ఒక్కసారిగా ఉపిరి పీల్చుకున్నాడు శశికాంత్.
అంటే!
ఒక్కసారిగా కోటి రూపాయలు లాభం!
"యూ ఆర్ జోకింగ్!" అన్నాడు అపనమ్మకంగా.
"నో! వెరి సీరియస్! అయితే మనం కాష్ తీసుకోవద్దు."
ఆశ్చర్యంగా చూశాడు శశికాంత్ "మరి?"
గురుదత్ ఒక మల్టి నేషనల్ కంపెనితో కొలాబరేషన్ ఏర్పరచుకుంటున్నాడు. ఇంకో ఆరు నెలల్లో అతని కంపెని షేర్ల ధర ఆకాశానికంటబోతోంది. ఆ షేర్లు మనకి ఇమ్మందాం. ఇప్పుడు నామినల్ గా టెన్ పర్సెంట్ - అంటే ఓ ఇరవై లక్షలు - కాష్ గా తీసుకుని మిగతావి షేర్ల రూపంలో తీసుకుందాం. ఒకసారి అందులో దురాక- వెల్- శశీ- నువ్వూ నేనూ కలిస్తే చెయ్యలేని దేముంది? గురుదత్ ని గుడ్డి గుర్రంగా మర్చిపారేస్తాం! ఇంకో విధంగా చెప్పాలంటే , మన కంపెనిని ఎవరికో అమ్మేయ్యడం కాదు. గురుదత్ కంపెనితో మన కంపెనీని మెర్జ్ చేసేసినట్లన్నమాట! ఏమంటావ్!"
"గురుదత్ తన కంపెని షేర్లు మనకి అమ్మడానికి ఎందుకు వప్పుకుంటాడు?"
"చెబుతున్ననుగా! నేను మేనేజ్ చేస్తాను."
"ఎలా?"
"నా పద్దతులు నాకున్నాయ్!"
ఏం పద్దతులు అనుకున్నాడు శశికాంత్ అసూయగా "మెర్జర్ అంటే కలయిక?" అదేనా ఉజ్వల అందరి మీదా ఉపయోగించే సమ్మోహనాస్త్రం!
"వాట్ డియర్? యూ ఆర్ జేలస్" అంది ఉజ్వల చిరునవ్వుతో అతనివైపు చూస్తూ.
అవసరంకొద్ది అసూయని మింగేస్తూనో! అబ్సట్యుట్ లో నో! అన్నాడు శశికాంత్.
మని మేక్స్ మెని థింక్స్! యా!
30
అదే రోజున - ప్లయిట్ లో బాంబే వచ్చింది ఉజ్వల.
ఆ రాత్రికి.
నున్నగా వున్న తన చెంపని గరుగ్గా ఉన్న గురుదత్ చెంపకేసి రాస్తూ అంది ఉజ్వల. 'చేప గాలానికి తగులుతుంది."
"ఎవర్ని గురించి చెబుతున్నావ్?" అన్నాడు గురుదత్.
"శశికాంత్ ట్రాప్ లో పడ్డాడు."
"అంటే?"
"తన కంపెనిని నీకు అమ్మేయ్యవచ్చని చెప్పాను నేను."
ఒప్పుకున్నాడు.
విస్మయంగా చూశాడు గురుదత్.
"అమ్మడానికి ఒప్పుకున్నాడా! నమ్మశక్యం కాకుండా ఉంది ఇది?"
"ఎవడికోసం ఒప్పుకుంటాడు? నేను లేనూ?"
"ఐసి!" అని తరువాత జాగ్రత్తగా అడిగాడు గురుదత్ "అమ్మకానికి టర్మ్ ఏమిటి?"
"రెండు కోట్లకి సెటిల్ చేశాను బేరం!"
"మైగాడ్, ఆర్ యూ క్రేజీ! ఆ కంపెనీకి రెండు కోట్లా?" అన్నాడు గురుదత్ కీచుగొంతుతో.
"పేరుకు మాత్రమే రెండు కోట్లు! కానీ మానం పే చేసేది ఇరవై లక్షలే! జస్ట్ టెన్ పర్సెంటు! అంది ఉజ్వల.
"మరి మిగతాది?"
"మిగతాది డబ్బుకి బదులుగా నీ కంపెనీలో షేర్లు అతని కిస్తావు."
"యూ ఆర్ మాడ్! అల్ రైట్?" అన్నాడు గురుదత్ కోపంగా. "బంగారు గుడ్లు పెట్టె బాతులాంటిది నా కంపెని! దానిలో షేరు ఒక్కటి కూడా బయటికి అమ్మను. షేర్లన్నీ మా కుటుంబంలోనే ఉండాలి. అది నా నియమం!"
"నిజంగా ఇవ్వమని ఎవరన్నారు? అంది ఉజ్వల.
చిత్రంగా చూశాడు గురుదత్ "మరి?"
ముందు ఇరవై లక్షలు ఇచ్చి అతని కంపెనిని స్వాధీనం చేసుకుంటావు. మిగతా ఒక కోటి ఎనభై లక్షలకి నీ కంపెనీలో షేర్లు ఇస్తానంటావు. కాజువల్ గా కొన్ని డాక్యుమెంట్స్ అతనికిచ్చి అవి ఫిలప్ చేసి తీసుకు రమ్మని చెబుతావు.
"ఆ తరువాత?"
"ఆ తరువాత?" అంది ఉజ్వల గురుదత్ ని అనుకరిస్తూ వెక్కిరింపుగా." వాటిని ఈ జన్మలో ప్రోడ్యుస్ చెయ్యలేడు శశికాంత్."
"ఎందువల్ల?"
ఎందుకంటె అతను గనుక వాటిని సక్రమంగా పూర్తీ చేసి నీకు ఇస్తే అతని కింక దమ్మిడి కూడా రాదు చేతికి. అలాంటి పైనాన్షియల్ ట్విస్టు పెడతా వాటిలో. అతని కంపెనీలో ఉన్న లోసగులు నాకు తెలుసు! వాటిని ఈ ప్రపంచంలో ఉన్న చార్టర్డ్ అకౌంటెంటు అందరూ కలిసి కూడా సరిచేయ్యలేరు. ఈ మధ్య పెద్దవాళ్ళందరూ చేస్తున్న పని ఇదే కదా! ముందు కంపెనీని స్వాధీనం చేసుకో! తరువాత మెలికలు వేసి డబ్బు ఎక్కొట్టు! అదే పద్దతి? పైనాన్షియల్ షార్ట్స్ అల్?" అంది ఉజ్వల.
"ఉజ్వలా! యూ ఆర్ ఎ జీనియస్! అన్నాడు గురుదత్. సంతోషంగా.
అండ్ యూ ఆర్ నాటి! అంది ఉజ్వల. తన వక్షాన్ని తాకబోతున్న అతని చేతిని అలవోకగా పక్కకి నెట్టేస్తూ.