Previous Page Next Page 
విరాజి పేజి 4

 

     చాలా చిన్న కథ. జీవితమంతా శ్రమించి చిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని యీదుకువస్తూ ఓ మోస్తారు స్థాయిలోకివచ్చి రిటైరై వృద్దాప్యంలో పిల్లల కోడళ్ళ నిరాదరణకు గురై, జీవతానికి నిర్వచనం చెప్పుకోలేక తీవ్రమైన అశాంతితో ఓ రాత్రి అలొచనల తాకిడికి గురయి . తెల్లారి అంతా లేచి చూసేసరిగి మరణించి వుంటాడు. బంధువుల్లో యాంత్రికమైన అడుఖం . అందులో కొంత సమాజత్వం అంత్యక్రియలు. ప్రపంచ మామూలుగా సాగిపోతూ ఉంటుంది.

    కథ చివరి రాత్రితో మొదలైమరునాటితో ముగిసిపోతుంది.

    కథలో సంఘటనలుగానీ బలమైన సన్నివేశాలుగాని ఏదీలేదు. కాని గుండెలని కొలిచేసే వేదన అంతర్లీనంగా ప్రవహిస్తూ వుంటుంది.

    ఆ పత్రిక మార్కెట్ లో రిలీజయి వారం రోజులు దాటి వుంటుంది. అతనూ చూసుకోలేదు. అచ్చయితే కంప్లీమెంటరీ కాఫీ వోస్తుంది కదా అని ఊరుకున్నాడు.

    తర్వాత కవర్లు చించాడు.

    వొళ్ళు గగుర్పోడిచినట్లయింది. ఆ రెండు ఉత్తరాలూ "జర" గురించే. కాని అతని, ఆశ్చర్యం అందుకుకాదు. అందులో మొదటి ఉత్తరం ప్రఖ్యాత రచయిత నాదమునిగారి దగ్గరనుంచి.

    "శ్రీగౌతమ్ కు"

    మీ కథ "జర" చదివి చాలా చాలించాను. చాలా గొప్పగా రాశారు. అభినందనలు.

    మనిద్దరం ఓ సారి కలుసుకుంటే బాగుంటు౦దేమో! ఫీలయితే నన్ను కలవండి.

                                                                                                              ___ నాదముని రెండోది

    అబ్బ! ఎన్నాళ్ళకి అట్టహసాలు లేకుండా, నిరాడంబరంగా అయినా గుండెలని పిండుతూ, కన్నీళ్ళు కార్పించకుండా మౌనంగా రోదించేలా ఓ స్వచ్చమైన కథ!

    కంగ్రాట్స్ దయవుంచి మలినం కాకండి.

                                                                                                                        ........విరాజి

    గౌతమ్ చాలా అనందం కలిగింది. ప్రసిద్దుడైన ఓ రచయిత అందులో ప్రస్తుతము తిరుగులేని రచయిత చాలా నిగర్వంగా తనకు ఉత్తరం రాయడం!

    మనసులోంచి జారిపోతున్న ఉత్సాహం మళ్ళీ రాజుకున్నట్టయింది.

    అతనికి రెండో ఉత్తరం కూడా అంతే ఆహ్లాదం కలిగించింది. విరాజి ఎంతబాగుంది, పేరు, అతనికి ఓ ఆడపిల్ల దగ్గరనుంచి లేఖ అందుకోటం తొలి అనుభవము. అతని కధల్లో ప్రేమ వుండదు. పాత్రల్లో సంఘర్షణ ఓ ఆడపిల్ల ఆదరణ తన కథ పొందగలిగిందీ అంటే ......?

    ఆ పత్రిక ఆఫీసుకు ఎడ్రెస్, చెయ్యబడి వొచ్చాయి ఉత్తరాలు.

    ఆ ఉత్సాహముతో మూగబోతున్న మనసు తిరిగి రంజిల్లాగా నాలుగు రోజులు కష్టపడి మరో కథ తయారు చేశాడు.

    ఈలోగా జేబులో వున్న డబ్బులన్నీ అయిపోయాయి. ఎక్కడనుచయినా మనిఅర్దర్ వొస్తుందా? పోష్టుమెన్ కోసం ఆతృతగా ఎదురు చూసేవారు.

    చివరి రూపాయి కూడా అయిపోయింది మళ్ళీ ఆకలి బాధ.

                              *    *    *

    మధ్య తరగతి కుటుంబాల్లో చాలీచాలని జీతం రామనాధంగారు తీసుకువస్తోంటే ఈ జీతం తమకూ తమ ముగ్గురు పిల్లలకూ సరిపొయీ సరిపోక రోజులు గడిచిపోతూ వుండేవి.

    ఊహా తెలసి కొంచెం జ్ఞానం అభివృద్ధి చెందుతున్నప్పటి నుంచీ రోజులు గడిచిపోతూ వుండేవి.

    ఊహా తెలసి జ్ఞానం అభివృద్ధి చెందుతున్నప్పటినుంచీ చుట్టూరా గోచరించే సంఘటనలను చూసి స్పందిస్తూ వుండేది హృదయం. ఏవేవో భావాలు ఉబుకుతూ వుండేవి _ వాటికో స్వరూపము యివ్వాలని గుండె తలలడిల్లుతూ  వుండేది.

    ఇంటిలో ఏకాంతంగా కూర్చునేందుకు స్థలము వుండేది కాదు. ఎలాగో ఓలా వీలుచూసుకుని కూర్చున్నా వెంటనే తండ్రి కేకేసి ఏదో పని చేప్పేవారు. లేకపోతే తల్లి బజారు వెళ్ళి కూరలు తీసుకురమ్మనేది. అందుకాని పెన్నూ , కాగితాలు తీసుకుని ఊరిబయతి వీధుల్లోకి వెళ్ళిపోయేవాడు. తానె మొదటిరోజుల్లో ఏది రాయాలన్నా సంకోచం తడబాటు. తాను యీ అంశము గురించి రాయగాలడా తేడా అన్న అనుమానము వుండేది కాదు. ఏది రాయాలనిపిస్తే అది రాసేస్తూ వుండేవాడు.నిర్మానుష్యంగా వున్న ప్రదేశంలో గంటల తరబడి అలా కూర్చుని రాట కార్యక్రమంలో మునిగి వుంటే ఆ వంటరితనం నిషా ఓ రకమైన హాయి గొల్పుతూవుంటే తన జీవితానికి యిదే అనిపిస్తూ వుండేది.

    "యింటికి రాగానే" ఎక్కడికెళ్ళావు? అనడిగేవాడు తండ్రి చాల కోపంగా.

    "ఊరికినే అలా వెళ్ళాను."

    "అలా అంటే?"

    ఏం జవాబు చెప్పాలో తెలీక ఊరుకనేవాడు.

    తర్వాత తెలిసింది ఆయనకు అతనూ కధలూ అవీ రాస్తున్నాడని.

    రాస్తోందన్నందుకు కోప్పడలేదుగాని "దానిమీద డబ్బూ అదీ వస్తుందా" అనడిగాడు.

    "తెలీదు బాగా పైకి వొస్తే రావచ్చునుకుంటాను."

    "పైకి రావటానికి ఎన్నాళ్ళు పడుతుంది?

    "సరీగ్గా తెలీదు."

    "మరి ఎందుకు రాయటం?"

    'రాయకుండా వుండలేకపోతున్నాను." అప్పటికి ఊరుకున్నాడు.

    అలా అలా అతని కాలేజి చదువు పూర్తయింది.

    "ఇహ నాకు పైకి చదివించే శక్తి లేదు. వెంటనే ఉద్యోగ ప్రయత్నాలు చెయ్యి" అన్నారు రామనాథంగారు.

    "ఉద్యోగాలు ...... ఎలాంటివి?"

    "ఎన్నోవున్నాయి. ఎంప్లాయిమెంటు ఎక్సేంజ్ లో పేరు నమోదు చేయించు కోవడం. అదలావుంచి స్కూల్ టీచర్ , బ్యాంకిలో ఉద్యోగాలు ప్రయివేటు కంపెనీల్లో ప్రయత్నించాతము లేదు.

    "నాకు ఉద్యోగము చెయ్యాలని లేదు. "మరి ఎలా బ్రతుకుతావురా?" అన్నాడు తండ్రి ఆశ్చర్యంగా.

    "ఈ భూమీద ప్రతి మనిషి ఉద్యోగం చెయ్యాలని వుందా?"

    "మరి డబ్బు ఎలా వస్తుంది?"

    "ఒక రచయితగానే సంపాదిస్తాను."

    "ఎప్పటికి? అన్నాళ్ళూ నిన్ను పోషించడం నా వల్లకాదు.

    అయనచేత పోషించటంఅతనికి నామోషీగానే వుంది. కాని తన బ్రతుకుని ఎలా తీర్చి దిద్దుకోవాలో తెలీయటములేదు.

    ఒక రోజు గౌతమ్ ఊరిబయట తోటల్లోకి వెళ్ళి సాయంత్రం వరకూ రాసుకుని యింటికి రాగానే ప్రొద్దుట్నుంఛీ ఎగిరిపడుతున్న రమానాథంతంగారు, గొడవే చేశారు.

    "ఇదిగో! ఇహా నిన్ను పోషించలేదు చెబుతున్నా! యిప్పటికే ఎంతో ఓపిక పట్టాను ఆ మాటకొస్తే అసలు నువ్వు ....."

    భార్య ఈశ్వరమ్మ _ ఏమండీ .... ఏమండి అని అతనిని వారించడానికి ప్రయత్నించింది.

    "ఎన్నాళ్ళు నా నోరు కుడతావే? నిజం చెప్పనియ్యి .... నువ్వు మా కన్న కొదుకుని కాదు."

    గౌతమ్ తృళ్ళిపడ్డాడు.

    "అలా అని నిన్నేమీ బేధభావంతో చూడలేదు. నా మిగతా పిల్లలతో సమానంగానే పెంచా. మ్నున్ను న పెద్దకొడుకు లాగానే చూసుకున్నాడు. చదువు చెప్పించాను. కాని నా వంటిలో శక్తి కరుగుతున్నా, ఆర్ధిక భారంతో కృంగిపోతున్నా నువ్వు బాధ్యత లేకుండా తిరుగుతుంటే ....." అయన గొంతు గాద్గదికమై కొంచెం వణికింది.

    గౌతమ్ నిర్వినుడై పోయాడు. అలాంటి అనుమానం కల్లో కూడా అతనికి రాలేదు.

    ఎందుకంటే రామనాథంగారు తన పట్ల ఎంతకఠినంగా ప్రవర్తించేవాడో, మిగతా పిల్లల పట్ల కూడా అంటే కఠినంగా ప్రవర్తించేవాడు. అయన ప్రవర్తనలో తారతమ్యమెప్పుడూ కనబడలేదు. అలాగే ఈశ్వరమ్మ మిగతా పిల్లలని ఎంత ప్రేమగా అభిమానంగా చూసేదో, తనమూ అదే స్థాయిలో చూసేది.

 Previous Page Next Page