Previous Page Next Page 
అసురవేదం పేజి 32

 

   "SAKETA MACHINE TOOLS, REQUIRES
    AN EXECUTIVE,
    SALARY NEGOTIABLE
    APPLY WITHIN A WEEK TO ...."


    రాజేంద్ర చేతులు కంపిస్తుంటే చదివిన అక్షరాల్ని మరోసారి చదువుతూ అలజడి పడుతున్నాడు __ "ఏ ... ఏమిటది?"

    "మన మెషిన్ టూల్స్ కంపెనీకి కావాల్సిన డిజైన్స్ చీఫ్ కోసం రేపు లీడింగ్ న్యూస్ పేపర్లలో రాబోతున్న అడ్వర్టయిజ్ మెంట్స్ ."

    "కాని ....." రాజేంద్ర మాటలు అర్ధైక్తిలోనో ఆగిపోయాయి.

    "మీరుండగా ఇదంతా ఏమిటి అన్నది మీ అనుమానం. వెల్. మీరు మీ సీటు ఖాళీ చేయబోతున్నారు .... సాధ్యమైనంత త్వరగా . రోజుల్లో కాదు __ గంటల్లో"

    "నో !" ఇక్కడ రాజేంద్ర ఎంత గట్టిగా అరిచాడూ అంటే పక్కగదిలోని మోనీ అదిరిపడి౦ది. రాజేంద్ర సామాన్యుడు కాడూ అని వచ్చి కిరీటికి చెప్పాలనుకుంటూనే నిభాయించుకుంది.

    "యు నో మిస్టర్ రాజేంద్రా ..... మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేని మనిశిగా బ్రతికారిన్నాళ్ళూ! కాబట్టే రాయల్టీని మరచి పాలిచ్చే అవు పొదుగును కోసే అద్భుతమైన ఆత్మవంచనతో సర్వైవ్ కాగలిగారు. పొడుగు మీరు కోశారా లేక మీచేత ఎవరన్నా కోయించారా అన్నది కాదిప్పుడు సమస్య. మిమ్మల్ని మీరు ప్రేమించుకునే మనిషిగా మారి వెంటనే రిజైన్ చేసి పరువు దక్కించుకోండి లేదా..... " సీరియస్ గా చూస్తూ అగాడో లిప్తపాటు "నేనే సాక చేయాల్సి వుంటుంది. ఆఫ్ కోర్స్ ఎవరో వచ్చి మిమ్మల్ని కాపాడగలరూ అని మీరు ఆలోచిస్తున్నారెమో! నో ఛాన్స్ ! ఈ కేసెట్ తో మార్గాలు మూసుకుపోయాయి .....సో .... నాలుగు గంటల టైం.... అంటే సాయంకాలం మీ డ్యూటీ పూర్తయ్యేదాకా అవకాశఇస్తున్నాను. మీరు రిజైన్ చేస్తే సరి, లేదా నేను అమర్యాదుగా మీ పైన దాడి చేయాల్సి ఉంటుంది బట్ యు నో ... రిపీ అడ్వర్టయిజ్ మెంట్ మాత్రం రావడం ఖాయం. నౌ యు కేన్ గో."

    రాజేంద్రకు యిక మాట్లాడే అవకాశం యివ్వకుండా వెంటనే ఇంటర్ కం బజర్ నిక్కుతూ _ "మిస్ మోనీ ప్లీజ్ కం హియర్ " అన్నాడు.

    "లోనికి వస్తున్న మోనీ ఎంత ఆశ్చర్యపోయిందీ అంటే రాజేంద్ర మోహం అలా ఉండటం ఆమె ఈ మధ్య చూడలేదు. అదికాదు .... నడుస్తున్న శవంలా బయటికి వెళుతున్నాడు రాజేంద్ర.

    "ఏం జరిగింది ?" మోనీ ఆశ్చర్యంగా అడిగింది.

    "ఆరోగ్యం చెడింది"
   
    "ఎవరదీ ?"

    "రాజేంద్రది"

    "అలా లేదే!"

    "లేకుండా ఏం జరిగిందీ అని ఎలా అడిగావు?"

    ఈసారి మోనీ ఖంగు తినింది "అహం .... మోహం అదోలా ఉంటేనూ"

    "అలా ఉండటం ఎప్పుడూ చూడలేదా?"

    "చూశాను ... ఒక్కసారి"

    "ఎప్పుడు?"

    "పూర్వం జనరల్ మేనేజర్ మోహతా రిజైన చేయడానికి ముందు."

    "వ్వాట్?" ముందు అర్ధం కాలేదు కిరీటికి. "మోహతా రిజిగ్నేషిన్ కి ముందు రాజేంద్ర మోహం ఇలా ఉందటమేమిటి?"

    "అదే సీక్రెట్ " మోనీ మూడ్ లోకి వెళుతూ అటూ ఇటూ చూసిరహస్యంగా చెప్పింది. "అ ఆరోజు నాకు బాగా గుర్తు. నేను ఛాంబర్ లోకి వచ్చేసరికి రాజేంద్రగార్ని రిజైన్ చేయమంటూ అరుస్తున్నాడు మిస్టర్ మోహతా. ఏం జరుగుతుందో నాకూ తెలీదు. సరిగ్గా ఇలాగే మొహం తెలేఉకుని వెళ్ళాడు. అంతే .... రెండు రోజుల్లో మెహతా రిజైన్ చేశాడు. ఎందుకంటే బోర్డు డిరెక్టర్సంతా ఏదో మేనినిప్యులేట్ చేశారన్నమాట .... రాజేంద్రంటే ఇష్టంగా?"

    ఆ తరువాత కిరీటికి మోనీ చెప్పింది వినబడలేదు.

    అంటే .... రాజేంద్ర వ్యవహారాలన్నీ బహుశా మెహతా కూడా పసిగట్టి ఉంటాడు. సరిగ్గా తనలాగే రిజైన్ చేయమని ఉంటాడు.

    ఆ తరువాత బోర్డు డైరెక్టర్స్ మెహతా పైన ఆసాధారణమయిన ఒత్తిడి తెచ్చి రాజేంద్రకి బదులు అతనే రిజైన్ చేసే పరిస్థితి  తీసుకొచ్చి ఉంటారు.

    "అంటే త్వరలో నేను రిజైన్ చేయాల్సి వస్తుందంటావా?" అనాలోచితంగా నోరు జారాడు.

    "వ్వాట్?" విస్మయంగా దగ్గరికి వచ్చింది మోనీ. "నువ్వు .... నువ్వు రిజైన్ చేయుడమేమిటి? ఏం జరిగింది?"

    అప్పటికి తన తప్పు తెలుసుకున్న కిరీటి "అదే...." అర్జెంటుగా నీళ్ళు నమిలేస్తూ అన్నాడు.

    "అదే అంటే?"

    ఇహా వదిలిపెట్టదు.

    "అదే ..... చూడు మోనీ. నీకు తెలుగు బాగా తెలుసు కదూ?"

    ఓ. నేను రాస్తాను కూడా"

    "ఏమిటి కథలే?"

    "అహం ... అక్షరాలు "

    "వెల్. రేపటికల్లా చెప్పు"

    "ఏమిటి?"

    "అదే .... మనిషిని చూడగానే సావిట్లో దాచుకుని పడుకుంటుంది. మీదనుంచి లేవగానే మూలాన ముడుచుకుని ఉండిపోతుంది."

    "ఎవరూ?"

    "కనుక్కొని చెప్పాలి"

    "పొదుపు కథా?"

    "మరేం ..." మరోసారి రిపీట్ చేశాడు.

    "ఛీ పాడు" బోలెడంత సిగ్గుపడింది మోనీ.
   
    "సిగ్గులేదు."

    "ఎవరికి?"

    "ఆ అమ్మాయికి."

    "రైట్ ఆవిడెవరో ఆలోచించి చెప్పు."

                                          *    *    *    *   

    రాత్రి పదిగంటల వేళ.

    క్షణాలను సాగదీస్తూ కాలం నీరసంగా కదులుతూంది.

    చాలా సేపటినుంచి సాగుతున్న చర్చకొలిక్కిరాని క్షుద్ర కావ్యంలా ఆ గదిలో కలవరాన్ని నింపుతూంది.

    "సో ... ఇప్పుడేం చేద్దా౦?" సరస్సులో విసిరినా రాయిలా మరో ప్రశ్నని సంధించాడు సత్యానంద్ .

    ప్రభంజనరావు అసహజంగా అటూ యిటూ పచార్లు చేస్తున్నాడు ఇంకా.

    శివరావు , ఎలిజిబెత్ లు అతన్నే రెప్పలార్చకుండా చూస్తున్నారు.

    అందరి మొహాల్లోనూ టెన్షన్.

    ఆ రోజు తప్పని పరిస్థితుల్లో రిజైన్ చేసిన రాజేంద్ర సమస్య ఆ సమావేశానికి కారణమైతే ఇప్పుడు వాళ్ళు అలోచిస్తున్నది రాజేంద్ర గురించి మాత్రమె కాదు. సరిగ్గా మూడు రోజుల తరువాత హనిత ఏర్పాటు చేయబోతున్న సమావేశం గురించి కూడా.

    ఒక ప్రక్క హనిత, మరోప్రక్క కిరీటి ప్రారంభించిన దండయాత్ర తారాస్థాయికి చేరుకోవడానికి ఉన్న గడువు కేవలం మూడు రోజులే.
   
    ఈలోగా ఏదో జరగాలి. లేకపోతే అంతా జరిగిపోతుంది. తమ అస్థిత్వాల్ని కోల్పోతారు. ఏళ్ళ తరబడి పేర్చుకున్న స్థానాలు కుప్పకూలి పోతాయి.

    ప్రభంజనరావు టక్కున ఆగాడు.

    "ప్రెండ్స్ ... అందరం సహా ప్రయాణీకుల్లాగే వున్నాం. హనిత ఎంత తెలివైనదీ అందరిపైనా  చావు దెబ్బ తీయాలని రహస్యంగా తన ఏర్పాటుల్లో మునిగి ఇన్నాళ్ళూ ఆగింది. ఇప్పుడు మనలో ప్రతి ఒక్కర్నీ నేలమట్టం చేయడానికి ఒక్క బలమయిన ఆయుధాన్ని సెకరించింది. ఎస్ .... మనలో అందరూ ఆమెకు టార్గెట్స్. ఇప్పుడు మనం ఆలోచించాల్సిందీ ఎవరం? ఏం చేశాం? ఎందుకలా చేశాం అని కాదు. జరగాల్సింది జరిగిపోయింది. మనలో కావాల్సింది పరస్పర నిందలు కావు, సంఘీభావం ముందు మన సమస్యల్నీ జమిలిగా ఎదుర్కోవాలి. అంటే హనిత ప్లాన్ చేస్తున్న సమావేశం తాత్కాలికంగానైనా ఆగాలి."

    "అదెలా సాధ్యం?" ఎలిజిబెత్ అడిగింది.

    "సుదర్శనరావు ఆరోగ్యం ప్రస్తుతం బాగోలేదు."

    "హనిత చాలా పట్టుదల గల మనిషి ప్రభంజనరావ్! అయన ఆరోగ్యం సరిగా లేకపోయినా మీటింగ్ కి కావాల్సిన అథరైజేషన్ని తన తండ్రి నుంచి సంపాందించి అనుకున్నది అక్షరాలా అమలు చేస్తుంది." శివరావు అన్నాడు ఇబ్బందిగా కదులుతూ.

    "ఏది ఏమైనా సమావేశం జరక్కూడదు శివరావు. అది ఏ పద్దతిలో అయినా సరే అగితీరాలి కొన్ని రోజులపాటైనా."

    "దానివల్ల మన కోరిగేదేమిటి?"

    "కొద్దిపాటి సమయం దక్కుతుంది. మనం బలాన్ని అదుపులోకి తీసుకోడానికి కొంత వ్యవధి చిక్కుతుంది. ఈలోగా కిరీటిని అదుపులోకి తీసుకోవాలి."

    "ఎలా? వాడు సామాన్యుడు కాడు." తన హత్యాప్రయత్నం విఫలమైనందుకు గాక తన చేతులపై నున్న సత్యానంద్ . "వస్తూనే అందరిపైన దాడి ప్రారంభించాడు. చూస్తుంటే దేనికయినా తెగించినట్టున్నాడు"

    "ఒకనాడు మెహతా కూడా ఇలాగే తెగింపుతో వ్యవహరించి రాజేంద్రని రిజైన్ చేయి౦చబోయి మన దెబ్బకి నిలబడలేక తను రిజైన్ చేశాడు. సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేసిన కిరీటి ముందు రాజేంద్ర రిజిగ్నేషన్ ఒక చిన్న గెలుపు సాధించినమాట వాస్తవమే అయినా, మనం ఇప్పుడు మరో రూట్ లో వాడ్ని ఇబ్బంది పెట్టాలి ...."

 Previous Page Next Page