"మిస్ హనితా" కిరిటీ గొంతు ఈసారి స్థిరంగా పలికింది. కొన్ని వేలో, వందలో కట్నంకోసం కోడళ్ళని కిరోసిన్ పోసి హత్య చేయగల వ్యక్తులున్న ఈబార్భేరియన్ సోసైటీలో కోట్ల రాబడిని కాల దన్నుకోవాల్సిన స్థితి ఏర్పడేటప్పుడు ఇలాంటి ప్ప్రయత్నాలు సాగించడం నమ్మశక్యం కాదని ఎలా అనుకోగలుగుతున్నారు? ఇక్కడ డబ్బు ఒక్కటే కాదు ప్రత్యర్దుల్నీ అలా ప్రోత్సహిస్తున్నది. మేడలో మెడల్స్ గా వేసుకు తిరిగే స్టేటస్ సింబల్స్ ప్రస్తుతమున్న పరపతీ గట్రా."
"అంటే?" ఆమె సునాయాసంగా గ్రహించింది ఇప్పుడు కిరిటీ ఎవర్ని అనుమానిస్తున్నదీ .
"గౌరవనీయులైన మీ బోర్డు మెంబర్స్ ఇదంతా చేయిస్తున్నారని చెప్పడానికి పెద్ద మేధ అక్కర్లేదనుకుంటాను."
ఇంతదాకా వచ్చాక ఆమె కూడా ఇక సంశయించలేదు. "ఖచ్చితంగా ఎవరు కారణమో చెప్పగలరా?"
"ఈపాటికే తెలుసుకోగలిగేవాణ్ణి హానితగారూ. కాని ప్రత్యర్ధి క్షణంలో తప్పించుకున్నాడు. బాల్కనీలో నిలబడ్డ నేను ఎందుకో ప్రమాదాన్ని ఊహించాను. చెప్పానుగా ఏ సిక్త్ సేన్సో ఆ క్షణంలో పని చేసిందని!" అంతే .... వెనుకనుంచి ఎవరో నెడితే __ నేను బాలెన్స్ తప్పి కిందికి జారిపోతూ ఆ వ్యక్తి చేతుల్ని పట్టుకున్నాను. విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ నన్నూ పైకి లాగాడు. వెంటాడేవాణ్ణి కాని, అప్పటికి నా మోకాళ్ళ కొట్టుకుపోయాయి. నేను నడవలేనంతగా నడుంకూడా బెణికింది. "ఓ క్షణం అగేక అన్నాడు __ అన్నట్టు ప్రత్యర్ధి తెలుగులో టిఫ్ చేసిన కొన్ని ఉత్తరాల్ని ఇక్కడ వదిలిపెట్టాడు. అన్నీ మీకే ఎడ్రస్ చేసి ఉన్నాయి.
"అందులో ఏం రాసి ఉంది?" ఉద్వేగంగా అడిగింది.
"సింపుల్" చదవడానికన్నట్టు ఓ లిప్తపాటు అగేక అన్నాడు ___
"మిస్ హనితా. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇక రోజులు లెక్కపెట్టుకో. రణధీర్ హత్య చేయించి తప్పించుకున్నా నేను నిన్ను వదిలిపెట్టను. నా స్నేహితుడికి జరిగిన అన్యాయానికికక్ష తీర్చుకుంటాను.
ఇట్లు
కిరిటీ."
విస్మయంగా వింటూందామె. రణధీర్ హత్య జరిగాక కూడా సరిగ్గా ఇలాంటి ఉత్తరాలే హొటల్ గదిలో పోలీసులకి దొరికాయి.
"కంగారు పడకండి హనితా! బహుశా ఇలామ్టి నా బెదిరింపులకి భయపడి మీరు నన్ను హత్య చేయించారని నిరూపించడం వాళ్ళ ఉద్దేశ మనుకుంటాను."
"కానీ వాక్యాల్ని కూడబలుకుతున్నట్టుగా అంది __ "మిమ్మల్ని సెలక్ట్ చేసుకోవడంలో ఎక్కువ శ్రద్ద చూపించింది నేనే అని అందరికీ తెలసీ. ఈ నేరాన్ని నా మీదికి ఎలా నెట్టుగలిగేవారు?"
"రణధీర్ నాకు నిజంగా స్నేహితుడే అయితే అది నోరూపించడం పెద్ద శ్రమ రాదనీ వాళ్ళ అభిప్రాయం కావచ్చు."
"ఇప్పుడేం చేస్తారు?"
"అంటే?"
"మీరు ....." అర్ధోక్తిలో ఆగిపోయింది .
"మిస్ హనితా .... ఇలాంటి స్థితిలో నేను ఉద్యోగంలో చేరుతానా, లేదా అన్నది. మీ అనుమానం కావచ్చు. కాని ఓ విషయం చెప్పమంటారా ? నథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ టు బి ఫియర్డ్ . ఇటీజ్ ఓన్లీ టు బి అండర్ స్టుడ్. ఒకవేళ నేను ఈ మాత్రం డానికి బెదిరి పారిపోయానని మీలాగే వాళ్ళు అనుకుంటే నా వ్యక్తిత్వం గురించి మీకు మరోసారి చెబుతున్నాను వినండి. జీవితంలోని అవాంతరాల్ని సమస్యల్లాగా భరించే నిరాశావాదిని కాను నేను. చాలెంజ్ స్ గా అంగీకరించే ఆప్టిమిస్ట ని . సో ... ఇంకా అడుగుపెట్టకముందే నాకిలాంటి స్వాగతం లభించినందుకు సంతృప్తిపడుతూ మీరు అనుమతిస్తే ముందు చార్జి తీసుకుంటాను . చార్జి తీసుకున్న ఆరుగంటల వ్యవధిలో ....."
"ఏం చేయబోతున్నారు?"
"రణధీర్ ని హత్య చేయడమేగాక నా మీద హత్యా ప్రయత్నం చేసిన లేక చేయించిన వ్యక్తిని గుర్తించి మీకు తెలియపరుస్తాను.
"ఎలా ?" ఆమె నిర్వీణ్ణురాలౌతూనే అంది.
"హంతకుణ్ణి మీకు చూపించక ఎనాల్సిన్ చెబుతాను."
"దెన్ భావరహితంగా అందామె. రేపే మీరు చార్జి తీసుకోబోతున్నారు __ బై " ఫోన్ క్రేడిల్ చేసిన హనిత స్వప్నంలోలా కిటికీ దగ్గరికి నడిచింది.
యుగాంతానికి ముందు స్థితిని గుర్తు చేస్తున్నట్టు దూరంగా సముద్రం చెలియకట్ట దాటే చివరి ప్రయత్నంలా కిటికీ దగ్గరికి నడిచింది.
ఆ స్థితిలో ఆమెకు మరోమారు తన కళ గుర్తుకోచ్చినా, ఆ కళ చివరిలో ఓడ పగిలి సముద్ర గర్భంలో కలసిపోతుంటే ఓ చేయి ఒడ్డు నుంచే సముద్ర మధ్యదాకా విస్తరింస్తున్నట్టు అనిపిస్తూంది.
ఇప్పుడిక కలత అప్పుడు ఆమె దృష్టి సమీపంలో టేబల్ పైన ఉన్న ఓ పైలు మీదికి మళ్ళింది అదే .... ప్యాక్టరీ విజిలెన్స్ ఆఫీసర్ చతుర్వేది ఆ సాయంకాలమే అందించిన రహస్య సమాచారం.
మరో బోర్డు డైరెక్టర్ పైన రేపు సందించబోతున్న బలమైన అస్త్రం.
* * * *
చీకటి నిష్క్రమణంతో వెలుగును పుంజుకున్న ప్రకృతి ఆకాశపు శరపంజరంలోనుంచి మూడు గంటల క్రితమే వెలికి వచ్చిన సూర్యుడి ప్రకాశానికి తాళనట్టు క్రమంగా తెల్లబోతూంది.
ఉదయం తొమ్మిదిన్నర గంటలవేళ .....
యుద్దానికి సన్నద్దమైనట్టు క్రీం కలర్ కాంటేస్సా వేగంగా సాకేత అండ్ కో ఎదమీనిస్ట్రెటివ్ బిల్డింగ్ ముందు. ఆగగానే వచ్చిందేవరో తెలిసినట్టు ఓ సెక్యూరిటీ గార్డ్ పరుగున వెళ్ళి డోర్ తెరిచాడు.
ముందుగా ఒక గంధర్వ కన్యలా హానిత డ్రైవింగ్ సీటులోనుంచి దిగగానే ఆమెను అనుసరిస్తూ కిరిటీ బయటికి వచ్చాడు.
ఆజానుబాహుడైన కిరీటి స్పురద్రూపం లాబీలోని కొమ్దర్నీ చిత్రంగా ఆకట్టుకుంటే , మరి కొందరికి మనిషిగా మారివచ్చిన మిస్సైల్లాఅనిపించింది. అభివాదాల్ని అందుకుంటూ ముందుకు నడిచిన హానిత కిరీటితోబాటు ఎలివేటర్ లో మొదటి ప్లోర్ ని చేరుకొని సరాసరి పర్సనల్ డిపార్ట్ మెంట్ లో అడుగు పెట్టింది.
ఎన్నడూ లేనిది హానిత స్వయంగా ఆఫీస్ లోకి వచ్చేసరికి చీఫ్ పర్సనల్ మేనేజర్ ముందు కంగారు పడ్డారు.
ఆమె ఏ క్షణంలో ఎలా ప్రవర్తింస్తుందో, ఎప్పుడేలాంటి నిర్ణయం తీసుకుంటు౦దో _ ఆయనకి అర్ధంకాని విషయమే కావడంతో. ఎనిమిదిన్నరకల్లా ఆఫీసులో ఉండమని ముందే ఆదేశించేసరికి హడావుడిగా వచ్చేశాడు.
కిరీటిని పరిచయం చేసి దగ్గరుండే అపాయింట్ ఆర్డర్ ఇప్పించి పార్మాలిటీస్ పూర్తీ చేయించింది __ కేవలం అయిదు నిముషాల వ్యవధిలో ఇదంతా ఆమె పర్సనల్ గా ఫాలో కావాల్సిన అగత్యం లేదు. ఈరోజు ఒక వ్యక్తిపైనఅంత శ్రద్దని కనపరచడం _ ఆ తరువాత చాలా చర్చనీయా౦శ మైపోతూందని ఆమె సైతం ఊహించి వుండడు.
తొమ్మిది గంటల వరకూ ఒక మామూలు వ్యక్తి మాత్రమె అయిన కిరిటీ సరిగ్గా తొమ్మిదీ పది నిముషాలకి ఓ పెద్ద బిజినెస్ గ్రూఫ్ టాఫ్ ఎగ్జిక్యూటివ్ గా అతి కీలకమైనా స్థానంలో అడుగు పెట్టాడు.
పర్సనల్ ఆఫీసులో నుంచి బయటికి వస్తూ అంది హానిత _ "మనంముందు గాజువాకలో ఉన్న మెషిన్ టూల్ ప్యాక్టరీకి వెళ్తున్నాం . మేనేజరియల్ కేడర్ లో ఉన్న ఎగ్జిక్యూతివస్ కి మిమ్మల్ని పరిచయం చేయాలని 'పార్మల్ గెట్ టూగేదర్' లాంటిది ఏర్పాటు చేశాను. మీరుండే ఆఫీసుకూడా ఆ ప్యాక్టరీ ఎడ్మినిష్ట్ర్టివ్ బిల్డింగ్ లోనే కాబట్టి తక్కిన డిటైల్స్ మీ ఛాంబర్ లోనే మాట్లాడుకోవచ్చు."
అంతకన్నా ముందు బోర్డు డైరెక్టర్స్ కి ఓ మారు పరిచయం చేసుకుని వెళ్ళడం బెటరనుకుంటాను."
కిరిటీ యధాలాపంగా అన్నా ఇది ఆమె ఊహకందని అభ్యర్ధన కావడంతో ఓ క్షణంపాటు విస్మయంగా చూసింది.
"మీకో మాటిచ్చాను."
"ఏమిటిది?" హానిత రెప్పవాల్చకుండా చూసింది.
"అదే చార్జీ తీసుకున్న ఆరు గంటల్లో హంతకు డెవరున్నదీ చెబుతానని."
హానిత మరింత నిర్వీణ్ణురాలైంది . "అది చెప్పడానికీ , బోర్డు డైరెక్టర్సుని పరిచయం చేసుకోవడానికి సంబంధమేమిటి?"
"కొన్ని ప్రశ్నలకి జవాబులు సందర్భోచితంగానే ఉండాలి మిస్ హనితా. ఫర్వాలేదు. ఇంకా ఆరు గంటల వ్యవధి ఉందిగా. వెంటనే కాక పోయినా. ఈ సాయంకాలానికల్లా వాళ్ళని నేను కలిసే ఏర్పాటు చేయండి."
ఏ నమ్మకంతో కిరిటీ ఇలా మాట్లాడుతున్నదీ ఆమెకు అర్ధం కాలేదు. కాని అతన్నంత పనీ చేయగల సమర్దుడే అని మనసు చెబుతూంది. ఒకవేళ అతను ఆ వ్యక్తి ఎవరూ అన్నది నిరూపించగలిగినా పర్యవసానం ఎలా వుంటుందీ అన్నది ఆమె ఊహకీ అందడంలేదు.
"బహుశా ఇప్పుడు మీ రెక్కువ అందోళన పడుతున్నారనుకుంటాను." ఆమెను పూర్తిగా చదివేయగలిగినట్టు వెంటనే అన్నాడు. "ఈ సంస్థలో నేను అడుగు పెట్టిన రోజునే ఒక బాంబ్ షేల్ తో అందర్నీ కంగారు పెట్టడం నా అభిమతం కాదు మేడమ్. నాకు తెలుసు హంతకు డేవరన్నదీ నేను గ్రహించి బాహాటంగా తెలియజేస్తే అది మరిన్ని అనర్ధాలకు దారి తీస్తుందని . కేవలం మీకుమాత్రమే రహస్యంగా వివరిస్తాను __ మాటిచ్చాను కాబట్టి దానివల్ల లాభనష్టాలు బేరీజు వేసుకుని ఆ తరువాత ఏం చేయాల్సిందీ మీకే వదిలిపెడతాను. ఓ.కే?"
ఒక పెద్ద సంస్థలో బాధ్యాతయుతమైన వ్యక్తిలా అంటుంటే సాలోచనగా తల పకిమ్చిమ్ది "వెల్ .... మధ్యాహానం మూడు గంటలకల్లా అందర్నీ సమావేశపరుస్తాను."