మోహం మడతల మధ్యపడే విధ్యిద్దీపపు కాంతి అయన అందోళనగా మరింతగా స్పష్టం చేస్తుంటే "డాడీ" అంది తండ్రి చేతుల్ని స్పృశిస్తూ.
ఒక మేరుపర్వతంలా లోతు తెలీని మహావార్ణంలా దశాద్బాల తరబడి బ్రతికిన ఒక మహర్షిలాంటి అయన అంపశయ్యమైనా ఉన్న భీష్ముడిలా అనిపిస్తున్నారు. అంతకుమించి ఏదో చెప్పాలని ఆరాటపడుతుంటే "రిలాక్స్ డాడీ" అంది రుద్దమైనా కంఠంతో.
"బే .... బీ" ఆమె చెంపల్ని స్పృశిస్తూ రొప్పుతున్నారాయన.
ఏమనసు పొరల్ని వేరు చేసి ఒక వాస్తవమేదో తెలియజెప్పాలని ప్రయత్నిస్తూ స్మదిగ్ధంతో నలిగిపోతున్న ఆమెకు స్పష్టమౌతూనే వుంది.
"నేను ... నేను తప్పు చేశాను కదూ?"
ఆమె మెదడు పొరల్లోనుంచి ఓ శతఘ్ని దూసుకుపోయింది. ఇదే సరిగ్గా ఇదే వాక్యం అయన డైరీలోని ప్రతి పేజీని ఆక్రమించింది. ఇప్పుడు అక్రోశంలా వెలువడుతున్నదీను......
"యూ నో .... ఐ హేవ్ రియల్లీ మే డేమిమిస్టేక్ ."
"నో డాడీ !" గగుర్పాటుని దుఃఖం డామినేట్ చేస్తుంటే చాలా బలవంతంగా నిగ్రహించుకుంటూ౦ది. "మీరు ... మీరు తప్పు చేయరు .... చేయలేరు డాడీ."
ఎదను ఎరలా కొరుక్కుతింటున్నా బాధ ఆయన్ని వివశుణ్ణి చేస్తుంటే ఇంతకు మించి అవకాశం ఇక రాదన్నట్టు కంపిస్తూ అడిగారు, "డాడీ అంటే నీకు చాలా ఇష్టం కదూ?"
ఒక నీటిబొట్టు ఆమె కనుకొలకుల నుంచి రాలి పడాలనుకుంటూనే ఆగిపోయింది ఎన్నడూ లేనిది డాడీ ఇలా మాట్లాడుతున్నరేమిటి.
"ఐ లవ్ యు సోమచ్ డాడీ!"
"నాకు తెలుసు బేబీ! నేనంటే నీకు ప్రాణం." కొద్దిగా శక్తిని కూడగట్టుకున్నారాయన. "మమ్మీ అంటే?"
దాగలేనమ్మా అన్నట్టు అశ్రు వొక్కటి ఆమె చెంపలపైకి చేరి తళుక్కున మెరిసింది. "జన్మ నిచ్చిన తల్లిగా డాడీ ..... ఐ లవ్ హర్ టూ ..... అయినా ఇప్పుడదంతా......"
"నన్ను మాట్లాడనియ్యి హనితా. ఇది ఈనాటిది కాదమ్మా. రెండు దశాబ్దాలుగా నా మనసును కాష్టంలా మందిస్తున్న ఒక వాస్తవం ....."
హానిత రెప్పవాల్చడం మరచిపోయింది.
"హనీ!" సుదర్శనరావు గారి చెంపలు అదిరిపడుతున్నాయి. "వ్యాపారం కోసం మమకారాన్ని చంపుకున్న నీ తండ్రి నిన్ను ప్రేమగా పెంచాడు. కోట్ల ఆస్తిని ఇచ్చాడేమో కాని వెలకట్టలేని తల్లి ప్రేమను చేజేతులూ దూరం చేశాడంమా. లక్ష్యం కోసం నిన్ను కన్నతల్లిని అలక్ష్యం చేశాను. నా నమ్మకాల కోసం మీ అమ్మని నీకు దూరం చేశాను." ఇప్పుడు సుదర్శన రావుగారి ముఖం పగిలిన మంచు మైదానంలా ఉంది. జీర్ణించుకోలేని తన తప్పిదాన్ని తల వంచుకుని అంగీకరించాలానే ఆవేశం ఆవేదమై వ్యధ అంతరాశాన్ని మోదే లోహా విహంగమై , ఊర్పులు మండుతున్న కర్పూర గురిలై, ఆయన్ని ఏ క్షణం అయినా పగిలే బెలూన్ గా మార్చుతున్నాయి.
"నీ తండ్రి మహర్షి కాడమ్మా .... కట్టుకున్న దాన్ని కిరాతకంగా బయటికి నెత్తిన రాక్షసుడు! నూరేళ్ళు దాంపత్యాన్ని ఏడాదికే కుదించి ఒక చిన్న కారణంతో నీకు తల్లిని దూరం చేశాను, నీ తలపుల్లో తను మాత్రమె మిగాలాలన్న స్వార్ధంతో నీ తల్లి ఫోటో ఆ ఇంట్లో కనిపించకుండా నాశనం చేసి ....."
రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలాన్ని ఒక అతి ముఖ్యమైన నిజం తెలియకుండా గడిపిన హానిత మానసం అగ్ని గుండంగా మారిపోయింది. ఇక్కడ తండ్రిపైన ద్వేషం కలగడంలేదు. పశ్చాత్తాపంతో తన తప్పుని తెలుసుకుని నిజమైన వ్యక్తిత్వాన్ని సిద్ధింపచేసుకున్నాందుకేమో స్థాణువులా అలాగే చూస్తూ వుండిపోయింది.
ఉద్విగ్నత ద్విగుణీకృతమౌతుంటే ఒక అసంపూర్తి గ్రంధంలో జరిగిన సంఘటనకు మూలకారణం చెప్పే అవకాశం లేనట్టు అంతకు మించి మరో బాధ్యత మిగిలినట్లు కంపిస్తూనే అన్నారాయన _ "వద్దమ్మా ఈ వ్యాపార౦ నీకొద్దు. ఈ మానసికమైన సంఘర్షణ నీకు సరిపడదు. నేను .... నే నింకా ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలీదు. నువ్వు పెళ్ళి చేసుకోవాలి నా కళ్ళ ముందే నువ్వు _ అమ్మా హనితా _" హఠాత్తుగా అయన గొంతు ఆర్ద్రమై కళ్ళనించి జలజలా రాలాయి. "నేను ఈ ఒక్క బాధ్యతనీ పూర్తీచేస్తే ..... నీ తల్లి కోల్పోయిన సంసారిక జీవితం నీకైనా దక్కిందన్న సంతృప్తితో నేను చనిపోయతాను బేబీ!"
మాట్లాడలేకపోతున్నాడు. మహాప్రభాజనం పిడికిలిలో నలిగినట్టు గర్జించిన తుఫాను మేఘం ఒక చిన్న గాలి ఆలకి స్థానంభ్రంశం చెందినట్టు గుండెల్ని పట్టుకున్నాడు. మనసు కంపనలు ప్రకంపనలై ఇంకా ఏదో చెప్పి తీరాలన్న ఆరాటంతో పెదవులు అదురుతుంటే బాధతో కళ్ళు చిట్లించాడు.
"డాడీ!" ఒక సన్నని అర్తనాథం . హానిత గొంతునించి.
డాక్టర్లు పరుగెత్తుకు వచ్చారు.
అయిదు నిమిషాల పాటు ఇంచుమించు మృత్యువుతో పోరాడిన డాక్టర్లు చివరికి ఆయన్ని కాపాడగలిగారు.
"సేడేటినేతో నిద్రలోకి జారిన సుదర్శనరావు ఇప్పటికి నెమ్మదించి మరో క్షణంలో పగిలే అగ్ని పర్వతంలా అనిపిస్తుంటే ......
ముందు హనితని పరామర్శించింది డాక్టర్ దినకరరావు.
"లాభం లేదమ్మా ఇలా నువ్వు బెంబేలు పడితే లాభంలేదు. చాలా గట్టి పిల్లవాని నమ్మే న ఆలోచనల్ని దెబ్బతీస్తే అసలు లాభంలేదు."
"కానీ అంకుల్ ....."
ఆత్మీయంగా తల నిమిరాడు. "పిచ్చి పిల్లా మీ డాడీ గట్టి మనిషే __ లేకపోతె స్ట్రోక్ ఇంత హెవీగా వచ్చినా బ్రతగలిగేవాడా? ఎందరి పుణ్యమో మూటగట్టుకున్న మహాత్మతుడు కాబట్టే నిలదొక్కుకున్నాడు."
ఒక స్వప్నంలో కారిడార్ దాకా నడిచింది.
ఇక్కడ చాలా యాదృచ్చకంగానైనా సుదర్శనరావు కూతురికి చెప్పాలేకపోయినా విషయం హానిత తల్లి ఇంకా బ్రతికే ఉందని.
* * * *
హాస్పిటల్ అవరనంలోకి విద్యుద్దీపాలు జీవాన్ని కోల్పోయిన ప్రకృతి ముందుంచిన ప్రమిదల్లా నిస్సహాయంగా వెలుగుతున్నాయి.
స్తంభించిన గాలి ఇంకా కొలిక్కిరాని ఆలోచనల్లా హానిత నుదుట స్వేదాన్ని నింపుతూంది. ఏదో అర్దమయ్యీ కాని సందిగ్ధం ఆమెను దారుణంగా కదిలిస్తూంది. సుమారు రెండు దశాబ్దాల జీవిత కాలంలో ఇంతదాకా తెలియని ఏ రహస్య పుటలో హఠాత్తుగా తెరుచుకున్నాయి. జాని సంపూర్ణంగా చదవలేక పోయింది. అలవాటులేని కన్నీళ్ళు కలల్లో పేరుకుని నీటిపొరలలో నుంచి అలికిన అక్షరాల వెంట ఉద్విగ్నంగా పరుగెడుతుండగానే వారధి పడిపోయింది.
మరో నిముషంలో పశ్చాత్తాపంతో రగిలిపోతున్న డాడీ జరిగిందేమిటో చెప్పేసేవారే. కాని అక్కడే గుండె నిబ్బరం సడలినట్టు ఆగిపోయారు.
అసలేం జరిగింది?
మమ్మీకి డాడీ చేసిన అన్యాయమేంటి?
ఇన్నేళ్ళూ ఘనీభవించిన గతం ఈ క్షణంలోనే వెల్లువలో మనసు సరిహద్దుల్నీ దాటి రావాలని ఎందుకంతగా ప్రయత్నించింది?
చెదురుతున్న అయన మనోనిగ్రహానికి సాక్ష్యంలా అనిపించిన డైరీలోని పేజీలు ఇప్పుడు వరసగా గుర్తు కోస్తున్నాయి. ఏదో రాయాలని రాయలేకపోయిన నిస్సహాయత ..... తను రాసింది తనే చదవలేని పసికందు ఆరాటం ప్రతి పేజీలో.......
ఏదో జరిగిందన్నది ఆమెకి తెలుస్తూనే వుంది. కాని ఏం జరిగిందో పూర్తిగా తెలియదు ..... నిజమే ..... మమ్మీ ఎలా ఉంటుందో తనకు తెలీదు. కనీసం ఒక్క పోటో సైతం ఇంటి ఛాయల్లో కనిపించదు. ఎన్నోసార్లు అడిగింది. ఇప్పుడిప్పుడు గుర్తుకోస్తూంది. అడిగిన ప్రతిసారీ దాటేస్తూనే వచ్చారు.
మమ్మీని అంతగా ద్వేషించడానికి ఏం తప్పు చేసిందని?
ఏనాడూ ఆమె తల్లి విషయంలో ఇంతగా ఆలోచించలేదు. అసలు అలాంటి ఆలోచన రానివ్వనంత ఆప్యాయంగా పెంచారాయన. ప్రకృతతంత పచ్చదనంతో వాన కౌగిట తుంపరల మధ్య నిశ్చితంగా బ్రతికిన తను, ఇదిగో ఇన్నేళ్ళ తరువాత వరద గోదావరిలో పడింది! కొన్ని క్షణాల క్రితం మనసొక అగ్నిగుండమై ఆ కీలాగ్ర భాగంలో కనిపించని ఏ సత్యాన్వేషణ కోసమో దారుణంగా అన్వేషిస్తూంది.
"అయాం సారీ"
అప్పుడు చూసింది ఎదురుగా నిలబడ్డ కిరీతిని . ఎప్పుడోచ్చాదో ఆ సమయంలో ఓ దారపు నందించగల ఒకే ఒక వ్యక్తిలా కనిపించాడు "ఐ థింక్ హీ ఈజ్ అల్ రైట్ నో ."
డాక్టరు ప్రస్తుతానికి చెప్పింది అదే కావడంతో నెమ్మదిగా తల పకించింది నేల చూపులు చూస్తూనే .
సమీపంలో ఓ బెంచీపైన కూర్చున్నాడు.
ఏ కొండకనుమల్లో నుంచో నిశ్సబ్దంగా ప్రవహించే నదిలా కొన్ని గంటల క్రితం దాకా అనిపించిన ఆమె ఇప్పుడు ఆవిరైపోతున్న అశ్రునాదంలా కనిపిస్తూంది.
ఇద్దరి మధ్యా నిశ్శబ్దం చాలాసేపటి దాకా.
"ఊహించగలను మిస్ హనితా! ఏ సమస్యనైనా ఎంతో నిబ్బరంగా ఆలోచించగల మీరు ఇప్పుడూ ధైర్యాన్ని కోల్పోకూడదనే ప్రయత్నిస్తున్నారు. కాని సాధ్యం కావడం లేదు..... కదూ?" తదేకంగా ఆమెనే చూస్తూ అన్నాడు "జీవితంలో పరిష్కారం కాని ఇబ్బందులు కొన్నుంటాయి" వాటిని చూడగాలమే తప్ప ఏమీ చేయలేం వాటి గురించి అలాగే ఆలోచించాలి తప్ప ఆ సమస్యలో ఒక భాగంగా మారి నిబ్బరాన్ని కోల్పోకూడదు. ఇది మీకు తెలీని విషయం కాకపోవచ్చు _ కాని ఎందుకు చెబుటున్నానూ అంటే బాధ ఆలోచించగల మనసుని ఒడిస్తుంది. మనిషిని బాధలో ఓ భాగంగా మార్చుతుంది." ఓ క్షణం అగేడు నిట్టూర్పోటూ. "మీ డాడీ అనారిగ్యం గురించి మీకు తెలుసు. అది తెలిశాక ఒక యజ్ఞానికి సిద్దపడ్డారు. ఇస్ది కీలకమైన ఓ సంధికాలం ఇక్కడ మీరు ధైర్యాన్ని కోల్పోతే ఒకనాడు మీరన్నారే మీ సంస్థతో వేళ కుటుంబాళ భవిష్యత్తు ముడిపడి వుందని _ ఆ లక్ష్యానికి విఘాత మేర్పడుతుంది."
ఒక మనిషి సహృదయంతో అందించే ఉపశమనానికి ఇంత ప్రభావం వుంటుందని ఇప్పుడిప్పుడే ఆమెకి బోధపడుతూంది.