"ఇతను మెంటల్ షాక్ కు గురయ్యాడు మేడమ్! అది ఎందువల్లనో తెలియడంలేదు. నీలిమ....నీలిమ....అంటూ ఒకటే కలవరింతలు-ఇప్పడే మళ్ళి స్పృ తప్పిపోయింది" డ్యూటి డాక్టర్ వివరణ యిచ్చాడు.
"డాక్టర్! అసలు పేషంట్ కండిషన్ ఎలా వుంది?"
"ఇతని ప్రాణాలకు వచ్చిన ప్రమాదమేమి లేదు. ఊహించనిదృశ్యాన్ని చూడటం వలన కానీ....వినడంవలన కానీ కలిగిషాక్ అందుకే ఎట్ లిస్ట్ పది పన్నెండు గంటలు మత్తులో పడుకోబెడితే చాలు కోలుకుంటాడు. ఏమంత ప్రమాదకరమ్తెన స్టోక్ కాకపోయినా అతని మనసు వెలిబుచ్చే చిత్రవీచిత్రమయిన ఆలోచనలను కార్డియోగ్రాఫి ఎక్విఫ్ మెంట్ ద్వారా రికార్డ్ చేస్తున్నాం. సాదారనమయిన షాక్ తగిలిందా లేక ఉన్మాదస్ధితికి లోనయ్యడా అనే నిర్దారించే పరిక్షలు ఇప్పడే పూర్తయ్యాయి."
"అసలు ఇతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవరు?" ఇన్స్ పెక్టర్ ధీరజ పెశ్నించింది.
"అదిగో ఆమె...."అంటూ స్టూల్ మీద ఒక మూల కూర్చునివున్నరజనివ్తెపు చూపించాడతను.
ఆమెను చూసిన ధీరజ ఆశ్చర్యపోయింది.
ఆమె కూడా దిరజను అక్కడ చూసినప్పటినుంచి సిగ్గుతో చితికి పోతున్నది.
"ను...వ్వా...." అప్రయత్నంగానే అన్నది ధీరజ.
డాక్టర్స్ వాళ్ళిద్దరివ్తెపు ఒకసారి తలలుతిప్పి చూసి తిరిగి తమ పనిలో మునిగిపోయారు.
"అవును! నేనే మేడమ్...." రజని తలవంచుకుని సమాధానం యిచ్చింది.
"సుధాకర్ తో కలిసి హాస్పిటల్ వరకూ వచ్చావంటే అతనిమీద నిజంగానే నీకు ప్రేమ వున్నట్టుందే....అంత మ్తెకంలో ముంచేశాడన్న మాట నిన్ను" వ్యంగ్యంగా ఎత్తిపొడిచింది ధీరజ.
"అలా మాట్లాడకండి మెడమ్! అసలే మా బావ అలా అయిపోవడం చూసి నేను తట్టుకోలకపోతుంటే చచ్చినపామును ఇంకా చంపుతారేందుకు? నన్ను మాటలతో చిత్రవధ చేయకండి" విలవిలలాడిపోతూ అన్నది రజని.
"సుధాకర్ నీకు బావ అవుతాడా?" ధీరజ గొంతులో వేళాకొళం...
"మీ అనుమానం నాకు అర్ధమయింది మేడమ్! సుధాకర్ నిజంగానే మా మేనత్తకొడుకు. నాకు స్వయంగా బావ....మాది ప్రక్కనే వున్న పల్లెటూరు. మా ఇద్దరికీ చాలా కాలం నుంచి పరిచయం వున్నది. మాకు ఆస్దిపాస్తులు లేవని, మేము అడిగినంత కట్నం యిచ్చుకోలేమని మా మెనమామ కుటుంబం మాకు దూరంగా వుంటున్నది.
"కానీ నాకు నా బావంటే ఎంతో యిష్టం. అటువ్తెపు వాళ్ళకుకానీ, మా వ్తెపు వాళ్ళకు కానీ బావకు నాననిచ్చి చేయాలనే ఆలోచన లేదని నాకు తెలుసు. అందుకే విలయిన్న డల్లా పట్నం వచ్చి బావతో కలిపి సరదాగా వుండటం అలవాటు చేసుకున్నాను.
మనసుకు నచ్చినవాడిని ఎటూ భర్తగా పొందలేదని తెలుసు.
అందుకే తప్పని తెలిసినా నా మనసుకు వచ్చిన బావతో కొన్నాళ్ళయినా కలిసి వుండవచ్చునని అప్పడప్పడూ వచ్చి వెళుతుంటాను. ఆ విధంలా నిన్నరాత్రి మీరు చూశారు.
అంతే తప్పు నేను నీతిమాలిన దానినో, ఒళ్లు అమ్ముకునే బజారు పిల్లనో కాదు....."
ఆ అమ్మాయిది అమాయకత్వమో, తెలివితక్కువతనమో....తను గొప్పవని చేస్తున్నానని పొంగిపోతుందో కానీ....ప్రస్తుతం ఆమె గీతాన్ని త్రవ్వేకన్నా ఇప్పుడేం జరిగిందో తెలుసుకోవడం ముఖ్యం అనుకున్నది ధీరజ.
"రజని! ఆ విషయం వదిలేయ్ .....అసలు సుధాకర్ ఈ షాక్ ఎలా తగిలింది?"
"అదే నాకూ అర్ధకావడంలేదు మేడమ్! రాత్రి మీరు వచ్చ్చి వెళ్ళారు. వెంటనే కరెంట్ పోయింది.
ఆ చీకటిలోనే నేను వెదుక్కుంటూ బాత్ రూంకు వెళ్ళాను. అరె..... కరెంటు పోయిందే అని మా బావ గోనుక్కోవడం వినిపిస్తూనే వుంది. నాకు. ఐదు నిమిషాలు కూడా కాకముందే తిరిగి కరెంటు వచ్చింది. నేను వచ్చేసరికి నెలప్తే పడివున్నాడు మా బావ ఎంతలేపిన లేవకపోవడంతో నాకు భయం వేసి వెంటనే బయటకు వచ్చిఆటో కేకేశాను. ఆటోవాడి సాయంతో మా బావను హాస్పిటల్ లో జాయిన్ చేశాను. రాత్రినుంచి యిదే వరుస...." గడగడా పాఠం చెప్పినట్టు చెప్పిందామె.
"అంటే నువ్వు బాత్ రూమ్ కు వెళ్ళివచ్చేలోపు....అది కరెంట్ ఫెయిలయినప్పుడు ఏదో జరిగింది. కానీ అదేమిటో నీకు తెలియదంటావు అంతేనా?" దిరజ సీరియస్ గా ప్రశ్నించింది.
"అవును మేడమ్! నేను ....నే....ను"
రజని ఏదో చెప్పాలని చెప్పలేకపోతోందని అర్దమయిందామేకు.
"ఫర్వాలేదు చెప్పు ఇంకేమ్తెనా చెప్పాలా?"
"నేను మా వూరు వెళ్ళిపోవాలి మేడమ్! లేకపోతే మా యింట్లో ఖంగారుపడిపోతారు. మా బావకు ఇలా అయిన విషయం, నేను దగ్గర వున్న సంగతి తేలిస్తే నన్ను బ్రతికనివ్వరు. అందుకే వెళ్ళిపోవాలను కుంటున్నాను" నెల చూపులు చూస్తూ ఎలాగో మాటలను పూర్తి చేయగలిగిందామె.
"మరి మీ బావను ఇలాంటప్పుడు ఒంటరిగా వదిలేసిపోతావా?" దిరాజ ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
"ఒంటరిగా వదిలేయలేక ఇంతవరకూ వున్నాను. ఇప్పుడు పోలీసులు వచ్చరుగా....నిజానికి నాకు పోలిసులప్తె నమ్మకం లేకపోయినా మిమ్మల్ని చూసిన తొలిసారే అన్పించింది మీరు సిన్సియర్ అని. అందుకే మా బావకు వచ్చిన యిబ్బంది ఏమీలేదని, మానవతా దృష్టితో మీరే అతని ఆరోగ్యాన్ని గురించి శ్రద్ధ తీసుకుంటారనే నమ్మకం వెళ్ళిపోతున్నాను మేడమ్."
అని చెప్పి గుడ్లనిరు కక్కుకుంది.
దిరజ చూస్తుండగానే, తను చెప్పినట్టుగానే వెళ్ళిపోయింది రజని.