Previous Page Next Page 
అసురవేదం పేజి 30

 

     "మీరొక అపూర్వమయిన వ్యక్తి మిస్ హనితా!     మీ జీవితానికో లక్ష్యం ఏర్పరుచుకుని నిర్భయంగా దూదుకుపోగలిగే అరుదయిన వ్యక్తిత్వం  గలవారు . ఈ క్షణంలో నేను కొన్ని వాస్తవాలను నిస్సంకోచంగా చెప్పడానికి సాహసిస్తున్నందుకు క్షమించండి. ఏ ఉద్దేశంలో మీరు ప్రారంభించినా పోరాటం సగభాగంలోకి ప్రవేశించారప్పుడే. ఆప్రమత్తంగా ఉండాల్సిన ఈ సమయంలోనే మీరు ధైర్యాన్ని కూడగట్టుకోవాలి."

    ఆ మాత్రం ఓదార్పుకే తట్టుకోలేనట్టు రెండు నీటిబోట్లు ఆమె కళ్ళనుంచి రాలిపడ్డాయి. "ఇప్పుడు నేను బాధపడుతున్నది పోరాటం గురించి కాదు కిరీటి! ఏ క్షణంలోనయినా నాకు దూరం కాబోతున్న డాడీ ....."

    "లేదు మిస్ హనితా ..... ఇది సమస్య కాదు. ప్రకృతి సిద్దంగా మనిషి కేదురయ్యే ఓ దురదృష్టం."

    "కావచ్చు .... కాని నా కింకెవరున్నారని!"

    "అసాధరణమైన ఓ బాధ్యతుంది. ఆ బాధ్యత వెనుక మీ సహాకారాన్ని ఆశించే ఎందరో వ్యక్తులున్నారు. కొన్నివెళ కుటుంబాల శ్రేయస్సు, వాళ్ళ కన్నీళ్ళు ఇవన్నీ మీతో ముడిపడుతున్నాయి. అలా అని ఇలాంటి ఓ దురదృష్టకరయిన సంఘటనకి మిమ్మల్ని రియాక్ట్ కావద్దనడం లేదు. ఇరవయ్యేళ్ళ బంధమూ, జన్మ కారణమైన తండ్రి మీద ప్రేమా, స్పందనా తప్పనిసరే కాని, అని మీ జీవితంలో ఓ భాగమే తప్ప అదే మీ జీవితం కాదు......"

    హానిత అప్పుడు తలతిప్పిచూసింది.

    ఏ కృతజ్ఞతాభావం అతన్ని వివశుణ్ణి చేస్తుందో, అదీ కానివాడు ఏ ఉద్విగ్నత మనసుని ఆక్రమించి క్షణకాలమైనా ద్రవింపచేసిందో కాని నిజాయితీగా అన్నాడు.

    "నేనో చిరుగాలి ఆలకి సైతం కదిలే ఇసుకరేణువుని హనితా. నిన్న మొన్నటిదాకా ఉనికిలేకుండా సంచరించిణ నేను మీ ఆశ్రయంతో ఓ అస్థిత్వాన్ని పొందగాలిగాను. అందుకే మీలో శూన్యాన్ని చూడలేకపోతున్నాను. నిశీధి తప్పనిసరయితే  ఆ నీరసంతో మీరో వెలుగు రేఖలా నిలబడింది అది చాలు హలాహలాన్ని నేను జీర్ణించుకుంటాను. మీ అండతో అమృత మథనానికి సిద్దపడతాను ......"

    ఆ నిశ్శబ్దపు చీకటి రాత్రి జీవన వాజ్మూలంలా,  ముత్యాల సరల్లా వినిపిస్తున్న కిరీటి మాటలు జ్వలించే మనసుపైన  రాలిపడుతున్న తుషార బిందువులయ్యాయి.

    ఆమె తేరుకుంది.

    గ్రీష్మంలో అయినా పూసే మల్లెలు నేలరాలుతూ కూడా అంత దాకా తనను అభిషేకించిన వెన్నెలకి నీరాజనం పడుతున్నట్టు అనుభూతి చెందింది.

    అప్పుడు చూసింది మసక వేలుతురులో రక్తం పేరుకున్న కిరీటి షర్టు చేతిని.

    "ఇది ...." అసంకల్పితంగా ఆమె నోరు జారింది. ఏం జరిగింది?

    అది చెప్పడానికి అనువైన సమయం కాదనే షర్టుతో గాయాన్ని దాచాడు. కాని ఆమె కంటబడింది చెప్పక తప్పలేదు.

    విన్నంతసేపూ ఆమెలో చలనం లేదు. తన మనిషీ తమ కుటుంబంలోని వ్యక్తీ అని శివరావుపైన అణుమాత్రం సదుద్దేశ మున్నా అదీ కాస్తా చెరిగిపోయింది.

    ఇప్పుడామె ఆలోచిస్తున్న విషయం అదికూడా కాదు. నిన్ననే హత్యా ప్రయత్నం జరిగింది. అయినా మొండివాడిలా దూసుకుపోతూన్నాడు కిరీటి. జీవితాన్ని ఇంత సులభ సాధ్యమైన విషయంగా ఎలా భావించగలగుతున్నాడు?

    "ఎందుకిలా రిస్క్ తీసుకున్నారు?" బాధగా అడిగింది.

    "భలేవారే" నవ్వేశాడు కిరీటి "అప్పుడప్పుడు ఇలా రక్తాన్ని ధారాపోస్తే తప్ప నిజాయితీ నిరూపించుకునే అవకాశమేలా వస్తుంది?" చొక్కాకి అంటుకున్నారక్తం కేసి చూపిస్తూ అన్నాడు.

    నిర్వీణ్ణురాలయింది. "నువ్వులాటగా తీసుకుంటారేం?" అంది.

    "లైఫీజేగేం ..... అన్నట్టు మీకు చెప్పలేదు కదూ? .... నేను మంచి స్పోర్ట్స్ మెన్ని కూడా. కాబట్టి అడుకోవడాన్నీ, సమస్యల్నీ నవ్వులాటగా స్వీకరించడాన్ని ఇష్టపడతాను. వెల్ .... మీరు మీ డాడీ కోలుకునే వరకూ తక్కిన విషయాలు పట్టించుకొనక్కర్లేదు. ఐ విల్ టేక్ కేరాఫ్ దెం.... అయితే నాకు కొద్దిపాటి శ్వేశ్హకిమీ అనుమతి కావాలి."

    అర్ధం కానట్టు చూసింది.

    "అదే .... ఇప్పుడు నేను ఆడిన అట మొదటి సగభాగం పూర్తయ్యింది. మీరు ఫ్యాక్టరీలో అడుగు పెట్టెలోగా మిగతా సగం కట్టించాలనుకుంటున్నాను. ఇది మీ అనుమతితో."

    ఒకనాడు ఆమె తండ్రినుంచి ఇలాగే అనుమతి కోరింది తను. ప్రారంభించాలనుకున్న ప్రక్షాళన కార్యక్రమానికి ముందు. సరిగ్గా కిరీటి ఇప్పుడు తననుంచి అలాంటి అనుమతినే కోరుతున్నాడు.
   
    రిస్కుతోనైనా తీసుకునే ప్రతి నిర్ణయమూ సక్రమంగానే ఉంటూందన్న వాస్తవం ఆమె అప్పటికే గ్రహించింది. "మీ ఇష్టం ."

    "థాంక్యూ మేడం" బయలుదేరాడు మరో నిముషం తరువాత.

    వెళుతున్న కిరీటినే చూస్తూ వుండిపోయిన హానిత తేరుకుని వెనక్కీ తిరిగింది.

    శివరావు  అక్కడ నిలబడి ఉన్నాడు.

    క్షణంలో ఆమె కళ్ళు అరుణిమను పుంజుకున్నాయి.

    "వెనకొచ్చిన కొమ్ముల్ని చాలా నమ్ముతున్నావు హనీ!"

    "చేవలేని చెవులకన్నా కుమ్ములాటల్ని ఎదుర్కోగల కొమ్ములేనయమనిపిస్తూంది"  స్థిరంగా అందామె.

    "ఎందరికి నువ్వు శత్రువయ్యవో ఊహించలేక పోతున్నావు."

    "అందరి శ్రేయస్సు కోసం కొందరికి చెడ్డయినా నేను కేర్ చేయను."

    "ఒక్క కిరీటి ఆసరాతో బలవంతురాలినయ్యాననుకుంటూన్నావా?"

    "అతను అడుగు పెట్టక ముందునుంచే నేను శక్తివంతంగానే మిమ్మల్ని ఎదుర్కోగలుగుతున్నానే."

    నవ్వాడు వ్యగ్యంగా "ఏస్ .... ఇప్పుడు కథ క్లయిమాక్స్ కి చేరుకుంటూ౦ది."

    "అవును నీ కథకూడా."

    "హనితా!"

    "అరవకు మిస్టర్ శివరావ్! ఒక్క నాలుగురోజుల వ్యవధి ఇవ్వు __ మీ అందరి కథలకీ అందమైన మిగింపు నిస్తాను."

    "అంతవరకూ వచ్చిందా?"

    "ఎస్ .... " హానిత ఉద్వేగాన్ని నిభాయించుకుంటూ అంది." అంత వరకూ రావడమే కాదు. ఒక వటవృక్షంలాంటి సంస్థకి పట్టిన చీడపురుగు లని పూర్తిగా ఏరిపారేసి నిన్న డాడీ చేయలేని ఓ మంచిపనిని నేను పూర్తీ చేసిన సంతృప్తిని దక్కించుకుంటాను."

    ఆమె లోపలి నడిచింది మరేమీ మాట్లాడే అవకాశమివ్వ కుండా.......

    మరో ప్రతర్ధిని రెచ్చగొట్టిన చివరి క్షణం .....

    సరిగ్గా ఇదే సమయంలో __

    బంగ్లా చెరుకున్న కిరీటి మెయిన్ గేటు దగ్గర ఆగిపోయాడు అప్రతిభుడైనట్టుగా.

    నేలపై నుంచి ఓ సన్నని మూలుగు వినిపించడంలో సమీపించాడు .....

    "వాచ్ మెన్ ఇంటిలోకి దూసుకుపోయిన కిరీటికి గదిలో వస్తువాలన్నీ చిందరవందరంగా పడి ఉండటం కనిపించింది.

    తను లేకపోవడం చూసి ప్రత్యర్ధి దండయాత్ర చేశాడు. ఓ మూల పడి వుంది భ్రీఫ్ కేస్.
   
    నిర్విణ్ణాడయ్యాడు టఫ్ రికార్డ్ లేకపోవడంతో.

                                                                       *    *    *    *   

    ఉదయం ఏడు గంటలు కావస్తూంది.

    కాలింగ్ బెల్ మోగాడంలో బడలికగా కళ్ళు తెరిచాడు కిరీటి. గాయపడిన వాచ్ మెన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్ళి చికిత్స చేయించి తిరిగి బంగళాకి వచ్చేసరికి మూడు గంటలైంది.

    ప్రత్యర్ధులు వచ్చింది మేల్కోటేతో జరిగిన సంబాషణలున్న కేసెట్ కోసమే అని తెలసినా ఫార్మల్ గా అడిగాడు. కాని చీకటిలో తన పైన కలియబడ్డ వ్యక్తులెవరో చెప్పలేకపోయాడు వాచ్ మెన్.

    అసలు జరుగుతున్నా పోరాటం గురించి ఆ కింది స్థాయిదాకా తేలియడం కిరీటికి ఇష్టంలేదు. అందుకే ఆ విషయాన్ని గోప్యంగానే ఉంచమన్నాడు. ఓ నాలుగు రోజులపాటు డ్యూటికి రానక్కర్లేదని చెప్పి ఇంటికి పంపేశాడు. ఈ విషయాన్ని హనితకి సైతం తెలియపరచలేదు.

    తను తీసుకునే కొన్ని నిర్ణయాలకు కావలసిన స్వేచ్చ గురించి ఆమెను రాత్రే అడిగిన కిరీటి ఆమెకు ఫలితాన్నే తెలియచేయాలనుకున్నాడు తప్ప, అడగకుండా ఎదురయ్యే సమస్యల గురించి ఏకరపు పెట్టకూడదని ముందే నిర్ణయించుకున్నాడు.

    ఒడుపుతో వేగం చూపించాల్సిన మరో రోజు మొదలైంది..

    కిరీటి అనుకుంటుండగానే మరో మారు కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీసిన కిరీటి ఎంత కంగారుపడ్డాడు. అంటే, అంతతెల్లవారుజామునే తల్లి వస్తుందని ఊహించలేకపోయాడు.

    అదికూడా కాదు .... తాయారమ్మ వెనక మరో వయసులో ఉన్న అమ్మాయి ఉంది.

    "ఏమిట్రా కిట్టూ, ఆ మొద్దునిద్ర?" ఇల్లంతా కలియచూస్తున్న తాయారమ్మ కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి. "ఎంత బావుందిరా ఇళ్ళు! నీకు పూర్తిగా ఇచ్చేసినట్టేనా? ఇదేక్కడ చోద్యంతా అబ్బీ ......? ఉద్యోగం ఇస్తారని తెలుసుగాని ఇలా ఇళ్ళు కూడా మన పేర్న రాసిస్తారని ఇంతదాకా నాకు తేలేదు సుమీ. బ్రహ్మండంగా  ఉందిరా .... ఒక్క మాటలో చెప్పాలంటే మన తుమ్పల చుట్టూపక్కల గ్రామాల్లో కూడా ఇంత మంచి ఇల్లు చూడలేదంటే నమ్ము."

 Previous Page Next Page