"శివరావు చాలా టెన్షన్ లో ఉన్నట్టున్నాడు."
నిజానికి టెన్షన్ పెరుగుతున్నది కిరీటి కి. ప్రత్యర్ధి శక్తిని అంచనా వేసే అవకాశం లేకుండా తొందరపడి వలాయ్మ్లోకి వచ్చాడు.
"ఎస్సర్. నిజంగా టెన్షన్. ఎందుకంటే మిస్ హనిత కొద్దిగా అనుమానించినట్లు౦ది."
"ఏమిటి?"
"అదే గత మూడేళ్లుగా మా ప్యాక్టరీ కొటేషన్ వివరాలు కొద్దిగా నవ్వినా మేల్కొంటే __ "అవును ... సహజమేగా " అన్నాడు _ చాలా అసహజంగా కళ్ళద్దాలతో బట్టతలని గోక్కుంటూ.
"వెల్ .... ఈ రాత్రికి శివరవుతో ఎంత ఆలస్యమయినా నేను మాట్లాడతాను గాని ఆ కొటేషన్ కాఫీ ఇవ్వండి." భ్రీఫ్ కేస్ తెరచిన కిరీటి ఇంతసేపూ ఆపరేట్ అవుతున్న టఫ్ రికార్డర్ బటన్ని ఆఫ్ చేశాడు. రహస్యంగా. వెంటనే కంపెనీ లెటర్ హెడ్ పై తమ మానిఫ్ లేట్ చేసిన ఓ కాగితాన్ని అందించాడు.
మరో నిముషం దాటితే ఒక ముఖ్యమైన చర్చని రికార్డ్ చేసిన కిరీటి ఆ భవంతి నుంచి బయట పడేవాడే.
సరిగ్గా అప్పుడు ఫోన్ రింగయింది.
"మేల్కోటే హియర్ ." రిసీవర్ అందుకున్న మేల్కోటే చెప్పుకుపోతున్నాడు. ఎస్ మిస్టర్ శివరావ్ .... ఇందాక మీకోసం ఫోన్ చేస్తే లేరని తెలిసింది. రాజేంద్ర పంపిన సంపత్ ఇప్పుడు నాముందే......"
ఆ తరువాత అటువేపు నుంచి శివరావు ఎం చెప్పి ఉంచాడో గ్రహించడానికి కిరీటికి అట్టే టైమ్ పట్టలేదు.
అయిపోయింది - తను వెసిన ఎత్తులో గెలుపుకి చాలా సమీపంలో వాస్తవం బయటపడిపోయింది.
అప్పటికే మోహం వివర్నమైన మేల్కోటే ఉద్వేగంగా పైకి లేచాడు __"యూ డాం పూల్! "
స్వింగ్ డోర్ దాటి భ్రీఫ్ కేస్ తో బాటు బయటకి నడిచిన కిరీటి ద్వారాన్ని చేరుతూ చూశాడు మార్గానికి అడ్డంగా నిలబడ్డ వ్యక్తుల్ని ........
ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఇలామ్టి గాంగుని మెయిన్ టైన్ చేస్తాడని కిరీటి అంతదాకా ఊహించినట్లు చేతుల్లో ఇనుప ఊచలతో కూరంగా చూస్తున్నారు.
కిరీటికి బోధపడిపోయింది తనెలాంటి ప్రమాదంలో చిక్కుకున్నదీ.
"టెర్ హిం ఇంటూ పీసెస్ ..... వీణ్ణి ముక్కలు చేసి సముద్రంలో విసేరేయండి" రౌద్రంగా అరిచాడు మేల్కోటే!
అలాంటి అనుజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నట్లు ఆరుగురు వ్యక్తులా ముందుకు కదిలారు.
ఆ గదిలో గాలి గడ్డకట్టుకుపోయింది.
కిరీటి టెన్షన్ గా చూస్తున్నాడు.
"మిస్టర్ మేల్కొంటే!"
కిరీటి కంఠంలో ఇప్పుడు అలజడి లేదు. ఎలాంటి ప్రమాదన్నైనా ఎదుర్కోడానికి సిద్దపడిన వ్యక్తిలోని నిర్లీప్తత మాత్రమె ధ్వనించింది . మీ వాళ్ళను ఇలా పురమాయించేముందుఒక్కమాట!"
ఇంతకు తెగించినవాడు ఇంకేదన్నా పథకంతో తనను తాను రక్షించుకోవాలని ప్రయత్నించకపోడూ అన్నది మేల్కోటేకి తెలియని విషయం కాదు.
అప్పటికే సాయుధలయినవ్యక్తులు కిరీటికి చాలా దగ్గరగా వచ్చేశారు.
"ఇంత పెద్ద పారిశ్రామికవేత్త వయ్యుండి ఒక చిన్న ఆలోచన లేని నిన్ను చూస్తుంటే జాలేస్తూంది. మిస్టర్ మేల్కోటే! ఇప్పుడు నేను చెబుతున్నది ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన నేను కొందరు పోలీసుల్ని బయట చీకటిలో నిలబెట్టాననీ కాదు, పది నిముషాల్లో నేను బయటకు రాకపోతే నా రక్షంకోసం వాళ్ళని లోనికి రమ్మని ముందే చెప్పిన విషయమూ కాదు ...."
నిలువునా ప్రాణాలు తీసే సమర్దుల్లా ఉన్న ఆరుగురూ సడెన్ గా ఆగి మేల్కొంటే వేపు చూశారు.
"అసలు నేను నీకు ప్రత్యర్ధినీ కాదు. నువ్వు నాకు శత్రువుని అంత కన్నా కాదు!" కిరీటి గొంతులో తొణకని ఆత్మస్థైర్యం. "ఇప్పుడు నీ ముఠా నన్ను చంపి పతరేసినా ప్రయైజనం ఏమిటి? ఇందాక రాజేంద్ర గొంతులో నేను నీతో మాట్లాడేక తెలుసుకున్న ప్రతి విషయమూ మిస్ హనితకి చెప్పాను. సో .... రేపు పంపబోయే కోటేషన్ లోబోర్డు మెంబర్స్ కిక జోక్యం వుండడు ..... స్వయంగా తానె అంతా నిర్వహిస్తుంది. అంటే __ మూడేళ్లుగా నీకూ, శివరావుకి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ ఈ రోజుతో ఆగిపోతుంది. అప్పుడు ఈ క్షణంలో ణను హత్యచేసిన ఓ నేరాన్ని మూటగట్టుకోవడమే తప్ప నువ్వు సాధించే దేముంది?"
ఒకటి కాదు, రెండు కాదు .... నాలుగున్నర నిముషాల పాటు ఆలోచిస్తూ వుండిపోయాడు. మేల్కొంటే.
కిరీటి తర్కం నచ్చింది. నిజమే! అక్కడ శివరావు బలహీనుడయిపోయాడు. ఇక తనకీ ఏ లాభమూలేని స్థితిలో , పైగా బయట పోలీసులు ఎదురుచూస్తున్న తరుణంలో, చేతికి మట్టి అంటించుకోవడం అవివేకమే.
"నీ తార్కిక జ్ఞానాన్ని అభినందిస్తున్నాను మిస్టర్ కిరీటి! యూ ఆర్ దైనిమిక్ ఎగ్జిక్యూటివ్ .... నౌ" తోడేలులా నవ్వాడు. "నీ భ్రీఫ్ కేసులో రికార్డర్ లాంటిది ఉంటే ఆదిలా ఇచ్చేయ్ ...."
"సారీ మిస్టర్ మేల్కొంటే! ఫ్రీఫ్ కేస్ లో రికార్డర్ ఉందని తెల్సుకున్న నిన్నునేను అభినందిస్తున్నాను కాని ఒక సంస్థ భవిష్యత్తుకు సంబంధించిన గట్టిగా అన్నాడు.
"దెన్ ఓకే" కొద్దిగా నేలపైకి వంగాడు భ్రీఫ్ కేస్ తెరవరాదనికన్నట్ట్లుగా . సరిగ్గా యిక్కడే కిరీటిని ప్రత్యర్దులుతక్కువగా అంచనా వేసింది.
కిరీటి సరెండర్ అయ్యాడనుకున్నారే తప్ప ఊహించని వేగంతో పోరాటాన్ని ఈ క్షణంనుంచే ప్రారంభిస్తాడనుకోలేకపోయారు.
అంతదాకా రిలాక్సయిన గాంగ్ లోని ఓ వ్యక్తి గాలోలోకి లేచిన భ్రీఫ్ కేసు తాకిడికి దబ్బున నేలపైన పడ్డాడు.
ఒక లిప్తపాటు అజాగ్రత్తగా ఉంటే ఇనుపచువ్వలు కిరీటి పొట్టలోకి డిగిపోయేవే! ఒడుపుగా పక్కకి జరిగి భ్రీఫ్ కేస్ ను కవచంలా అడ్డం పెట్టాడు.
అక్కడ కొన్ని నిముషాలపాటు అనూహ్యంగా పోరాటం జరిగింది.
మేల్కొంటే బిత్తరపోయి చూస్తుండగానే కిరీటి తప్పించుకున్నాడు తప్పనిసరి పరిస్థితి కావడంతో భుజబలాన్ని ఉపయోగించాల్సి వచ్చిన కిరీటి చీకటిలోకి అడుగు పెట్టాకగాని తెలీలేదు __ మోచేతినుంచి రక్తం ధార కారుతున్న విషయం.
చర్మం నాలుగు అంగుళాల మేర చీలిపోయింది.
బయట పోలీసులు అండగా ఉన్నారని మభ్య పెట్టినందుకేమోగాంగ్ యిప్పుడు వెంటాడటంలేదు. నొప్పిక్రమంగా భుజందాకాపాకి ఎడమ చేతిని మెలిపెడుతుంటే రోడ్డుపైన ఆ ఆటోని తీసుకుని అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్శింగ్ హొమ్ ని చేరుకున్నాడు. ఏ స్టిచేస్ పడ్డాయి.
దీన్నో మెడికో లీగల్ కేసుగా మార్చి పోలీసులదాకా వెళ్ళడం ఇష్టంలేదు. అందుకే ఓ ఎస్కిడెంట్ గా తెలియజెప్పి నుంచి బయట పడ్డాడు.
అప్పటికే రాత్రి పదిన్నర కావస్తూండటంతో హానిత వచ్చి ఉంటుందని హడావిడిగా క్వర్దర్ గా చేరుకున్నాడు గాని అలికిడి లేదు.
ముందు హాల్లో రిలక్సయిన కిరీటికేదో చెప్పాలని వచ్చిన వాచ్ మెన్ పెదవి విప్పబోతూ రక్తం మరకలున్న షర్టుతో కనిపించిన కిరీటిని చూస్తూ క్షణం పాటు మాట్లాడలేకపోయాడు.
"మేనేజింగ్ డైరెక్టర్ సాబ్ ని హాస్పిటల్ లో అడ్మిట్ చేశారట సర్! గంట క్రితమే అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు.
ఆ మాట వింటూనే ఉలికిపాటుగా లేచిన కిరీటి యిక ఆలస్యం చేయలేదు. ఆకలిమాట మరచిపోయాడు. షర్టు మార్చుకుని వెంటనే బయలు దేరాడు ఆవరణలో ఉన్న ప్యాక్టరీ కారులో.
ఈ స్థితిలో జరిగింది హనితకి తెలియడం ఇష్టంలేదు. అందుకే బెండేడ్ కనిపించకుండా పుల్ హండ్స్ షర్ట్ వేసుకున్నాడు.
* * * *
హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోని సుదర్శనరావు గారి కళ్ళనుంచి ఒక్కో నీటిబొట్టూ నిస్సహాయంగా కారుతూంది వజ్రపంజరంలో దాచిన తులసి తీర్ధంలా .
సమీపంలో బెడ్ పైన కూర్చుని యింకా నిబ్బరాన్నే ప్రదర్శిస్తున్నట్టున్న హానిత నేత్రాలు నిజానికి ఏ క్షణంలో అయినా నీటికుండలయ్యేట్టున్నాయి. రెండు గంటలక్రితం డైనింగ్ టేబుల్ దగ్గరే స్ట్రోక్ వచ్చి నేల కూలిపోయిన డాడీ యిక తనకు దక్కడేమో అనుకుంది.
కనుచూపు మేరలో గమ్యం కానరాని తన యాత్రకి ఎలాంటి విఘాత మేర్పడుతుందో అని ఎంత అలజడి చెందిందని? ఇప్పుడు అయన స్పృహలోకి వచ్చేసరికి కొద్దిగా మనసు తేలికపడింది.
పూర్తిగా టేస్ట్ చేశాక అయన పరిస్థితి ఏ క్షణంలో అయినా వగిలే గాజు విగ్రంహంలా ఉందని డాక్టర్స్ చెప్పిన విషయం ఆమె మనస్థయిర్యాన్ని ఇంకా బలహీనపరుస్తూనే వుంది.