Previous Page Next Page 
అసురవేదం పేజి 24

   

    ఒక మెరుపులాంటి ఉత్సాహం కిరీటిని చుట్టుముట్టింది. టేబుల్ పై నున్న ఇంటర్ కం బజర్ నొక్కాడు _ "ఒక్కసారి"

    వెంటనే గదిలో ప్రత్యక్షమైంది మొనీ "రియల్లీ?" ఉచ్చ్వాస నిశ్వాసాలు ఆమె ఒపుల్ని వ్యాకోచింపచేస్తుంటే తను ఎప్పుడూ అనే 'ఒక్కసారి' అన్న పదం కిరీటి నోటినుంచి వినగానే చాలా సంబరపడి పోయింది.

    "కూర్చో" చూపించాడు.

    "ఒక్కసారీ అని పిలిచి కూర్చోమంటావేంటి?"

    "ఈ ఒక్కసారికీ కూర్చో." నవ్వుతూ ఆమె కళ్ళలోకి చూశారు. మంత్రముగ్ధంలా ఎదురుగా కూర్చున్న ఆమెనే గమనిస్తూ "నువ్వసలు మారలేదు  మోనీ" అన్నాడు.

    హఠాత్తుగా కిరీటి ఇలామ్టి ఉస్తుకతని ఎందుకు ప్రదర్శిస్తున్నదీ ఊహించలేదామే. "మారిపోయాను కిట్టూ .... కానీ నిన్ను చూడగానే మూడ లో కొచ్చేశాను" ఆమె భాషలో చిత్రమియా యాస ధ్వనిస్తూంది.

    "మీ పెద్దక్కయ్య ఎలా వుంది?"

    "లేచిపోయింది" కేజువాల్ గా చెప్పింది.

    "చిన్నక్కయ్య?"

    "భర్తపోయాక ఒంటరిగా ఉంది."

    "అంటే పాపం మీ బావ ...."

    "పోయాడంటే చావలేదు .... పారిపోయాడు."

    "అదేం పాపం?"

    "మా చిన్నక్క నింఫోమానియాక్ .... ఒక పట్టాన సెక్స్ లో సంతృప్తి పడదు.

    మోనీ ఇంత పచ్చిగా మాట్లాడగలదని కిరీటికి తెలీని విషయం కాదు."ఈ విషయం నీకెలా తెలుసు?"

    "వాళ్ళ బెడ్ రూమ్ పక్కనే నా గది కూడా."

    "వింటూండేదానివా?"

    "బావని చూసి జాలిపడేదాన్ని కూడా."

    "ఎందుకూ?"

    "అక్కబాధపడలేక ప్యాక్టరీలో ఎక్కువనైట్ డ్యూటీస్ వేయించుకునేవాడు. కాని దే టైమ్ మాత్రం ఊరుకునేదా?" ఆరు నెలల్లో సగమై పోయాడు. ఆ తరువాత సంసారంమీదా, సెక్స్ మీదా జాయింట్ గా రోతపుట్టి ఎటో వెళ్ళిపోయాడు" చాలా ఉత్సాహంగా చెప్పుకుపోయింది మోనీ తనకన్నా ముందునుంచే ఓ కీలకమైన పొజిషన్ లో వున్న మోనీని మించి తాను వివరాల్నీ సేకరించే అవకాశం లేదు.

    అమ్వేని మరింత మూడ్ లోకి రప్పించాలనుకున్నాడు. "మరి మీ అయన మాటేమిటి?"

    "ఎద మీద బాగానే తంటాలు పడతారుగాని ఎప్పుడూ సముద్రం మీద తిరుగుతుంటాడు. పిష్ లో రేడియో ఆఫీసర్ లే."

    "ఐ. సీ." తల ప౦కించాడు సాలోచనగా .

    "ఇక పర్వాలేదు."

    "అదేం?"

    "నువ్వున్నావుగా ..... కొంతకాలంపాటు రేడియో ఆఫీసర్ని మరచిపోయి ఈ ట్రాన్సిస్టర్ ట్యూన్ చేస్తుండోచ్చు ."

    "యూ సీ." వెంటనే అనుకున్న ప్రసక్తిలోకి టాఫిక్ ని మళ్ళిస్తూ అన్నాడు. ఇంతకు ముందు యిది జనరల్ మేనేజర్ చాంబర్ అనుకుంటాగా . ఆయనతో మాట్లాడేదానికా?"

    "అమ్మో!" మోనీ కళ్ళలో భయం తారాట్లాడింది. "అయన చాలా స్ట్రిక్ట్."

    "డ్యూటీలోనా?"

    "అహం ... సెక్స్ లో ."

    "నీకేలా తెలుసు?"

    "ఎప్పుడూ నా కళ్ళలోకే చూసేవ్డు కాదు. నేల చూపులే."

    "బహుశా యిలా మినీస్ లో వచ్చేదానికేమో?"

    ఫకాలున నవ్వింది. "అవును ఫ్రాక్ లో."

    ఆమె చెప్పడం యింకా పూర్తీ కానేలేదు.

    "అందరితో సరదాగా మిక్సయ్యేవాడా?"

    "అలా అయితే ఎందుకు పోయేవాడు?"

    "పోవడానికి మిక్సవకపోవడమే కారణమా?"

    హఠాత్తుగా మోనీ గొంతు స్థాయి తగ్గించి అటూ ఇటూ చూసింది "రాజేంద్ర తెలుసా?"

    "ఎవరూ?"

    ఇక్కడ డిజైన్స్ చీఫ్ ఇంజనీర్ కన్నింగ్ ఫెలో .... ఎప్పుడూ ఆయనతో అర్గ్యూమెంట్స్ కి డిగి మహా టార్చర్ చేసేవాడు."

    క్రమంగా కావాల్సిన వివరాల్ని మనసులోనే చాలా ఎఫిషియెంట్ అని విన్నాను."

    "ఆఫ్ కోర్స్" భుజా లేగారేసింది. "కాబట్టి అతని మాటిక్కడ వేధం"

    "కానీ" భుజా లేగరేసింది. "కాబట్టి అతని మాటిక్కడ వేధం."

    "కానీ" కిరీటి నొసలు చిట్లించాడు. "వరసగా మూడేళ్ళగాడిఫెన్స్ కాంట్రాక్ట్ మనకి రాకుండా పోతూందిగా?"

    ప్రతి ఏడాదీ దేశ రక్షణ వ్యవస్థ కొన్ని యంత్ర పరికలరాలని కోట్ల విలువలో కొనుగోలు చేస్తుంది. గత మూడేళ్ళుగా ఆ కాంట్రాక్టు కోల్పోతున్న విషయాన్ని ఇందాకే రికార్డ్ లో పరిశేలించండి కూడా.
   
    మోనీ జవాబు చెప్పలేదు ఉన్న అనుమానాన్నైనా వ్యక్తం చేయలేని పొజిషన్ లో ఉన్న అమమయిని ఇంతకన్నా ఇబ్బంది పెట్టకూడదను కుంటూనే అడిగాడు __ "మనక మెషిన్ టూల్స్ లో పెద్ద పోటీదార్లు ఎవరు?"

    "అనిల్ మెషిన్ టూల్స్ .... మర్రిపాలెంలో ఉందిగా?"

    ఈ విషయం కిరీటికి తెలీనది కాదు .... ఈ దేశంలో మెషిన్స్ ఉత్పత్తి చేసే యంత్ర పరికరాల సంస్తఃలు మరెన్నో ఉన్నాయి. కాని మోనీ కేవలం అనిల్ మావుశిన్ టూల్స్ గురించి మాత్రమె అసంకల్పితంగా జవాబు చెప్పింది. పూర్తిగా వివరాలు తెలియకపోయినా సబ్కాన్షస గా నైనా ఆ ప్యాక్టరీ గురించి మోనీకొక రకమైన అవగాహన ఉంది.

    "వెల్" యథాలాపంగా ఆమెనే చూస్తూ "మీ అయన బాగుంటాడా?" అడిగాడు.

    "నీ అంత బాగా ఉంటాడు కాని నీ కున్నంత స్ట్రెంగ్త్ సంగతి నీకెలా తెలుసు?" అన్నాడు నిర్వీణ్ణుడోతూ__

    "రెండుసార్లు చూశాము."

    "ఏమిటి?"

    "నువ్వు స్నానం చేసేటప్పుడు ."

    "అయితే?"

    "వట్టి మొద్దు సిగ్గుతో చేతుల్ని గుండెలకి హత్తుకుని తరువాత నవ్వుతూ అరచేతులతో మోహాని కప్పుకుంది. "ఇంత పెద్ద పొజిషన్ లో  కొచ్చావు .... అస్సలు ఏమీ తెలీదు."

    అప్పటికి అర్ధమైనట్టు మృదువుగా నవ్వినా కిరీటి __ "అయితే మనం డిఫైన్స్ కి గాని, మరే సంస్థలకు గాని కొటేషన్స్ పంపేటప్పుడు వాటిని ఎవరు ఫైనలైజ్ చేస్తూంటారు." తన చర్చలో తెలుసుకోవలసిన అతిముఖ్యమైన ప్రశ్న అది.

    "బోర్డు మెంబర్స్నంతా ."

    "హానిత కూడా ఉంటుందా?"

    "హానిత రంగంలోకి దిగింది. ఈ మధ్యనేగా ... ఇంతవరకూ లేదు. రాజేంద్ర సహకారంతో మెంబర్స్ ఫైనలైజ్ చేస్తుంటారు."

    "ఐ.సీ అంటే రాజేంద్ర జోక్యం ఉంటుందన్నమాట ."

    "మెషిన్ డిజైన్ లో కస్టమర్ ఏదన్నా మార్పు కావాలని అడిగినప్పుడు దాని ఖరీదు ఎస్టిమేట్ చేసేది ఆయనేగా?"

    "మరి ఈ సంవత్సరం కొటేషన్ ....."

    "మరో మూడు రోజుల్లో మెంబర్స్ అంతా సమావేశమవుతారు." చెబుతూనే విసుగ్గా చూసింది. "అయినా ఇవనీ తరువాత మాట్లాడుకో వచ్చుగా? అందాకా__"

    "ఏం కావాలి."

    "ఒక్కసారి."

    "మోనీ."

    "ప్లీజ్."

    "చూడు మోనీ." కిరీటి గొంతు అసహనంగా పలికింది. "ఇక్కడ మనం స్నేహితులం కాదు. అయామ్ యువర్ బాస్ ...... అల్లరి చేస్తే దిసిప్లీనరీ ఏక్షన్ తీసుకోవచ్చు కదా?"

    మోనీ ఇప్పుడు నవ్వడంలేదు కిరీటి మొహంలో సీరియస్ నేస్ ని చూస్తూ ఖంగుతున్నట్టు తల పకించి లేచి నెమ్మదిగా నడిచింది.

    మోనీతో పూర్వం అయిదేళ్ళ పరిచయంగలకిరీటికి ఆమె తత్త్వం తెలీనది కాదు. ఒక పసిపిల్లలా పైన పదాలనుకుంటుంది. కళ్ళెర్ర చేయగయే కంగారుగా దూరంగా జరుగుతుంది.

    నిట్టూరుస్తూ వెనక్కీ జారగలబడి కిరీటి ఇప్పుడు సీరియస్ గా ఆలోచిస్తున్నాడు.

    ఈసారి డిఫెన్స్ కాంట్రాక్టు అనిల్ మోషిన్ టూల్స్ కి కాదు __ సాకేత మెషిన్ టూల్స్ కే దక్కాలి.

    తన ఉనికిని బలంగా నోరూపించుకునే మొదటి ఘట్టం .

    "మోనీ ఇంకా ద్వారం దగగ్రే నిలబడింది. మనసు మారిన కిరీటి 'ఒక్కసారి' మళ్ళీ పిలుస్తాడేమో అన్నట్ట్లుగ్తా.__

                                                           *    *    *    *

    "ఇదంతా ...." ఫైలు చూస్తున్న సత్యానంద్ గొంతు తడారి పోతుంటే నిశితంగా అతన్నే చూస్తూ ఉండిపోయింది హానిత.

    "మీరంతా నాపైన సాగిస్తున్న సమరంలో మీకు మాత్రమె ప్రత్యెక మైనా మారణాయుధం అంకుల్." నిస్చాలంగానే చెప్పడం ప్రారంభీంచింది. "ఇంతకాలం మీరు పెరమైట్స్ మాత్రమె అనుకున్నాను కాని  సంస్థని వెన్నుపోటు పొడిచే ప్రర్త్యర్ధులు కూడా అని తెలుసుకోవడంతో కాస్త ఇన్విస్టిగేషన్ చేశాను."   

 Previous Page Next Page