Previous Page Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 8

   
    జస్ట్ ఇంపాజిబుల్....కాలేజీకి రాకుండానే  వచ్చినట్టు ఎలా  సంతకం చేయగలిగింది?

    ఈ  పుస్తకం తన టేబుల్ మీదనే ఉంటుంది.

    ఎవరొచ్చినా  సంతకం  చేసి ఇక్కడే  వుంచి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరినీ  తను ఆవిధంగా చూసే అవకాసం  వుంది.

    నీలిమ రెండు రోజులుగా రాలేదనేది నిజం.

    ఆవిషయం తనతో  ఆమె డిపార్ట్మెంట్ హెడ్  ప్రేమ్ చంద్ కూడా  చెప్పాడు. క్రమశిక్షణకు మారుపేరయిన నీలిమ చెప్పా పెట్టకుండా, కనీసం లీవ్  అయినా  పెట్టకుండా గైర్ హాజర్ అవడం  ఆమె డ్యూటీలో  జాయిన్ అయినప్పటి  నుంచి  ఇప్పటివరకూ తను చూసి వుండలేదు.

    రెండు రోజులుగా కంట్రోల్ చేసేవాళ్ళు లేక హాస్టల్ స్టూడెంట్ విచ్చల విడిగా గొడవ చేస్తుంటే ఆ విషయం  తన నోటీస్కు వచ్చింది.

    తనే వెళ్ళి నీలిమ రావడం లేదనే  విషయం స్వయంగా తెలుసుకు మరీ వచ్చాడు.

    ఎందుకయినా మంచిదని  పోలీస్ రిపోర్టు కూడా ఇచ్చాడు.

    ఇంత జరిగితే ఏమీ  జరగలేదంటున్నది నీలిమ.

    "ఏమిటి సార్? రిజిస్టర్ ముందు పెట్టుకుని ఎక్కడో ఆలోచిస్తున్నారు? సంతకం చేయాలి. ఇటివ్వండి" నీలిమ రెట్టించి అడగడం తో  ప్రిన్సిపాల్ వులిక్కిపడ్డాడు.

    అప్రయత్నంగా రిజిస్టర్ ముందుకు నెట్టాడు.

    నీలిమ సంతకం చేసి  వెళ్ళిపోయింది.

    అనుమానం తిరక ఆ శతకం వ్తెపు చూశాడతను.

    అదేసంతకం.....!

    ఫోర్జరి కాదు.

    ఛ!ఛ! అయినా నీలిమ సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేసి రాకపోయినా  వచ్చినట్టు సంతకం చేయవలసిన  అవసరం ఎవరికీ వుంటుంది?

    ఎటూ తేల్చుకోలేని  నందిగ్దంలో వున్నాడతను.

    ఆర్కియాలజీ ప్రేడ్ ఆఫ్ ది డిపార్ట్ టెంట్ ప్రేమ్ చంద్ అప్పడే తన గదిలోకి  రావడం కూడా పట్టించుకునే స్ధితిలో  లేడాయన

    "సార్...."ప్రేమ్ చంద్ పిలవడంతో ఈ లోకంలోకి వచ్చాడు ప్రిన్సిపాల్.

    అప్పడే నీలిమ ఆ గదిలోనుంచి వెళ్ళిపోయింది.

    "నీలిమ ఈ రోజు డ్యూటిలో జాయిన్ అయినట్టుంది. ఇన్నాళ్ళూహెల్త్ బాగోక రాలేదా ఏమిటి? కనిసం లివ్ ఆప్లయ్ చేసే  అవకాశం  కూడా  ఆమెకు లేదేమో....లేదంటే ముందే పంపించి వుండేది "తన ధోరణిలో తను చెప్పకుపోతున్నాడతను.

    "స్టాఫ్....స్టాపిట్...." ప్రిన్సిపాల్ చిరాగ్గా అరిచాడు.

    తనేం  తప్పగా మాట్లాడాడో అర్ధంగాక తెల్లబోతూ ఠక్కున నోరు మూసుకున్నాడు ప్రేమ్ చంద్.

    "ఒహే....సారి ప్రేమ్ చంద్! ఏదో  ఆవేశంలో నోరు జారాను. ఐయం రియల్లీ సారి" తనతోటి సహొద్యోగి ప్తె ఆవేశంతో  చిరాకు పడినందుకు నొచ్చుకుంటూ  అన్నాడాయన.

    "ఇట్సాల్ ర్తెట్ సర్!"

    "ఏమీలేదు ప్రేమ్ చంద్! నీలిమ యూనివర్సిటీకి  రెండు రోజులుగా రావడంలేదని తెలుసు కదా.... అదే అడిగితే తను వచ్చానంటుంది. వచ్చినట్టు రుజువు చేసుకుని మరివెళ్ళింది కూడా అందుకే  మీరు టాఫిక్ ఎత్తేసరికి చిరాకుపడ్డాను."

    ఆయన విసుగుదలకు కారణం అర్ధమ్తెన ప్రేమ్ చంద్ స్తెతం ఆశ్చర్యపోయాడు.

    "ఏమిటి సార్ మీరు చెప్పేది?"

    "నిజమేనయ్య! నీలిమ రాకుండానే వచ్చినట్టు అబద్దమాడుతున్నది. అసలు  ఆమె ఎందుకిలా అబద్దమాడిందో ఏం అర్ధం  కావడంలేదు, నీలిమ డిపార్ట్ మెంట్ లెక్చరరే కదా....మీరూ అడిగి చూడండి....ఏం సమాధానం చెబుతుందో...." అనిచెప్పి తల పట్టుకుని కూర్చుండిపోయాడు ప్రిన్సిపాల్.

    ఆయన మాటలు విన్న ప్రేమ్ చంద్ అయోమయంగా ఆ ప్రిన్సిపాల్ వ్తెపు చూస్తూ-

    నీలిమ వెళ్ళినవ్తెపే సాలోచనగా  ఆలోచిస్తూ అడుగులు వేశాడు.

          
              *    *    *    *

    హాస్పిటల్ బెడ్ ప్తె స్పృహలేని  స్ధితిలో వున్నాడు లెక్చరర్ సుధాకర్.

    ఒకవ్తెపు స్టూల్ ప్తె కూర్చుని తనలో  తనే కుమిలిపోతున్నది ఒక అమ్మాయి.

    ఆమె పేరు రజని.....

    సుదాకర్ కు స్పృహ తెప్పించడానికి డాక్టర్లునానా తంటాలు పడుతున్నారు. తలకు ఏవేవో ఇన్ స్టు మెంట్స్  తగిలించారు. క్షణక్షణానికి అతని మెంటల్ వ్తే జేషన్స్ చెక్ చేస్తున్నారు.

    సుధాకర్  కు అప్పడే  స్పృహ వచ్చింది.

    రజని కళ్ళల్లో కొద్దిగా కాంతి....

    "అదిగో...అది....అదిగో....అక్కడే వున్నది" అని ఆరిచి మళ్ళి స్పృహ కోల్పోయాడు అతను.

    డాక్టర్లు విసుగు విరామం లేకుండా ప్రయత్నిస్తూనే వున్నారు.

    సుధాకర్  ఆ విధంగా ప్రవర్తించడం అది ఎన్నావసారో వాళ్ళు  లెక్కపెట్ట్టలేదు.

    అతనికి స్పృహ  వస్తున్నది. కాస్సేపు ఏవేవో పిచ్చిమాటలు మాట్లాడడం, అందరివ్తెపు వెర్రిచూపులు చూడడం....తిరిగి అదే షాక్ కు గుర్తెతల వాల్చేయడం చేస్తున్నడతను.

    ఇలా దాదాపు రెండు గంటలనించి జరుగుతున్నది.

    ఇన్స్ పెక్టర్ ధీరజ వచ్చింది అక్కడకు.....

    "నమస్తేడాక్టర్! వాట్ హపెండ్ టు సుధాకర్?" వచ్చిరావడం తోనే ఆమె అడిగింది.    

 Previous Page Next Page