Previous Page Next Page 
అసురవేదం పేజి 21

   

   వాచీ చూసుకున్న కిరిటీ "నో ప్రాబ్లమ్..... అప్పటికి గడుపులో పూర్తయ్యేది కేవలం అయిదు గంటలేగా? న పరిశోధనకి మరో గంట టైం ఉంటుంది" అన్నాడు నెమ్మదిగా .

    ప్రతి విషయాన్నీ స్థూలంగా మేథమేతికల్ గా ఆలోచించే కిరిటీ కళ్ళలోకి చూడలేనట్టుగా తల మరేదో తిప్పుకుంది. చాలా త్వరలో ఒక అసాధారణమైన మార్పుకి అతనో కారణం కాబోతున్నాడు. ఆ మార్పు తనలోనా లేక సంస్తలోనా అన్నది ఇతమిద్దంగా ఆమె తేల్చుకోలేక ఆలోచిస్తుండగానే "వెళ్దామా?" అన్నాడు.

    హానిత కదిలింది. ఆమె సమీపంలో నడుస్తున్న కిరిటీ సన్నగా కంపిస్తూ ఇంటర్వ్యూ గదిలో అడుగు పేట్టినట్టు లేదిప్పుడు భూగోళ వాతావరణాన్ని పరిశోధించటానికి అంతరీక్షంలోకి బయలుదేరిన ఉపగ్రహంలా అనిపిస్తున్నాడు.

    హానిత ఆలోచిస్తూంది తన చుట్టూ తను తిరిగే భూమిలా అతన్ని గురించే .

    కారులో కూర్చుని నిశితంగా బయటికి చూస్తున్న కిరిటీ భూమిని తన చుట్టూ తిప్పుకునే సూర్యుడిలా కనిపించాడు ఓ క్షణంపాటు.

    అసంకల్పితమైన ఈ ఆలోచన ఏ మనసు పొరల్ని తాకిందో హానిత వేమత్నే తల తిప్పుకుంది.

                                       *    *    *    *    *

    సరిగ్గా పది గంటల పదీహేను నిముషాలకి హానిత కిరిటీతో బాటు సాకేత మెషిన్ టూల్స్ ఎడ్మినిస్ట్రెషన్ బిల్డింగ్ లో అడుగు పెట్టింది.

    కారిడార్ నిలబడ్డ డిపార్ట్ మెంట్ మేనేజర్స్ ని ఒక్కొక్కర్నీ పరిచయం చేసిన కాన్ఫరెన్స్ హాలువేపు నడుస్తుంటే వారించాడు కిరీటి "ముందు ప్యాక్టరీ రోవ్డ్స్ కి వెళదాం."

    కాదనలేకపోయింది. నిజానికి ఆ రోజు షెడ్యూల్ ఇది లేదు. స్టేయిర్ కేస్ మీదనుంచి ప్రొడక్షన్ ప్లావుర్స్ వేపు దిగుతూ నెమ్మదిగా అంది __ "గెట్ టుగెదర్ తరువాత వెళ్ళొచ్చుగా ....? హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేమిటి?' అని.

    వెనుక ఫాలో అవుతున్న మేనేజర్స్ మరీ సమీపంలో లేరన్న నిర్ధారణకు వచ్చాక తనూ నెమ్మదిగానే జవాబు చెప్పాడు. "తీసుకునే నిర్ణయాలు అర్ధవంతంగా ఉండాలి తప్ప టాఫ్ ఎగ్జిక్యూటివ్ అన్నవాడు తక్కిన వాళ్ళకి పూర్తిగా అర్ధం కాకూడదు. మిస్ హనితా. తొలి పరిచయంలోనే నన్ను కొలిచేస్తే నా కొలతల మేరకు వాళ్ళు ఎదగాలేరు. సో .... ఇలామ్టి మార్పు తప్పనిసరైంది."

    ఓ క్షణంపాటు ఆగి అతని కళ్ళలోని భావాల్ని స్పష్టంగా చదవాలనుకుంది కాని ఇక్కడ అవకాశం లేదు. అయినా క్రీగంట అతడ్ని చూసినప్పుడు హుందాని డామినేట్ చేసే చిలిపితనం కనిపించింది. ఇప్పుడు ఆమెకి మరింత స్పష్టంగా అర్ధమైందోక్కటే, అతను ఓ అర్ధంకాని మనిషిని.

    పోత ఇనుము కేస్టింగ్స్ తయారుచేసే పౌండరీ మొదలుకుని మార్కింగ్ సేక్షనూ, దాకా నెమ్మదిగా నడుస్తుంటే ఒక్కో డిపార్ట్ మెంటు మేనేజరూ వారి వారి విభాగాలకి చెందిన వివరాల్ని తెలియజేస్తేన్నారు.

    ఓ నిముషంపాటు ఎసెంబ్లీ లో ఆగిన కిరీటి సగం ఎసెంబిల్ అయిఆగిన రెండు లెల్ మెషిన్స్ వేపు చూస్తూ __ "అవి అలాగే వదిలి పెట్టేశారేం?" అన్నాడు ఎసెంబ్లీ మేనేజరు తో.

    "హెడ్ స్టాక్ మేషినింగ్ అయి ఇంక రాలేదు. "వెంటనే జవాబు చెప్పాను.

    "పౌండరీ నుంచి కేసింగ్ ఈరోజే వచ్చింది ." తను సకాలంలో మేషనింగ్ పూర్తీచేసి ఎసెంబ్లీ కి ఎందుకు పంపలేకపోయిందీ మెషిన్ షాప్ మేనేజర్ వివరిస్తుంటే పౌండరీ కాస్టింగ్స్ తయారు చేయడానికి అవసరమైన మరో ముడి పదార్దాన్ని పర్చేజ్ డిపార్ట్మెంట్ బయటి నుంచి రప్పించడంలో ఆలస్యం చేసిందని పోమ్డ్రీ మేనేజర్ తెలియచేశాడు.

    చాలా సహజమైన ఈ విషయాలలో కిరీటి ఎందుకింత ఆసక్తిని ప్రదర్శిస్తున్నదీ హనితకి అర్ధం కావడంలేదు.

    "వెల్" హానితతోపాటు షాప్స్ లో నుంచి ఎడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వేపు కదిలిన కిరిటీ మరో అయిదు నిముషాలలో కాన్ఫరేస్ హాలును చేరుకున్నాడు.

    నడుస్తూండగానే హానిత చెప్పింది _ "సుమారు పాతిక ఎకరాల స్థలంలో ఉన్న మెషిన్ టూల్ ఫ్యాక్టరీలోని కార్ముకుల సంఖ్య పడుహేను వందలదాకా ఉంటుంది. సంవత్సరానికి అయిదు కోట్ల రూపాయల టర్నోవర్ , అయినా కొన్నేళ్లుగా నష్టాల్లో నడుస్తూంది."

    అవే విషయాలను మననం చేసుకుంటూ చిన్న డయాస్ పైన హనితతో బాటు కూర్చున్న కిరీటి తనకు అభిముఖంగా ఆసీనులైన డిపార్ట్ మెంటల్ మేనేజర్స్ ని చూస్తూ అన్నాడు.

    "వెల్ .... డియర్ ప్రెండ్స్ ! అనుభవంలో తలపండిన మిమ్మల్ని కలుసుకున్నందుకు, మీతో కలసి పనిచేసే అవకాశం నాకు లభించినందుకు చాలా ఆనందంగా వుంది." మాటల్లో క్లుప్తతకి ప్రధానాన్యాన్నివ్వడంలో చాలా జాగ్రత్త పడ్డాడు. "ప్యాక్టరీ వ్యవహారాల లోతుల్లోకి పూర్తిగా నేనింకా వెళ్ళకపోయినా ఎపారెంటుగా పనిచేస్తున్నాయి."

    అన్ని విభాగాల మేనేజర్లూ ఈ అభినందనకి ఆనందించినా ఎక్కువ విస్మయం చెందింది హానిత మాత్రమే. అతని ఆలోచనల్లో ఎక్కడో పోరాపాటు దొర్లిందని అనుకోకుండా ఉండలేకపోయింది.

    "ఇప్పుడు మీ ఎఫీషీఎన్సీస్ గురించి ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్పాలనుకుంది" గొంతు సవరించుకున్నాడు. "ఒక ఫ్యాక్టరీలో ఒధ్యోగానికి ప్రిపెరవుతూ బట్టలు చెక్ చేసుకున్నాడు. ఒక చిన్న టైలరింగ్ మేషన్ తో కుటుంబాన్ని ఈడ్చుకు వస్తున్న తల్లి కుట్టిన కొత్త షేంట్ ఇంటర్వ్యూ కి వేసుకువెళ్ళాలనుకుంటే అది బాగా _ అంటే అవసరానికి ఓ ఆరంగుళాల ఎక్కువ పొడవుగా అనిపించింది తల్లికి ఆ విషయం చెప్పలేకపోయాడు. చెబితే ప్రయత్నాన్ని కించపరిచినట్టుందేమో అని తనకి టైలరింగ్ లో అనుభవం లేదు. కాని ఇంట్లో ఉన్న ఇద్దరు అక్కలకీ, అతని తమ్ముడుకీ టైలరింగ్ మెషిన్ ఆపరేట్ చేయడం వచ్చు. రహస్యంగా పెద్దక్క నడిగాడు _ పొడవు తగ్గించి కుట్టమని. తనకు ఖాళీ లేదంది. చిన్నక్క నడిగాడు. అమెనుమ్చీ అదే జవాబు వచ్చింది. ఆ రాత్రి తమ్ముణ్ణి రిక్వెస్ట్ చేస్తే పరీక్షలకి చదువుకోవాలి కాబట్టి తనకీ వీలుపడదన్నాడు. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక పెద్దక్క లేచింది. ఎంతైనా ఇంటర్వ్యూకి వెళుతున్న తమ్ముడూ తనని మాత్రమె అడిగాడన్న ఆలోచన రాగానే తమ్ముడి మీద ప్రేమతో వెళ్ళి షేంటు ఆరంగుళాల పొడవు తగ్గించి కుట్టేసింది. మరో గంటకి నిద్ర లేచిన చిన్నక్కా ఎప్పుడో తెల్లవారు జమున జ్ఞానోదయమైన తమ్ముతూ అంతా సానుభూతి వర్షించి తలో ఆరంగుళాలు కట్ చేసి కుట్టేశారు" ఓ క్షణం అగేడు సాలోచనగా.

    అంతా ఆసక్తిగా వింటున్నారు.

    "అంటే షేంట్ పొడవు ఇప్పుడు అవసరానికి ఓ అడుగు తక్కువై ఇంచుమించు హాఫ్ పేంటులా తయారైంది. విడిగా అందరూ సానుభూతితో, బాధ్యతతో సహాయం చేశారు. అయినా ఫలితం శిఇంయం. షేంటుని అతను ఉపయోగించుకోలేకపోయాడు. ఈ కథ ద్వారా మనం తెలుస్కోవాల్సిన ముఖ్యమైన నీటి సహాయం ఒక్కటే కాదు. పరస్పర మైనా సహకారం కావాలి. అలాగే అనిపించి౦ది ఇప్పుడు నేను చూసిన  ఫ్యాక్టరీ పరిస్థితి కూడా."

    అప్పటికి తేరుకుంది హానిత. ఉన్న లోపాన్ని చాలా పాజిటివ్ గా వ్యక్తం చేస్తున్నాడు కిరీటి .

    "అన్ని విభాగాల్లోనూ ఫ్యాక్టరీ కోసం పాటుపదాలన్న కో _ ఆపరేషన్ కనిపించింది కాని ఒక విభాగానికీ, మరో విభాగానికీ మధ్యకో _ ఆర్దినేషన్ లేదు. దానికి అవసరామిన కమ్యూని కేషన్ లేదు. కాబట్టే లిప్తపాటు అందర్నీ పరిశీలనగా చూస్తూ అన్నాడు __ "అక్కడ ఎసెంబ్లీ రెండు మెషిన్స్ సగంలో స్తబ్దంగా పది వున్నాయి. కారణమా అడగ్గా మీ నుంచి వచ్చిన జవాబులు రాజు ఏడుగురు కొడుకులూ ఏడు చేపల జ్ఞప్తకి తెచ్చాయి. ఉత్పదిక శక్తిని పెంచుకోవడానికి కావలసింది ఉత్పత్తి మాత్రమే కాదు __ సమన్వయ శక్తీ కావాలి సో .... ఈ రోజు నుంచి ప్రతి ఉదయం ఏ రోజు కారోజు ఏం చేయబోతున్నదీ కలసి నిర్ణయిద్దాం. ప్రతి సాయంకాలం అనుకున్నది ఎంతవరకూ సాధించిందీ తెలుసుకుందాం."

    చాలామంది మోహాలు వివర్ణం కావడం సునాయాసంగానే గ్రహించాడు.  కిరిటీ. ప్రతిక్షణమూ తన చేతుల్నీ, తనను గమనించే ఓ ఎగ్జిక్యూటివ్ విషయంలో డిపార్ట్ మెంట్ హెడ్స్ ఎంత కలవరపడేదీ కిరీటి తెలీని విషయము కాదు.

    అచేతనంగా ఉన్న ఏ వ్యక్తితమైన దారుణంగా కదిలించే న్యూటన్ మొదటి సూత్రాన్ని ఇక్కడ అలా సంధించాడు కిరీటి.

    మరో అయిదు నిముషాలలో తన ఛా౦బర్ ని చేరుకొని కిరీటి _ "వెల్ ... బాగుంది " అన్నాడు రివాల్వింగ్ ఛేయిర్ లో కూర్చుంటూ .

    "ఏమిటీ?" అడిగింది హనిత.

    "సింహాసనం" ఇప్పుడు కిరీటిలో ఇందాకటి సీరియస్ నేస్ లేదు. అతని నవ్వులో, చూపులో అప్పుడేప్పుదో అతని తల్లితో బాటు సముద్రపు ఒడ్డున చూసిన ఆకతాయితనం కనిపించింది.

    క్షణక్షణానికీ ఓ అర్ధంకాని పజిల్ గా అనిపిస్తుంటే మరేటో చూస్తూ అంది __  "ఈ రోజే మీరు మీ క్వార్దార్స్ ల్ చేరొచ్చు " కంపెనీ అత్యున్నత అధికారిగా బీష్ లో జే.జి. ఎమ్. కోసం ఎలాట చేయబడిన బంగ్లా గురించి చెప్పింది "సరిగ్గా మూడు గంటలకి డైరెక్టర్స్ టో సమావేశం ఏర్పాటు చేయబోతున్నాను" పైకి లేచింది ఇక వెళ్ళాడనికన్నట్టుగా __ "అసలు హంతకుడెవరో మీరు గుర్తించబోతున్నారు."

    "గుర్తించాక మీరు నాకు ...."

    "మీకు ....." హనిత భ్రుకుటి ముడిపడింది.

 Previous Page Next Page