించనా కొన్నాళ్ళకైనా వేటుక్కొంటూ రావాల్సిందే పాఠకులకు కావాల్సిందేమిటో తెలుసుకునాన్ను. పత్రికలన్నీ ఎలా పూర్తీచెయ్యాలో తెలుసుకున్నాను. వాళ్ళకు కావాల్సింది బిజినెస్. ఎప్పటికప్పుడు సర్కులేషన్స్  పెరుగుతూ వుండాలి. ఓ లెవెల్ కి వొచ్చాక కనీసం పదిపోకుండా నిలబెట్టాలి. దానికోసం నవలల్లో ఎన్ని పాత్రలు వీలయితే అన్ని పాత్రలు సృష్టిస్తాను. ఎన్ని మెలికలు యిమడాలో అన్ని మెలికలు యిస్తాను అన్నీ మేలికలూ, చిక్కుముళ్ళు వేసుకుంటూ పోవటమే. ఎప్పుడో చివరకు బుద్ధిపుట్టినప్పుడు అముళ్ళు విప్పదీస్తూ వుంటాను. అవసరాన్ని బట్టి వారాల తరబడి నవలను పొడిగిస్తూ వుంటాను"

    అయన కళ్ళలో ఓ కాంతి, గర్వం ఆత్మవిశ్వాసం ."

    ఇప్పుడు నేను ఎడిటర్స్ తర్మ్స్ డిక్టేట్ చెయ్యగల స్థితిలో వున్నాను. పబ్లిసిటీ దగ్గర్నుంచి నేను అలా వెయ్యమంటే అలా వెయ్యవలసిందే. ఇదే జీవిత రహస్యం. అనుక్షణం అన్ని కొణాలనుండీ     పోటీని ఎదుర్కోంటూన్న యీ రోజుల్లో ఎవర్ని విజయం వరిస్తుందో అతడే నీడ తీసుకుని పరిపాలిస్తూ వుంటాడు.

    "ఇప్పుడు మీకెన్ని సీరియల్స్ రాస్తూన్నారు?"

    "నాలుగు"

    "ఒకేసారి నాలుగు సీరియల్స్ ఎలా రాయగలుగుతున్నారు?"

    అయన నవ్వాడు. మనసులో ఎప్పుడూ ఏడెనిమిది థీమ్స్ కు తక్కువ కాకుండా వుంటాయి. ఇదిగో నా టేబుల్ మీద నాలుగు ప్యాలస్ వున్నాయి. చూడండి. ఉదయం అయిదు గంటలకల్లా లేస్తాను. లేవగానే టీతాగి ఆరున్నర దాకా ఓ నవల రాస్తాను. ఏనిమది గంటలదాకా స్నానం వగైరాలు. తిరిగి పదిగంటలదాకా యింకో నవల ఆ తర్వాత ఒకటి రెండు గంటలు చదువుకోవటం, విజిటర్స్ , సొంతపన్లు చూసుకోవటం యిలాంటివి. పన్నెండుకు భోజనం ఓ గంటసేపు నిద్ర, అయిదులోపల మూడో నవల. సాయంత్రం అలా బయటకు వెళ్ళిగాని, యింట్లో ఫ్రెండ్స్ తో గాని రిలాక్స్ అవుతాను లేకపోతె ఏదో మీటింగు అదీ ఎక్కడో అక్కడ వుంటుంది. రాత్రి యింటికి వొచ్చాక ఓ గంటసేపు నాలుగో నవల. ఏ నవలా కూడా రోజుకి ఒకటిన్నర రెండు పేజీలకంటె ఎక్కువ రాయను. అంతకన్నా ఎక్కువ స్త్రేయిన్స్ అవటం యిష్టంవుండడు. అలా రాస్తే వారానికి నాలుగు నవలలు ఒక్కొక్క ఇష్యూ చొప్పున తయరవుతాయి.

    అయన ప్లానింగ్ గౌతమ్ కు ఆశ్చర్యంగా వుంది.

    "మీరు నవల రాయడానికి మూడ అఖ్కర్లేదా?

    ఒక ఉద్యోగి తన విధులని నిర్వర్తిస్తున్నట్లు , కాగితాలు పెన్ను ముందు తెచ్చుకుని కూర్చుంటాను. ఇవేళ పెజిన్నర పూర్తి చేయాలనుకుంటాను. అంతే, దాంతో గంటన్నరలో ఎలాగో ఓలా పూర్తి చేయాలను కుంటాను , అంతే, దాంతో గంటన్నరలో ఎలాగో ఓలా పూర్తి చేస్తాను మూడ అనేదాన్ని మరచిపోయి సంవత్సరాలు గతించింది.

    "ఒకవేళ అదే పెజిన్నర రాయటానికి కూడా కధగానీ, సంఘటన గానీ దొరక్కపొతే?

    అయన మళ్ళీ నవ్వడు. "సాధారణంగా అలా జరగదు. ఒకవేళ అటువంటి పరిస్థితే ఎదురయితే ఏదో ఒక పాత్రను _ అంతే కొత్త పాత్రను సృష్టించి, ఏదో రకంగా కథలో ప్రవేశపెడతాను. దాంతో కొన్ని పేజీలు వెళ్ళిపోతాయి. లేకపోతె ప్లాష్ బ్యాక్ లో ప్రస్తుతం వున్న కథ చెడకుండా ఏవేవో సంఘటనలు చెబుతాను. కమర్షియల్ రైలులాగా ఆరితేరాకయీ పద్దతలన్నీ ఆ ప్రయత్నంగా తెలిసిపోతాయి.

    "ఒకేసారి యిన్ని నవలలు రాస్తున్నప్పుడు కన్ ప్యూజ్ణ్ గానీ, ఒక దాని యితివృత్తం  యింకోదానితో ఒదర్ టేక్ అవటంకాని వుండదా?

    "వుండదు."

    "ఎందుకని?"

    "అలవాటు."

    కొంచెం ఆగి అయన అన్నారు. ఇందులో శ్రమలేని నేననను. ఇదో అపూర్వమైనా సాధనం పాఠకుల మీద ఓ మత్తుమందు చల్లాను. ఆ మత్తునుంచి పాఠకులాని మేలుకో నివ్వకూడదు. ఊపరాడనివ్వ కూడదు. మార్కెట్ లో అగ్రస్థాయిలో వుండాలంటే ఎక్కడపడితే అక్కడ రచయితా కనిపిస్తూ వుండాలి. నేనుచెప్పినట్లు వినే పత్రికలూ నాచేతిలో కొన్నివున్నాయి. అవి నాకు బోలెడు సహకరిస్తాయి."

    ఓ నిముషం నిశ్సబ్దంగా గడిచింది.

    "ఈనాడు నాకు అపారమైన ఫ్యాన్ మెయిల్ , తృప్తిమేరకు డబ్బు అందమైన యిల్లు, కారు, నా కథలు సినిమావాళ్ళు కొంటున్నారు. బాగా తీస్తున్నారా లేదా అన్నది వేరే విషయం. ఒక రచయితా ఏమి సాధించాలని కళలు కంటాడో అన్నీ సాధించాను.

    "మీకు తృప్తివుందా?

    నాధముని ఉలిక్కిపడ్డాడు. "మీరుచేస్తున్నా సాహిత్య సృష్టి వల్ల మీకు తృప్తి కలుగుతొందా?"                                

    అయన మళ్ళీ నవ్వాడు. ప్రశ్నకు సమాధానం కొన్నాళ్ళుపోయాక చెబుతాను.

    కాని ఆ మాట అనేటప్పుడు నాదముని ముఖంలో మీరింకా కలుషితం కాలేదు. అలా కలుషితం కాకుండా వుంటారని భావిస్తాను. అదంత తేలికైనా పని కాదనుకోండి.

    గవుతమ్ లేచాడు వెళ్ళటానికి. నాదముని అతనిని సాగనంపటానికి కన్నట్ట్లుగా గుమ్మందాకా వచ్చాడు.

    ప్రక్క హాల్లో భరతనాట్య పాఠం అప్పుడే ముగిసినట్టుంది. డ్వాన్స్ టీచర్. పాప బయటకు వస్తున్నారు.

    "మా పాప త్రిపుర . నాకు మొదటినుంచీ భరతనాట్యంఅంటే ఎంతో మోజు. త్రిపురను గొప్ప కళాకారిణి చెయ్యాలని నా ఆకాంక్ష. అది ఓ రకంగా నా జీవితాశయము కూడా. కల్మషంకాని నాట్య ప్రవీణతను నేను త్రీపురలో చూసుకోవాలి. మరి ఆ ఆశ నేరవేరుతుందో లేదో తెలీదు. అన్నట్టు వీరు డ్వాన్స్ టీచర్ విరాజి"

    విరాజి రెండుచేతులూ జోడించి నమస్కారము చేస్తుండగా ఈయన గవుతమ్ అని .... ఓ రచయిత.

    ఆమె కళ్ళలో చిత్రమైన మెరుపు. పెదవులమీద సంతోషంతోమారిన హాసరేఖ .

                                                             *    *    *   

    గవుతమ్  బయటకు వొచ్చి, ఫర్లాంగు దూరంలో వున్న బస స్టాఫ్ దగ్గరకు నిల్చున్నాడు.

    అతని ఉద్దేశ్యం బస్సులో ఎక్కాలని కాదు. జేబులో డబ్బులు కూడా లేవు.

    ఎక్కడకు పోవాలి? ఏం చెయ్యాలి?

    ఈ ప్రశ్న అనుక్షణం ఉదయించే మానవుడు చాలా దురదృష్టవంతుడు.

    విరాజి! తమాషగా వుంది పేరు. ఆమెను కలవటం కూడా గుమ్మత్తుగానే కలిశాడు. అసలు జీవితంలోని పరిచయాలన్నీ  ఇలాగే అవుతూ వుంటాయేమో .

    ఒక రచయితగా పరిపూర్ణమైనా జీవితం గడపాలన్నది తనలో తీవ్ర మైనా ఆకాంక్ష . అందుకే ఎలాంటి చెడు అనుభవానైన్నా ఎదుర్కోనెందుకతను వెనుదియ్యడు, రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణీకులందరిని నిశితంగా గాన్మనిస్తూ వుంటాడు. ఆ తాత్కాలుకపు ప్రయాణంలో వాళ్ళ స్వార్ధం వాళ్ళ అవేగల ప్రసారశ విసుగూ విరామం లేని సంభాషణ గమనించటం ఎంతో ఆసక్తి. అలాగే బయటకు కాదంటూనే మానవుడు కోసం బ్రతుకుతూ వుండటం, తిండికోసం అతని వెంపర్లాత అతనికి వినోదం కలిస్తూ వుంటుంది.

    అలాగే డబ్బు .....

    "మీరు యిక్కడ వున్నారా? ప్రక్కనుండి ఓ తియ్యని కంఠం వినిపించేసరికి తల త్రిప్పి చూశాడు.

    అతని కళ్ళలో ఓ మెరుపు , ప్రక్కన విరాజి నిలబడి వుంది.

    అతనెప్పుడూ బెంగాల్ చూడలేదు. బెంగాలీ సాహిత్యం ఎక్కువగా చదివాడు . శరత్ బాబు రాసిన చరిత్రహీనులు అనే నవలలో సావిత్రి అనే పనిమనిషి పాత్ర అంటే అతనికి ప్రాణం . హైదరాబాదు వచ్చిన కొత్తలో అలాంటి పనిమనిషి తారసపడుతుందేమోనని ఎంతో ఆశతో ఎదురు చూశాడు. ఆ నవల చదివాక సావిత్రిలాంటి  పనిమనిషిని వుంటే నేను జీవితాంతం మెస్సులోనే ఉంటాను అన్నాడుట ఆ రోజుల్లో ఓ విమర్శకుడు తమాషాకు.

 Previous Page Next Page