గౌతం చకితుడై పోయాడు. శరీరమంతా సిగ్గు తెరలు వ్యాపించి ఒక విధమైన మధురానుభూతి కలిగింది.
"ఇదేమిటి" అన్నాడు.
"నాకోసం యింత శ్రమ తీసుకుని వొచ్చారు. కొంచమైన అతిధిమర్యాద చేయవద్దా."
అతనేదో అనబోయి వూరుకున్నాడు.
"ఉండండి కాఫీ కస్తాను" అంటూ ఆమె స్టవ్ దగ్గర కెళ్ళి అటూ ఇటూ తడిమిచూసి అయ్యో అగ్గిపెట్టె లేనట్టుందే అని అతనివంక చూసి మీ జేబులో అగ్గిపెట్టె వుంటే యిలా ఇవ్వండి __" అంది చేయిజాచి.
"లేదు" అన్నాడు గౌతం సిగ్గు పడుతున్నట్లుగా.
"అరె ౧ మీరు సిగరెట్టు కాలుస్తారనుకున్నాను. అలవాటు లేదన్నమాట ఉండండి. యిప్పుడే వస్తాను" అంటూ బయటకు వెళ్ళి రెండు నిముషాల్లో తిరిగి వచ్చింది.
నేలమీద కూర్చుని స్టవ్ వెలిగిస్తూ అంది. కాఫీ అంటే నాకు ప్రాణం రోజుకి పదిపదిహేను సార్లయినా తాగుతూ ఉంటాను. మనిషన్నాక రవ్వంత దురలవాటు వుండాలండి లేకపోతే శోభించదు.
"మీ రింట్లో వంతరిగా వుంటారా?" అనడిగాడు గౌతమ్ ఏమనటానికి తోచక.
"అవును . నాకెవరూ లేరు."
"ఎవరూ లేరా?"
"అవును. వున్నావారందరిని వోదులుకుని వొంటరిగా వచ్చేశాను."
"ఎందుకని?"
"బహుశా వొంటరిగా వుండాలనుకోవడం మనకి, మనం తప్ప ఇతరుల్లో ఈ గుణం నచ్చక పోవడం మానసిక రుగ్మత కావచ్చు. అలా తి రుగ్మత నాకూ వుండి వుంటుంది" అంటూ కాఫీ తయారు చేసి రెండు కప్పుల్లో పోసి తీసుకొచ్చింది.
అతనో కప్పు అందుకున్నాడు.
ఆమె మంచంమీద కూర్చుని _ '"బహుశా అంత రుచిగా వుండి వుండదు. చిక్కటి పాలు, మంచి కాఫీ పొడి యీ రెండూ నాకు దొరకవు" అంది.
"బాగానే వుంది" అన్నాడు.
ఆమె అతని ముఖంలోకి నవ్వి కాఫీ కంచం త్రాగాసాగింది.
"ఇందాక రుగ్మత అన్నారు, మిమ్మల్ని చూస్తె అలాంటేదేమీ మీలో వున్నట్లు కనిపించడం లేదే."
"నలుగురితో వుండకుండ ఎవ్వరితో కలవకుండా వొంటరిగా వుండాలనను కోవటం రుగ్మత కదా?"
బహుశా కాకపోవచ్చు . కొందరివిషయంలో ."
"ఎందుకని?"
ఏదయినా లక్ష్యంతో పని చేసి వుండవచ్చుగా .
"లక్ష్యమా?" అంది విరాజి అలోచిస్తున్నట్లు . ఆమె విశాలమైన కళ్ళు పాతజ్ఞాపకాలతో రెప రెప లాడాయి.
"చిన్నప్పటి నుంచీ ఎంతో కష్టపడి నాట్యం నేర్చుకున్నను మరో ప్రపంచంతో సంబంధం లేకుండా, అదో తపస్సుగా నేర్చుకున్నను. కాని దాని ఫలితాన్ని నేననుకున్న విధంగా రూపొందించడానికి నాకు ననరలు సమకూరలేదు. అభిప్రాయాలని యింట్లో అందరూ వ్యతిరేకించారు. వాళ్ళ అభిరుచుల ప్రకారం నన్ను మలచుకోలేక పోయాను. ఆ వాతావరణంలో వుండలేక యిల్లు విడిచి వచ్చేశాను."
చీకటి పడటం వల్ల ఒకరి ముఖం సరిగ్గా కనబడటంలేదు . విరాజి కాఫీ త్రాగడం ముగించి.లేచి స్టూల్ మీద వున్న లాంతరు వెలిగించి అలసిపోయినట్టు కనబడే కళ్ళు అదో వింత శోభాలా గోచరించింది విరాజి.
"గమ్మత్తేమిటంటే నాట్యంలో కొత్త దానానిని చూపిస్తే చూపించవచ్చుగానీ దాని ద్వారా చైతన్యం తీసుకు రావాలను కోవటం అత్యాశే అవుతుంది. ఒక్కోసారి ఆలోచిస్తుంటే ప్రవాహానికి ఎదురీదడం అసంభవమేమోననిపిస్తుంది. కాని సాహిత్యం విషయం వేరు. సాహిత్యంలో ఎన్ని ప్రయోగాలైనా చేయవచ్చు. సాహిత్యాన్ని జీవితానికి దగ్గరగా తీసుకురావచ్చు. కొత్త వెలుగులతో జిగేలు మనపించవచ్చు. సమాజంలో చైతన్యం తీసుకురావచ్చు."
"ఈ సందేహం నా కెప్పుడూ వోస్తూ వుంటుంది. సాహిత్యంలో ఏదో మార్పు తీసుకురావాలని మన ఆరాట పడతాం. కాని __ దానికంత విలువుందా" అమి అన్నాడు గౌతమ్.
"ఉంది" అన్నది విరాజి చాల నమ్మకంగా , ఇక్కడ రెండు విశేషాలు గమనించాల్సి వుంది చెడ్డ సాహిత్యం ప్రభావం సమాజంమీద ఎంతవరకు వుంటుంది? అందరూ అనుకున్నట్లుగా యీ సాహిత్యం చదివి చెడిపోయే వాళ్ళ సంఖ్య గణనీయంగా వుండక పోవచ్చు. చాలామంది కాలక్షేపానికి తాత్కాలికానందానికి వాటిని చదివి, వొదిలేస్తూవుంటారు. అలాంటి సాహిత్యం ఓ నిర్దుష్టమైన ఎయింలేకుండా రాసే రచయితలు గ్లామర్ రచయితులుగా ప్రఖ్యతలుగా కీర్తీ డబ్బు సంపాదిస్తు వుండవచ్చు. కాని పాఠకుల బలహీనతలతో వాళ్ళు ఆడుకుంటున్నరన్న సత్యం మనం మరచి పోకూడదు. ఓ రాజకీయ నాయకుడు ప్రజల అభిమానానిని తన ఉద్రిక్త పరిచే ప్రసంగాలతో నినాదాలతో ఎలా క్యాష్ చేసుకుంటున్నాడో యీ _ కోవకు చెందిన రచయితలూ పాఠకుల బలహీనతల ని క్యాష్ చేసుకుంటాడు. కాని మంచి ప్రభావం కలిగి వున్న సాహిత్యం ఎప్పుడూ శాశ్వతమైన విలువని కలిగి వుంటుంది. గౌతమ్! పాఠకుల మీద వాటి ముద్ర ఎన్నటికి చేర్పలేము థామస్ హార్టీ నవలలు మనం మరచి పొగలుగుతున్నామా? టాల్ స్టాయ్ , గోర్కి , చకడ్ , డికేన్సీ లాంటివారి రచనలు మనలని వెన్నంటి తరమడం లేదా? స్పంది౦చే హృదయం గల వారి జీవితాల మీద నాటి ప్రభావం పడటం లేదా?
గౌతమ్ ఆశ్చర్యంగా చూశాడు. విశాలమైన ఆమె కన్నులలో ఏదో కాంతి. ఆమె తనకంటే ఏదో ఎత్తుగా వున్నట్టనిపించింది.
"ఏదో అతి తెలివి, గడుసుతనం. తెచ్చి పెట్టుకున్న లేక విదేశ భాషలు నుంచి ఎరువు తెచ్చుకున్న ప్రయోగాలు రాను రాను మన సహజత్వానికి దూరమైపోవడం లేదా? స్వచ్చత నిజాయితీ నశించిపోవడం లేదా?
ఆమె ముఖంలోని ఆవేశంతో పాటు ఆవేదన _ వ్యధా పూరితమైన అశాంతి అతనిని కదిలించాయి.
"మళ్ళీ అటువంటి రోజులోస్తాయా?" అనిపిస్తుంది నాకు అంది సాలోచనగా.
"ఊ?"
మన తెలుగులోనే కాదు, ఏ యితర భాషల్లో తీసుకున్నా పరిస్థితి అలాగే వుంది. మంచి పుస్తకం, మనసుకు ఊరట కలిగించే పుస్తకం చదవాలంటే ఎంతో వెనక్కివెళ్ళి ఏ రవీంద్రుడిదో శరత్ బాబుదో , ప్రేంచంద్ దో చదువుకోవాలి తప్ప కాగడా పెట్టి వెతికినా, అంతటి సమగ్రత, సంపూర్ణత్వం వున్న పుస్తకాలు కనిపించవు. మంచి సాహిత్యంలోని పాత్రలు మనిలిని వెన్నంటి తురుముతూ వుంటాయి. నిద్రపోనివ్వవు చరిత్ర హీనుల్లో సావిత్రి, కిరణ్మయి శేష ప్రశ్నలోని కమల అలాగే విప్రదాసు సరే దేవదాసు. గౌతమ్! ఈ ముప్పయి నలభయి ఏళ్ళ బట్టి పరుగులు తీస్తున్నా యీ సాహిత్యంలా దేవదాసు లాంటి పాత్ర ఏ రచయిత అయినా సృష్టించ గలిగాడా? దేవదాసులా అంటే నా ఉద్దేశ్యం అచ్చం అలాంటిపాత్ర అని కాదు. అలా గుండెల్ని తరించుకుపోయే పాత్ర అలా ఏమీ చెయ్యకుండా కేవలం. పభ్లిసిటి గారడీలతో చిన్న చిన్న మెలికలు పెట్టి రంగులు పులిమియిగి గొప్ప సాహిత్యం అని పోజు పెట్టటం తగునా?"
గౌతమ్ కి ఎందుకో భయం వేసింది. అనుభవిస్తున్న నిజాన్నే ఎవరియినా వేలు పెట్టి చూపిస్తుంటే తట్టుకోలేరు.
"గౌతమ్! మీ కెవరూ ఎందుకని లేరు?" ఉన్నట్లుండి విరాజి అడిగింది.
"అతను యిదివరకు ఉండేవారు. కావాలనే అందరిని వోదులుకొని వొచ్చాను." అన్నాడు.
"ఎందుకని?"
"వొంటరితనాన్ని వెదుక్కుంటూ ....."
"వొంటరి తనం కోసమా? వొంటరిగా వుండి ఏ వన్నా సాధించాలన్న తాపత్రయం తోనా?
"రెండూ నిజమే కావచ్చు."
"ఒక చిత్రం చెప్పనా గౌతమ్ ."
"ఊ?"
"ఆలోచనా పరుడైన మనిషి ఎప్పుడూ వొంటరివాడే."
"మీరూ ఏకాంతాన్ని కోరుకున్నారు. కదా. మీ కేమనిపిస్తోంది?"
"మనకి తెలియని ఏకాంతం యింకా ఏవన్నా వుందని పిస్తోంది" అంటూ విరాజి నవ్వింది.
గౌతమ్ కూడా నవ్వేశాడు.
"గౌతమ్ నువ్వు రాత్రిళ్ళు ఏంతింటావు?"
"ఫలహారాలతో సరిపుచ్చుకోవటానికి నేనేమీ వయసు మళ్ళిన వాడిని కాదుగా . డబ్బులుంటే అన్నం తింటాను . డబ్బులేక పొతే ఆకలి తింటాను."
"అచ్చం రచయితలుగా మాట్లాడవు" అని వెంటనే విరాజి" "అయ్యో?" అని నాలిక కరుచుకుంది.
"ఏమిటి?"
"మిమ్మల్ని పొరపాటున నువ్వు అని సంభోదించాను."