ప్రభ౦జనరావు అసహనంగా మళ్ళీ పచార్లుచేస్తున్న ఆ సమయంలో ఫోన్ రింగయింది.
రెండు లిప్తాలు గడిచాయి. "ఎస్..... ప్రభంజరావ్ హియర్ ." ఫోన్ చేసింది. ఎవరన్నా కాని ముక్తసరిగా ముగించేద్దామన్నంత ఉద్విగ్నత.
"నేను .... సాకేతని."
ఉలికిపడ్డాడు ముందు. "ఎక్కడున్నుంచి?"
"ప్రస్తుతం సేఫ్ గానే వున్నాను. వేటని తాత్కాలికంగా ఆపేసిందీ. హనిత. అది గ్రహించక ఇప్పుడు ఇంటికి వెళుతూ మీకు ఫోన్ చేసింది. నిజం. వట్టిగా బెదిరించిందేమో ..... నన్నిప్పుడు గూండాలు వెంటాడటం లేదు."
"కావచ్చు సాకేతా! హనిత వ్యవహరదక్షురాలే. తప్ప, హంతకు రాలు కాదు." సరిగ్గా ఈ వాక్యం అంటుండగా ప్రభంజనరావు మెదడులో ఓ ఆలోచన తళుక్కుమంది.
అది క్రమంగా పెరిగి ఆకాశమంత మెరుపై అతన్ని వ్యవహరదక్షుడిగా నిరూపించుకునే అవకాశమిచ్చింది.
"అర్జెంటుగా రాగలవా సాకేతా?"
"ఎందుకు?"
"నీ ప్రత్యర్ధిపైన ఓ అస్రం సంధించే సమయం ఆసన్నమైంది. అందుకు నిన్ను రంగంలోకి దింపాలని ఉంది."
"కొన్ని క్షణాలపాటు నిశ్శబ్దం తరువాత అంది సాకేత __ అర్ధం కావడంలేదు."
"ఇక్కడికొస్తే వివరంగా చెబుతాను."
"ఇప్పుడే రావాలా?"
"ఇప్పుడే ... ఈ క్షణంలోనే!"
"ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు."
"ఎస్ .... ఇప్పుడు నిజంగానే నీ సహాయం మాకు కావాలి."
"మాకూ అంటే?"
"చెబుతాను ప్లీజ్! ఇక్కడికిరా."
"అభ్యంతరంలేదు ప్రభంజనరావ్ . నీతో చేతులు కలుపుతున్నానని తెలిస్తే హనిత మళ్ళీ విజ్రుంభిస్తుందేమో?"
"బెదిరిపోయావా?"
"అదికాదు .... ఎదురుచూస్తున్నాను."
"దేనికి?"
"పగ అన్నది వేడి పానీయ౦లాంటిది . చల్లబడుతున్న కొద్దీ రుచుని పెంచుకుంటుంది."
"అంటే ? నీ పాగని చల్లర్చుకుంటున్నావా?"
"ఆహా .... చల్లబడిందనుకున్నాక పగ తీర్చుకావాలనుకుంటున్నాను. అవును ప్రభంజనరావ్ ! ఏమీలేదని హనిత సైతం అనుకుంటున్న సమయంలో ఓ చావు దెబ్బ తీయడం సమంజసం అనుకుంటున్నాను."
"నీ మేధని శకించడంలేదు. సాకేతా. కానీ ఓ విషయం చెప్పనా? ప్రత్యర్ధి బలాన్ని కోల్పోతున్న సమయంలో పైనబడి ఊపిరి పీలిచుకునే అవకాశమివ్వకపోవడమూ ఓ అద్భుతమైన స్ట్రేటజియే .... హనిత తండ్రి పరిస్థితి బాగైలేదని ఈ క్షణంలో నువ్వు రంగప్రవేశం చేస్తే చాలా మేలు జరిగిపోతుంది నీకూ, నీలాగే హనితకి ప్రత్యర్దులయిన మాకందరికీ."
"వెల్ .... వస్తున్నాను" ఫోన్ క్రేడిల్ చేసిన చప్పుడు.
"ఎవరు?" అడిగారంతా ఒకేసారి.
చెప్పాడు ప్రభంజనరావు. కొందరు నమ్మలేదు. మరికొందరు 'ఒకే పోలికలున్న మరో మనిషి ఉండటమేమిటి' అంటూ విస్మయంగా చూశారు. అంతా నిశ్చష్టులై ఆలోచిస్తుండగానే ప్రభంజనరావు చెప్పుకుపోయాడు.
"వేదకపోయిన తీగ కాలికి తగలడమంటే ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కొన్ని క్షణాలలో ఓ అద్భుతాన్ని చూడటమే కాదు .... చూశాక అవాక్కయిపోతారు....."
"ఒకే పోలికలు౦డోచ్చు. ఉంటే మాత్రం అది మనకే విధంగా ఉపయోగపడుతుంది ?" సత్యానంద్ అడిగాడు.
"చాలా మంచి ప్రశ్న వేశారు మిస్టర్ సత్యానంద్ . ఇన్నాళ్ళూ సాకేత ఉనికి నాకుమాత్రమే తెలిసిన నిజం. ఇప్పుడు మీకూ తెలుస్తూంది. వెంటనే నేను చేయబోతున్నది ఏమిటో తెలుసా?" సాకేతని ఒప్పించి రేపు హనిత స్థానంలో ఫ్యాక్టరీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో అడుగు పెట్టించడం."
అప్రతిభులై వుంటున్నారంతా.
"మన అభియోగాలకి సంబంధించిన ఫైల్సు. ఆ కేసేట్సు లాంటివన్నీ లాకర్ లో నుంచి తెలివిగా బయటకి రప్పిస్తాను."
"కాని హనిత ...."
"మరో రెండు రోజులదాకా చాంబర్ లో అడుగు పెట్టదు. కారణం తండ్రి ప్రస్తుత పరిస్థితి."
సత్యానంద్ కూట్రాటగా అయిపోయాడు.
"ప్రమాదమమో? అదికాదు, ఎవరయినా గురిస్తే ...."
"గుర్తించే ప్రశ్నేలేదు సత్యానంద్ . అంత పోలికలున్న ఆడపిల్ల సాకేత. ఇక్కడ ఈ రాత్రికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త హనిత బిహేవియర్ గురించి, తన సబార్డినెట్స్ తో ప్రవర్తించే తీరు గురించి, అక్కడ ఆమె డీల్ చేసే స్టాఫ్ గురించి సాకేతకి వివరంగా తెలియచెప్పడం ఆ మాత్రం చాలు ..... తెలివైన సాకేత ఇమిడిపోతుంది. మన గురించి రహస్యంగా సేకరించిన సమాచారాలున్న ఫైల్సు నెక్ గా తీసి అటు హనిత అట కట్టిస్తుంది."
"కాని తాళాలు ...."
"ఆ డిటైల్స్ నేను చూసుకుంటాను సత్యానంద్ ....." ఉల్లాసంగా నవ్వాడు చాలాసేపటి తరువాత. "ఇక్కడ సాగించబోతున్న మరో అతిముఖ్యమైన ప్రయోగం కిరీటిపైన."
"అదెలా?"
"హనితకి కిరీటి చాల ఆత్మీయుడైనట్టున్నాడు కదూ" అగాడో క్షణం సాలోచనగా "ఇప్పుడు హనిత స్థానంలో వెళుతున్న సాకేతకిరీటిని తెలివిగా రెచ్చగోడుతుంది. ఒక చిత్రమైన ఆహ్వానంతో కిరేటి హనిత దగ్గర తొందరపడేటట్టు చేసి అతని పునాది కదలడానికి ఓ అంకురం వేస్తుంది."
స్పష్టంగా కాకపోయినా కొద్దికొద్దిగా అర్ధమౌతుంది అందరికీ.
హనిత స్థానంలో వెళుతున్న సాకేత కేవలం ఫైల్సు బయటకి రప్పించడమేకాక, కిరీటిని ఓ అసభ్య సన్నీవేశంలోకి తెలివిగా నెట్టి అసలు హనిత ముందు దోషిగా నిలబెడుతుంది.
అదిగో సరిగ్గా అప్పుడు లోపలి ప్రవేశించి౦ది సాకేత.
"వెల్ కం " ప్రభంజనరావు సాదరంగా ఆహ్వానించి ఒక్కొక్కర్నీ పరిచయం చేస్తుంటే అంతా నివ్వెరపోయి సాకేతనే చూస్తున్నారు.
శివరావు మునిపంట పెదవుల్ని కొరుక్కున్నాడు. పోలికలేకాక ఓంపుల్లోనూ హనితలాగే అన్పిస్తున్న సాకేతని చూస్తూ.
* * * *
అనంతాకాశంలో ఉద్భవించిన వజ్రకీరటంలా సూర్యుడు మళ్ళీ ఉదయించాడు.
జ్ఞాపకాల ఖజానాలో నుంచి ఒక్కుమ్మడిగా లేచిన స్ప్రుతుల్లా కిరణాలు వాడిగా నేలపైకి ఉబుకుతున్నాయి.
వేనీషియన్ బ్లయి౦డ్స్ దాటినా సూర్యరశ్మి గదిలోకి చొచ్చుకోస్తుంటే రోఫ్ తో ఎడ్జస్ట్ చేస్తూ వెనక్కి తిరిగింది హనిత.
అప్పటికే కళ్ళుతెరిచి ఆమెనే తదేకంగా చూస్తున్నారు. సుదర్శన రావుగారు.
తెల్లవారుతుండగా డాడీని ఇంటికి తీసుకువచ్చిన హనిత అయన అప్పుడే నిద్రలేస్తారనుకోలేదు.
"నిద్రపొండి డాడీ." ఒక పసికందును లాలించే తల్లి గొంతులోని అర్ధ్త్రత హనిత కంఠంలో......
"మనసు బాగోలేదు బేబీ నిద్ర రావడంలేదు."
"ఇప్పుడేంమైందని?" ఆయనకి అభిముఖంగా కూర్చున్నా సూటిగా తండ్రి కళ్ళలోకి చూడలేకపోతూంది. "అసలు మీరు మానసికంగా అలిసిపోయారు డాడీ యూ నీద రెస్ట్ . ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోవడానికి నేనున్నానుగా!"
"నేను ఆలోచిస్తున్నది ఫ్యాక్టరీ గురించి కాదు బేబీ. నీ గురించి"
"అయాం క్వయిట్ ఒకే డాడీ " పెదవులమీద నవ్వుతో మనసు లోని అందోళన దాచుకోవాలని ప్రయత్నించింది ఎన్నడూలేనిది రాత్రి నుంచి అయన ప్రవర్తన ఆమెకీ విస్మయాన్ని కలిగిస్తూ౦ది ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారని ఆమెకీ తెలుసు, తెలుసుకోవాలని తనకీ వుంది. కాని ఇది అదను కాదు. అందుకే మాట తప్పించేస్తూంది.
"డాక్టర్ అంకుల్ ఏం చెప్పారో తెలుసా డాడీ?"
"చెప్పు,"
"మిమ్మల్ని పసిపిల్లాడిన బుజ్జగించలనుకున్నారు."
"అంటే నిన్ను నాకు తల్లిలా ప్రవర్తించమన్నారన్నమాట!"
తలవంచుకుంది నిశ్సబ్దంగా.
"దురదృష్టం కదూ?"
హనిత పైకి లేవబోయింది.
"కూర్చో బేబీ. నీతో చాలా మాట్లాడాలి."
డాడీ!"
"నన్ను మాట్లాడనివ్వు హనితా. బహుశా మళ్ళీ నాకు అవకాశం రాకపోవచ్చు. నేను పోయేలోగా చేయాల్సిన అతిముఖ్యమైన పనులు మాత్రమే కాదు, చేప్పాల్సిన విషయాలూ ఉన్నాయి."
"ప్లీజ్ డాడీ!" హనిత కనుకొలకుల్లో ఓ నీటిబొట్టు నిలిచింది.
"మిమ్మల్ని రెస్ట్ తీసుకోంటున్నావా. అవన్నీ తరువాత మాట్లాడు కోవచ్చు."
"నీకు తల్లిని దూరం చేసిన వాణ్ణమ్మా."
"ఫర్ గేటిట్ డాడీ. ఆ వివరాలాన్నీ నాకు అక్కర్లేదు. అయినా నాకేం తక్కువ చేశారని? అమ్మా, నాన్న అనీ మీరే అయ్యరుగా!"
"వాస్తవం తెలిస్తే నువ్వు నన్ను క్షమించలేవు."