Previous Page Next Page 
అసురవేదం పేజి 34

  

   "తెలియాల్సిన అగత్యం లేదు డాడీ. అది అంత మనో నిబ్బరాన్ని సడలించే నిజం అయితే అది అలాగే సమాధి కానివ్వండి. నాకు తెలీని ఏ నిజం అయితే అది అలాగే సమాధి కానివ్వండి. నాకు తెలీని ఏ నిజం  ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మీరు నిజం, మీ ఆప్యాయత నిజం. అలాగే పెరిగినదాన్నినేను. ఇలాగే మిగిలిపోనివ్వండి."

    ఆమె ఎంత ఉద్విగ్ధంగా చెప్పుకుపోయిందీ అంటే చాలా చెప్పాలనుకున్న అయన గొంతూ మూగపోయింది.

    "ఎస్ డాడీ .... దయుంచి ఇంకెప్పుడూ మీ గతాల గురించి నాకు చెప్పే ప్రయత్నం చేయకండి. అసలు అంత అవసరం లేకుండా లేదేమో. ఎస్ ....."

    "పోనీ ఒక్క వరమిస్తావా?"  మనసులోని ఏ గగుర్పాటునో. అదిమిపెడుతూ అనడం ఆమెకే తెలుస్తూంది "చెప్పు బేబీ."

    "ఆదేశించండి డాడీ .... అడగాల్సిన పనిలేదు."
   
    కొన్ని క్షణాలు సాలోచనగా చూశాడు."ఈ వ్యాపార పోరాటంలో ఒకనాడు మీ అమ్మకు అన్యాయం చేసినవాణ్ణి నేను. సరే. ప్రస్తుతానికి నీ ఇష్టప్రకారం ఆ వివరాలేమీ  తెలియజేయ్యెను. కానీ నేను కోరుతున్నది ఒక్కటే" ఓ లిప్తపాటు అగేడు అందోళన నిగ్రహించుకుంటున్నట్టుగా "నువ్వీ వ్యాపారానికి దూరం కావాలి." అన్నారు.

    "డాడీ!"

    "అవును బేబీ. ఒకనాడు ఇలాగే దాంపత్య జీవితానికి నేను దూరమయ్యాను. అందుకే నీ బ్రతుక్కి నిన్నూ దూరం కావద్దంటున్నాను .... అంటే అర్ధమైందనుకుంటాను."

    హానిత నేలచూపులు చూస్తూ ఉండిపోయింది.

    "నువ్వు వెంటనే పెళ్ళి చేసుకోవాలి. అవును బేబీ .... తండ్రిగా నేను కోరుకుంటున్నది నా తదనంతరం ఈ వ్యాపారాన్ని దక్షతతో నిర్వర్తించగలిగే ఒక అండని. దానికోసం నువ్వు పెళ్ళికి దూరంగా ఉండాల్సిన అగత్యం లేదు ...."

       
    హానిత స్థాణువై౦ది శిలలా వింటూంది.

    "ఏ క్షణంలో రాలిపోతానో తెలీని బ్రతుకు నాది. ఈ మాత్రం ఆశించడం దురసః కాదుగా బేబీ?"

    "కానీ డాడీ."

    "ఇందులో న ఇష్టం అంటూ నేనేమీ సతమతలు విధించను బేబీ. నీ మనస్సుకు నచ్చిన ప్రపోజల్స్ ని సున్నితంగానే తిరస్కరించింది. బహుశా అని దృష్టిలో పెట్టుకునే ఆయనలా అంటున్నారని బోధపడిపోయింది. "ఇది నువ్వు తీర్చలేని వరంకాదుగా హనితా! ఐ వాంట్ టు డై ఇంలీ ఆఫ్టర్ సీయింగ్ యువర్ మేరేజ్ ...."

    అప్పుడు చూసింది గుండెల్ని చేత్తో నోక్కుకుంటున్న తండ్రిని . ఆమెకు దుఃఖం తన్నుకొచ్చింది.

    "ప్లీజ్ హనితా నా మాట సజలాలయ్యాయి.

    "నువ్వు ఒక్కదానివీ నిర్వర్తించలేని ఈ బాధ్యత నీ భర్త అండతో సునాయాసంగా .... అందుకే .... నేను పోయేలోగా" రోప్పుతున్నా రాయన.

    ఆమె తోట్రుపాటుతో పైకి లేచింది.

    "ఓ.కే డాడీ .... అలాగే ...." ఇప్పుడేం జరగబోతూందీ అన్నఅందోళనతో ఆమె పైకిలేచి ఫోన్ దగ్గరకి పరుగెత్తబోతూ౦డగా డాక్టర్ దినకరరావు అ గదిలోకి అడుగుపెట్టాడు.

    ఎం జరిగిందీ అర్దమైనట్టు వెంటనే ఆయనకి సెడేటివ్ ఇచ్చారు. క్రమంగా సుదర్శనరావుగారి పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరో అయిదు నిముషాలలో అయన నిద్రలోకి జారిపోయారు.

    ఓ మూల ప్రతిమలా నిలబడి చేరుకున్న దినకరరావు నెమ్మదిగా అన్నాడు __ "ఎంతటి గుండె నిబ్బరంగల మనిషైనా ఓడిపోయే కొన్ని క్షణాలు అతని జీవితంలో తప్పని సరే అయితే, సరిగ్గా మీ డాడీ కూడా ఇప్పుడు అలాంటి స్థితికి చేరుకున్నాడమ్మా ప్రస్తుతం కావాల్సింది మందులు కాదేమో ..... ఆలోచించు."

    అస్పష్టంగానైనా నా తండ్రికోరే గంయాన్నే ఆయనా నిర్దేశిస్తున్నాడు.

    అసలు ఇదీ ఒక సమస్యే అని ఇన్నాళ్ళూ ఊహించకుండా గడిసింది హనిత. ఇదిగో ఇప్పుడు అనంతమంత పెద్దదిగా విస్తరించింది.

    చాలా ప్రశ్నలకి జవాబులు సునాయాసంగా వెతకగల 'ఐక్యూ' ఉన్న హనిత ఏ దిక్కువేపు ప్రయాణం చేయాల్సిందీ తెలీనట్టు అలాగే నిల బడిపోయింది చాలా సేపటిదాకా.

                                                         *    *    *    *   

    "మే .... మేడమ్ ..... మీరా? గుడ్ మాణింగ్ " ద్వారం తెరచిన కిరీటి కంగారుగా పక్కకి జరిగి తోట్రుపడుతూనే హనితకి సోఫా చూపించాడు. ఆఫీసుకి బయలు దేరబోతున్నాను."

    హనిత నిశ్సబ్దంగా సోఫాలో కూర్చుంది. అతను ఇంకా నిలబడే వుమ్దతంతావు కూర్చోమన్నట్లు సంజ్ఞ చేసింది.

    ఇది అతను ఊహించని ఆగమనం కావడంతో చాలా హైరానా పడిపోతున్నాడు. "ఫోన్ చేస్తే నేనే వచ్చేవాణ్ణి."

    "నేను వచ్చింది ఓ రెండు గంటలపాటు ఆఫీసుకు రాలేనని చేపడానికి."

    'ఆ మాటైనా ఫోన్ చేసిచెప్పొచ్చుగా ' కిరీటి అనుకుంటుండగా __

    హనితే అంది __ "ఈవేళ పేపర్ లో చూశాను __ అదే డిజైన్స్ ఎగ్జిక్యూటివ్ గురించి మీరిచ్చిన ఆడ్వర్డ్యిజ్ మెంట్."

    "రాజేంద్ర నిన్ననే ...."

    "రిజైన్ చేశాడని తెలిసింది గుడ్! గో ఎ హెడ్"

    కొన్ని క్షణాలపాటు నిశ్శబ్దం. నిజానికి ఆమె వచ్చింది ఇందుకు కాదని కిరీటికి బోధపడుతూనే వుంది .... కాని స్పష్టంగా తెలసుకోగలిగే సాహసం చేయలేకపోయాడు.

    అలసటగా కూర్చున్న హనిత ఎగిసే ఆలోచనల ఆవిరిలో రూపు దిద్దుకున్న మేఘమై నాభిని చీల్చుకురాణి ఎ నాదమై మనసు గొంతు వాకిట గడ్డకట్టిన రాగమై, ఆశల దివ్వెలతో ఓ అరక్షనమే ఉదయించిన ప్రభావంలా అనిపిస్తూంది.

    చేయి తిరిగిన ఏ శిల్పో ఒక జీవితకాలం కష్టించి మలచిన ఒక శిల్పమో, లేక మనసుపడిన ప్రకృతి తన స్వహస్తాలతో గీసిన ఓ చిత్రమో గాని ... ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఓ అలౌకిక దృశ్య౦లాంటిది హనితని ఓరకంట చూస్తూనే వుండిపోయాడు.

    ఓ క్షణం ఇద్దరి చూపులూ కలుసుకుని విడిపోయాయి.

    "డాడీ ఎలా ఉన్నారు?"

    జవాబు లేదు.

    ప్రవహించని ఆకాశానికి ఆవలిగట్టులా నిశ్సబ్దంగా ఉండిపోయిన హనిత పైకి లేచింది. "వెళతాను."

    విస్మయంగా చూశాడు "కొంచెం కాఫీ"

    "థాంక్యూ .... వెళ్ళాలి"

    "నువ్వంటే అమ్మడూ!" తాయారమ్మ కంఠం వింటూ వెనక్కీ తిరిగిన హనితను వెంటనే గుర్తుపట్టింది." "ఎంతసేపైందీ వచ్చి ....? హయ్యా రామా! వీడి తీరవ యిమ్తేనే పిచ్చిపిల్లా! మనసులో ఏముందో చెప్పాడు .... అంతా తండ్రి పోలికే"

    ఆప్యాయంగా హనిత కురుల్ని సవరిస్తూ "రా లోపలి. యిల్లు చూద్దువుగాని" అంటూ చేతిని పట్టుకుంది.

    ఇక నిభాయించుకోలేని కిరీటి "అమ్మా ... ఆగవే ... ఆవిడ ముందే చూసేసింది" అన్నాడు గిలగిల్లాడిపోతూ .

    "నోర్మూయ్  వెధవఖానా....!" అని హనితని అప్పటికే ద్వారం దాటించి లోపలి గదిలోకి తీసుకుపోయింది "మావాడు లేడూ .... ఇప్పుడు పెద్ద ఉద్యోగాస్తుడై పోయాడు. చెప్పానుగా పెద్ద చదువు చదివేవాడివి ఏరి కోరి వీన్నే తీసుకున్నారట .... పైగా వాళ్ళకి వీడంటే బోలెడు యిష్టం కూడానూ. అందుకే వుండటానికి పెద్ద కొంపనిచ్చింది..... అయినా వీడికేం తక్కువే అమ్మడూ?"

    వంట గదిదాకా వెళ్ళాక అడిలక్ష్మిని చూపిస్తూ అంది __ "మావాళ్ళ పిల్లే! పేరు ఆదిలక్ష్మిలే ... మొన్ననే పుష్పవతి అయితే మా అబ్బాయికి చూపించాలని యిలా తీసుకొచ్చాను . చెప్పాకపోవడమేమిటిగాని అన్ని విధంలా అర్హులయిన పిల్ల."
   
    "అమ్మా." ద్వారం దగ్గర నుంచి గగ్గోలు పెడుతున్నారు కిరీటి .... "విడిచిపెట్టేయ్"

    "నోర్ముయ్యమన్నానా! ఇదమ్మా వీడి వరస ! పెళ్ళంటే చాలు పది ఆమడల దూరం పరుగేడుతాడు. నా కళ్ళ ముందే ఎంతమంది ఆడపిల్లలు పెద్దమనుషులయ్యారు? పెళ్ళిళ్ళు యి పిల్లా పాపలతో సుఖంగా వున్నారు. ఏక రూపు పెడుతుంటే వాడి మంట చూడు."

    "అమ్మా! ఆవిడేవరనుకున్నావ్?" దూకుడుగా ముందుకు పరుగెత్తి చెవిలో అన్నాడు "అవిడినే."

    "అవున్రా! అంత మతిమాలినదాన్ని అనుకున్నావా? ఆవిడే ..... ఆ రోజు మనకి సముద్రపోడ్డున అదే నవ్వు అర్ధరూపాయి బఠానీలు కొనుక్కుని తల్లినన్న జ్ఞానం సైతం లేకుండా ....."

    "అమ్మా ....!" తల పట్టుకున్నాడు. "ఆవిడే నాకు ఉద్యోగమిచ్చిన ఆవిడే"

    అలాగటే అమ్మడూ ....! మరి చెప్పవేం.......? అంటే వదిలేయ్. ఓ కపహీ పట్రా" హనితని చేరి "రండి మేడం" నొచ్చుకుంటున్నట్టు చూస్తుంటే ఆమె పెదవుల పైన ఓ నవ్వు తెర తోణికి అక్కడే మాయమైంది.

    "సారీ! మా అమ్మది వట్టి చాదస్తం."

    "అంటే ఏమిట్రా బడుద్దాయీ! నేను చాదస్తపుదాన్నా? చూడమ్మడూ! ఇదీ వీడి తీరవు. పెద్దమండలాన్ని అని ఏమన్నా అలోచిస్తాడా __ నోటికొచ్చినట్టు అంటాడు. అప్పటికీ యింటికి ఓ కోడలు పిల్ల వస్తే వీడిముక్కుకు తాడు వేసి ఈ రేసు గుఱ్ఱం వేగాన్ని ఆపుదామానుకుంటే వింటాడా? నేను కపహీ తెస్తానుగానీ వెళ్ళికాస్త నువ్వయినా నచ్చచెప్పు ....." తాయారమ్మ అప్పటికే కళ్ళోత్తుకుంది. "ఈ బాధ్యత యిక నీకే అప్పచెబుతున్నాను. వాణ్ణి ఎలాగన్నా పెళ్ళికి ఒప్పించాలి. లేకపోతె ఉద్యోగం పీకిఊరికి పంపెస్తానని బెదిరించు, బోద్దోస్తుంది."

 Previous Page Next Page