"నిజానికి పూర్ఫ్వం జనరల్ మేనేజర్ కూడా మీకు ఎదురు నిలబడలేకపోయారు."
"కదా!"
"ఎస్సర్!"
"అలాంటప్పుడు ఇందాక నువ్వు కూసినదానికి నీకు నేనేం శిక్ష విధించాలి?"
అసలు ఏం కూసిందీ జ్ఞప్తికి రకపోవడంతో ఈసారి బయటకే ఏడ్చేసింది.
"ఏడవకు"
"సారీ సర్"
"అలా అంటే చాలదు" అరక్షణం తరువాత అన్నాడు. "పెనాల్టీ చెల్లించుకో!"
ఎలాగో ఆమెకి అర్ధంకాలేదు.
"ఒక్కసారి"
నొసలు చిట్లించి "పార్దన్ మి సర్" అంది త్రోటుపడుతూ.
"ఒక్కసారి "
"ఏ ... ఏమిటి?"
"అదే .... ట్రాన్సిస్టర్ ట్యూని౦గ్ "
"సర్ .... యూ ఆర్ ...." ఇంకో క్షణం ఆలస్యమయితే ఆమె బావురుమని బిగ్గరగా ఏడ్చేసేదే.
సరిగ్గా అప్పుడు వినిపించింది కిరీటి కంఠం.
గదిలో కొచ్చాడేమో అనుకుంది.
ఈసారి బోధపడింది కిరీటి గొంతు వినిపిస్తున్నది రిసీవర్ లో నుంచే నని .... ఇంతసేపూ రాజేంద్ర మాట్లాడాడే?
గగుర్పాటుని అదిమిపెడుతూ మరో రెండు సెకండ్లలో కిరీటి ఛాంబర్ ని చేరుకుంది.
నవ్వుకున్నాడు కిరీటి __ "బెదిరిపోయావు కదూ?"
మోనీకి అప్పటికి అర్దమయింది _ ఇంతసేపూ రాజేంద్ర కంఠాన్ని అనుసరించింది కిరీటి అని. వెంటనే యూనివర్సీటి ఫంక్షన్ లో మిమిక్రీ చేసిన అప్పటికిరీటి టేలెంటూ గుర్తుకొచ్చింది.
"యూ _ నాటీ" మనసారా నవ్వేస్తూ "ఎంత షేకైపోయానో తెల్సా?"
అతని కభిముఖంగా కూర్చుంది కళ్ళు తుడుచుకుంటూ.
"ఈ మాత్రం దానికే ఏడ్చేశావా?"
"నీకు తెలీదు కిరీటి ... అసలు రాజేంద్ర ...."
"ఏమిటో ఇప్పటికి పూర్తిగా తెలిసిపోయింది మోనీ!"
ఇందాక ఫోన్ లో అతడి ప్రాచుర్యం గురించి ఒక్కొక్కటి విడమరచి చెప్పింది అదే .... కిరీటి తెలుసుకావాలనుకున్న ముఖ్యవిషయం కూడా. అంతకుమించి మిమిక్రీ లాంటి కళలో ఇంకా తాను ప్రావీణ్యాన్ని కోల్పోలేదని బోధపడిపోయింది. రాజేంద్ర తో మధ్యాహ్నం మాట్లాడింది ఒక్కసారే . అప్పుడే క్షుణ్ణంగా స్టడీ చేశాడు.
"చూడు మోనీ..... ఇప్పుడు నిన్ను పిలిచింది ఎందుకో తెలుసా?"
'అందుకు' కాదని ఇందాకే తెలియడంతో ఇప్పుడు ఎందుకు పిపించిందీ అర్ధంకానట్టు తలను అడ్డంగా ఊపింది.
"ఈ ఫ్యాక్టరీకే కాదు, సాకేత అండ్ కంపెనీ బిజినెస్ గ్రూఫ్ లోని సుమారు పడి ఫ్యాక్టరీలకి నేను టాఫ్ ఎగ్జిక్యూటివ్ ని. అవునా?"
తలూపింది బుద్ధిమంతురాలిలాగా.
"సో .... ఒకవేళ నా విషయంలోగానీ, నాతో జరిగిన చర్చ సంగతి గానీ ఎవరన్నా నీ దగ్గర కదిలించినా కంగారు పడకూడదు. కారణం నేను నీ వెనుక వుంటాను .... కాబట్టి ....."
ఆ వెనుక ఉండటమే తన కిష్టంకాని విషయమని స్పురణకి రావడంతో నిస్రాణగా తలూపింది.
"వెల్ .... ఇక నువ్వు వెళ్ళొచ్చు" అన్నాడు కిరేటి.
ఆది బాధ్యత ఉన్న ఆ ఉద్యోగం మూలంగా ఏర్పడిన దర్బమావులేక వయసు సహజంగా తెచ్చిన మార్పో ఆమె వూహకి అందడం లేదు.
మారు మాట్లాడకుండా పైకి లేచిన మోనీ ద్వారం నడిచి హఠాత్తుగా ఆగి వెనక్కీ తిరిగింది.
"ఏమిటి?" దేనికోసం సంకోచిస్తుందో తెలిసినట్టు అడిగాడు.
"చిన్న క్లారిఫి కేషన్!"
"అడుగు"
"సర్!" హఠాత్తుగా ఆమె సంభోదనలో మార్పు వచ్చింది..... "ముందు మీరు స్నేహితులే అయినా బాస్ కాబట్టి ఇక 'సర్' అంటూనే ఎడ్రస్ చేస్తాను."
"గూడ్ .... ఇందులో క్లారిఫికేషన్ ముంది?"
"అది కాదు "
"మరి?"
"మనం చివరగా కలుసుకున్నది మూడేళ్ళ క్రితం."
"ఎస్! ఆఫ్ కోర్స్ ! ఆ తరువాత ఎంబియ్యే చేస్తూ హాస్టల్ కి వెళ్ళి పోయాను. సో! మనం కలియలేదు."
"కానీ నేను కళలో చాలా తరుచుగా మిమ్మల్ని కలిసేదాన్ని ...." 'కలిసే' అన్న పదాన్ని ఒత్తిపలుకుతూ అంది. "ఎందుకంటే దానికి మీ పర్మిషన్ అక్కర్లేదు కాబట్టి!"
"సరే" ఇందంతా ఏం ఆశించి మాట్లాడుతున్నది వెంటనే తోచనే లేదు. "నీ సొంత కలల్లోకి, సొంత విషయాల్లోకి జోక్యం చేసుకోనని యిప్పుడూ హామీ యిస్తున్నాను."
"నాక్కావల్సింది హామీ కాదు."
"మరి?"
"ఒక నిజం ... నేకెడ్ ట్రూత్ "
"నేకెడ్ నేస్ కి సంబంధించిన ట్రూత్ అయితే నాకు తెలీదు" చాలా సిన్సియర్ గా జవాబిచ్చాడు.
"కాని నేను అదే తెలుసుకోవలనుకుంటున్నాను" ఈసారి మరింత సీరియస్ గా మారిపోయింది మోనీ. "మీకు గంతంలో లేదని తెలుసు."
"ఏమిటీ?"
"ఆడపిల్లలతో అనుభవం ... కనీసం ఈ మూడేళ్ళలో కూడా ఒక్క సారీ ఏ అమ్మాయితో ...."
"మోనీ! సొంత జుట్టుని స్వహస్తాలతో పట్టుకుని బాధగాచూశాడు యింతసేపూ నాసా దీనికోసమూ అన్నట్టు. "లేదు .... అస్సలు ఏ అమ్మాయి తోనూ అనుభవం లేదు."
"ఒక్కసారి కూడా?" రెట్టించింది.
"సగం కూడ లేదు. సరేనా?"
"మీకు ఉద్యోగంలో కూడా పూర్వం అనుబవం లేదు"
"మరే! మిస్ హనితకి కేండినెట్ అంటే ఇష్టంలా వుంది." అసంకల్పితంగా నోరుజారి అటు చూసేసరికి మోనీ అక్కడ లేదు. తను కూసిందా౦ట్లోనూ కొత్త భావమేదో స్పురించేసరికి మోనీ మాటల్తో. ప్రవర్తనతో తనో పెర్వేర్దేడ్ గా మారుతున్ననా అనుకుంటూ తల పట్టుక్కూచుండిపోయాడు.
ఎంతసేపలా ఉన్నదీ కిరీటికి తెలీదు.
అప్పుడు గుర్తుకొచ్చింది హానిత ఆ రాత్రికి కలవబావుతున్న విషయం .... హానిత రూపం గుర్తుకురాగానే మనసులో చిత్రమైన పులకింత, అంతకు మించిన కృతజ్ఞత.
"నాకింతటి అవకాశమిచ్చిన మిస్ .... హనితా .... నేను ఉండేది మీ కొమ్పలోనే అయినా తొలిసారి అతిథిగా నా యింట అడుగు పెట్టిన మీకు ఒక మంచి ఆతిథ్యంలో స్వాగతం చెప్పాలనుకుంటున్నాను.... ఇట్ మస్త బీ రోజీ ...."
సరిగ్గా పావుగంట సేపు సొరుగులోని ఓ ఫైలు తీసి స్టడీ చేశాడు. డిఫెన్స్ యంత్ర పరికరాల టెండర్స్ కి సంబందించిందది. వరసుగా మూడేళ్ళ పటు సాకేత మెషిన్ టూల్స్ ఎంత 'రేటు' వ్యత్యాసాలల్లో కోల్పోయింది చూశాడు.
ప్రతిసారి మెషిన్స్ కి తక్కువ ధర 'కోట్' చేసింది. అనిల్ మెషిన్ టూల్స్ 'కోట్' చేసిన రెట్లు కూడా సాకేత మెషిన్ టూల్స్ కి చాల దగ్గరగా వున్నాయి. తమ సమీప ప్రత్యర్ధి ఐల్ మెషిన్ టూల్స్ యజమాని సుధీర్ మేల్కోటే.
ఏం చేయాల్సిందీ మరోసారి మననం చేసుకున్న కిరిటీ ఇందాక మొనీ నుంచి తెలుసుకున్న వివరాలున్న స్ల్పీఫ్ ని ఓ మారు చూసి ఫోన్ అందుకున్నాడు.
పొజిషన్ లోకి అడుగు పెట్టిన అతి స్వల్ప వ్యవధిలో చేస్తున్నా తొలి ప్రయోగం కావడంతో కొద్దిగా చేతులు వణికాయి. ఖచ్చితంగా యిదావుక్ కారణమని తెలీదు. కాని ప్రోబబులిటెస్ లో యిదీ ఒకటి.
అవలివేపు ఓ యువతి కంఠం వినిపించింది. "ఎస్ .... ఎం.డి సేక్రేటీ హియర్."
"మే ఐ స్పీక్ టు మిస్టర్ మేల్కోటే ....?" ఇప్పుడు రాజేంద్ర గొంతుని అనుకరిస్తూ అడిగాడు. "అయాం రాజేంద్ర ప్రం సాకేత మెషిన్ టూల్స్ ."
కొన్ని సెకండ్ల జాప్యం తరువాత ఓ బొంగురు కంఠం వినిపించింది "ఎస్ మిస్టర్ రాజేంద్రా .... అయాం సుధీర్ స్పీకింగ్ .... మీ కాల కోసం చాల అత్రుతుగా ఎదురుచూస్తున్నాను."
ఎలర్టయ్యాడు కిరీటి. తన ఊహా తప్పు కాలేదు. ఇక్కడున్న ఓ ముఖ్యమైన ఎగ్జిక్యూటివ్ కి మరో బిజినెస్ ప్రత్యర్ధితో పరిచయం వుంది..... పైగా 'కాల' కోసం ఎదురుచూస్తున్నానంటున్నాడు.
"ఆఫ్ కోర్స్" కిరీటి వెంటనే జవాబు చెప్పాడు. ఈ పదాన్ని ఒక "మేనరిజం' లా రాజేంద్ర వాడటం కిరీటి పరిశీలనలో తెలిసిన మరో ముఖ్య విషయం "మాట్లాడేవాడినే . కొత్త బే.జి.ఎం. ఈ రోజే చార్జి తీసుకున్నాడుగా __ బిజీగా వున్నాం."
"ఐ.సీ ...ఎలా ఉన్నాడు?" మేల్కొంటే క్యూరియస్ గా అడిగాడు.
"ఆఫ్ కోర్స్ .... బచ్చాగాడే ....! ఐ థింక్ వియ్ కేన్ హేండిల్ హిమ్."
"బాస్ ఏమంటున్నాడు?" కిరీటి భృకుటి ముడిపడింది. డైరెక్టర్స్ లో ఏ వ్యక్తినో అతనిప్పుడు అడ్రస్ చేస్తున్నాడు. పేరుతోగక 'బాస్' అంటూ అదే కిరీటి తెలుసుకావాలనుకుంటున్నది. కూడా.