Previous Page Next Page 
అసురవేదం పేజి 23

 

     "ఉన్నాయా?"

    "చాలా స్పష్టంగా కనిపించాయి." నవ్వుని నిట్టూర్పుతో కలిపేసి తన గెలుపుని అలా అర్ధవంతంగా తెలియచేశాడు.   

    హనిత శరీరంలో సన్నని ప్రకంపన మొదలయింది. ఎప్పుడూ భయస్థడిలా వుంటూ దేనికీ అంతగా పెదవి విప్పని సత్యానంద్ ఓ హంతకుడు .... రణధీర్ ని  చంపి తానను ఇరికించాలి ప్రయత్నించి, రాత్రి కిరీటిపైనా ఇంచుమించు అలాంటి ప్రయత్నమే చేసిన కోల్డ్ బ్లడేడ్ మర్దరర్......

    వీళ్ళు నా సంస్థకి మూలస్థంబాలు .

    వీళ్ళంతా ఈ సంఘంలో అసాధరమైన పరపతి వున్న వ్యక్తులు పెదవి విప్పితే నైతిక విలువల గురించి, దేశాభ్యున్నతి గురించి మాట్లాడే వీళ్ళు నా తండ్రిలాంటి నిజాయితీపరుడి చూరును పట్టుకుని వెళ్ళాడుతూ ఇన్నాళ్ళూ ముడుగు లేసుకు బ్రతికిన కిరాతుకులు.

    "నాకు తెలుసు మిస్ హనితా! ఇక్కడ నాకు ప్రత్యక్షంగా దొరికి పోయిన సత్యానంద్ ఇక జూలు విదిలించుకుంటాడు. ఇక ఈ విషయాన్ని మీకు నేనెలాగూ తెలియపరుస్తానన్న న్బంమకంతావు పూర్తిగా నన్నూ శత్రువర్గంలోకి చేర్చి అవకాశం కోసం ఎదురుచూస్తూంటాడు. అయితే ఒక్కటి ..... ప్రమాదాలు నాకు కొత్తకాదు. ఒకసారి ఒక బాధ్యతని నెత్తిపైన వేసుకున్న నేను ఈ తాటాకు చప్పుళ్ళకు ఒక్క అడుగూ వెనక్కీ వేయను. శత్రువు ఎవరంనదీ తెలిసిపోయింది. కాబట్టి చాలెంజ్ ని మరింత సపోర్టివ్ గా తీసుకుంటాను. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది మీ గురించే."

    హనిత చివాలున తల తిప్పి అతని కళ్ళలోకి చూసింది.

    "మిమ్మల్ని _ తక్కువగా అంచనా వస్తున్నాననుకోకండి. అందమైన అమ్మాయిలో సెక్స్ నీ, తెలివయిన అమమయిలలలో సైకం ప్రకృతి సిద్దమైన బలహీనతనీ, లెక్క చూసుకుంటూ పోరాటంలో ముందుకు నడిచే మగాళ్ళ మధ్య మాత్రమే కాదు మీరన్నది. విషం కక్కడానికి సమయాన్ని వెతుక్కుంటున్న పడగల నీడల్లో ఇంతదాకా ఎం జరిగిందీ అన్నదికాదు మీరాలోచించాల్సింది. ఇకముందు ఏం చేయాలీ అన్నది." ఇక్కడ కూడా కిరీటి గొంతులో అందోళన లేదు. చాలా మామూలుగా చెప్పుకుపోతూన్నాడు.

    ఏనాడూ లేనిది హఠాత్తుగా ఆమెలో అణువంత భయం లాంటిది కాహోటు చేసుకుంటోంది. అయినా ఆమె మొహంలో ఆ భావం కనిపించకుండా జాగ్రత్త పడుతూంది. "వీళ్ళలో దుర్మార్గులున్నారనుకున్నాను కాని హంతకుడూ ఉన్నారన్నది నేనూహించని విషయమే." గోణుగుతున్నట్లుగా అంది.

    "మిస్ హనితా.... మోయిస్టరైజర్ తరువాత మొహానికి అడ్డుకో వాల్సిన పౌడరు గురించో, కోల్డు క్రీమ్, లిప్టు స్టిక్స్ లాంటి వాటి గురించో, అట్లా తద్దినాడో, ఆషాడమాసంలో అమ్మాయిలు ఆరాటపడే గోరింటాకు గురించో , ఆలోచించాల్సిన వయసులో ఇలాంటి బృహా త్తరమైన బాధ్యత భుజాలపై వేసుకున్న మీరు నిబ్బరంగానే ముందుకు సాగిపోవాలి."

    ఇక్కడ హనితకు బోధపడింది కిరీటి అవకాశం తీసుకుని అలా మాట్లాడుతున్నాడని కాదు. అసలు అతని తత్వమే ఆడని ఎప్పుడో బోధపడిపోయింది. దూకుడు ఎక్కువై తేనేం .... అణువంత ధైర్యాన్ని నూరి పోయగాలుతున్నాడు.

    ఈ కొద్దిపాటి మీమాంసతోనో మనసారా నవ్వే యగలిగింది. "నిజమే"

    "ఏమిటి?"

    "ఒక మగాడిని పూర్తిగా తెలుసుకోవాలీ అంటే అతన్ని అధికారంలో కూర్చోపెట్టాలట. "

    "తెలుసుకున్నాకే కూర్చోబెట్టారా?"

    ఆమె నేత్రాలు కొద్దిగా అరమోడ్పులయ్యాయి. "కూర్చోబెట్టాక తెలిసింది."

    "ఏమని?"

    "అతని గురించి ఏమీ తెలుసుకోలేకపోయానని."

    "అర్ధమైంది " కిరిటీ పెదవులపై విడీవిడని నవ్వు."

    "ఏమిటీ?"

    "మగాడి ఆలోచన ఎప్పుడూ నిజమే అయితే, అమ్మాయి తలపులు అరుదుగా తప్పవుతుంటాయని."

    పకాలున నవ్వబావుయి టక్కున ఆగిపోయింది. అప్పటికే తను చాలా శత్రుమించాననుకుందేమో "వెల్ ..... ఇప్పుడేం చేయమంటారు?"

    "ఎలాగూ వచ్చింది కాబట్టి మూడు స్పూనుల ఎప్పం సాల్ట్ ని అర లీటరు నీటిలో కరిగించి ఆ ద్రావణాన్ని దూదితో ముఖానికి రాయాలి తప్ప, అందమైన చెక్కిలి మీద 'పిమ్పుల్' ఎలా వచ్చిందీ అంటూ వచ్చాక బాధపడి ప్రయోజనంలేదు. " ప్రస్తుత స్థితికి అన్వయిస్తూ కిరీటి కారులో కూర్చోగానే అసంకల్పితంగా హనిత చేయి ఆమె చెంపల్ని చేరుకుంది.

    ఒక పింపుల్ వెలికి తగిలింది ఇప్పటి సమస్యకి ఎగ్జాంపుళ్ళా. హనిత కోన్ని క్షణాలపాటైనా తనను తాను మరచిపోయింది. ఇదంతా కారిడార్ లో నిలబడి శివరావు గమనిస్తున్నాడని, అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయని ఆమె గ్రహించలేదు.

    కాని వెళ్తున్న కారులో నుంచి సైతం కిరీటి సులభంగా గుర్తించాడు. అది కోరుకునే యిమ్తసేపూ అలా మాటలతో తాత్సారం చేశాడని శివరావుకీ తెలీదు.

    ఇక్కడ కిరీటి ఆచరిస్తున్న యుద్దనీతి ఒక్కటే. తన శక్తిని పూర్తిగా ప్రత్యర్ధి అంచనా వేసే అవకాశం యివ్వకుండా ముందు ప్రత్యర్ధిని రంగంలోకి అతనెంత శక్తివంతుడో తెలుసుకున్నాక తను పోరాటం ప్రారంభించాలి.

    హనిత యిప్పుడు ఇంటికి వెళ్ళిపోలేదు. అలా ఊహించి పొరపాటు చేసిన సత్యానంద్ ఆదరాబాదరాగా బయటకి నడవబోతుండగా హనిత అయన ఆఫీసు గదిలోకి వచ్చింది.

    "అంకుల్" హనిత మొహంలో ఎలాంటి భావమూ లేదు. "ప్లీజ్ బీ సీటేడ్ ."

    తత్తరపాటుగా తన సీటులో కూర్చున్న సత్యానంద్ ని చూస్తూ అతని ఇంటర్ కం నుంచే పియ్యేతో మాట్లాడింది."ఓ అరగంట సేపు ఎలాంటి ఫోన్ కనేక్షనూ ఇవ్వదు..... నో డిస్టర్బ్ న్స్ ఎటాల్."

    అప్పుడు ఓ ఫైలు అతని ముందుంచింది.

    "ఏమిటిది?"

    "మీ జాతకం . జాగ్రత్తగా ఒక్కో డాక్యూమెంట్ చూడండి." నిశ్చలంగా అంది.

    ఆమెకు తెలుసు, ఇప్పుడీ ప్రయత్నంలో తనూ మరింత ప్రమాద కరమైన ఊబిలో కూరుకుపోతున్నానని. అయినా నిబ్బరం. సడలిన ప్రత్యర్ధిని పూర్తిగా నొక్కిపట్టడానికి ఇంతకన్నా మంచి అదను రాధనుకుంది.

    ఫైలు తెరిచి చూస్తున్న సత్యానంద్ మోహం అప్పటికే వివర్ణమై పోయింది.

                                                                *    *    *    *   

    చూస్తున్న పర్సనల్ ఫైల్సులో నుంచి తల పైకెత్తాడు కిరీటి. ఉదయం రాగానే ప్రారంభించిన ఈ కార్యక్రమం మధ్యలో కాస్త ఇంటరప్షన్ తరువాత యిప్పుడు అరగంటనుంచీ మొదలుపేట్టి, ఆగింది యిప్పుడే. ఎ సంస్థ అభ్యున్నతయినా విచ్చిన్నమయ్యేది దాన్ని నడిపే వ్యక్తుల నైతిక వులువలపై అన్న సూత్రంలో డిపార్ట్ మెంట్ ల్ హెడ్స్ వివరాలు పొందుపరిచిన రికార్డ్స్ పూర్తిగా చూశాక బడలికగా రివాల్వింగ్ ఛేయిర్ వెనక్కీ జారగిలపడ్డాడు.

    ఏది ఏమైనా తను చేరుకున్నది కలలో సైతం ఊహించలేని స్థానాన్ని . ఇది అదృష్టమే అయితే యిలాంటి అదృష్టాన్ని అందించిన హనితకు తన వునికేమితో తెలియచెప్పి అహోరాతరులూ శ్రమించి ఆమె మానసిక గ్లాసుని తగ్గించాలి. లేదూ ఊపిరి తీసే విషయవలయమే అయితే తన జీవితాన్ని పణంగా పెట్టయినా, వేలమంది కర్ముకుల జీవనోపాదికి కారణమైన ఒక సంస్థ జీవిత కాలాన్ని పెంచే ప్రయత్నంలో తను సమసిపోవాలి.

    కిరీటి పుట్టింది సిల్వర్ స్పూన తో గోరుముద్దలు తినగలిగే కుటుంబంలో కాదు. ఎప్పుడో బాల్యంలో నాన్న వాడయ్యాడు. కాబట్టే కష్టాలూ, కన్నీళ్ళు అతనికి కొత్తకాదు. ఒక విధంగా జీవితాన్ని ఈ మాత్రమైనా అర్ధం చేసుకోవడానికి దోహదం చేసిన పరిస్థితులనీ బాల్యమే తెలియచెప్పిందేమో.

    అమ్మ ముందు అమాయకత్వం నటించినా సహజంగా ఎంత ధైర్యవంతుడూ అంటే __ తను పుట్టిన పెరిగిన తుంపాలతో శారదా నది గండి పడి ఊరంతటీని వరదలో ముంచేస్తే పదిహేనేల్ల వయసులోనే ప్రాణాలకు తెగించి ఎందరి ప్రాణాలనో కాపాడి అమ్మచేత తిట్లూ తిన్నాడు. అమ్మ కంటిలో అనందబాష్పలన్నీ చూడగాలిగాడు.

    పుస్తక పరిజ్ఞాన మొక్కటే కాదు ప్రపంచ గ్నాన్నీ సమపాళ్ళలో రంగరించుకున్న కిరీటి ఆ క్షణంలోనే అనుకున్నాడు. కథనో కొలిక్కితీసుకోచ్చేదాకా కంటినిండా మరచిపోవాలి.

    ఇక్కడ కిరీటిని పదే పదే కదిలిస్తున్న ఆలోచన ఒక్కటే. కేవలం తను సుఖపడటానికి డబ్బు మాత్రమే అవసరమనుకుంటే, హనితకీ సంస్థతో పనిలేదు. ఈ సమస్యలకి అతీతంగా తరతరలూ సుఖంగా బ్రతికేసెంత ఆస్తి ఉంది. ఈ సంస్థలలో ముడిపెట్టుకుని బ్రతుకుతున్న ఎందరి కోస్మావు ఆమె పడుతున్న ఆరాటమే ఆమెలో అతన్ని అమితంగా ఆకట్టుకున్నది.

    ఆమె వెనుక తండ్రి ఉన్నా అతనో క్షత్రగాత్రుడైన సైనికుడు యిక పోరాటం బాధ్యత ఆమెది మాత్రమే. ఒక ఒంటరి అంకెగా కదిలే ఆమె ఒక సంఖ్యగా మరాలీ అంటే చాలా మేథమేతికల్ గా తను సంపూర్ణమైన సహకారం అందించాలి. తప్పదు. ఆమె ప్రయత్నాన్ని సంకోంచింపచేసే డినామినేటర్స్ ని జాగ్రత్తగా తనూ కనిపెట్టాలి.

 Previous Page Next Page