Previous Page Next Page 
విరాజి పేజి 3

   

   దారిలో కనిపించిన ఓ కుర్రాడిని ఆపి ఎడిటర్ గారి రూమేక్కడో అడిగి _ మెల్లిగా గదిలోకి అడుగుపెట్టాడు.

    ఎడిటర్ గారు రివాల్వింగ్ చైర్ లో కూర్చుని వున్నారు. యాభయి ఏళ్ళు దాటిన మనిషి. ప్యాంటు , బుషర్ట్లు వేసుకుని వున్నాడు, చురుగ్గా కదిలే కళ్ళు.

    "కూర్చోండి " అన్నాడు మర్యాదగానే.

    "నా పేరు గౌతమ్ అన్నాడు  కూర్చుంటూ .

    ఎడిటర్ గారు "చెప్పండి " అన్నట్లు చూశాడు.

   కొన్నాళ్ళక్రితం మీకో నవల పంపించాను. అందులో జవాబుకోసం స్టాంపులు కూడా పెట్టాను. ఇంతవరకూ మీరేమీ తెలియచెయ్యలేదు" అన్నాడు గౌతమ్ వినయంగా .

    "నవల పేరేమిటి?"

    "అంధకారపు ఆకారాలు"

    "అం చదివనీ మధ్యే! నవల బాగానే వుంది. కానీ ....."

    కావ్యం తెలిసినవారి లక్షణమేమిటంటే మొదట పాజిటివ్ గా చెప్పటం ప్రారంభించి తర్వాత నెగిటివ్ ట్రెండ్ లోకి దిగుతారు. కానీ ....." అనే పదంయొక్క ఉపయోగం అటువంటి సందర్భాలలో చాలావుంటూ వుంటుంది.

    కానీ..... సీరియల్ గా పనికిరాదు. మేడుకంతే సీరియల్స్ చిదివే పాఠకులకు యీ సబ్జెక్ట్ ఎక్కదు."

    గౌతమ్ ఆ నవలమీద ఎంతో ఆశపెట్టుకున్నాడు. తల బ్రద్దలు కొట్టుకొని రాత్రింబవళ్ళు శ్రమించి రాశాడు. అతను క్రమంగా నీళ్ళు కారిపోతు న్నాడు.

    "ఎందుకంటే  అందులో ఇతివృత్తం స్ట్రెయిట్ గా వుండి. ఎత్తు పల్లాలు మెలికలు లేవు. విజవంతమైన సీరియల్ లక్షణాలేమిటంటే వారంవారం ఓ మేలికముందేమీ జరుగుతుందోనన్న ఉత్కంఠ పాఠకులు థ్రిల్లర్స్ గాని, ప్రేమకథలు కానీ చదువుతారు. మిగతావి ఎంత బాగా టెన్ పర్సెంట్ వున్నా _వాళ్ళు ప్రతికలుకొని చదివే వారయివుండరు. వాళ్ళవల్ల సర్క్యూలేషన్స్ ఒక్క కానీ కూడా పెరగదు.

    గౌతమ్ శ్రద్ధగా వింటున్నాడు, నీలిపాఠాలు వింటున్నట్లు .

    "ఇప్పుడు సబ్జెక్ట్ కన్న కథ రాసే టెక్నిక్ చాలా యింపార్టేన్స్ వుంది. రాసే విధానం అడుగడుక్కీ ఉత్కంఠత కలిగిస్తూ వుండటం, పాఠకుల పల్స్ పట్టుకుని రాస్తూవుండటం . నాదమునిగారు యీ ఒడుపులన్నీ బాగా గ్రహించారు. అందుకే అయన పాఠకులకుఅభిమాన రచయిత అయ్యారు. అయన రచనలంటే పాఠకుల్లో అంత క్రేజ్ వొచ్చింది.

    గౌతమ్ బుద్ధిగా వింటున్నాడు.

    "ఇంకో ముఖమైన విషయం. సీరియల్ మొదలయినప్పట్నుంచీ  పాఠకుల్ని దగ్గరకు తీసుకుని అడుగడుక్కీ ఇన్ వాల్వ్ చెయ్యటానికి అవకాశం వుండాలి. ఉదాహరణకు మీకిందులో ఏ పాత్ర నచ్చింది. ఆ పాత్ర మీరైతే ఏంచేస్తారు. నవల ముగింపు ఎలావుంటే బాగుంటుంది, మీరైతే ఎలా ముగిస్తారు. లేకపోతె యీ సమస్యమీద మీ ఉద్దేశ్యం ఏమిటి? ఇలా ..... నవల మొదలయినప్పుట్నుంచీ పాఠకులకి ఊపిరాడనివ్వకూడదు.   

   
    "ఇదివరకు సాహిత్యపు విలువలున్న కొన్ని నవలలు మీరు ప్రచురించారుకదా" అనడిగాడు గౌతమ్.

    "ఇదివరకు అని మీరే అంటున్నారు. కదా. అది ఇదివరకటిమాట" అని నవ్వడు ఎడిటర్ గారు.

    "అయితే ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు?" అని అడిగాలనుకున్నాడు. గౌతమ్. కాని ఎలా అడగాలో తెలీక ఊరుకున్నాడు.

    ఎడిటర్ గారు అసిస్టెంటుని పిలిచి గౌతమ్ రాసిన నవలను తెప్పించారు. అది భద్రంగా తిరిగియిస్తూ "నేను చెప్పిన అంశాలు గుర్తుపెట్టుకుని  యీసారి ఓ కమర్షియల్ నవల రాసి పంపించండి" అన్నాడు.

    గౌతమ్ ఓ రకం నిస్పృహ  ఆవరించింది. తాను ఎంతో బద్రంగా బైండ్ చేయించుకుని  ఆ పుస్తాకాన్ని తీసుకుని _ ఓ నమస్కరంచేసి అక్కడ్నుంచి లేచాడు.

                                                             *    *    *

     ఓ గంట తర్వాత మూడునెల్లక్రితం కథల్సిన పబ్లిషర్ దగ్గరకు వెళ్ళాడు.

    పబ్లిషర్ అప్పుడే బైండింగ్ పూర్తయి ప్రెస్ నుంచి వొచ్చిన సూపర్ హిట్ నవలను పుంఖాను పుంఖంగా వొచ్చిన ఆర్డర్లు ప్రకారం కట్టలుకటిస్తూ చాలా బిజీగా వున్నాడు. ఇలా కొత్త పుస్తకాలు  అందులో సూపర్ హిట్ నవలలు పుస్తకరూపం ధరించి వొచ్చినప్పుడు  ఆయన చాలా హడావుడిగా, చెమటలు కక్కుతూ వుంటాడు.

    " ఇలాంటి సమయంలో వొచ్చారేమిటి?" అన్నట్లు విసుగ్గా చూశాడు పబ్లిషర్ __

    ఆ చూపు గుచ్చు కుంనట్లు౦ది గౌతమ్ కు.

    "మీరు బిజీగా వున్నట్లున్నారు. మళ్ళీ వొస్తాను" అన్నాడు గౌతమ్ వేనుతిరగబోతూ _   
       
    "మళ్ళీ యింకోసారికూడా నా టైము వేస్ట్ చెయ్యడమెందుకు?" అన్న భావం వొచ్చేటట్లు యింకో చూపుచూసిఫర్వాలేదు. చెప్పండి వొచ్చిన పాయింటేమిటో" అన్నారు.

    గౌతంకు ఆ వాతావరణంలో సంబాషణ కుదరటం ఇష్టంలేక పోయినా చేసేదిలేక "కొన్నాల్లాక్రితం మీకు నా కథలిచ్చను...." అన్నాడు తటపటయిస్తూ.

    "అబ్బే! ఇప్పుడు కథల పుస్తకాలు అసలు పోవండీ, అందుకుని పబ్లిష్ చెయ్యటం కుదరదు" అన్నాడు పబ్లిషర్ ఖచ్చితంగా.

    "పోనీ .... చదివారా?"

    "చదవటమెందుకు ? వేస్టు. ఒకవేళ బాగున్నా _వెయ్యటం కుదరదు. పుస్తకలు అచ్చేసి గోడవున్ లో పేట్టి పూజించడంకదా."
   
    "అయితే చదవలేరన్నమాట "అ అన్నాడు నిస్పృహగా గౌతం.

    పబ్లిషర్ , కుర్రాడ్ని కేకేసి ఆ కథల పుస్తకం వెదికించి తిరిగి ఇచేశాడు.

    "పోనీ నవలలు వేసుకుంటానాన్నరుకదూ" అన్నాడు గౌతమ్ తన నవల గురించి చెప్పాలనే ఉద్దేశ్యంతో.

    "సీరియల్ గా వొచ్చి పాప్యులర్ అయిననవలల్ని వేసుకుంటాను."

    "కొన్ని డైరెక్ట్ నవలలు కూడా వేస్తున్నట్లుగా వున్నారు."

    "పాప్యూలర్ రచయితలవి"

    "వస్తాను" అంటూ కదిలాడు.

                             *    *    *   

    ఆ పూట భోజనం కూడా చెయ్యాలనిపించలేదు. సమాజంలో ఏ రంగంలోనయినా పోటీ వుంటుందని తెలుసు. పైకి రావాలంటే ఎంతో పోరాటం వుంటుందని తెలుసు. కాని ఆ రోజు ఎప్పటికయినా వొస్తుందా?" అసలు ఆ రోజంటూ వున్నదా.

    గదికి వొచ్చాక ఆ రెండు పుస్తకాలు ఓ మూలకి గిరాటువేశాడు. లోపట్నుంచి కసి పొంగుకు వోస్తున్నది. తిరిగి వొచ్చిన ఆ రెండూ కూడా కాల్చి పరేడ్డామా అనుకున్నాడు.

    అగ్గిపెట్టె చేతుల్లోకి తీసుకున్నాక భ్రాంతిలాంటిది కలిగింది. చేతులు వోణికాయి.

    ఆ ప్రయత్నం విరమించి చాపమీద వాలిపోయి, కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అలా ఎంతసేపు పడుకున్నాడో అతనికే తెలియదు.

    "పోస్టు" అన్న కేకతో మెలకువ వొచ్చింది. లేచివెళ్ళి తలుపు తీశాడు.

    పోస్ట్ మెన్ ఓ మేగజేన్, రెండు కవర్లూ అతని చేతికిచ్చి వెళ్ళిపోయాడు.

    ఆ మేగజేన్ ఓ మాసపత్రిక , కొంచెమో, గొప్పో సర్క్యిలేషన్స్ వున్న పత్రికే.

    అందులో అతని కథ అచ్చయింది.

    కథలు అచ్చయిందతనికి కొత్తకాదు.

    ఇంతవరకూ ముప్ఫయి, నలభయిదాకా ప్రచిరితమైనాయి. రచయితగా గుర్తింపు కాని, పేరు ప్రఖ్యాతులుగానీ లేవుగానీ _ అడపాతడపా కథలు అచ్చవూతూనే వున్నాయి.
 
    "ఆ కధ పేరు "జర"

 Previous Page Next Page