ఆ రాత్రి ఈశ్వరమ్మని గ్రుచ్చి గ్రుచ్చి అడిగాక ఆమె నిజం చెప్పేసింది __ గౌతమ్ అయిదేళ్ళు పిల్లాడప్పుడు, ఆమె తల్లి అత్తన్నో బాటు కృష్ణపుష్కరాలాకని వొచ్చింది ఆమె ఎవరో వీళ్ళకి తెలియదు. ఏ ఊరోకూడా తెలీదు. ఒక ప్రక్కన వాళ్ళు స్నానం చేస్తున్నారు. కొంచెం దూరంలో తనూ, ఆయనా స్నానం చేస్తున్నారు. వాళ్ళు స్నానం చేసే ఘాట్ లో ఏర్పాట్లంతా పకడ్భందీగా లేవు. ఉన్నట్లుండి అమే నీటిలో అదృశ్యమైపోయింది. స్నానం చేస్తున్నా వాళ్ళంతా కంగారుతో కేకలు పెట్టారు. ఇద్దరు ముగ్గురు యీతగాళ్ళు నదిలో దూకి గాలించినా ప్రయోజనం లేకపోయింది.
ఒడున్న నిలబడి యీ పిల్లవాడు __ "అమ్మా అమ్మా" అని పిలుస్తున్నాడు. రామనాథంగారూ, మిగతా వాళ్ళు అతని దగ్గరకు వెళ్ళి ఎన్ని ప్రశ్నలు వేసినా తన పేరు గౌతమ్ అన్న ఒక్క విషయం మినహాయించితండ్రి గురించి గాని సొంత ఊరు గురించి గాని వివరాలు చెప్పలేక పోయాడు. చాలసేపు ప్రయత్నించి రామనాథంగారు ఆ కుర్రాడిమీద సానుభూతితో పోలీసులకు తన ఊరూ ఎడ్రెసూ యిచ్చి అతని తరపున ఎవరైన వస్తే అక్కడికి పంపించమని చెప్పి తనతోబాటు ఊరు తీసుకెళ్ళి పోయాడు. నాలుగైదు రోజులు చూసినా ఎలాంటి కబురూ రాలేదు. మళ్ళీ తనే వెళ్ళి పోలీసుస్టేషను లో వాకబు చేశాడు. పిల్లవాడి గురించి ఎవరూ రాలేదన్నారు. తర్వాత అరు నెలలదాక వారానికో, పదిరోజులకో ఓసారి విజయవాడ వెళ్ళి వాకబు చేస్తూనే వున్నారు. ఫలితమేమీ లేక పోయింది ..... గౌతమ్ వాళ్ళతో బాటు ఆ యింట్లో స్థిరపడి పోయాడు.
అంతా చెప్పి ఆవిడ అతని తలమీద చెయ్యివేసి నిమురుతూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. "వారీ గౌతమ్! నువ్వుఎక్కడివాడివో తెలీకపోయినా నిన్ను సొంత బిడ్డలానే చూసుకొన్నారురా. నువ్వు పరాయి వాడిననే భావంతో ఎప్పుడూ చూడలేదు. ఒకసారి నీకు న్యుమోనియా వోచ్చి సీరియస్ అయితే ఏం జరుగుతుందోనని అల్లాడి పోయానురా. మీ నాన్నాగారు కూడా _ నువ్వు ఉద్యోగం చెయ్యడం లేదన్న వేరే భావమేమి లేదురా. ఈ భేదం నువ్వు మనసులో పెట్టుకుని బాధ పడకురా" అని వాపోయింది.
గౌతమ్ ఏమీ మాట్లాడలేదు. అతని గుండెలో అగ్ని పర్వతాలు బ్రద్దలవుతున్నాయి.
రెండు రోజులు సంఘర్షణ తర్వాత అతనో నిర్ణయానికి వొచ్చాడు. తల్లిపేరున ఓ ఉత్తరం రాసి రాత్రికి యిల్లు విడిచి వెళ్ళిపోయాడు.
"అమ్మా!"
ఒక నిజం తెలసి నా మనసు గాయపడిందే గాని _నాకెవరి మీద కోపంలేదు.
కాని ....
ఈ ఉద్యోగాలు నవనవోస్మేషం. కాని వికాసం లేని పంజరంలాంటి బ్రతుకుంటే నాకు భయంగా వుంది. ఆ యాంత్రిక చక్రంతో మనిషిని ఊపిరాడకుండా చేసే ఛత్రంలో నేను యిమడలేని తెలిసిపోయింది.
ప్రతి మనిషి జీవితంలో ఓ గమ్యం వుంటుంది. ఓ అభిరుచి వుంటుంది. వాటి ప్రకారం తన మనుగడ సాగించాలని కోరుకుంటాడు. తనది కాని జీవితం కేవలం బ్రతకటం కోసం పొట్ట నింపుకోవటం కోసం ఏదో ఒకటి చెయ్యడం _ నా మనస్సంగీకరించటలేదు.
గెలవని ఓడిపోని నాదైన జీవితం గడపటానికి వెళ్ళిపోతున్నాను. నన్ను సంవంత్సరాల తరబడి భరించినందుకు కృతఙ్ఞతలు నా ఋణం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాను
__గౌతమ్
విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.
* * *
రోడ్లమీద నడుస్తున్నాడు.
ఒక్క రూపాయి!
కావాలని యీ జీవితం కోరుకున్నాడు. తాను సెన్సాఫ్ హ్యూమర్ డెవలప్ చేసుకోవాలి.
ప్రక్కన కారాగినట్లయి తలత్రిప్పి చూశాడు. డ్రైవింగ్ సీట్లో ఓ యువకడు కూర్చుని వున్నాడు. నీటుగా ఖరీదైన దుస్తుల్లో వున్నాడు. ఎవరయి వుంటాడు అనుకుంటూ గౌతమ్ ప్రశ్నార్ధకంగా చూశాడు.
"మీరు గౌతమ్ కదూ?"
అవునన్నట్లు తల ఊపాడు.
"నేను విక్రమ్ ని బి.ఏ లో మీ క్లాస్ మట్ ను. మీరు _ ఎక్కువగా వొంటంగా వుండేవారు. అందుకని బహుశా గుర్తుపట్టి వుండరు."
"గుర్తువుంది."
వెనకనుంచి కారు హారన్ మ్రోగుతుంది.
"కారెక్కండి. వెడుతూ మాట్లాడకుందాం" అని ఫ్రంట్ డోరు తెరిచాడు.
గౌతమ్ ఓ క్షణం సంశయించి అటు తిరిగి వచ్చి కరేక్కాడు. కారు కదిలింది.
"ఏం చేస్తున్నారు?"
"ఏవీ చెయ్యటం లేదు."
"మరి ...." అని ఏదో అడగబోయి పత్రికల్లో మధ్య మధ్య గౌతమ్ అని పేరుతో కథలు చూస్తూ వుంటాను. మీరేనా అన్నాడు.
గౌతమ్ అవునన్నట్లు తల ఊపి _ మీరేం చేస్తున్నారు?" అనడిగాడు సభ్యత కోసం.
"మొన్నటిదాకా ఏమీచెయ్యలేదు. కాని యీ మధ్యనే ఓ సినిమా మొదలు పెట్టాను" అన్నాడు విక్రం.
"సినిమానా?"
"అవును. ఘాంటింగ్ యిక్కడే అవుతుంది. మద్రాసు లో ఓ అఫిసూ, యిక్కడో అఫీసూ వుంది."
"పెద్ద ఆర్టిస్టులంతా యీ హైదరాబాదు లోనే ఘాంటింగ్ ప్రిఫర్ చేస్తున్నారు. దానికి తోడు కొన్ని ప్రయోజనాలు కూడా వున్నాయను కోండి. డబ్బింగ్ రీకార్దింగ్ వగైరాలన్నీ మద్రాసులో జరుగుతాయి."
"ఘాంటి౦గ్ అయిపోయిందా?"
"లేదు. అయిదు రీళ్ళయింది. కథ దొరకడం లేదు?"
"అదేమిటి! కథ దొరక్కూండానే అయిదురీళ్ళు పూర్తీచేశారా?"
"ఇప్పటి రోజుల్లో అంతే. మాది యాక్షన్ పిక్చర్ . మా హీరో మాధవ్ చాలా బిజీ ఆర్టిస్టు . అతని కాల్ షీట్స్ ప్రకారం గబగబా ఘాంటింగ్ మొదలు పెట్టేశాం"
"కథ లేకుండా ఎలా మొదలు పెట్టారు?"
"ఏముంది ? నాలుగు ఫైట్స్ తీసేశాం. నాలుగు డ్యూయిట్స్ తీశాం. హీరోయిన్ తో రెండూ, సిల్క్ స్మీతతో ఒకటి, జయమాలినితో ఒకటి సాంగ్స్ . అందులో ఒకటి డ్రీమ్ సాంగ్ పిక్చరైజ్ చేశాం. ఇప్పుడు స్టోరీ ఆలోచించి మధ్య మధ్య వాటిని గుచ్చాలి అంతే!" సినిమా అయిపోతుంది. సూపర్ హిట్ సినిమాలు చాల వరకు అలా తయరయినవే."
గౌతమ్ ఆశ్చర్యంగా వింటున్నాడు.
"మీ దగ్గర సినిమాలకి పనికి వచ్చే కథలేమయినా వున్నాయా?"
గౌతమ్ కంగారుపడి "అలాంటివేమీ లేవు." అన్నాడు.
విక్రమ్ నవ్వి "పోనీ ట్రై చెయ్యండి. డైరెక్టరుగారు ఊళ్ళోనే వున్నారు. బహుశా యిప్పుడు ఆఫీసుకు వొచ్చివుంటారు. పరిచయం చేస్తాను" అన్నాడు.
గౌతమ్ కి భయం వేసింది. "వొద్దు ప్లీజ్. ఆ వాతావరణం నాకు కొత్త" అందామనుకున్నాడు. కాని అనలేకపోయాడు.
పది నిమిషాల తర్వాత కారు విక్రమ్ వాళ్ళ సినిమా ఆఫీసు ముందాగింది.
ఆఫీసు చిన్నదైనా నీటుగా వుంది. స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలకుపోతూ "చెప్పులు యిక్కడ విడ్చేయండి" అన్నాడు విక్రమ్ .
"అక్కడ ఆచారం కాబోలనుకుంటూ చెప్పులు విప్పి అతనిని అనుసరించాడు.
ఆఫీసు గదిలో ఖరీదైన కార్పెట్ పరిచివుంది గోడలకు రెండు ఆయిల్ పెయింట్స్ అమర్చివున్నాయి. ఒక ప్రక్కన షెల్స్ లో పది, పన్నెండు యింగ్లీషు నవలలు మినీ సైజు లైబ్రరీలా నిలబెట్టబడివున్నాయి _ నిర్మాత అభిరుచికి చిహ్నంగా . టేబుల్ మీద మూడుపోన్లున్నాయి. గౌతమ్ కు మూడు ఫోన్లు అవసరమేముంటుంది అర్ధం కాలేదు.