ఏదో ఊహించనిది జరిగిపోతుంది... అరుపులు.. రోదనలు... జనం పరుగులు... తర్వాత ఏం జరుగుతుంది? అంతా అలుక్కుపోయినట్టుగా మైనం ముద్దలా జ్ఞాపకాలు... ఎంత జ్ఞాపకం చేసుకుందామన్నా, అసలేమీ గుర్తుకు రావడంలేదు.
ప్రస్తుతం తనకి తెలియనిచోట, నిస్సహాయ స్థితిలో, బెడ్ కు అతుక్కునిపోయి వున్నాడు.
ప్రస్తుత పరిష్టితి తనకు స్పష్టంగా తెలుస్తోంది. కానీ గతం ఒక ప్రశ్నయింది.
"లేచార... వెరీగుడ్! నన్ను స్పష్టంగా గుర్తుపట్టాగలుగుతున్నారా?ఆ మాటలు విని ఆలోచనల్లోంచి తేరుకుని డోర్ వైపు చూశాడు.
ఎదురుగా నర్స్ మేరీ... తెల్లటి గౌనులో, రాత్రింబవళ్ళూ, తనని కనిపేట్టుకుని సేవలు చేసిన నర్స్... ఆమె పెదవుల మెడ మమకారపు స్పర్శతో కదలాడే ప్రసన్నమైనా నవ్వు_ నర్స్ మేరీ హీల్స్తో బెడ్ మీదదిండు కానుకుని కూర్చున్నడతాను.
"సిస్టర్ మేరీ... నేను ఇక్కడికెలా వచ్చాను?" అడిగాడతను అమాయకంగా.
"మీరు రోడ్డుమీద పడివుండగా ఎవరో ఈ హాస్పిటల్ కు చేర్చారు. డాక్టర్ మధురిమ ఈ హాస్పిటల్ చీఫ్_ ఆమె ఆద్వర్యంలో మీకు ట్రీట్ మెంట్ జరుగుతోంది. మీకోసం లాయర్ నీలకంఠన్ అనే వ్యక్తి తరుచూ ఫోన్ చేసి యోగాక్షేమాలు అడుగుతున్నాడు" చెప్పింది నర్స్ మేరీ.
"లాయర్ నీలకంఠన్... ఎవరాయాన?" ఆ ప్రశ్నకు విస్తుపోవటం మేరీ వంతయింది.
"అయన మీకు తేలీదా?" ఆశ్చర్యపోతూ కళ్ళు చిట్లించి అడిగింది మేరీ.
"తెలీదు... ఆ పేరు నేనెప్పుడూ వినలేదు." అతను నిజం చెబుతున్నట్లుగానే వుంది.
"ఇంతకీ మీ పేరు?" అడిగింది మేరీ.
"నా... పేరా... నా పేరు... అనకు తెలీదు" ఒక్కొక్క మాటను ఒట్టి పలుకుతూ నేమ్మదిగా అన్నాడు.
"అయితే... ఇప్పుడు మనం బారసాల, నామకరణం ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలన్నమాట..." అప్పుడే, ఇంజక్షన్ బాటిల్స్తో లోనికొచ్చిన శివానందం అన్నాడు.
"ఎర్రగా, బుర్రగా, అందంగా వుంటాడు కదా... అందమైన పేరు పెడితే బావుంటుంది" అంది మేరీ నవ్వుతూ.
"ఏం పేరు? నీ అభిమాన హీరోలు తెలుగులో నాగయ్య, నారాయణరావు, హిందీలో బలారాజ్ సహానీ, శాంతారామ్ అలాంటి పేర్లు పెడతావా?" అన్నాడు వర్డ్ బోయ్ శివానందం.
"ఏం... ఆ పేర్లు కావా? పోనీ, మోడ్రన్ టైఫ్ లో ఓ పేరు పెట్టు చూద్దాం..." అంది నర్స్ మేరీ చిరుకోపంతో.
"రాజబబ్బర్." అన్నాడు శివానందం.
"గాడిగుడ్డులా వుంది." ఉడికిస్తూ అంది మేరీ.
"అమ్రేషీ పూరీ... పరేష్ రావాల్ ... శక్తికపూర్ ... నానాపటేకర్... కుల్ భూషణ్ కర్బందా.... ప్రేం చోప్రా.... గుల్హన్ గ్రోవర్.... రంజిత్..." కసిగా హిందీ సినిమా విలన్ల పేర్లన్నీ చెప్పాడు శివానందం. పెద్దగా నవ్వేసింది మేరీ_ అతని ఉక్రాశాన్ని చూస్తూ.
తనకు తన పేరు గుర్తుకురాకపోవడం_ వాళ్ళు తనకెదురుగానే తనకో పేరు పెట్టె ప్రయత్నలో పడటం ఆ యువకుడికి వింతగా వుంది.
అంతలో వచ్చాడు_ జూనియర్ వర్డ్ బోయ్ దిలీఫ్.
"మిరతని పేరు కోసం వూరికే అలా వర్రీ అయిపోకండి_ ఇతని పేరు నాకు తెలుసు" అన్నాడతను ఫోజుకొడుతున్నట్ట్లుగా కాలరేగేరేస్తూ.
"నీకు తెలుసా?"
"అవును"
"నీకేలా తెలుసు?!" మేరె. శివానందం ఇద్దరూ ఒకేసారి అడిగారు ఆశ్చర్యపోతూ.
"ఇతనిలో పాటు యితని సూట్ కేసు కూడా మన హాస్పిటల్లోకి చేర్చబడింది. నిన్న యితనికి బట్టలు మార్చాల్సి వచ్చి_ ఆ సూట్ కేసు తెరిచాను. అందులో యితనికి సంభందించిన పేపర్స్, బట్టలు వున్నాయి. ఆ పేపర్స్ లోనే యితని పేరుంది" అన్నాడు.
"ఏంపేరు?" మేరీ అత్రుతుగా అడిగింది.
"కాశీచరణ్... కాశీచరణ్ కే." అన్నాడు వర్డ్ బోయ్ దేలీఫ్ చిద్విలాసంగా .
ఆ మాత్రం ఆలోచన తమకు ముందుగా రానందుకు ఆ ఇద్దరూ సిగ్గుపడిపోయారు.
"మెరు పెట్టాలని అనుకుంటున్న పెర్లకన్నా, ఈయన ఒరిజినల్ పెరే బాగుంది. గనుక_ వర్రీ కాకండి" అంటూ వెళ్ళిపోయాడు జూనియర్ వార్డ్ బోయ్ దేలీఫ్.
"కాశీ చరణ్__ బాగానే వున్నట్టుంది కదా పేరు?" శివానందం అన్నాడు మేరీతో.
"అవును..." అని అతని వైపు తిరిగి_ "మీ కాశీచరణ్...ఇకపై ఆ పేరుతోనే పిలుస్తా," అంది సిస్టర్ మేరీ.
అలాగే అన్నట్టు అతను తలూపూతూ మనసులోనే అనుకున్నాడు తన పేరు_
కాశీ చరణ్... కాశీ చరణ్ కే. అని.
"కే... అంటే..? తెలీదు. బహూశా నర నేం అయివుండవచ్చు అదేవర్ని అడిగి తెలుసుకోవాలి?
ఆ వార్డ్బోయ్నేనా?
అదే వార్డ్ బోయ్ క్రితంరోజు తన దగ్గరకొచ్చి, తన బట్టలుమారుస్తూ తను న్యూడిల్లీనుంచి ఆంద్రా ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ వస్తూండగా ఆ ట్రైన్ కి ఆక్సిడెంట్ జరిగినట్లు. ఆ ఎక్సిడెంట్ మూలంగానే తను గాయపడినట్లు చెప్పాడు.