అ రోజు చూసిన కారే: బహుశా యింటిలోనే ఉండి ఉండాలి.
లోపలకు వెళ్ళి మూడుమెట్లు ఎక్కాక పేముకుర్చీలు వేసిఉన్న చిన్న సిట్ అవుట్ లాంటి ప్రదేశంలో నిలబడి గోడకున్న బటన్ నొక్కాడు.
లోపల్నుంచి టంగ్ టంగ్ మని చాలా శ్రావ్యమయిన శబ్దం వినబడింది.
ఒక నిముషం గడిచాక లోపలినుంచి ఎవరో పదిహేనేళ్ళ కుర్రాడు వచ్చి తలుపు తీశాడు. పనిపిల్లవాడు అయివుండవచ్చు.
"నాదముని గారున్నారా?"
"ఉన్నారు. రాసుకుంటున్నారా."
"ఇప్పుడు చూడరా ?"
"మీ పేరేమిటోచెప్పండి . అడిగి చెబుతాను."
చెప్పాడు.
ఆ కుర్రాడు లోపలకు వెళ్ళి ఓ నిముషంలో తిరిగివచ్చి "రమ్మంటున్నారు రండి." అన్నాడు.
గౌతమ్ లోపలకు అడుగుపెట్టాడు.
వరందాలోంచి నడుస్తుంటే ప్రక్కన చిన్న హాలులాంటి దానిలో ఎమిదేళ్ళ పాపకు ఓ అమ్మాయి డాన్సు నేర్పిస్తూ కనిపించింది.
పాప చాలా ముద్దుగా ఉంది.
డాన్సు నేర్పించే అమ్మాయికి పద్దెనిమిదీ _ ఇరవయ్ ఏళ్ళ మధ్య ఉంటాయి. అందానికి ఉన్న నిర్వచనాల ప్రకారం ఏ అందవతో కాదో నిర్ణయించడం కష్టం. కానీ ఆమె ప్రతీ అవయవంలో, కళ్ళలో, మేడలో, నడుంలో , శరీరపు నున్నదనంలో ఏదో ప్రత్యేకత ఉంది. సృష్టిలో చాలా మందికి విషయాలనేత్రాలు ఉండవచ్చు. ఇవి కేవలం విశాల నేత్రాలేకాదు. వాటిలో ఏదో వెలుగు, లోటు అమ్తుర్గత భావాన్ని రెండింటిగా మధించి ప్రసారం చేస్తున్నట్లు గుండెల్లోకి దూసుకుపోయే చూపులు .....
క్షణంపాటు స్తబ్ధుగా నిలబడిపోయాడు.
ఏదో భంగిమ ప్రదర్శించబోతూన్నదానిలా ఆమె ఎవరో తనని గమనిస్తున్నట్లు గ్రహించి చప్పున ఆగి, అతనివంకచూసి అంతలోనే తల త్రిప్పుకుంది.
"రండిసార్ " అని కుర్రాడు తల దించుకుని చూపులు మార్చుకుని అతను ముందుకు కదిలాడు.
నాదముని తన గదిలో కుషన్ కుర్చీలో కూర్చునివున్నారు. మనిషికి నలభై అయిదు, నలభయ్ ఆరేళ్ళకంటే ఎక్కువ ఉండవు . జుట్టు ఇంకా కొంచెంకూడా నేరవలేదు. ఇంట్లో ఉండడంవల్ల లుంగీపైన లాల్చీలాంటిది వేసుకుని ఉన్నాడు. బయటకు వేదతే ప్యాంటు, స్లాక్ వేసుకుంటాడు. భారీ విగ్రహం ముఖంలో వర్చస్సు. రాసుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు మాత్రం కళ్ళజోడు పెట్టుకుంటూ వుంటాడు. మిగతా సమయాల్లో తన టేబుల్ మీద ఉంచుతూ ఉంటాడు.
గౌతమ్ అది మొదటిసారి ఆయన్నంత దగ్గరినుంచి చూడడం.
టేబుల్ మీద నాలుగయిదు ఫైల్స్ ఉన్నాయి. గదిలో చాలా షెల్స్. వాటినిండా రకరకాలు పుస్తకాలు _ యింగ్లీషువీ, తెలుగువీ సరస్వతీదేవి మూర్తీ భవించినట్లుగా వుంది. గోడలమీద వివిధ సందర్భాలల్లో సపర్పించబడిన సన్మానపత్రాలు, షెల్స్ లలో మెమెంటోలు అలంకరించబడిఉన్నాయి.
"రండి" అన్నాడు నాదముని చిరునవ్వుతో కూర్చునేందుకు కుర్చీచూపిస్తూ.
"మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా?" అన్నాడు గౌతమ్ ఎదురుగా కూర్చుంటూ. అయన సీరియల్స్ ప్రస్తుతం నాలుగు పత్రికల్లో, మూడువారపత్రికలు. ఒక మాసపత్రికలో రాస్తున్న విషయం అతనికి తెలుసు. "లేదు. నేనే రమ్మన్నకదా." నాదముని చాలా గర్విష్టఅనీ, యితరులతో చాలా రిజర్వడ్ గా వుంటారని చెప్పుకోగా అతను విన్నాడు. కాని అందుకుభిన్నంగా ఉన్న అయన మాటల్లోని స్నేహిశీలత ఆప్యాయత అతనిని ముగ్దుడిని చేశాయి.
"మీ ఉత్తరానికి జావాబివ్వలేదు _ వెంటనే వొచ్చి కలుద్దామానుకుంటూ ఇంతలో ఏదో పనులవల్ల జాప్యం జరిగింది."
"'జర' _ ఆ కథ మీరు చాలా బాగారాశారు. ఒక రచయితా అట్లారాస్తే బాగుండునని కలలుకనే కథ"
"మీ ఉత్తరం నాకు చాలాసంతోషం కలిగించింది. అది రాస్తొన్నప్పుడు మీలాంటి మేధావులనికూడా ఆకర్షించగల ఉత్తమ రచన అనుకోలేదు. ఓ రాత్రంతా కూర్చుని రాసినట్లున్నను."
"ఉత్తమ రచనలేప్పుడూ అలానే తయారవుతూ వుంటాయి."
వాళ్ళు అలా మాట్లాడుతూ అలానే తయారవుతూ వుంటాయి."
వాళ్ళు అలా మాట్లాడుతూ వుండగానే టేబుల్ మీద ఫోన్ మ్రోగింది. అయన రిసీవర్ తీసుకుని 'నాదముని' అన్నాడు.
అవతలినించి ఎవరో మాట్లాడుతున్నారు.
"ఇంకా అవలేదు, సాయంత్రానికి రెడీఅవుతుంది. ఆరు గంటలు దాటాక ఎవరినయినా పంపించండి యిస్తాను" అంటూ ఫోన్ పెట్టెశాడు.
"సారధి వీక్లీ వాళ్ళు వొచ్చేవారం మేటర్ కోసం" _ అని, యింతవరకూ నలలలేమైనా రాశారా?" అనడిగాడు.
"రాశాను అచ్చవలేదు?"
నాదముని నవ్వాడు. ఈ పత్రికా ప్రపంచం సీరియల్స్ అంతా ఒక విచిత్రం. ఎవరిని ఎప్పుడు ఎందుకు కీర్తీ కిరీటం వరిస్తుందో చెప్పటంకష్టం ఉత్తమ రచన వేరు. పాప్యులర్ రచన వేరు. ఉత్తమ రచయితగా వుండి పోవాలా? పాప్యులర్ రచయితగా తయారవాలా_ అన్న నిర్ణయం మొదట తీసుకోవాలి.
ఇందాక తలుపుతీసిన కుర్రాడు ఓ ట్రేలో యిద్దరికీ కాఫీ తీసుకొచ్చాడు.
"తీసుకొండి."
"ఒకప్పుడు ....." అన్నాడు నాదముని కాఫీ సిఫ్ చేస్తూ _ "రచనా విధానం , రచనా లక్ష్యం వేరుగావుండేవి. అప్పుడిన్ని పత్రికలూ లేవు. ఓ పత్రికలో రచన అచ్చవ్వలంటే రచయితా విశ్వప్రయత్నం చేయాల్సివచ్చేది. బాగా ముందుతరంలో కవులే నవలా రచయితలుగా వుండేవారు. ఉదాహరణకు చెప్పాలంటే విశ్వనాథ సత్యనారాయణ , అడవి బాపిరాజు _ ఇలాంటి వారు. ఇప్పటి పరిస్థతులనుబట్టి ఆ నవలలు విలువలని నిర్ణయించడం కష్టం. కానీ జీవిత చిత్రణ నవలా సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయిన ఫ్రెంచి రచయితల ప్రభావం వుండేది. మనకు యిష్టంవున్నా, లేకపోయినా ఒక విషయం మాత్రం ఒప్పుకోకునితీరాలి. ఆనాటి కవులు చాలా అంశాల్లో నిష్టాతులు , జీవితాన్ని ఒక అధ్యయంగా నడిపినవారు . ఒక రకంగా చెప్పాలంటే జీవితాలను సాహిత్యానికి అంకితంచేసిన వాళ్ళు.
గౌతమ్ కు యీ సంబాషణ చాలా ఆసక్తికరంగా వుంది. అతని మంచి అన్యభావం కావటంవల్ల ఎక్కువగా రచయితలతో పరిచయం లేదు. సాహిత్య సమావేశాలకూ వాటికి కూడా చాలా అరుదుగా వెడుతూ వుంటాడు.
"ఒక్కసారి ఆలోచించండి. చలంలాంటి నవలా రచయితా ఓ సిద్దాంతాన్ని ప్రచారం చేస్తూ ఆ సిద్దాంతానికి కట్టుబడి జీవితాన్ని ప్రయోగషాల చేసుకుని. సంఘంలో ఓ విచిత్ర వ్యక్తిగా గుర్తించబడుతూ మనుగడకోసం పోరాటం సాగిస్తూ __ చివరకు యీ సమాజంలో యిమడలేక ఏ అరుణ చలానికో వెళ్ళి శేష జీవితమంతా గడపటం, జీవితమంతా ఎక్సేపెరి మెంట్స్ తో సమాజంతో పోరాటం తానె గడపటం, అయిందంటే రచయితా మనకు దూరంగా వున్న ఏ విదేశాలలానేగాక అనకే చిత్రం అనిపించేటట్లు మన దేశంలో మన మధ్య ప్రతివాదనలు తలుచుటు౦ టే ఆశ్చర్యముగా లేదూ?"
గౌతమ్ చలాన్ని గురించి ఆలోచిస్తున్నాడు.
అలాగే గోపీచంద్ సమాజాన్ని ఎన్ని కొనాలనుంచి, ఎన్ని దృక్పధాల నుంచి దర్శించాడు. ఎన్ని వాస్తవిక చిత్రాలు చేశారు! జీవితపు లోతుల్లోకి ఎంత చొరవగా దూసుకెళ్ళిపోయాడు.
అలాగే మరికొందరు పుట్టుకు వస్తే యీ సాహిత్య చరిత్ర ఎలా వుండేదో. ఈ లోపల సాహిత్యం తొందరపడి పోయింది. కమిట మెంట్స్ ఎక్కువగా వోచ్చేసాయి. ఈ కమిటి ఓరైటింగ్ వల్ల విశాల దృక్పథం, వైవిధ్యం కొరవైపోయి, ఆవేశం, కేవలం ఒకవైపు నుంచి ఆలోచించే గుణం ఎక్కువైపోయాయి. ఆ వొరవడిలో కొన్ని ఆణిముత్యాలవంటి రచనలు వెలువడినా , రాసిందే రాయటం , చెప్పిందే చెప్పటం వల సాహిత్యం సంపూర్ణత్వాన్ని కోల్పోయి స్తబ్దతను చీలిస్తూ , నిశ్శబ్దాన్ని బ్రద్దలు కొడుతూ ఓ కొత్త సాహిత్యం బయల్దేరింది. అది ప్రేమ సాహిత్యం కావచ్చు. థ్రిలర్స్ కావచ్చు ...... రకరకాల రూపాలు ధరిస్తోంది. పాఠకులపల్స్ పట్టుకుని, వారి అభిరుచుల స్థాయికి డిగి, పోనీ దిగజారి వారి మనసులను రాజింపజేసే నేర్పురచయితలూ సాధించారు. దీన్నే కమర్షియల్ రైటింగ్ అన్నారు.
ఓ నిమిషమాగి నాదముని చిరునవ్వు నవ్వి "నేనిప్పుడా కమర్షియల్ రచయితని" అన్నారు.
"మారాలని మారారా? పరిస్థితుల ప్రాబల్యం వల్ల మారారా?" అనడిగాడు గౌతమ్ .
నాదముని కొంచెంసేపు మౌనంగా వూరుకున్నారు. అయన ముఖంలో బాధ, వేదన, కసి, గాంభీర్యం రకరకాల భావాలు తోనికిసలాడాయి.
మానసికంగా ఓ స్థాయికి ఎదిగిన వ్యక్తి కావాలని ఏ పనిచేయరు. అందులో అభిరుచుల ప్రమేయం వున్నప్పుడు సాహిత్య జీవితంలో మొదలు పది పదిహేనేళ్ళూ నా భావమైన పాత్రలనే సృష్టిస్తూ, వాస్తవికతనే పోషిస్తూ రచనలు చేశాను. ఎవరో కొందరు మేధావులు శేభాష్ అన్నారు. ఎప్పుడో ఓ ఉత్తరం పాఠకుల దగ్గర్నుంచి ఏ మారుమూల ప్రాంతంనుంచో వొచ్చేది . ఎందుకంటే స్థాయికి ఎదిగిన వాళ్ళుకాదు. ఇలా ఏంకావాలో అయి పాఠకులు అత్యుత్తమ ఆ దశలో నేను కొన్ని ఉత్తమ రచనలు చేశాను. కాని అది నన్ను రచయితగా నిలబెద్దతానికి, ఓ గుర్తింపు తీసుకురావటానికి సరిపోలేదు అది చేతిలో పెట్టుకుని కాలే కడుపుతో నేను పభ్లిషరు గుమ్మంఎక్కందిలేదు పేజీకి రూపాయిస్తానని ఒకరు. వెయ్యి కాఫీలకంటే ఎక్కువ పోవని ఒకరు .... అసలువేసుకునెందుకే నిరాకరించేవారు ఒక వేళ వేసుకున్నా ఆ యిచ్చే రెండు మూడు వందల రూపాయల కోసం ముప్పయినలభయిసార్లు త్రిప్పేవారు. అలా అవస్థపడుతూ , జీవితచక్రంలో నలిగి పోతూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ వుండేవాడిని. ఇంగ్లీషులో వెలువడేపాప్యులర్ రచనలన్నీ చదివి జీర్ణించుకోటానికి ప్రయత్నం చేస్తూ వుండేవాడిని. అలా మధన పది అనేక విధాల నలిగి నలిగిచివరకు కమర్షియల్ రచయితగా మారాను."