"కాని మన టుబాకో కంపెనీ సేల్స్ వివరాలు రికార్డ్స్ లో స్పష్టంగా ఉన్నాయి." సత్యానంద్ గొంతు వణికింది.
"అవన్నీ ఫిక్షనల్ సేల్స్ అంకుల్. గుంటూరులో ఉన్న మన సిగరెట ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసే బాధ్యత డాడీ మీకు అప్ప చెప్పారు. దాన్ని మీరు అవకాశంగా తీసుకున్నారు. ఒకపక్క సిగరెట్ల ఉత్పత్తి వాస్తవంగా అయినదానికన్నా తక్కువగా రికార్డ్ చేశారు. నెలకి పది మిలియన్ల సిగరెట్లు ఉత్పత్తి అయి పన్నెండు ట్రక్స్ పైన డీలర్స్ కి పంపుతుండగా, ప్యాక్టరీ ఇన్ వాయిస్ నీ, లారీ నెంబర్లనీ తారుమారు చేయించారు నాణ్యత లేదని లక్షలకొద్దీ సిగరేట్లు స్క్రేఫ్ గా మార్చినట్టు రికార్డ్ చేయించి, దానికి తగ్గట్టు ముడిసరుకుగా వాడిన పొగాకు ఎకౌంటులోనూ జాగ్రత్త తీసుకున్నారు. నిలువ చేయడంలో పాడైనట్లు 'స్టోరేజ్ లాసేస్' అన్న టర్మ్ తో అద్భుతంగా మోసానికి పాల్పడ్డారు. మీరు టుబాకో కంపెనీలో ఎ ఎగ్జిక్యూటివ్స్ తో చేతులు కలసిందీ, ఏయే రాష్ట్రానికి ఎంత అనకౌంటేడ్ గా పంపి విడిగా డబ్బు చేరుకున్నదీ ఆ ఫైల్లో వుంది.
హనిత మేధ ఏయే మూలదాకా విస్తరించి పోతున్నదీ ఎప్పుడో తెలుసుకున్న సత్యానంద్ ఏర్ ఈరోజు ఒక పథకం ప్రకారం తన అవినీతిని సాక్ష్యాదారాలతో ఆమె నిరూపిస్తుంటే దారుణంగా కుంచించుకు పోతున్నాడు.
"మీ అవినీతి నెలకి ఎన్ని లక్షల్లో ఉందన్నదీ అంకెలతో సహాఉంది. మిస్టర్ సత్యానంద్ . అది చాలు మిమ్మల్ని మీ స్థానం నుంచి పక్కకి నెట్టడానికి . మీ షేర్సు మాట ఎలా ఉన్నా మీరు జైలుగోడల మధ్య తక్కిన మామూలు ఖైదీలతో కొన్నాళ్ళు శిక్షని షేర్ చేసుకోవదానికీని. మీ షేర్స్ తో ఈ సంస్థ నష్టాన్ని పూడ్చుకోగలదు. కాని మీరు ఫిక్టనల్ గా __ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దొంగతనంతో _ ఎకౌంట్ లేకుండా అమ్మిన మిలియన్ల సిగరెట్లు గురించి ప్రభుత్వానికి తెలియపరిచే ఎగవేసిన ఎక్సైజ్ డ్యూటీ విషయంలో మీరు శిక్ష్యార్హ్లు లౌతారు."
సత్యానంద్ నేలచూపులు చూస్తూ ఉండిపోయాడు.
"షేమ్ షేమాన్ పార్ట్ మిస్టర్ సత్యానంద్ ! ఇలాంటి దౌర్భాగ్యులని తెలసీ బహుశా డాడీ మిమ్మల్నందర్నీ క్షమిస్తూ మానసిక మైనా శ్రమనిఉ తాను భరించారు. అనారోగ్యానికి గురయ్యారు. కానీ నేను అయన కూతుర్నే అయినా ఆయనంట క్షమాగుణం ఉన్నదాన్ని కాను. కాబట్టే సమస్యల్ని చాలా త్వరలో సింప్లీఫై చేయబోతున్నాను" పైకి లేచింది. "ఇన్నాళ్ళూ మిమ్మల్నందర్నీ ఎదిగిన పెద్దమనుషులు అనుకుంటూ 'అంకుల్' అని పిలిచి పొరపాటు చేసిన నేను చివరగా హెచ్చరించేదోక్కటే. ఈ చేతుల్నీ హత్యలతో దాచేయగలరనుకోకండి. మీ ముందుంచిన ఫైలు లోనివి ఒరిజినల్స్ కావు. కాఫీలు మాత్రమె. సో, చీఫ్ జిమిక్స్ మానేసి కొన్నాళ్ళపాటు బుద్దిగా ఉండండి. కొన్నాళ్ళు అంటే రాబోయే బోర్డు మీటింగ్ లో మీ జాతకాలు డాడీముందు నేను బయటపెట్టె వరకుబై."
కేవలం సంస్థ ప్రతిష్ట దిగజారకూడదని హనిత ఇక్కడా కొంత సహనాన్ని ప్రదర్శి౦చింది. సత్యానంద్ మౌనాన్ని గిల్టీ నేస్ తో తలవంచుకోవడంగా భావించింది. తప్ప ఆ బోర్డు మీటింగ్ కి ముందే ఆమె కథని మరింత సింప్లీఫై చేయాలనకుంటున్నాడని ఊహించలేక పోయింది.
* * * *
హఠాత్తుగా గదిలోకి వచ్చిన హనితని చూసిన ప్రభంజనరావు ఎంత కంగారుపడ్డాడూ అంటే, అప్పటికే ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్న వాడల్లా అర్జెంటుగా రిసీవర్ పెట్టెయబోయాడు.
"నో ప్రాబ్లమ్ .... మాట్లాకండి"
"ఇట్సాల్ రైట్"
"తప్పు చేస్తున్నట్టు ఎందుకలా త్రోటుపడతారు? సాకేత ఫోన్ చేసిందా?"
పక్కలో బాంబు పేలినట్టు అదిరిపడ్డ ప్రభంజనరావు వెంటనే ఫోన్ క్రేడిల్ చేశాడు. నిజంగా అ సమయంలో ప్రభంజనరావు మాట్లాడుతున్నది సాకేతతోనో. తనను వెంటాడుతున్న గేంగు విషయం చెబుతూ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన తన తల్లి బెడ్ పక్కన బిక్కుబిక్కుమంటూ ఎలా గడుపుతున్నదీ వివరిస్తూంది. ఇంతలో హనిత రావడం జరిగింది.
అదికాదు ప్రభంజనరావు అందోళన పరిచింది. నిన్న సాయంకాలం సాకేతను తను రక్షిస్తుండగా చూసిన గేంగు అంతా తెలియపరిచారు. కాబట్టే సర్కాస్టిక్ గా హనిత అలా అంది.
హనిత మాత్రమే కాదు ఇప్పుడామె నీడ చూసినా బెదిరే స్థితిలోకి జారిన ప్రభంజనరావు నీళ్ళు నమిలేస్తూ "అబ్బే ఎవరో ఫ్రెండు మాట్లాడుతుంటేనూ .... అసలు .... సాకేత ఎవరు?" చెబుతూ హనిత సూటిగా చూస్తుంటే టక్కున ఆగిపోయాడు.
"మీరు ఎవరు ఎవరికి సహకరించినా నాకు అభ్యంతరం లేదు మిస్టర్ ప్రభంజరావ్ ! ఎలాగూ నీడలా మిమ్మల్ని నేనూ వెంటాడుతున్నాను. కాబట్టి ఏం జరుగుతున్నదీ తెలుసుకోవడం నాకూ కష్టం కాదు. ఇకపోతే ఇంతదాకా వచ్చింది కాబట్టి ఒక విషయం నేనూ స్పష్టం చేయాలి. సాకేత ఎవరన్నా కాని ఎంతైనా సాటి ఆడపిల్ల కాబట్టి బెదిరించి నోరు మూయించాలని అనుకుంటున్నాను తప్ప, అంతకుమించిహాని చేయాలన్న అలోచన నాకు లేదు. ఒకవేళ నా తండ్రికి పుట్టిన కూతురే అయితే నా తోబుట్టువుగా అంగీకరించడానికి నాకూ ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ విషయం స్పష్టంగా చెప్పాను కూడా. కానే ప్రస్తుతం డాడీ ఆరోగ్యం సవ్యంగా లేదు. కాబట్టి కొంతగడుపు కావాలన్నాను. విననుంది. పైగా రణధీర్ ని హత్య చేయించింది కూడా నేనే అంటూంది . పిచ్చిపిల్ల అనుకున్నాను. పదిమంది ముందూ పిచ్చిగా వాగకుండా కొన్ని రోజులపాటు నోరు మూయించుకున్నాను. ఇదీ నా ఉద్హేశ్యం " ఓ క్షణం ఆగింది. "ఇకపోతే దీన్ని అవకాశంగా తీసుకోవాలని ఎవరన్నా _ అదే మీలాంటివాళ్ళు ప్రయత్నిస్తే మాత్రం నేను సహానాన్ని కోల్పోతాను. ఈ విషయం గుర్తుపెట్టుకొండి. వీలైతే ఆ పిచ్చిపిల్లకి నచ్చచెప్పండి బై!"
హనిత బయటికి నడిచింది.
ప్రభంజనరావు అవాక్కయి తన గదిలో తెల్లమోహం వేసుకుని కూర్చున్న సమయంలో తన ఛాంబర్ కి వచ్చిన హనిత ఆలస్యం చేయలేదు. కిరీటికి ఫోన్ చేసింది.
వెంటనే లైన్ లోకి వచ్చాడు కిరీటి .
"మీతో అర్జెంటుగా కొన్ని విషయాలు మాట్లాడాలి కిరీటి . చాలా అవసరం ... ఇప్పుడు కాదు. రాత్రికి నేను మీ బంగళాకి వస్తాను. ప్రాబ్లంలేదు. తప్పదు ..... రాత్రి పది గంటలకి .... అంటే డాడీ నిద్రపోయాక .... ఎస్."
హనిత ఫోన్ క్రేడిల్ చేసింది.
ఆమె ఛాంబర్ లోకి రాబోతూ స్ప్రింగ్ డోర్ దగ్గరే ఆగిన ఓ వ్యక్తి ఆమాటలు విన్నాడు . ఉక్రోషంగా పిడికిళ్ళు బిగించుకుని ఆ రాత్రి వ్యవహారాన్నిఆటో ఇటో తేల్చేయాలనుకున్నాడు.
హనిత గదిలోకి అడుగు పెట్టకుండా వెనక్కి మరలిజ్న ఆ వ్యక్తి శివరావు.
* * * *
సాయంకాలం అయిదు కావస్తూంది.
డ్యూటీ టైమ్ ముగిసిపోవడంతో ఇంటికి బయలుదేరాలనుకున్న మొనీ బాత్ రూమ్ లోకి నడిచి బాబ్ద్ హెయిర్ సవరించుకుంది. వాలెట్ లోని లైఫ్ స్టిక్ తీసి పెదవులకు అద్దుకుని అద్దంలో ఓమారు చూసుకుని టేబుల్ దగ్గరకు నడిచింది.
సరిగ్గా అప్పుడు ఇంటర్ కమ్ బజర్ మోగింది.
రిసీవర్ అందుకొని "హలో" అంది కిరీటి పిలుస్తూన్నాడేమో అనుకుంటూ.
"నేను .... రాజేంద్రని" ఖంగుమంది కంఠం.
"ఎన్సర్" ఎవరో అవసరం ఉంటే తప్ప సామాన్యంగా మాట్లాడని వ్యక్తి రాజేంద్ర. పైగా అతని గొంతులో సహజంగా వినిపించే కాఠిన్యం ఆమెను చాలా కంగారుపడుతూ వుంటుంది.
"ఇందాక కొత్త జి.ఎమ్ . తో చాలా మాట్లాడినట్టున్నావు?"
"వ్వాట్?" ఇదంతా రాజేంద్రకి ఎలా తెలిసిందీ అన్న విస్మయం ఆమె గొంతులో . "నో ... నో సర్!"
"తెలివితేటలు ప్రదర్శించకు."
"సర్!"
"అతను నీకు ముందే పరిచయమా?"
చెప్పాలా వద్దా అన్న సందిగ్ధంలో ఓ క్షణం ఆగి "య .... ఎస్సర్ " అంది.
"అందుకని నా గురించి నోటికొచ్చినట్టు కూసేవన్నమాట!"
మోనీలో సన్నగా కంపనం మొదలయింది. ఇందాక కిరిటీ తను బాస్ మంటూ హెచ్చరించినప్పుడే సగం మూడ పాడయింది. ఇదంతా ఏమిటో అర్ధంకానట్టు ఆమెకు కళ్ళనీళ్ళ పర్యంతమౌతుంటే ముందు రాజేంద్ర గురించి తను ఎం చూసిందీ గుర్తు చేసుకోవాలనుకుంది. కానీ అప్పటికే మెదడు మొద్దుబారిపోవడంతో వ్యక్తి జ్ఞప్తికి రాలేదు.
"సారీ సర్" ఏడుస్తూ౦ది.
"నేనెవర్ని ?"
"రాజేంద్రసర్!"
"నాన్సెన్స్ .... నా పొజిషన్ మిటి?"
"యూ ఆర్ చీఫాఫ్ డిజైన్స్ డిపార్ట్ మెంట్ !"
"నాన్సెన్స్ ... నాకున్న పరపతేమిటి?"
"మీరు మీ ఫ్యాక్టరీలో చాలా పలుకుబడి ఉన వ్యక్తి. బోర్డు డైరెక్టర్స్ కి మీరెంత చెబితే అంత."
"ఇంకా?"
"మీ మాటకి ఎదురు చెప్పిన వాళ్ళని వెంటనే బయటకి పంపేయగలరు"
'"ఇంకా?"