అమ్మా" తల్లిని పొదివిపట్టుకుని లోపలికి నడిపిస్తూ అన్నాడు ..... "ఇది మన సొంత ఇళ్ళు కాదే."
"కాదూ?" చేతులు విడిపించుకుని విస్మయంగా చూసింది..... "అంటే అద్దెకు తీసుకున్నావా? నెలకి ఎంత తగలేదద్దామనుకుంటున్నావేమిటి?"
"అబ్బా.... చెప్పేది వినవేమే. అద్దెకి తీసుకోలేదు. ప్రీగానే ఇచ్చారు."
"మరి నేనంటున్నదీ అదే కదరా?"
"ఫ్రీగా అంటే మన సొంతం అని కాదు. ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళూ ఉండమని."
"ఉండకేం చేస్తావు? వదిలిపెట్టి పోదామనా? అలాంటి పిచ్చిపని చేస్తే పళ్ళు రాలగొడతానోరే, వెధవకానా అని. సలక్షణంగా వుంది. ఉండక పోయేకాలమా?"
"అమ్మా" ఉస్సురోమంటూ ఓ సోఫాలో చతికిలబడిపోయారు. "కాస్త చెప్పేది వినవే!"
"గుడ్డోచ్చి పిల్లని వెక్కిరి౦చిందని. ఇహా నువ్వు చెప్పేది వినను. అందుకే అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. ఇటు రావే ఆదిలక్ష్మీ ఎవరనుకున్నావు? వాడే నా .... కొడుకు .... "
సిగ్గుపడుతున్న అమ్మాయిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకో బోయింది. కాని ఆమె బిడియంగా మరో గదిలోకి పారిపోయింది.
"ఎవరే? మళ్ళీ ఎవర్నిలా వెంటబెట్టుకొచ్చావు?" తన పెళ్ళికోసం హడావుడి చేసే అమ్మ ఇలా తన ఊళ్ళోనే కాక చుట్టుపకక్కల గ్రామాల్లో పెద్దమనుషులైన అమ్మాయిల్ని ఇంటికి తీసుకురావడం, వాళ్ళ గుణగుణాలు ఏకరపు పెట్టడం అతనికి అలవాటే గాని, ఇంత దూరం అమాంతం ఓ అమ్మాయిని లాక్కోస్తుందని ఊహించలేక పోయాడు.
"అసలు ఈ అమ్మాయెవరు?"
"మా మేనమామ అక్క తోడబుట్టిన దాని కూతురు దేవుడమ్మ లేదూ? ఉందిలే. మార్టూరులో ఉండేది. ఈ మధ్యనే తగరంపూడి వెళితే తెలిసింది. వాళ్ళ మేనత్త చెల్లెలు వేలువిడిచిన తోడికోడలు కూతురు సమర్తాడిందని. అదేరా ఈ ఆదిలక్ష్మీ . నీకు జోడీగా వుంటుందని చెప్పడానికిలా వెంటేసుకొచ్చాను ఏమిటో ఊళ్ళో అమ్మాయిలంతా పెద్ద మనుషులవుతున్నారు. పెళ్ళిళ్ళై పిల్లల్నీ కూడా కంటున్నారు గాని, ఎనుబోతులా ఎదిగావు పెళ్ళిచేసుకురా అంటే నన్నిలా ఆరడి పేడుతున్నావు.
కళ్ళోత్తుకుంది.
"ఇహా చేసుకుంటానులేవే .... ఇప్పుడు నన్ను వేధించకు."
"ఒరేయ్!" అదిశక్తిలా లేచింది. "ఇలా అంటూనే ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఈసారి కాదంటే నీ కాళ్ళు విరగ్గోడతాను. అసలు ఆదిలక్ష్మీ కి ఏం తక్కువైంది?" పేరుకు తగ్గట్టు మహాలక్ష్మీలా వుంది. పైగా ఆరో తరవాతి పూర్తీచేసింది. వాళ్ళయ్య నువ్వు వద్దన్నా దాని పేర్న ఆరెకరాల మాగాణి రాసిస్తానంటున్నాడు. ఇన్నాళ్ళూ పెళ్ళి చేసుకుంటే ఉద్యోగం వూడుతుందని నన్ను మభ్యపెట్టావు గాని యిక నన్ను నీకు యిల్లాల్లూ వచ్చి తీరాలానే వాళ్ళ మనసులోనూ ఆలోచన బలంగా పడివుంటుంది. ఇప్పుడు నువ్వు కాదంటే యీ ఉద్యోగం ఊడదీసి నిన్ను మెడ పట్టుకుని గెంటుతారని నాకు అనుమానంగానూ వుంది."
"అమ్మా ... అమ్మ ... చాలా సమస్యల్లో ఉన్నావే! అనక వచ్చి మాట్లాడతాను. ఇప్పటికి నన్ను వదిలి ఆ వంట ఏర్పాట్లు చూడు. అదికాదే నీ చేతి వంట తిని ఎన్నాళ్ళయింది?"
టాఫిక్ మార్చే ప్రయత్నంగా అమ్మని సమీపి౦చేసి అర్జెంటుగా కాకా పట్టడం ప్రారంభించాడు."చూడూ! ఆ ఒట్టోడియాల వేపుడూ! దోసకాయ పచ్చడీ లాంటివి చేసి నన్ను ధన్యుణ్ణి చేసెయ్యమ్మా!"
"ఏమిట్రా" చోద్యంగా చూసింది. " మీకంపెనీ వాళ్ళు ఇంట్లో ఒట్టోడియాలా అవీ రెడీగా వుమ్చుటారా? అంటే కాగితం తెలిసిన వాళ్ళన్న మాట. ఓపెన్ ఆదిలక్ష్మీ !" కేక పెడుతుంటే కంగారుగా లేచాడు. "వంటగదిలోకెళ్ళి ఆ ఒట్టోడియాలు ఏ డబ్బాలో వున్నదీ చూసి ...."
అప్పటికే బాత్రూం వేపు పరుగెత్తబోతుంటే ఠక్కున చేతిని పట్టుకుంది తాయారమ్మ.
ఆమె కిరీటి మోచేతి పైన ఉన్న బెండేజ్ నే ఏకాగ్రంగా చూస్తూ అంది _ "ఏమిట్రా ఈ రక్తమేమిటి?"
"మ ..... మరేం ..... రక్తం "త్రోటుపడ్డాడు . ఇంతదాకా జరిగిన ప్రసక్తికన్నా యిప్పుడు ఎదుర్కోబోతున్నది మరింత జటిలమైన సమస్యగా అనిపిస్తుంటే అందోళన కప్పిపుచ్చుకుంటూనే నవ్వేశాడు. "ఇది మామూలు దేబ్బెనే! కా కారులో వెళ్తూంటే గీసుకుంది. తగ్గిపోతుందిలే. నీకు తెలీదే నాకు కంపెనీ వాళ్ళు కారు కూడా యిస్తారు. ఏమ్డుక్మాటే జీతం ఎక్కువగా! ఎంతేక్కువో తెలుసా?" తదేకంగా తాన్నే చూస్తున్న తల్లి చూపుల్ని టట్టు కోలేకపోతున్నాడు. "ఎంతెక్కువంటే మనచుట్టుపక్కల గ్రామాల్లో ఎవడూ నా అంత పెద్ద ఉద్యోగస్థుడు కాడన్న మాట. నీ కొడుకుని కదే .... బోలెడంత చదువుకున్నాను కూడా ..... అందుకుని " తల పక్కకు తిప్పి చెప్పుకుపోతూ అక్కడ నుంచి జారుకోవాలనుకున్నాడు. కాని యిప్పుడు ఎదురుగా వచ్చి నిలబడింది . "అందుచేత అమ్మా ..... ఈ కార్లున్నాయి చూశావూ ..... సుఖంగా వుంటుంది. కానీ అప్పుడప్పుడిలా గీసుకుంటాయి. అయినా ఒడెం నాకు కొత్తటే.... చిన్నప్పుడు కోతికొమ్మచ్చులాటలు ఆడుకున్నప్పుడు దెబ్బలు తగ్గలేదూ..... అలాగే నన్నమాట! అందుకని ......"
నీళ్ళు నమిలేస్తూ ఆగిపోతూ అప్పుడు చూశాడు తల్లి కళ్ళలో నీళ్ళని . వట్టి అమాయుకురాలయిన తల్లికి నిజం చెప్పి బాధపెట్టుకుని తల నిస్సహాయతకి అతని మనసూ ద్రవించి౦దేమో "ఏంటమ్మా! యింత చిన్న దానికే కళ్ళనీళ్ళు పెట్టుకుంటారా? నువ్వోటి పిచ్చిపిల్లవు."
"అవున్రా" నెమ్మదిగా కళ్ళు తుడుచుకుంది. "నేనొట్టి పిచ్చిమాలో కాన్ని ! అందుకే నువ్వెం చెప్పినా నమ్మేస్తుంటాను. కానీ నేను మీ అమ్మ నిరా ..... నీకేమ్మన్నా అయితే భరించలేను . అస్సలు తట్టుకోలేను. అం!"
"అవునమ్మా! నాకు తెలీదూ?" అమ్మని విడిపించుకోని ముందుకు వెళుతూ అన్నాడు "ఆ ఒట్టోడియాలు ...."
"మినప్పిండేలేరా .... చీము పొయ్యదులే. నీకిష్టంగా తినొచ్చు." వుండిపోయాడు కొన్ని క్షణాలపాటు.
ఒక చిన్న ప్రశ్న క్రమంగా విస్తరించి బ్రహ్మండమంతగా మారిపోయింది.
ఇప్పుడొక చిన్న గాయానికే కంటతడి పెట్టుకున్న ఈ అమ్మకి తనెలా చెప్పగలడు తానెలాంటి వలయంలో అడుగు పెట్టిందీ...... ఇంకా మరిన్ని గాయాలతో ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నదీ!
* * * *
"మోనీ" ఇంటర్ కంలో చెప్పాడు కిరీటి . "అర్జెంటు గా మిస్టర్ రాజేంద్రని కలుసుకోమని మెస్సేజ్ పంపు."
"ఎస్సర్" మోనీ హుక్ చేస్తూ ఆ పనిలో నిమగ్నమైంది కొన్ని క్షణాలపాటు..... రాత్రి కలలోకి వచ్చిన కిరీటి తనకెలా అల్లరి పెట్టిందీ చెప్పలనుకుంది. కాని ఎందుకో వుదయం నుంచీ సాహసం చేయలేకపోతూంది. అంత ముభావంగా వున్నాడు.
మరో అయిదు నిముషాలలో ఛాంబర్ లో అడుగు పెట్టాడు రాజేంద్ర .... డిజైన్స్ చీఫ్.
"పిలిచారట" విష్ చేయాలన్న ధ్యాస లేదు. ముక్తసరిగా అన్నాడు.
"ప్లీజ్ బీ సీటేడ్" కిరీటి కొన్ని సెకండ్లపాటు తదేకంగా రాజేంద్ర మొఖంలోకి చూశాడు.
అతని కళ్ళలో ఇప్పుడు సమస్యని ఎదుర్కోబోతున్నానన్న టెన్షన్ వుంది. కాని ఇదేంతలే అన్న ధీమాతో ఆ టెన్షన్ ని ఓవర్ కమ్ చేయాలన్న ప్రయత్నమూ కనిపిస్తూంది.
"మిస్టర్ రాజేంద్రా!" భావరహితంగా పిలిచాడు కిరీటి "యు నో మోకాళ్ళ మీద నిలబడి బ్రతికే కంటె కాళ్ళ మీద నిలబడి చావడం మేలంటారు."
"ఎవరు?" ఉద్విగ్నంగా వినిపించింది రాజేంద్ర కంఠం.
"నాలా కాళ్ళ మీద నిలబడి బ్రతికేవాళ్ళు."
"ఇప్పుడు పిలిచింది దేనికి?"
"ఈ మాట చెప్పటానికి."
"ఇవన్నీ చిన్నప్పుడు విన్నవి."
"కాని పెద్దయ్యేదాకా తెల్సుకోలేకపోయిందని థింక్."
"నన్ను అవమానిస్తున్నారు......"
"మీ అనుమతి లేకుండా మిమ్మల్నేవరూ అవమానించలేదు. ఈ సూత్రాన్నీ మీరు చదువుకునే వుంటారు." కిరీటి పెదవులపై నిశ్చలంగా మెరుస్తున్న మందహాసం.
"నేనేదో తప్పు చేసినట్టు నీ నీతులు చెప్పడం నాకు నచ్చడంలేదు."
"వెల్ .... ఎనీ మాస కేన్ మేక్ మిస్టేక్స్ . బట్ ఓన్లీ ఏ నిడిఎట్ పెర్నిస్ట్స్ ఇన్ హిజ్ ఎర్రర్ .... ఈ సత్యమూ మీకు చిరపరిచితమయ్యుండాలి."
"ఇదంతా."
"రికార్డ్ చేసుకోవలసిన నిజాలు .... ఆఫ్ కోర్స్ .... రికార్డర్ ఏదన్నా కావచ్చు. కాని ఇలాంటి కేసెట్ వుండాలి." అప్పుడు చూపించాడు రాత్రి రికార్డర్ లినుమ్చి ముందే తీసి దాచిన కేసెట్ ని. రాజేంద్ర నుదుటిపైన చెమటపట్టడాన్నిగమనిస్తూ అన్నాడు కిరీటి. "కొన్ని సత్యాలని సమాధిచేసినా ఆ సమాదుల్నీ కల్తీ సిమెంటుతో నిర్మించినవి అయితే ఇలా సమాధి చేసినా ఆ సమాదుల్నీ కల్తీ సిమెంటుతో నిర్మించినవి అయితే ఉపోద్ఘాతం అయిపోయింది. మనలాంటి ఎగ్జిక్యూటివ్స్ కాలం చాలా విలువయినది కాబట్టి డైరెక్టర్ పాయిమ్తుకే వస్తున్నాను. "ఓ ఫైలు తెరచి టైఫ్ కాగితాన్ని రాజేంద్ర ముందుంచాడు. "ఇదెలా వుంది? చదివి చెప్పండి"