ఈ సారి ఇక నవ్వాపుకోలేని హానిత చేతిని పెదవులకి అడ్డంగా వుంచింది. తాయారమ్మ కాఫీ అందించింది. మరో అయిదు నిముషాల్లో .
బుద్ధి చెప్పేటప్పుడు తను దగ్గర ఉండకూడదని మరో గదిలోకి వెళ్ళిపోయింది కూడా.
ఎంత తేరుకుని కిరీటి చేతిలోని కప్పు అతని వనుకుకు సాక్ష్యంగా సాసర్ లో నాట్యం చేస్తుంది . "ఏదో మా అమ్మ ....."
"తప్పేముంది కిరీటి? పెళ్ళి చేసుకోవచ్చుగా?"
ఇప్పుడు హనిత నిజంగానే బాధ్యత తీసుకునేసరికి పోలమారేడు ...... "క .... కరెక్ట్ ... అనుకోండి . కాని పెద్దమనిషి అయిన ప్రతి అమ్మాయినీ చూపిస్తే ఎలా చెప్పండి. నాకూ టేస్ట్ వుంటుందిగా!"
సూటిగా చూసింది హనిత అతని కళ్ళలోకి .
త్రోటుపడుతూ తల వంచుకున్నాడు బిలేడంత సిగ్గుపడిపోతూ ..... "నీ మొహానికి టెస్టు కూడానా అని మీరనుకుంటే, నేను చెప్పలేనుగాని ..... నిజంగా నాకూ టెస్టు వుంది." నీరసంగా నవ్వేశాడు.
"చెప్పండి ...... అదే __ మీ టేస్ట్ గురించి నాకు నమ్మకముంది." ఎటో చూస్తూ అంది హనిత.
"ఆ టెస్టుకితగ్గ అమ్మాయి దొరుకుతుందనా?"
"కాదు"
"మరి?"
"ఏ విషయంలోనైనా, ఎవరినైనా మీరు ఒప్పించగలరని ...."
కిరీటి మరేదో అనబోయే౦తలో హనిత వెళ్ళిపోయింది.
ముందు అర్ధంకాని గూడర్దమేదో మనసులో మెదిలి క్షణ౦పాటు కిరీటిని వివశుణ్ణిచేసింది.
* * * *
ఎస్ మోనీ ...." ఉల్లాసంగా చూశాడు ఛాంబర్ లోకి అడుగుపెట్టి సిగ్గుతో మెలికలు తిరిగిపోతున్న మోనీని.
"నిన్న ఏడుపు కథ ....."
"హయ్యా ..... అది ఏడుపు కథ కాదు .... పొదుపు కథ ."
"అం అదే విప్పేస్తాను"
"ఏమిటీ?"
"అదే" ఓసారి పొడుపు కథని మననం చేసుకుంటూ అంది "మనిషిని చూడగానే సావిట్లో దాచుకుని పడుకుంటుంది. మీది నుంచి లేవగానే మూలాన ముడుచుకుని వుండిపోతుంది కదూ?"
"మరేం "
"వేశ్య."
తల పట్టుకున్నాడు.
"కాదా?"
"చూడు మోనీ! మీ ఆంగ్లో ఇండియన్స్ లో ఆడపిల్లలు పెద్దమనిషయ్యాక ఏం చేస్తారో నాకు తెలీదు. మరి మా హిందువుల్లో ఏం చేస్తుంటారో తెలుసా?"
".... తెలుసు. చాపమీద కూర్చోబెడతారు."
"అదే .... నా పొడువు కథకు జవాబు."
"ఏంటీ ! పెద్దమనిషి కావడమా."
"అబ్బా! అదికాదు మోనీ. చాప ఎవరన్నా కూర్చోవాల్సి వచ్చేటప్పుడు పరుచుకుంటుంది. మనిషి లేచిపోయాక మూలాన ముడుచుకుని ఉంటుంది."
"య్యా!" మరో అరక్షణం ఆలస్యమైతే మోనీ ఉత్సాహంతో మీదకు కలియబడేదే. సరిగ్గా అప్పుడు గదిలోకి ప్రవేశించింది హానిత.
ఇద్దరూ తత్తరపడుతూ అటు చూశారు.
"వాట్ నాన్సెన్స్ ఈజ్ గోయింగాన్ హియర్?"
ఆమె వాడి చూపులకి తాళలేనట్టు ముందు తల వంచుకున్న మోనీ మరుక్షణం తేలుకుట్టిన దొంగలా __ "సారీ మేడం" అంది. వెంటనే ఛాంబర్ దాటి బయటికి వెళ్ళిపోయింది.
"మేడం ... అసలు" .... కిరీటి ఏదో అనబోయాడు.
"సంజాయిషీ అక్కర్లేదు." ఇప్పుడామె సరాసరి వెళ్ళి అతని సీటులో కూర్చుంది. ఇదీ అతనూహించని ప్రవర్తనే.
అతనికి తెలిసిన హానిత ఎటికసీ, ఈస్టటిక్ వేల్యూస్ గల అమ్మాయి. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కొన్ని నియమాల్ని తప్పని సరిగా పాటిస్తుంది తప్ప, ఇలా మరో ఎగ్జిక్యూటివ్ సీట్ లో కూర్చుని తన స్వాతిశయాన్ని ప్రదర్శించదు.
అతడింకా విస్మయంలో ఉండగానే __ "ప్లీజ్ బి సేటేడ్ " అంది కూర్చోమని ఆదేశిస్తూ .....
మారు మాట్లాడకుండా ఆమెకు అభిముఖంగా మరో కుర్చీలో కూర్చున్నాడు.
"ఎ౦దుకిలా ఆశ్చర్యంగా చూస్తున్నావు?" ఏకవచనంలో అడ్రస్ చేయడం కూడా అతనికి కొత్తగా వుంది."
"మీరు ఇవాళ ఆఫీసుకు రానన్నారు."
"ఎప్పుడు?" అసంకల్పితంగా నోరు జారిందామె.
"ఉదయం వచ్చి చెప్పారుగా?"
సన్నగా త్రోటుపడింది "ఓహ్ .... అదా .... మరేం .... అన్నాను కాని అలవాటు పడిందాన్నిగా? చూడకుండా ఉండలేకపోయాను."
"దేన్నీ?"
"నిన్నే!"
ఉలిక్కిపడ్డాడు కిరీటి.
"అవును కిరీటి ..... కొత్తగా చార్జి తీసుకున్నావుగా? ఒంటరిగా ఇబ్బంది పడుతున్నావేమో అని వచ్చానిలా."
హనిత ప్రవర్తన ఇప్పుడే కాదు __ ఉదయం ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలా విచిత్రంగా అనిపించింది. కాని లోతుగా వెళ్ళే చనువు లేదతనికి.
సరిగ్గా ఇదే సమయంలో ఛాంబర్ కుడిపక్క బాల్కానీలో రహస్యంగా నిలబడ్డ ప్రభంజనరావు ఏకాగ్రతగా చెవులు రిక్కించి వింటున్నాడు, హనిత స్థానంలో లోనికి అడుగు పెట్టిన సాకేత సంబాషణనని, ఇచ్చిన తర్ఫీదులో హనిత స్థానంలో ఇప్పుడు ఇమిడిపోవాలని ప్రయత్నిస్తూంది సాకేత.
"మేడం " సూటిగా విషయానికి వచ్చేశాడు. "మీలో ఇలాంటి మార్పుని ఊహించలేకపోతున్నాను."
తన మొహంలోకి భావాల్ని ఎక్కడ చదివేస్తాడో అన్నట్టుగా సాకేత కిటికీ దాకా నడిచింది.
కిరీటి సునాయాసంగా మభ్య పెట్టగలుగుతున్న ఆమె ప్రతిభకు అభినందనగా ప్రభంజనరావుపిడికిలిని బిగించి బొటనవేలు పైకి చూపించాడు.
"మిస్టర్ కిరీటీ!" వెనక్కీ తిరిగి చూడకుండానే అంది. "నేను తెలివైన దాన్నయినా, శారీరకంగా బలవంతురాల్ని కాని ఆడదాన్ని! ఒక పక్క డాడీ పరిస్థితి విషమిస్తోంది. మరోపక్క వ్యాపారంలో సమస్యలు ..... నీడల్లా వెంటాడే ప్రమాదాలు .... ఎలా తట్టుకొను?"
"మీరూ మామూలు ఆడపిల్లే మిస్ హనితా!" నిశ్చేష్టుడిలా అన్నాడు.
"నీ ముందు కేవలం నీ ఒక్కడి ముందు ఈ నిజాన్ని అంగీకరించటానికి నేను వెనుకాడను కిరీటీ ....." రెప్పలార్చకుండా అతన్ని చూస్తూ చాలా చెరువుగా నడిచి వచ్చింది. "ఆశ్చర్యపోతున్నావు కదూ?"
ఇప్పుడు ఇద్దరి మధ్య దూరం కేవలం కొన్ని అంగుళాలు మాత్రమే!
"కిరీటి!" సాకేత నేత్రాలు అరమోడ్పులయ్యాయి. " నా మనసు నొసటిపైన తెలియకుండా చోటుచేసుకున్న సిందూరానిని నువ్వు. నేను నిక్షిప్తంగా రాసుకున్న ముగ్ధ కవితా పంక్తుల్ని చదివి అర్ధం చేసుకున్న భావుకుడివి నువ్వే! నీ ముందు బిడియంగానైనా ఓడిపోవటానికి సిగ్గుపడను నాకు .... నీ అండ కావాలి."
అతని భుజంపైన పడిన ఆమె చేయి కాదు .... ఇప్పుడు కిరీటి సన్నగా ప్రకంపిస్తున్నాడు.
"ఎంత ఉన్నా నేను ఏమీలేని ఆడదాన్ని కిరీటి!
బతుకునొక ధ్యానంలో కొనసాగిస్తున్న తొలి మనోమందిరంలోకి అల్లరిగా ప్రవేశించినా అంతటా వ్యాపించిన తొలి మగాడివి నువ్వు నన్నర్డం చేసుకో. "
"హనితా!" ఇబ్బందిగా కదిలాడు. "ఎందుకిలా బేలగా మాట్లాడుతున్నారు?"
"నాకు బ్రతకాలనుంది."
"ఇప్పుడేమయిందని?"
"ఇప్పటికి ఏమీ కాలేదు. కాని ఈ రాత్రికి __" ఓ క్షణం ఆగింది నిస్త్రాణగా. "నాపైన హత్యాప్రయత్నం జరగబోతూంది."
"వ్వాట్?" ఉద్విగ్నంగా చూశాడు.
"అవును కిరీటి ..... ఈ రాత్రికి నన్ను హత్య చేయలని చాలా దృఢంగా పథకం సిద్దమైంది.
తేలిగ్గా నవ్వేశాడు. "ఇట్స్ సిల్లీ! హత్యమ్తే అంత సులభంగా సాధ్యమయ్యేది కాదు మిస్ హనితా!"
"కాని బంగారు పంజరం లాంటి మా భవంతుల్లో అదో సమస్య కాదు. చాలా నిశ్సబ్దంగా అమలు అవుతుంది."
"మీవి బంగారు పంజరాలే అయినా అందులో పోలీసులకి ప్రవేశముంటుంది హనితా! ముందే తెలుసుకున్న మీరు తప్పకుండా రక్షణ చేసుకోగలరు."
"ఈ స్థాయిలో బ్రతికే మేము ఆ స్థాయికి దిగజారాలేం కిరీటి! మా సామ్రాజ్యంలో సాగే అంతర్యుర్దాలు ప్రపంచానికి తెలిస్తే మేము కాదు_ మా వ్యాపారాలూ బలహీనపడిపోతాయి."
"అలా అని ప్రణాలమీదకి తెచ్చుకుంటారా?"
"అదికాదు కిరీటి ! నేను పోలీసుల సహాయాన్ని అర్ధించిన మరుక్షణం అది డాడీకి తెలిసిపోతుంది ప్రస్తుతం అయన అనారోగ్యం దృష్ట్యా ......."