Previous Page Next Page 
అసురవేదం పేజి 19

  

   అప్పటికే ఆమె శరీరం స్వేదంతో తడిసిపోయింది __ భాస్వరంలా మనసు మండిపోతుంటే .

    డిజినల్ వాచ్ రాత్రి పన్నెండున్నర గంటల్ని చూపిస్తూంది.

    జరగబోయే ఒక ఉపద్రవానికి సకేతంగా పదేపదే కలతగా తెలియచెప్పే ప్రికాగ్నిషనో లేక నిక్షిప్తమైన మనసు పొరల్లోని అందోళనకి అంతశ్ఛెతన అందించే రూపమో ఆమెకు తెలీదు.

    ఆ నిశ్శబ్దపు చీకటి రాత్రి నిద్రకు వెలి అయినట్టు నెమ్మదిగా నడిచి తండ్రి బెడ్ రూంని చేరుకుంది.

    మసక వెలుతురులో నిద్రపోతున్నట్టున్నా అయన ముఖంలో ప్రశాంటాటా లేదు. పగటి వెలుగులో కనిపించని విరామమెరుగని అరాటము చాల స్పష్టంగా ద్యోతకమౌతుంది.

    ఏనాడూ ప్రశ్పుటంగా బయటపడని వ్యక్తిత్వం ఆయనది. తన అందోళననీ, కళవెనుక అశాంతినీ పెదవుల మాటున దాచుకుని ఏ సమస్యా తెలీనది కాదు.

    ఆదిలో పట్టించుకోలేదు. కాని అయన గుండె నిబ్బరంచేరిగిపోతున్నట్టూ, నవ సడలినట్టూ హఠాత్తుగా గుండెజబ్బుకు లోనైతే అది మామూలుగా వచ్చింది చూసేవరకూ బోధపడలేదు. అసలు కారణం ఏమిటి అన్నది.

    ఆ డైరీలో  సైతం ఎవర్ని అయన నిందించలేదు. కాని పెరుగుతున్న సమస్యల్లో కూలిపోవడానికి సిద్దంగా వున్న తన సామ్రాజ్య వైభవంపించలేదు. ఇంకా ఏంచేయాలి అన్న మీ మాంస తప్ప ఏం జరుగుతున్నా అన్న సత్యాల్ని విశదీకరించాలన్న ఆలోచనలేదు.

    అది కూడా కాదు ఆమెను అంతగా కదిలించింది.

    "నేను తప్ప చేశానా" అన్న వాక్యం ప్రతిపేజీ చివర్న.

    అదే హనితను కొన్ని రోజులపాటు దారుణంగా అలిచింపచేసింది. ఏ విషయంలో ఆయనంతా కలవరపడుతున్నదీ తెలుసుకోవాలని వున్నా అడిగే సాహాసం చేయలేకపోయింది. మూడు దశాబ్దాల అవిరళ కృషితో ఎందరికొ ఉపాధి నందించగల ఓ బిజినెస్ ఎంఫైర్ ని అంచెలంచెలుగా నిర్మించుకుంటూ ఎదుగుదలవేపు సాగించిన ప్రయాణంలో కొన్ని అనుకోకుండా వేసే తప్పటడుగులు తప్పనిసరి అయినప్పుడు, ప్రత్యేకించి ఆ వాక్యం ప్రతి పేజీలోనూ రాయాల్సిన అగత్యము లేదు.

    ఏ అంతర్మధనంతో ఆ వాక్యం రాస్తున్నారాయన.

    మానసికంగా అయన రోజు రోజుకీ క్షీణించిపోవడాన్ని గమనించకనే హనిత రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత తనే ప్రక్షాళన కార్యక్రమంలో బిజినెస్ పునర్నిర్మాణం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్నది కూడా.

    "అపర్ధాలకి జంకుతూ నిర్ణయాలని నెట్టుకుంటూ కాంప్రమైజ్ అయిన నెహ్రూని క్షుణ్ణంగా అర్ధం చేసుకున్న ఇందిరా ప్రియదర్శిని తండ్రి స్థితిని, తను పాఠంగా మార్చుకుంది. మీలాగే ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించి తిరుగులేని స్థాయికి ఈ దేశపు ఔన్నత్యాన్ని....."

    ఆ క్షణంలో  ఆమెకు కిరిటీ మతలుజ్ఞప్తికి రావడం యాదృచ్చికము కాదు. అతి స్వల్ప కాలంలోనయినా ఆమెను సరిగ్గా అర్ధం చేసుకున్నదీ, ఆమె చర్యల్ని సమర్ధించి అభినందించిందీ అతనోక్కడే. తను బురదలో రాయి విసురుతున్న  విషయం తనకి తెలీనది కాదు. కాని మరుక్షణం తనపైకి వచ్చిపడిన బురదని నిజాయితీగా తుడిచి, తన చర్యని ఖండించమని ఒక్క తోడుకోసం తాను అహర్నిశలూ కోరుకుంటే అది కిరిటీ రూపంలో దక్కబోతూంది.

    హఠాత్తుగా ఆమెలో ఉద్విగ్నత పేరుకుని అది ఏ స్థాయికి చేరుకుందీ అంటే అది రాత్రి _ అతను నిద్రపోతుంటాడేమో తెలిసి కూడా వెంటనే మాట్లాడాలనిపించింది.

    అది సభ్యతా సభ్యతల ప్రశ్నకన్నా ఎక్కువ సందిగ్ధతకే లోను చేసింది. క్రమంగా కోరిక ద్విగుణీకృతమౌతుంది.
   
     ఆ క్షణంలో అలాంటి ఆలోచన ఎందుకు కలిగిందో , అదెందుకంత ఉధృతమౌతుందో ఆలోచించకలేకపోతూంది.

    ఇష్టమయినది చేయడం స్వతంత్రమైతే, చేసింది ఇష్టపడటం అనందం. అదే సరిగ్గా అలాంటి భావమే ఆమెను తొందరచేసింది. బెడ్ రూంలోకి నడిచింది వెంటనే.

    రిసీవరు అందుకోబోతుంటే విచక్షణ వారించింది. అదీ అరక్షణం పాటే. ఎన్నడూ లేంది ఎందుకిలాంటి భావోద్వేగం ఆమెను కలవరపరుస్తూన్నదీ మాటల్లో వ్యక్తం చేయలేని విచిత్రమయిన స్థితి అది.

    ఇక జాప్యం చేయలేదు. సాలోచనగా డయల్ చేసింది. కొన్ని క్షణాలు విరామం తర్వాత బడలికగా ఆపరేటర్ కంఠం వినిపించింది.

    "ప్లీజ్  కనెక్ట్ మీ టు ....."

    "ఓ నిముషంపాటు రింగైన చప్పుడు.

    బహుశా నిద్రపోతున్నాడేమో అనుకుంటూ ఫోన్ క్రేడిల్ చేయబోతుంటే వినిపించింది __ "కిరీటి హియర్" అని.

    "సారీ ..... డిస్టర్బ్ చేసినట్టున్నాను ..... హనిత తత్తరపాటుగా అంది. బహుశా నిద్రపోతున్నారేమో కదూ!"

    అరక్షణం జాప్యం తరువాత అన్నాడు __ "ఆశ్చర్యంగా ఉంది."

    "ఇలాంటి సమయంలో ఫోన్ చేయడమా?"

    "కాదు. సరిగ్గా ఇప్పుడు ఫోన్ చేయడం."

    హనితకీ అర్ధం కాలేదు అతనేమంటున్నదీ.

    "అవును మిస్ హనితా! కొద్దిగా అటూ ఇటూ అయ్యుంటే ఈ ఫోన్ లో మీకు నా చావు కబురు తెలుసుండేది."

    "వ్వాట్?" హనిక అప్రతిభురాలై౦ది. ఏమిటీ ఏం జరిగింది?"

    "చిన్న హత్యా ప్రయత్నం!" కిరీటి గొంతులో అందోళన లేదు. మామూలుగా వినిపించే ప్రశాంతతే. "నన్ను బాల్కానీలో నుంచి తోసేయాలని ట్రైచేసి ఫెయిలయ్యారు."

                     
    హనిత ఫాలభాగంపైన స్వేదం పేరుకుంది ముత్యాల్లా. "మిస్ హనితా .... సిక్త్ సెన్స్ మీద మీకు నమ్మకముందా?"

    హనిత ఇంకా తేరుకోలేకపోతూంది.

    "ఈ రాత్రివేళ నాతో మీరు మాట్లాడాలని మీకు అనిపించడం సిక్త్ సెన్స్ ప్రభావమే అయితే ఇందాక నన్ను నేను కాపాడుకోవడం కూడా దాని ప్రభావమే."

    హనిత నిశ్ఛేష్టురాలై వింటూంది. నిజమే! ఇంత స్వల్ప పరిచయంలో వయసులో వున్న తను అతనితో మాట్లాడాలని ఇలాంటి రాత్రి వేళ ప్రయత్నించాల్సిన అగత్యం లేదు. అది తొందరపాటుగా అనుకుంటూ ఫోన్ చేసింది.

    "ఆర్యూ ఓ.కే?" సన్నగా కంపించిందామె కంఠం. "రమ్మంటారా?"

    "మీరా?" నవ్వేశాడు. "మరో తప్పు చేయాలనుకొంటున్నారా?"

    "తప్పేమిటి అసలు?"

    "చూడండి మిస్ హనితా! ఇప్పటికి మీరు రెండు తప్పులు చేశారు __ ఒకటి ఇంటర్వ్యూలో నన్ను ఘాటుగా సమర్ధించడం , రెండోది నన్ను పర్సనల్ గా బీచ్ లో కలియడం ."

    "నో!" ఆవేశంగా జవాబు చెప్పింది. "అని నేను తప్పులుగా అనుకోవడంలేదు.

    "కాని ప్రత్యర్ధి ఇదంతా తప్పుగానే భావించాడు."

    "వాట్ డూ యూ మీన్?"

    "సింపుల్ మిస్ హనితా.... నిన్నగాక మొన్న మీ ప్యాక్టరీ ఎంప్లాయీ అయిన రణధీర్ ను ఇలాగే హొటల్లో అతని గదిలోనుంచి నెట్టే శారు. ఇప్పుడు నీమీద అలాంటి ప్రయత్నమే జరిగింది......"

    హనితలో తొలిసారి ఆమె వూహించలేని భయవిహల్వత అంతకు మిమ్హి ఈ విషయాలన్నీ కిరీటికేలా తెలుసా అన్న ఆశ్చర్యం .

    " నా గురించి నేను భయపడటం లేదు మిస్ హనితా. నా అంచనా తప్పు కాకపోతే ప్రత్యర్ధుల అసలు టార్గెట్ మీరు. అందుకే చెట్టుమొదలు నరకడం సాధ్యం కాకముందు కొమ్మల్ని వేరుచీ ప్రయత్నాలు ప్రారంభించారు."

    "కాని రణధీర్ నేను టెర్మినేట్ చేసిన వ్యక్తి."

    "కాబట్టే హత్యకు గురయ్యాడేమో!"

    "మీ ఎనాలిసిస్ నాకు అర్ధం కావడంలేదు."

    "ఒక స్థానంలో సుఖంగా బ్రతుకుతున్న ఏ వ్యక్తీ ఒక తాత్కాలికమైనా సుఖంకోసం స్థానాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకుని మీ ముందుకు వాస్తవంలో రావలనుకుని ఉంటాడు. అందుకే హతమయ్యాడు."

    హనిత వేగంగా ఆలోచిస్తూంది.

    "ఇక్కడ అనుమానించాల్సి౦ది ముఖ్యంగా రణధీర్ ని కాదు హనితా. రణధీర్  ని తప్పు చేయమని మొదట ప్రోత్సాహించిన వ్యక్తుల్ని ఇట్స్ ఇంటలిజెంట్ ఏక్ట్ టూ అబ్జర్వ్ రూలర్ నాట్ రూల్ద్."

    ఉలిక్కిపడింది హనిత. ఆ చివరి వాక్యంతో ఆమెకు చాలా స్పురించింది.

    పాలితుణ్ణి కాదు __ పాలించేవాణ్ణి పరిశీలించాలి.

    అవును. రణధీర్ చేత అలాంటి అక్రమానికి పాల్పడటంలో బాధ్యుడులెవరో తను తెలుసుకోబోతున్నానని తక్కిన బోర్డు డైరెక్టర్స్ తో చెప్పిన రాత్రి అతను హత్యకు గురయ్యాడు. అంటే అతని ఏక్ట్ లో భాగస్వామి అయిన వ్యక్తి ఈ హత్యాకాండకు సిద్దపడ్డాడా ?

    ఆమె ఆలోచనల నుంచి ఇంకా తేరుకోలేదు.

    "సో .... మిస్ .... హనితా .... యిప్పుడు నాకు అనిపిస్తున్నది. ఒక్కటే ... మీ గుడ్ లిక్స్ లోకి వచ్చిన నామీద హత్యా ప్రయత్నం జరిగింది. బహుశా మీ గుడ్ లుక్స్ లోకి రావాలనుకున్న రణధీర్ ని కూడా ఇలానే హత్య చేసి ఉంటాడు. ఇది కేవలం తర్కం మాత్రమే ....."

    "కాని" ఇంకా ఆమె నమ్మలేకపోతూంది. "ఇంత చిన్న కారణానికి హత్యలదాకా వేళతారంటే ఎలా?"

 Previous Page Next Page