Previous Page Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 10



    ఆ అమ్మాయిని ఎలా భావించాలో ఆమెకర్ధం కాలేదు.

    ఎదిగి ఎదగని మనస్తత్వం అనుకోవడానికయినా ఒంటరిగా వుండి కూడా ఎంతో ద్తేర్యంగా హాస్పిటల్ లో జాయిన్ చేయించగలిగింది....అదే ఇంకోకరయితే శోకాలుతీస్తూ ఏమీ చేయడానికి పాలుపోక ఇంట్లోనే మిన మేషాలు లెక్కిస్తూ కూర్చొని వుండేవాళ్ళు.

    "మేడమ్! అతనికి స్పృహ వచ్చింది."

    డాక్టర్ మాటలకు దిరజ ఆలోచన్లను  కట్టిపెట్టి అతని బెడ్ ని సమీపించింది.

    అప్పడే కళ్ళు తెరిచిన సుధాకర్ కంటికి ఎదురుగా వున్న ఇన్స్  పెక్టర్ దిరజ కనిపించడంతో అతని ముఖంలో రంగులు మారిపోయాయి.


                     *    *    *    *

    ఉదయం పదిగంటలు.....

    ఇండస్టి యలిస్ట్  ముకుందరావు బంగళా....

    ఇంటిల్ల పాడి ఎక్కడకో వెళ్ళడానికి బయలుదేరుతున్నట్టు హడావుడి కనిపిస్తుంది.

    నౌకర్లంతా ఖంగారు పడిపోతున్నారు.

    రెండుకార్లు రడిగా వున్నాయి.

    ముకుందరావు భార్య జయంతి పట్టుచీర కట్టి సమస్త నగలను ఆలంకరించుకుని వుండడంతో మహాలక్ష్మిలా  కనిపిస్తోంది.

    ఆమె ఒక్కగానోక్క తమ్ముడు శోభన్ కు  నిశ్చయ తాంబూలాలు తీసుకుంటున్నట్లు వెంటనే బయలుదేరి రమ్మని పుట్టింటినుంచి ఫోన్ రావడమే వాళ్ళ హడావుడికి కారణం.

    ఆ రోజు ఏ ఎంగేజ్ మెంట్స్ పెట్టుకోవద్దని భర్తకు మరిమరి చెప్పి ఒప్పించింది ఆ ఇల్లాలు. పుట్టింట ఏ చిన్న శుభకార్యం జరిగినా తప్పనిసరిగా వెళ్ళాలని పట్టుపట్టే తత్వం ఆమెది. అందుకే ఆమె మాటను కాదనలేక ఆమె ఇష్టానికే వదిలేశాడు ముకుందరావు.

    "ఇంతకూ వాడు ఏడి.....?" కొడుకు అనిల్ కనిపించకపోవడంతో అడిగాడతను.

    "రాత్రి  ఆలస్యంగా పడుకున్నట్టున్నాడు...."

    "వాడికది మామూలేగా! అదేమంటే చదివి చదివి అలసిపోయడంటావు. రాత్రి ఆలస్యంగా పడుకోవడం, ఉదయం ప్రోద్దేక్కినా లేవకపోవడం రోజూ వున్నదేగా" భార్యవ్తెపు చూస్తూ ఎత్తిపొడిచాడయన.

    "మీ పుత్రవాత్సల్యం  కాస్తా ఎప్పడూ వాడిని ఆడిపోసుకోవడంతోనే అడుగంటిపోతున్నది" నిష్ఠూరంగా అందామె.

    "నీలాంటి  తల్లి ఉన్నంతవరకూ వాడు ఈ జన్మలో బాగుపడదు."

    "అంటే ఏంటి మీ ఉద్దేశం....? నేనే వాడిని చెడగొడుతున్నానానా?"

    "మరలా నాచేత చెప్పించుకోవడమెందుకు? ఆ నిజమేమిటో నీకు తెలియకపోతేకదా....వాడు రాత్రిళ్ళుఎంత ఆలస్యంగా వచ్చినా ఏమీ అనవు. ఎన్ని అడ్డత్రోవాలు తొక్కినా నాకు  తెలియకుండా కడుపులో దాచుకుంటావు. తాగి తందనాలడుతున్నా నాకు  చెప్పావు అసలు వాడు ఏ రాచకార్యాలు వెలగబెడుతున్నాడని అంత అర్దరాత్రిళ్ళు వస్తున్నాడంటావు?" ఎన్నాళ్ళనుంచొ కడిగివేయాలనుకుంటున్నదంతా అప్పుడు సమయం దొరకదంతో ఆమెను తూర్పారబట్టాడు.

    "చాల్లెండి....అక్కడకు వాడేదో చేయరాని పనులు చేస్తున్నాట్టు.... చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నట్లు నిందించడమేనా? మగవాడన్న తర్వాత అందులోనూ కాలేజి చదువులు చదివేవాడికి స్నేహితులు వుండరంటారా? వాళ్ళతో కాస్తంత సరదాగా తిరగడం కూడా మీ దృష్టి లో తప్పేనా?"

    "తప్పలు చేయనంతవరకూ ఫరవాలేదు జయంతి....కానీ వాడికి కావలసినంత స్వేచ్చ  యిచ్చావు వక్రమార్గంలో పడితే....."

    "అంత తప్పదు పనులు నా బిడ్డ ఏమీ చేయలేదు. చేయదుకూడా...."

    "ఓహొ! ఆయనగారిమీద నీకంత నమ్మకముందన్నమాట."

    "కన్న  తల్లికి కన్నకొడుకుమీద నమ్మక మెందుకుండదండి....మీరు మరి విడ్డూరంగా అంటున్నారు" తేలిగ్గా కొట్టిపారేసిందమె.

    "వాడు అప్రయోజకుడయిన తరువాత చింతించి ప్రయోజనం  వుండదు జయంతి! నీ అతి ప్రేమ వలెనే వాడు పూర్తిగా చెడుతిరుగుళ్ళకు బానీస్తె పోతున్నాడని నా అనుమానం. ఆ తరువాత నీ యిష్టం....వాడిని సన్మార్గంలో పెట్టుకుంటావో , లేదులే జులాయిలా తిరగమని వూరికేవది లేస్తావో నీ యిష్టం" ఒకింత బాధగా అన్నాడు ముకుందరావు.

    కోట్ల ఖరీదు చేసే ఆస్దిపాస్డులున్నాయి తనకు.

    ఉన్న వ్యవహారాలను చూసుకోవడానికి తనకు ఇరవ్తే నాలుగు గంటలు చాలవు.

    తనకున్న  ఎక్తెక సంతానం అనిల్ ఒక్కడే!

    అతని చదువు పూర్తయితే తనకు చేదోడు వాదోడుగా వుంటాడనే తాపత్రయం తనది.

    "మనం వెళ్ళేది శుభకార్యానికి. ఇప్పడవన్ని ఎందుకు? ముందు బయలుదేరండి.....ఇప్పటికే చాలా ప్రోద్దేక్కింది. నేనొకసారి అబ్బాయినీ లేపివస్తాను లేదంటే మనం ఇలా వెళ్ళిపోతే వాడు మధ్యాహ్నం వరకూ ఏమీ తినకుండానే పడుకుని వుండిపోతాడు" పుత్రవాత్సల్యంతో మేడమెట్లు ఎక్కి ప్తెకి వెళ్ళిందామె.

    ఆ తల్లి ఆ పేక్ష గమనించిన ముకుందరావు మనసు బాధతో విలవిల్లడింది.

    అనిల్ ఎప్పుడో తన చేయిదాడిపోయాడు.

    ఆ విషయం అ తల్లికి ప్పుడు అర్ధమవుతుందో?

    ప్చ్....నిస్పృహతో నిట్టూర్చాడయన.

    డబుల్ కాట్ బెడ్ ప్తే అడ్డంగా పడుకుని నిద్రలో  మునిగి తేలుతున్నాడు అనిల్.

    "రేయ్ కన్నా! లేరా."

    అనిల్ ఆ గొంతు గుర్తుపట్టినా నిద్రమత్తులో ఏదో గొణిగాడు.

    "పదయిందిరా లే.....నువ్వింకా లేవలేదని మీ డాడి ఇప్పటికే చిందులు వేస్తున్నారు" అతన్ని తట్టిలేపుతూ అన్నదామె.

 Previous Page Next Page