Previous Page Next Page 
విరాజి పేజి 6

   

   టేబుల్ ముందున్న ఓ పేము కుర్చీలో ఒకాయన కూర్చుని వున్నాడు. నలభయి అయిదేళ్ళు౦టాయి.  చేతిలో త్రీ పైవ్స్  సిగరెట్లు, టీపాయ్ మీద సగం త్రాగి వొదిలేసిన బోసర్లీ సోడా.

    "మా డైరెక్టరు గారు" అని పరిచయం చేశాడు విక్రమ్.

    గౌతమ్ నమస్కారం చేశాడు.

    "గౌతమ్ అని నా స్నేహితుడు కథలు రాస్తూంటాడు." డైరెక్టరు గారు తలఊపారు.

    బాయ్ ట్రేలో కాఫీలు  తీసుకొచ్చాడు.

    "తీసుకొండి" అన్నాడు విక్రమ్.

    "కథేమైనా అలోచించారా?" అనడిగాడు విక్రమ్.

    "వొస్తుంది. యిప్పడిప్పుడే వొస్తుంది." _ అని రెండు నిముషాలు కళ్ళు మూసుకుని ఆలోచించి "బ్యూటిపుల్  అయిడియా , హీరోయిన్ హీరోబస్తీలో కాలేజీలో క్లాస్ మేట్స్. మొదట టీజింగ్. తర్వాత లవ్. యిద్దరూ కలసి కాలేజీలో ఓ డాన్స్ పోగ్రాంలో కూడా పార్టీస్ ఫేట్ చేస్తారు. హీరో, హీరోయిన్లమీద చిత్రీకరించిన ఓ సాంగ్ యిక్కడ మిక్స్ చేసుకోవచ్చు పరీక్షలయిపోయాక  యిద్దరూ ఊళ్ళకి వెడతారు. చిత్రమేమిటంటే యిద్దరినీ ప్రక్క ప్రక్క ఊర్లు. ఆ ఊరి కాకి యీ ఊరిమీద వాలటానికి వీల్లేదు. ఈ ఊరి కాకి ఆ ఊరిమీద వాలకూడదు. ఊరి గ్రామ పెద్ద హీరోయిన్ ఫాదర్ రెండో వూరీ గ్రామ పెద్ద హీరో ఫాదర్ ఇద్దరూ బుద్ధ. శత్రువులు. హీరో , హీరోయిన్ యీ పరిస్థితి గమనించి ఆ యిరు గ్రామాలమధ్యా మైత్రి సాధించాలని కంకణం కట్టుకుంటారు. ప్రతి రోజూ బోర్డర్ లైన్ లో కలసుకుంటూ వుంటారు ..... అక్కడినుంచి సీన్స్ వర్క్ అపుట్ చేసుకోవాలి .

    "మనం గౌతమ్ గారిని ఉపయోగించుకో వచ్చుననుకుంటూ."

    "అలాగే"

    ఆ మధ్యాహ్నంకల్లా ఓ దస్తా తెల్ల కాయితాలు , పెన్నూ అన్నీ సమకూర్చారు.

    రాయమన్నారు.

    గౌతమ్ కి ఏమి చెయ్యాలో తోచడంలేదు. వాళ్ళు ఓ అవుట్ లైన్ యిచ్చారు. కథను వూరించాలి.

    "మనకి ఎక్కువ టైములేదు. వొచ్చే వారంలో హీరోగారి కాల్ షీట్స్ వున్నాయి. అప్పటికల్లా రెడీ కాకపోతే అయన మండి పడతాడు." అన్నాడు విక్రమ్.

    అతను భయపడ్డట్లే ఆ రాత్రి మద్రాస్ నుంచి ఫోన్ వచ్చింది.

    అవతలనుంచి హీరో మాధవ్ మాట్లాడుతున్నాడు. విక్రమ్ రిసీవ్ చేసుకున్నాడు.

    "ఏమండీ స్టోరీ రెడీ అయిందా?"

    విక్రమ్ కొంచం భయంగా "అవుతోంది. కొత్తరైటరిని పేట్టి వర్క్ చేయిస్తున్నాము." అన్నాడు.

    "ఇంకా రెడీ కాకపోతే ఎలాగండీ? అసలాడైరెక్టరని వొద్దని చెబితే వినిపించలేదు. అతని పిక్చర్లు వరసగా మూడు ప్లాష్ అయ్యాయి పోనీ ఒక పని చేద్దాం. వచ్చేవారం  మీకిచ్చిన డేట్స్ ఇంకోకరికి ఎడ్జస్ట్ చేస్తాను. ఎందుకంటే అది ఫినిషింగ్ స్టేజిలో వుంది."

    విక్రమ్ గుండెల్లో రాయి పడింది. "ప్లీజ్! అంతపని చెయ్యకండి. బడ్జేస్ట్  ఇప్పటికే అయిదు లక్షలదాకా అదనంగా పెరిగిపోయింది. రెండు, మూడురోజుల్లో కథతయారైపోతుంది. డైలాగ్స్ దేముందిలేండి. సెట్స్ మీదయినా చూసుకోవచ్చు. దయవుంచి  డేట్స్ ఇంకొకరికి ఇవ్వకండి." అన్నాడు ముఖాన చెమటలు పడుతూండగా.

    "సరే ! ఈసారి కథ తయారు కాకపోతే ఊరుకోను. కాని ఆ డైరెక్టరు మాత్రం......


    "డైరెక్టరు ప్రక్కనే వుండబట్టి విక్రమ్ ఏమీ మాట్లాడలేదు.

    "అక్కడే వున్నాడేమిటి?"

    "ఊ."

    "సరే ..... వొచ్చే పిక్చర్ కైనా జాగ్రత్తపడండి" _ ఫోన్ పెట్టేశాడు.

    "ఏమిటోయ్?" అన్నాడు డైరెక్టర్.

    "ఈ సారి కథరేడీ కాకపోతే డేట్స్ ఇంకొకరికిఇచ్చేస్తానంటున్నారా? అందుకే ఈ పెద్ద అర్టిస్టుతో పిక్చర్ తియ్యడం నా కిష్టం లేదు ఈ సారికయిపోయింది. వోచ్చేసారి కొత్త ఆర్టిస్టులను పేట్టి బ్రహ్మాండ మయిన హిట్ పిక్చర్ తీద్దాం." అన్నాడు.

    విక్రమ్ ఏమీ మాట్లాడలేదు.

     డైరెక్టర్ ఆఫీస్ బాయ్ ని పిలిచి సిగరెట్ పాకెట్ తెమ్మని పురమాయించి _ "పైగా ఎవన్నా లక్కీ అర్తిస్టా అంటే _ వరసగా నాలుగు ప్లాప్స్ వచ్చాయి." అన్నాడు.

    అయన చేతిలో ఆరకుండా ఎప్పుడూ సిగరెట వెలుగుతూ వుండడం, మంచి నీళ్ళకి బిస్లరీ సోడాలు తాగుతూ వుండడం గమనించాడు గౌతమ్ . ఇహా కాఫీలు గంటకోసారి ఎవరూ అడక్కుండానే వస్తూ వుంటాయి. డైరెక్టర్ గారికి హార్లిక్స్ గాని, పాలు గానీ వస్తూ వుంటాయి.

    స్టోరీ డిస్కషన్ జోరుగా జరిగిపోతుంది.

    ప్రతిరోజూ డిస్కషన్ అయిపోయాక గౌతమ్ ని కారులో రూంకి పంపించేవారు. ఉదయం ఎనిమిది గంటలకల్లా అతనిని తీసుకెళ్ళడానికి కారు వచ్చేసేది.

    ఈ పద్దతి అతనికి చాలా మోహమాటుగా వుండేది. "కారెందుకు బస్ లో వస్తాను ." అనేవాడు.

    "నో. నో. కారు పంపిస్తాను." అన్నాడు విక్రమ్.

    ఒక వ్యక్తితో పని ఉన్నప్పుడు కారులేక వాళ్ళ భావాలో "బండి" పంపించడం ఒక ఆనవాయితీ అని తెలుసుకున్నాడు గౌతమ్.

    డైరెక్టరు పూనకం వొచ్చినట్లు టి.వి.వి.సి. ఆర్ దగ్గర పెట్టుకుని అందులో ఇంపోర్టె౦ట్ వీడియా క్యాసెట్స్ వేసుకుని చూసుకుంటూ అందులో తనకు పనికొచ్చే పాయింట్లకోసం గాలిస్తున్నాడు. గంటకో కదా వస్తువు మార్చేస్తున్నాడు.

    మధ్య మధ్య గౌతమ్ చెప్పింది వినడాని కన్నట్ట్లుగా కూర్చునేవాడు. కాని రెండు వాక్యాలయినా పూర్తీ చెయ్యకుండానే అడ్డు తగిలి అయన లీడ్ తీసుకుని చెప్పుకు పోయేవారు.

    అంతా చెప్పి "ఎలావుంది?" అని అడిగేవారు.

    గౌతమ్ పెదవులు విప్పెలోపలె అతని ముఖంలోని హావభావాలు గమనించి, చెప్పబోయే జవాబు పసిగట్టేసి మాటపూర్తీ చేయనిచ్చేవాడుకాదు.

    గౌతమ్ ఒక విషయం గ్రహించాడు. డైరెక్టరు చెప్పేది ఇతరులు  వినాలి, కాని ఇతరుల మాట అయన ఎక్కదని . ఒకవేళ ఎదుటి వాళ్ళు చెప్పడానికి ప్రయత్నించినా చివరకు తన మాటే నెగ్గించుకుంటాడు.

    అయన చెప్పేది తను రాసేదానికీ, తన అవసరం ఏమిటి అన్న ప్రశ్న ఉదయిస్తూ ఉండేది. గౌతమ్ లో. కాని బయటకు చెప్పలేక బాధపడి ఊరుకునేవాడు.

    డైరెక్టరు అతను లేకుండాచూసి విక్రమ్ తో "ఈ కుర్రాడికి సినిమా మీడియం తెలీదు. గబగబ ఐడియాలు మార్చలేదు. ఎంతసేపూ నేను చెప్పేది విని రాయడానికి ప్రయత్నిస్తాడుగాని అతని నోట్లోంచి ఒక్క ఉక్కరాదు. అలాంటప్పుడు అతనుండి ప్రయోజనమేమిటి? అంతా నేనేచూసుకుకుంటుంటే" అన్నాడు.

    గౌతమ్ అతనికి నచ్చలేదని తెలుసుకున్నాడు విక్రమ్ ఒకసారి సినిమావాళ్ళకి విముఖత్వం ఏర్పడిదంటే అంతవరకూ రాజమర్యాదులు చేసిన వాళ్ళు క్షణాలమీద వదిలించుకునేప్రయత్నాలు చేస్తారు.

    "డైరెక్టర్ గారు వేరే కథ ఆలోచిస్తున్నారు. మీకు మళ్ళీ కబురు చేస్తారు" అన్నాడు విక్రమ్

    గౌతమ్ అర్దమయింది "నే వెడతాను" అంటూ లేచాడు.

    "కారు బయటికెళ్ళింది కాసేపుంటే_"

    "అఖ్కార్లేదు. బస్ లో వెడతాను" అని బయలుదేరి వచ్చేశాడు.

    ఈ మూడు నాలుగురోజులూ పడ్డ కష్టానికిగాను ఇది ఉంచండని డబ్బు అతనేమీ ఆఫర్ చెయ్యలేదు గౌతమ్ అమ్తకనా అడగలేదు.

    సినిమావాళ్ళు వాళ్ళకు బుద్ధిపుట్టినప్పుడు వేలకువేలు ఎలా ఖర్చు పెడతారో బుద్ధిపుట్టనప్పుడు రూపాయల దగ్గర కూడా తూచితూచి వ్యవహారిస్తారు.

    గౌతమ్ బాధపడలేదు. కాని అతనికి వ్యవహారం చాలా వికారంగా అనిపించింది. ఈ వ్యవహార ప్రపంచానికి తాను పనికిరాడేమోననిపించింది.
   
    వెంటనే గదికి వెళ్ళబుద్ధికాలేదు. ఎందుకో తెలియని కసి.

    అలా ఎంతసేపు నడిచాడో అతనికి తెలియదు. చేతికి వకాహీ లేక పోవడంవల్ల టైమంతయి౦దోకూడా తెలీదు. జనసంచారం మందగించటం వలల కిల్లి దూకాణాలుకూడా మూసివుండడం వాళ్ళా పదకొండు దాటిపోయి ఉంటుందని గ్రహించాడు.

    కాళ్ళు నొప్పులు పుట్టి  _ గదిదారి పట్టాడు.

    ఈ మూడు నాలుగు రోజులనుంచీ కాఫీ టిఫిన్ లు , బోజనం , సినిమా ఆఫీసులో గడిచిపోతూ వుండటంవల్ల డబ్బు అవసరం రాలేదు. చాలా నీరసంగా ఉంది. ఆకలేస్తుంది.

    గదికి చేరేసరికి ఓ అరగంట దాటింది.

    తాళం దగ్గర చిన్న కాగితం పేట్టి ఉంది. తీసి, లోపలి వెళ్ళిలైటు వెలిగించాక చదివాడు.

    గౌతమ్!

    మరీ ఎక్కువగా రాయకపోయినా _ చాలమంది రచయితల్లా మీపేరు తరచు కనిపించకపోయినా  _ మీరు నా అభిమాన రచయితలు. మీ కదుల్లోని వస్తావికత, సునితత్వ౦. మూగవేదన నన్ను చాలా కదిలిస్తాను. ఎందుకో ఈవేళ మిమ్మల్ని చూడాలనిపించి, మీ ఎడ్రెస్  వెతుక్కుంటూ  వచ్చాను.  గది తాళం పెట్టివుంది. చాలాసేపు వెయిట్ చేశాను. మీరు రాలేదు. చీకటి కూడా పడిపోయింది. ఇంటికి  వెళ్ళాలంటే అరుమైళ్ళు నడవాలి. అందులో చీకటిలో! అందుకుని వెళ్ళిపోతున్నాను. అవకాశ మొచ్చినప్పుడు కలుస్తాను. 

                                                                                                            .......విరాజి     

                        
                                                  3

    రాత్రి చాలాసేపు ఆలోచన్లలో నిద్రపట్టలేదు. మామూలుగా ఉదయం ఆరున్నర ఏడు గంటలకు మధ్య నిద్రలేవడం అతని కలవాటు. కాని రాత్రి మూడుగంటల దాకా అవిశ్రాంతిగా రాయటంచేత ఎనిమిదిదాటాక మెలకువ వచ్చింది.

    ఎందుకో దిగులుగా ఉంది. వొంటరితనం కొంతమంది మనుషులకి ఎంత వాంఛనీయమో _ ఒక్కో సమయంలో అంత విషాదమయం కూడా.

    జేబులో రూపాయి అలాగే ఉంది.

    స్నానంచేసి దగ్గర వరదరాజు టీ త్రాగి అక్కడినుంచి కదిలాడు.

    డబ్బులేకుండా గడపడం గమ్యానికి ఓ స్వరూప ఏర్పరుచుకొక పోవడం ఓ థ్రిల్ అని అతనును కోవటంలేదు. కాని పట్టుదల , నిర్లిప్తతం మధ్య నలిగిపోతూ ఉండడంవల్ల అడుగులు తడబడుతున్నాయి.

    నాదముని గారింటికి వెళ్ళాలనిపించింది. అయన తనని ఆహ్వానించాడు. వెళ్ళటంలో తప్పులేదు. కాని అయన చాలాబీజీగావుండే రచయితా ఇంటికి వెడితే మాట్లాడటానికిఅవకాశమున్న స్థితి ఉంటాడో, ఉండడో.

    అయినా వెళ్ళాలన్న కోరికను చంపుకోలేకపోయాడు. ఒక రచయితా యింకో రచయితను కలుసుకోవటంలో అనందం ఉంది అయన అడ్రస్ తనకురాసిన ఉత్తరంలో ఉంది.

    ఓ గంట గడిచాక గౌతమ్ నాదమునిగారి యింటిముందు వున్నాడు అంత పెద్దదీ _ చిన్నది కాని యిల్లు. కాని చాలా ఆర్టిస్ట్ గా వుంది. బయట చిన్న గార్డెన్ ఎన్నో రంగులను విరజిమ్ముతూ రకరకాల పూలమొక్కలు. పోర్టికోలో ఫియట్ కారు ఆగిఉంది.

 Previous Page Next Page