"అంతా ఫైనలైజైపోయిందా? మరేంలేదు . ఉన్న టైం మూడు రోజులేగా?"
కిరీటి ఫలభాగం పైన స్వేదం ముత్యాల్లా పేరుకుపోతూంది . దిఫిన్స్ వింగ్ కి పంపే కొటేషన్స్ మరో మూడు రోజుల్లో పంపుతారని ఇందాక మొనీ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది ఇప్పుడు మేల్కోటే ఆ వివరాలు తెలుసుకునే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాడు.
"ఆఫ్ కోర్స్ " చాలా అప్రయత్నంగా చర్చ కొనసాగిస్తున్నాడు కిరీటి. "నేను ఫోన్ చేసిండి అందుకే నిజానికి తిమున్నా ఈ రోజే జె. జి. ఎం. అడుగుపెట్టడుగా. అందుకే అతని దృష్టికి రాకముందే అంతా సిద్దం చేయాలని ఉదయమే పూర్తీచేశాం.
"గుడ్" మేల్కొంటే గొంతులో రిలేఫ్ వ్యక్తమైంది. "మరి ఎప్పుడు అందచేస్తారు? అదే డిజైన్స్ మోడిఫికేషన్స్ కూడా."
పూర్తిగా బోధపడింది కిరీటికి.
ఇక్కడి వ్యక్తులు రహస్యంగా పంపే కొటేషన్ లోని ధరల వివరాలు ముందే ప్రత్యర్ధికి అందచేస్తున్నారు. ఆ విధంగా అతను కొంత ధరణి తగ్గించి టెండరు పెట్టె అవకాశాన్ని కలగజేసే సంస్థకి వెన్నుపోటు పోడుస్తున్నారు. ఇంతవరకూ రెట్సు విషయమే అనుకుంటే ఇప్పుడు మేల్కొంటే డిజైన్ మార్పుల గురించీ అడుగుతున్నాడు.
అంటే .... యంత్రాల నాణ్యతకు సంబంధించి వాటిని ఖరీదు చేసే కస్టమర్ కోరిన 'ఎక్యురీసీన్' విషయంలో మార్పు చేసే డిజైన్ డాక్యుమెంట్స్ కూడా రహస్యంగా ప్రత్యర్ధికి తరలిస్తున్నారు.
మెషిన్ డిజైన్స్ కోసం లక్షలు ఖర్చు చేసే సాకేత మెషిన్ టూల్స్ తన శ్రమని కొందరు స్వార్ధపరుల వంచనతో ఫ్యాక్టరీ సరిహద్దులను దాటి ఇలా దోపిడీ అవితూంది.
వచ్చియన్ తొలి రోజే అతి ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడు కిరీటి. ఒకవేళ చర్చను ఇక్కడే ముగిస్తే మూడు రోజుల్లో పంపే కొటేషన్ విషయంలో ఇక ఎలాంటి అక్రమమూ జరగకుండా కాపాడుకునేవాడు.
అదికాదు కిరీటి ఆ క్షణంలో ఆలోచిస్తున్నది. రాజేంద్రకి వెనుక ఉన్న ఆ 'బాస్' ఎవరో తెల్సుకోగాలగాలి. కనిపించని ఆ పేరు పురుగు ఎడ్రసు తెలుసుకుని వువరాలతో సహా ఆ విషయాని హనితకి తెలియ చేయాలి.
"మిస్టర్ మేల్కోటే .... డిజైన్ మోడిఫ్ కేషన్స్ తాలూకు డాక్యుమెంట్స్ బాస్ మీకు అందిస్తానన్నారే" ఆ 'బాస్' ఎవరో తెలుసుకోవాలని మరో ప్రయత్నం చేశాడు.
"అదేమిటీ ..... డిజైన్స్ తెచ్చిచ్చేది మీరుగా ?"
ఉలిక్కిపడ్డాడు కిరీటి. అనుకోకుండా చిన్న పొరపాటు దొర్లిపోయినది. "ఆఫ్కోర్స్! తెచ్చిచ్చేది నేనే అనుకోండి. ప్రస్తుతం ఫ్యాక్టరీ వ్యవహారాలు మీకు తెలుసుగా? హానిత చాలా తిరస్ ని పెట్టింది."
"అవును .... చెప్పాడు మీ బాస్"
"కాబట్టే ఫ్యాక్టరీ సెక్యూరిటీ విభాగం వాళ్ళు ఈ మధ్య అఫీసర్లనీ చెక్ చేస్తోంటే ఆ డాక్యుమెంట్స్ బాస్ కి నేనే అందించాను. బోర్డు మెంబర్స్ కి సెక్యూరిటీ చెక్ ఉండదుగా."
"ఐ.సీ ...కాని ఇంతవరకూ నాకు అందించలేదు . నౌ .... వాటేబౌట్ కొటేషన్ డిటైల్స్? ఎప్పటిలా బాస్ తో మీరూ వచ్చి ......
చెప్పానుగా మిస్టర్ మేల్కొంటే .... నా మీద విజిలెన్స్ ఉధృతమైంది ..... నేను రాలేను."
"దెన్?"
" నా తరుపున ఎవరూ అనుమానించని మరో వ్యక్తి ని పంపుతాను"
"కొటేషన్ జెరాక్స్ కాసీలతోనా?"
"ఎస్ .... _ ఆఫ్ కోర్స్ ..... మనకి చాలా నమ్మకస్థుడు పేరు సంపత్"
"గూడ్. రాత్రి ఎనిమిది గంటలకి వెయిట్ చేస్తుంటాను . అక్కడే మనం రెగ్యులర్ గా కలిసేచోటే."
అవకాశం జారిపోతున్నట్టనిపించింది కిరీటికి . ఇంతదాకా తెలవిగా చర్చని కొనసాగించిన తను ఆ 'కాహోట' తెలీని స్థితిలో మరో ముఖ్యమైన సన్నీవేశంలోకి చొచ్చుకుపోయే చాన్స్ కోల్పోతున్నాడు.
సెకండ్లు టెన్షన్ గా గడుస్తున్నాయి.
మరో అరసేకండు గడిస్తే మేల్కొంటే చర్చ ముగిసినట్టు ఫోన్ క్రేడిల్ చేసేవాడే ......
అప్పుడు ప్లాష్ లా ఓ ఆలోచన మెరిసిన కిరీటి వెంటనే అన్నాడు __ "మిస్టర్ మేల్కొంటే! పరిస్థితులు చాలా ఇర్రేగ్యులర్ గా ఉన్నాయి. కాబట్టి మనం రెగ్యులర్ గా కలిసేచోటు మార్చడం బెటరేమో?"
"దట్స్ రైట్ " వెంటనే జవాబు వినిపించింది "సో .... మీవాణ్ణి సరిగ్గా రాత్రి ఎనిమది గంటలకి పంపు" చెప్పాడు ఎక్కడికి పంపాల్సింది
ఫోన్ క్రేడిల్ చేసిన కిరీటి రిస్ట్ వాచ్ వేపు చూసుకున్నాడు.
టైం అయిదూ నలభై కావస్తుంది.
సరిగ్గా ఇదే సమయానికి మేల్కొంటే డిజైన్స్ డాక్యుమెంట్స్ తీసుకురమ్మని అడగటానికి 'బాస్' కి ఫోన్ చేస్తున్నాడు.
ఆ విషయాన్ని ఊహించలేని కిరీటి పోరాటంలో రెండో ఘట్టానికి సమయత్తమౌతున్నట్టు పైకి లేచాడు.
ఎందుకు రాత్రి పది గంటల తరువాత హానిత వస్తానన్నదీ కిరీటి కి తెలీదు. కాని ఆ రాక రహస్య సమాలోచనలకే అన్న విషయానికే తనూ ఓ రహస్యాన్ని చేధించి హనితకి సహకరించబోతున్నాడు.
మరో అరగంటలో తనకి 'ఎలాట్' అయిన బంగాళాని ఫ్యాకత్రీగా కారులో చేరుకున్న కిరీటి సనం చేశాక సనం చేశాక అ బేడ్ రూమ్ వేణీషియన్ బ్లయిండ్స్ తెరచి బయటకి చూశాడు.
అక్కడ మసక వెలుతురులో .....
ఉరి బిగుసుకున్న కంఠం చెప్పలేని నిజంలా సముద్ర గుక్కపేడుతూంది.
* * * *
రాత్రి ఎనిమిద గంటల వేళ.
ప్రళయాక్షరాల కెరటాలు ఘనీభవించినట్టు చీకటి అలుముకున్న యారాడ ప్రాంతంలో టాక్సీ దిగిన కిరీటి ఫేర్ చెల్లించి రెండు నిమిషాల పాటు చుట్టూ కలియచూశాడు.
దూరంగా డాల్ఫిన్ నోస్ పైన లైట్ హౌస్ కాంతి నిస్సహాయంగా పహారా కాస్తున్నట్టు వెలుగుల్ని చిమ్ముతూం\ది.
సుమారు రెండు పర్లాంగుల దూరంలో ఉన్న షిఫ్ యార్డ్ కాలనీ విధ్యుద్దీపాల కాంతిలో వెండి రావ్వాల్ని అద్దుకున్న ఖరీదైన కళేబరంలా ఉంది.
మేల్కోటే చెప్పిన సూచనల ప్రకారం నిర్మన్యుష్యంగా ఉన్న కాలి బాట మీద కుడివేపుగా నడిచి అయిదు నిముషాల్లో ఓ పెద్ద భవంతిని చేరుకున్నాడు చుట్టూ ఎత్తయిన ప్రహరీ గోడతో మేల్కొంటే గెస్ట్ హౌస్ అతని స్థాయికి తగ్గట్టు నిశీధిలో మెరిసే వజ్రకిరీటంలా ఉంది.
మెయిన్ గెట్ దగ్గర సెక్యూరిటీ వాచ్ మెన్ ఆపడంతో వెంటనే ఓ స్లిఫ్ రాసి పంపాడు.
ఆలస్యం కాలేదు. మూడు నిముషాల వ్యవధిలో లోనికి రమ్మన్న వార్త అందింది.
యారాడ కొండని అనుకుని వున్న ఆ గెస్ట్ హౌస్ లోకి అడుగు పేడుతున్న కిరీటి ఆవరణలోని పూలమొక్కల్ని దాటుతూ చూశాడు. చీకటిలో గోడకి అనుకుని విగ్రహంలా నిలబడి ఉన్నారు కొందరు వ్యక్తులు.
హఠాత్తుగా కాళ్ళు తడబడ్డాయి. అది కూడ కాదు. ఒక మృత్యుగహ్వరంలోకి అడగు పెడుతున్నట్టు మనసు ఉద్విగనమావుతూంది అదేదో సరిగ్గా వ్యక్తికరించలేని ఇంట్యూషన్ ఆ భావం నుంచి తేరుకోవడానికి అరనిముషం పట్టింది. అంతసేపూ నడక వేగాన్ని తగ్గించిన కిరీటి భ్రీఫ్ కేస్ ని కుడిచేతిలోకి మార్చుకుని ఇప్పుడు నిబ్బరంగా హాలులోకి వచ్చాడు.
ఆజానుబహుడైన ఓ వ్యక్తి ముందుకొచ్చి నిశితంగా కిరీతినే చూస్తూ ఎడమవైపు గదిని చూపించాడు.
క్షణంలో వెయ్యోవంతు ఇప్పుడు తానో స్త్రీయలిస్ట్ గెస్ హౌస్ కాకా ఓ తెలుగు సినిమా విలన్ దెన్ లో అడుగు పెట్టినట్టు ఫీలయ్యాడు. ఆ భావాన్ని కనపడనివ్వకుండా మోహం పైన అర్జెంటుగా నువ్వు పులుముకుని "థాంక్యూ అంటూ గడివేపు నడిచాడు.
స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలి వచ్చిన కిరీటి విశాలమైన టేబు ల్ కి అవలివేపు ఉన్న వ్యక్తిని మేల్కోటేగా గుర్తించినట్టు విష్ చేసి ఆయనని అడక్కుండానే అభిముఖంగా కూర్చున్నాడు.
సుమారు యాభై ఏళ్ళ వయసులో మెరుస్తున్న బట్టతలతో అక్కడ కూర్చున్న మేల్కొంటే నవ్వనన్ని ఒత్తేసుకుని ఈ భూమ్మీదకి అడుగు పేట్టి నట్టు చాలా సీరియస్ గా ఉన్నాడు.
"అయామ్ సంపత్! రాజేంద్రగారు పంపారు"
"ఐ. సీ " తల పకించాడు. "కొటేషన్ డాక్యుమెంట్ తెచ్చారా?"
తెచ్చినట్టు కిరీటి కూడా తల పంకిస్తూ భ్రీఫ్ కేస్ టేబల్ పైన ఉంచాడు.
ఇక ఓ క్షణంలో భ్రీఫ్ కేస్ తెరిచేవాడే.
"మీ బాస్ కి ఫోన్ చేశాను"
పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు కిరీటి "అదే మోడిపై చేసిన డిజైన్స్ గురించి"
కిరీటి గొంతు తడారిపోయింది ఆ 'బాస్' ఎవడన్నాగాని ఇప్పుడు యిదంతా నాటకమని తెలియచెప్పి ఉంటాడు. బోధపడింది ఇంటిదాక ఇంట్యూషన్ కి అర్ధమేమిటో .
"ఊళ్ళో లేడా?"
"ఎవరు?" త్రోటు పడుతున్నట్లుగా అడిగాడు కిరీటి.
"అదే .... శివరావు ఇందాక ఫోన్ చేస్తే లేదని తెలిసింది."
అప్పటికి గుండె తేలికపడింది. కొన్ని గంటలుగా ఆ 'బాస్' శివరావుని తెలీక కేవలం ఆ పేరు తెలుసుకోవడానికి యింట ప్రయత్నమూ చేసిన కిరీటి యిప్పుడెంత స్థిమితపడ్డాడూ అంటే అదృష్టవశాత్తూ శివరావు ఫోన్ లో దొరక్క ఒక ప్రమాదం నుంచి తనను తప్పించిన వాడయ్యాడు.
"మరేం . ఇందాక రాజేంద్రగారూ ట్రై చేశారు సార్. అప్పటికీ చెప్పాను కూడా. నాకూ యిది తొలిసారి __ అదే మిమ్మల్ని కలియడం శివరావుగారితోనే కలసి వెళితేనే బాగుంటుందీ అన్నాను. కాని వీలుపడక పైగా కొటేషన్ సబ్మిట్ చేయడానికి మీకూ టైమ్ సరిపోదని నాతో పంపించారు ...." అసలు మేల్కొంటే చూపులే అంతో లేక అనవసరంగా తాను అనుమానిస్తున్నాడో తెలీనట్టు మేల్కొంటే రెప్పలర్పకుండా కిరీటినే చూస్తూ తల పకించాడు.