అర్ధమైంది హనితా ...." కిటీకి దగ్గరకు నడవబోతున్న కిరీటిని భుజంమీద చేయివేసి బలంగా ఆపింది సాకేత __ అక్కడ నక్కి వున ప్రభ౦జనరావు అతని దృష్టిలో పడతాడని.
ఆగి వెనక్కి తిరిగాడు . "సో .... మీకు రక్షణ కావాలి -- చెప్పండి . నా పరంగా మీ కేమన్నా సహాయం కావాలంటే నేను సిద్దంగా ఉన్నాను."
"అదే కిరిటీ .... నా మనసు తెలిసిన మగాడిగా నువ్వు నాకు సహాకరించాలి."
"వెల్! మీకు నేను బాడీగార్డ్ గా ఉంటాను. సరేనా?" తేలిగ్గా నువ్వేశాడు.
"దానికీ కొంత వ్యవధి కావాలి కిరీటీ .... ప్రస్తుతానికి నువ్వు జాయింట్ జనరల్ మేనేజర్ వి మాత్రమే కదూ?" ఆమె మాటల్లోని నిగూఢతకి కొద్దిగా తత్తరపడ్డాడు. "అంటే నీ పరంగా నేను రక్షణ పొందుతున్నట్టు ప్రత్యర్ధులకు తెలియకూడదు."
"దెన్ హౌ?" చేత్తో కణతలు నొక్కుకుంటూ అన్నాడు. "నేను మీరేలా రక్షణ ఇవ్వాలి?"
"అపార్ధం చేసుకావు కదూ?"
"దేనికి?" విస్మయంగా చూశాడు.
"ఈ రాత్రికి సుమారు ఒంటిగంట _ రెండు గంటల మధ్య బెడ్ రూమ్ లోనే నా మీద హత్యాప్రయత్నం జరగబోతోంది. కాబట్టి ఆ వేళకి నువ్వు నాతోబాటు ఉండాలి. అవును కిరీటి .... అది మాత్రమె నాకు రక్షణ యివ్వగలదు."
ఏమిటంత చిత్రంగా మాట్లాడుతుంది? ఓ క్షణం సందిగ్ధంగా చూశాడు. "సరే .... సాయంకాలం ఆఫీసునుంచి సరాసరి మీ యింటికొస్తాను."
"లాభంలేదు." అందోళనగా అంది.
"అదేం ?"
"నీ రాక మా యింటి నౌకర్లకు కూడా తెలియకూడదు కిరీటి! అలా అయితే ప్రత్యర్ధి ఆ విషయాన్నీ గ్రహిస్తాడు."
"మంచిదేగా? ప్రయత్నం విరమిస్తాడు."
"ఇక్కడ నేను కోరుకుంటున్నది ఒక్క రాత్రిలో ఆగే ప్రయత్నం గురించి కాదు కిరిటీ! హంతకుడు పట్టుబడాలి. అది సాధ్యం అంటే రావాలీ నువ్వు చాలా రహస్యంగా నా బెడ్ రూమ్ లో అడుగుపెట్టాలి."
హానిత ఇప్పుడు ఓ పిచ్చిపిల్లలా అనిపిస్తుంటే __
"దొంగ రాముడిలా అర్దరాత్రి గోడదూకి మీ బెడ్ రూమ్ లోకి రమ్మంటారా?" అన్నాడు మృదువుగా నవ్వుతూ.
"ఎస్ .... సరిగ్గా అలాగే రావాలి."
నిర్విణ్ణుడయ్యాడు "వ్వాట్? నిజంగానే అంటున్నారా ?"
"తప్పదు కిరీటి __ నువ్వు నవ్వులాటగా తీసుకున్నా జరగాల్సింది అదే!"
"గోడలు దూకడం అలవాటు లేకపోయినా చిన్నతనం నుంచీ చేట్లేక్కడం, సరదాగా సాహసం చేయటం నాకు కొత్తకాదు హనితా! కాని యిప్పుడు ఓ ఉన్నతోధ్యోదిగా ఇలా గోడలు దూకాల్సి రావడం నిజంగా నువ్వు తెప్పిస్తూంది."
"ఒక్కరాత్రికి !"
"దూకేయమంటారు. అంతేగా?"
"నిజంగా అలాగే రాగాలావా కిరీటి?" అమాయకంగా చూసింది
"సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకు నువ్వు గోడదూకి మేడమీద గది కిటికీ ద్వారా లోపలికి అడుగుపెట్టాలి. వస్తావు కదూ?"
ప్రస్తుత ఆమె మానసిక స్థితి ఎలా ఉన్నదీ ఉదయాన్నే గ్రహించి కిరీటి ఇప్పుడు సాకేత ఆహ్వానంలోకి ప్రమాదాన్ని గ్రహించలేదు సరి ఇంకా అప్రతిభుడయి ఆలోచిస్తున్నాడు.
"వస్తావా ?"
"ఆశ్చర్యంగా వుంది"
"దేనికి?"
"సంస్థకోసం మీ అండతో చాలా చేయాలనుకున్న నాకు, ఇలా కూడా చేయాల్సి రావడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా మా అమ్మ భాషలో నేను ఆకతాయి పిల్లవాణ్ణి హనితా! వెల్ __ ఈ రాత్రికి ఆకతాయి పిల్ల వాణ్ణయిపోతాను."
"సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకు ...."
"ముసుగు వీరుడిలా మీ గదిలో ప్రవేశిస్తాను"
"ప్రామిస్?" చేయి చాపింది.
ఆమె చేతిని స్పృశించిన కిరీటి మనసు ముందు పాతుకుపోయిన మౌనానికి రాగం వచ్చినట్టు తత్తరపడింది. ఆపైన ఏ సుమబాల సౌరభమో శరీరాన్ని తాకి మూగాగానే ఓ గేయాన్ని పాడి కోరని కావ్యసృష్టి మనసు స్థబ్దుగా మారిపోయింది.
"ప్రామిస్!" రెప్పవాల్చకుండా అన్నాడు.
ఆమె ద్వారం దాటుతూ క్షణం ఆగి మునిపంట పెదవిని నొక్కిపేట్టి అతనివేపు చూసింది కాంక్షగా.
స్థాణువై చూస్తున్న కిరీటి శరీరం చెమటతో తడిసిపొయిందప్పటికే.
* * * * *
"మార్వలెస్!" అభినందించాడు డ్రైవింగ్ సీటులో కూర్చున్న ప్రభంజనరావు సాకేతని చూస్తూ .... "కిరీటిలాంటి తెలివైనవాడ్ని మోసం చేయగలిగావూ అంటే హానిత స్థానంలో ఇక అపూర్వంగా ఇమిడిపోయి నట్టే సాకేతా! అద్భుతంగా ట్రాఫ్ చేశావు .... ఇప్పుడేం జరుగుతుందో తెలుసా?"
సాకేత నుదుటిపైన స్వేదాన్ని తుడుచుకుంటూ చూసింది.
"కిరీటి నిజంగానే అర్ధరాత్రి హనిత గదిలోకి రహస్యంగా ప్రవేశిస్తాడు. ఆ దెబ్బతో హనిత దృష్టిలో పీసీలికంలా మారిపోతాడు. అంతే! వాడు రిజైన్ చేయనక్కర్లేదు . ఆటోమేటిక్ గా ఉద్యోగం ఊడిపోతుంది."
"కాని __" సంకోచంగా అంది ..... "తప్పు చేశానేమో అనిపిస్తూంది"
"దేనికి?"
"మొన్న రణధీర్ ఉద్యోగం పోయిందని బాధపడ్డ నేను నా శత్రువు కాని మరో వ్యక్తి ఉద్యోగం ఊడటానికి కారణమౌతున్నందుకు"
"నో రిగ్రెట్స్ ! ఇలాంటి చిన్న విషయాలకి బాధపడేదానివి హనితపై పగెలా తీర్చుకోగలవు?"
"కిరీటిని బయటకు సాగనంపితే హనితపై పగ తీర్చుకోవడం ఎలా అవుతుంది?"
కారుని పోనిస్తున్న ప్రభంజనరావు తోడేలులా నవ్వాడు ..... "ఇక్కడ బ్యూటీ అదే సాకేతా. కిరీటి ఎంతటి స్మర్దుడూ అంటే __ హనితని మించి రెండాకులు ఎక్కువ చదివిన ఘటం. వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో అందరూ కంపించెట్టు చేశాడు. వాడే ఈ పొజిషన్ లో కొనసాగితే ఈ సంస్థ తద్వారా హనిత మరింత బలవంతురాలై పోతారు."
"దయుంచి కారాపు"
"ఏం?"
"దిగిపోతాను."
"సింహసనంపైన కూర్చోదగ్గ తెలివైన అమ్మాయిని అప్పుడే దిగిపోతానూ అంటూ కంగారు పడుతున్నావేం?"
"భయంగా వుంది."
"మేమంతా లేమూ?"
ఫకాలున నవ్వింది ఆ స్థితిలో కూడా.
"ఎందుకానవ్వు?"
"అంత గట్స్ ఉన్నవాళ్ళయితే నా సహయాన్ని ఎందుకు కోరుతున్నట్లు?"
"నీకు వున్న ఒకనొక్క గొప్ప అర్హత నువ్వు మూమూర్తులా హనితని పోలి వుండటం సాకేతా! అందుకే నీ సహాయాన్ని కోరింది. ఇప్పుడు మరో పరీక్షలో నెగ్గితే నీకు రెండు లాభాలు దక్కుతాయి ..... ఒకటి మోసంవల్ల మంచం పట్టిన నీ తల్లికి ఖరీదయిన ట్రీట్ మెంట్, జీవితాంత౦ బ్రతకడానికి కావాల్సింనంత డబ్బు, మరోటి సాకేత అండ్ కంపెనీ బిజినెస్ గ్రూఫ్ నాశనం కావడం ...."
సాకేత గుండె దిటపు చేసుకుంటూ చూసింది ....."ఆ ఫైల్స్ హనిత . చాంబర్ లో నుంచి తీసేయ గలిగితే చాలా?"
"చాలు. వాటి ఆధారంలో ఈ సంస్థ ప్రభుత్వాన్ని ఏళ్ళ తరబడి ఎంత మోసం చేసిందీ సమాచారం అందించడానికి వీలుపడుతుంది...... హనిత అట పూర్తిగా కడుతుంది"
ఇప్పుడు ఎడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కి వెళ్ళేది తమపైన ఉన్న అభియోగాలకి సంబందించిన ఫైలు సేకరించడానికి అని అతనూ చెప్పలేదు.
ఓ మామూలు చదువు, సాధారణమైన తెలివిగల అమ్మాయినీ, ఆమె రూపురేఖల్నీ లాఘవంగా క్యాష్ చేసుకుంటున్నాడు ప్రభంజనరావు.
కారు మరో ఐదు నిముషాల్లో వాల్తేరు ఆఫ్ లెండ్స్ లోని సాకేత అండ్ కంపెనీ అడ్మిని స్ట్రెషన్ బిల్డింగ్ ముందాగింది.
సాకేత దిగబోతుండగా అన్నాడు __ "మిస్ సాకేతా ..... ఇప్పుడు వెళుతున్నది కాస్త జటిలమైన వలయంలోకి మీకు తోడుగా నేనుంటాను. హనితకి చాలా క్లుప్తంగా మాట్లాడటం అలవాటు __ కోపాన్ని సైతం కళ్ళతోనే వ్యక్తం చేస్తుంది. తప్ప అనవసరంగా వాదులాటకి దిగే మనస్తత్వం కాదు. నీతోపాటు నేనూ హనిత ఛాంబర్ లోకి వస్తాను. అక్కడ ఎలా ప్రవర్తించాల్సి౦ది ముందే చెప్పనుగా?"
యూనిఫాంలో వున్న గార్డ్ డోర్ తెరవగానే సాకేత, ప్రభంజన రావు ఒకేసారి కారు దిగారు.
సాకేత తొందరపాటులో పొరపాటు చేయకుండా ఆమె కన్నా రెండడుగులు ముందు నడిచెట్టు జాగ్రత్తపడ్డాడు.
లాబీలో అడుగుపెట్టగానే రిసెప్షనిష్టు విష్ చేస్తుంటే తల పంకిస్తూ ప్రభంజనరావుతోపాటు డైరెక్టర్స్ కోసం ప్రత్యేకించిణ ఎలివెటర్ ని చేరుకుంది సాకేత.
లిప్టు కదులుతుంటే క్రీగంట ఆమెనే గమనిస్తున్నాడు ప్రభంజనరావు. "డోంట్ వర్రీ బేబీ! మొహంలో అలా భయం కనబడనువ్వకు. ఏ స్థితిలో అయినా చెక్కు చెదరని ధీమాని ప్రదర్శించడం హనితకు వున్న పెద్ద క్వాలిఫికేషన్ ఫాలో ఇట్."


