ఆ అమ్మాయికింక దిక్కుతోచక, తన దారిన తనని వెళ్ళిపోనిమ్మని కాళ్ళా వెళ్ళా పడింది. అతను ఊరికే వదులుతాడా? రసికుడు.
"పాపం ఆ అమ్మాయి అతనితో.......... షి స్లేప్ట్ విత్ హిమ్. ఆ తరువాత దయతలచి వదిలేశాడు ఆ అమ్మాయిని.
"మై డియర్ శశికాంత్! నువ్వు ఆ అమ్మాయిలా ఆడపిల్లవి అయి వుంటే ఒళ్లప్పగించి తప్పించుకుపోయేవాడివేమో , యూ కెనాట్ ఈవెన్ డూ దట్, అన్ లెస్ యూ ఆర్ గే! అరె - అరెరే! అలా అయిపోతున్నావేమిటి? లైక్ టూ హావ్ జిన్ అండ్ టానిక్! వాట్?" అన్నాడు ముసలాయన తెల్లటి మీసాల వెనక నల్లటి కసి దాచుకుంటూ.
అప్పటికే ఉజ్వల దగ్గరికి వెళ్ళాడు శశికాంత్.
"ఉజ్వలా! వాటీజ్ దిస్? ఐ డిమాండ్ యాన్ ఎక్స్ ప్లనేషన్"
కేర్ లెస్ గా అంది ఉజ్వల.
"ఇందులో ఎక్స్ ప్లనేషన్ ఇచ్చుకోవడానికేముంది? దిసీజ్ హై పైనాన్స్. బిజినెస్ లో ఏం చేసినా చెల్లుతుంది. ఏం చేశావన్నది కాదు ముఖ్యం. ఎంత సంపాదించావన్నది పాయింటు. కొన్నిసార్లు గెలుస్తావు నువ్వు. కొన్నిసార్లు ఓడిపోతావు. దటీజ్ ద నేమ్ ఆఫ్ ద గేమ్ అండ్ విన్నర్ ఈజ్ అల్ వేస్ రైట్. హార్డ్ లక్ మై బోయ్. లైక్ టు హావ్ సమ్ పిక్ మి అప్?" ఆమె గొంతులో వెటకారం.
కసిగా ఆమె వైపు చూస్తూ అన్నాడు శశికాంత్.
"అయితే నువ్వు పార్టీ మార్చేశవన్నమాట!
"బిజినెస్ లో శాశ్వతంగా శత్రువులూ ఉండరు. పర్మినెంటుగా ఫ్రెండ్స్ వుండరు."
"నీకు నీతి, నిజాయితీ లేదు"
"నీతి , నిజాయితీ " అని నవ్వింది ఉజ్వల. "ఈ మధ్య ఒక పెద్ద కంపెనీలో గొడవలు వచ్చాయి. నీకు తెలిసే ఉంటుంది. ఆ కంపెనీలో వాటాదారుడైన తన తమ్ముడిని తన చెప్పుచేతలలో ఉంచుకోవటం కోసం అతనికి తన భార్యని అలవాటు చేశాడు. కానీ కొన్నాళ్ళ తరువాత ఆ భార్య నిజంగానే అతని తమ్ముడితో కలిసిపోయి మొగుడికి పంగనామాలు పెట్టింది."
"ఇప్పుడు మళ్ళీ కాంబినేషన్ మారినట్లుంది. ఆమె అన్నాదమ్ములిద్దరిని పక్కకు నెట్టేసి - తనే వేరే గ్రూప్ ఫార్మ్ చేసుకుంది-... సమ్ థింగ్ లైక్ దట్."
అందుకని మిస్టర్ శశికాంత్, నీతి గురించి నానమ్మ కబుర్లు చెప్పకు. యూ హాండ్ యువర్ డే. నౌ ఇటీజ్ అవర్ టర్న్.
తన కాళ్ళు వణుకుతున్నాయని అప్పుడే మొదటిసారిగా గమనించాడు శశికాంత్. ఒంట్లోని రక్తం అంతా ఒక్కసారిగా తలలోకి చిమ్మినట్లయింది. తనేం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో ఒక్కసారిగా గురుదత్ మీదికి దూకి అతని కాలర్ పట్టుకున్నాడు. గురుదత్ ని కొట్టడాని చెయ్యేత్తేలోగా ఇద్దరు మనుషులు వచ్చేసి అతన్ని పట్టేసుకున్నారు.
"బాహర్ ఫేక్ దో సాలేకో!" అన్నాడు గురుదత్ కూల్ గా.
శశికాంత్ ఏదో అరుస్తూ ఉంటె గురుదత్ మనుషులు అతన్ని బయటికి ఈడ్చుకు వెళ్ళారు.
పార్టీ అకస్మాత్తుగా ఆగిపోయింది.
హటాత్తుగా పదేళ్ళ వయసు పెరిగిపోయినట్లయింది శశికాంత్ కి. నడుం జారిపోయినట్లయింది. తన ఇంటికి ఎప్పుడు ఎలా వచ్చాడో కూడా అతనికే తెలియదు.
ఇంటికి వచ్చాక కదలిక లేకుండా రాత్రంతా అలా కుర్చీలో కూర్చునే వుండిపోయాడు శశికాంత్.
తన ఇండస్ట్రీ తన చెయ్యి జరిపోయిందని అతనికి తెలుసు. కానీ ఆ గురుదత్ ఉజ్వలను - దాన్ని అనుభవించనివ్వడు తను.
ఏం చెయ్యాలి? ఎలా ఆపాలి?
తెలతెలవారుతుండగా అతనికి స్పురించింది ఏం చెయ్యాలో. ఆలోచన వచ్చాక చాలా సేపు సంకోచించాడు దాన్ని అమలులో పెట్టడానికి.
చివరికి ఒక నిశ్చయానికి వచ్చి, తేజస్వి ఇంటివైపు సాగిపోయాడు శశికాంత్.
32
బాంబే షార్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో.
లూప్త్ హాన్ సా విమానం అరైవల్ కోసం ఎదురు చూస్తున్నారు గురుదత్ ఉజ్వల.
"జర్మని నుంచి ఇప్పుడు రాబోయే అతని పేరేమిటి?" అంది ఉజ్వల. "ఐక్ మాన్ కదూ!"
"యా! ఐక్ మాన్! మనతో కొలాబరేషన్ కుదుర్చుకుంటున్న కంపెని ప్రెసిడెంట్ కి రైట్ హాండ్ మాన్ ఇతను. చాలా ఇన్ ఫ్లూయేన్షియల్ గై" అన్నాడు గురుదత్.
తల పంకించింది ఉజ్వల.
మరో పావుగంట తరువాత గ్రేస్ ఫుల్ గా రన్ వేమీద లాండ్ అయింది జెట్ ఎయిర్ క్రాప్ట్. కొద్దిసేపటి తరువాత పాసింజర్స్ కిందికి దిగడం మొదలుపెట్టారు.
అందరికంటే ముందుగా, ఒక ఖరీదైన బ్రీఫ్ కేసుని చేతిలో పట్టుకుని చకచకా నడిచి వస్తున్నా నడివయస్కుడిని చూపించి అన్నాడు గురుదత్.
"దట్ మే బీ హిమ్!"
అతని ఉహ కరక్టే అయింది. కస్టమ్స్ ఫార్మాలిటీస్ ముగించుకూని వచ్చిన ఐక్ మాన్ పలకరించి కరస్పర్శ చేశాడు గురుదత్.
"వెల్ కమ్ టు ఇండియా!" అని చెప్పింది ఉజ్వల చిరునవ్వుతో.