Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 9

    అటతాళం. అక్షరములు 12. అంగములు 4
                           అంగసౌంజ్ఞ                         1_1_0_0
                                                                    ల_ల_దృ_దృ
                                                                      4_4_2_2

    (రెండక్షరముల నడక)
    జతి/ తా, కిటకిటతొం ! తత్త, కిటకిటతొం ! తకఝెణు ! తకఝెణు !!


                 ఏకతాళ లక్షణమ్ :- (ఏకతాళము)


   శ్లో!!    శనివారే స్వాతిరుక్షే ఏకతాళ సముద్భవః !
    నీలవర్ణో రక్తనేత్రి రక్తమాలా విభూషితః !!

    వరపీతాంబరధరం ! భారత్యామధి దేవతా !
    అయం !! శంబద్వీపవాసి  వసిష్టళ్చఋషి స్వయం ఏక !
    తాలలఘుచై వా ! తాలజ్ఞాన  వినోదినః !!

    తా :- శనివారము స్వాతి నక్షత్రమున ,ఏకతాళం పుట్టినది, నల్లని వర్ణము కలిగినది యర్రని కన్నులు, యర్రని పుష్పమాలిక, శ్రేష్టమైన పట్టువస్త్రము ధరించినది. సరస్వతీదేవి అధిదేవత, శంబద్వీపమందు  నివాసము, వసిష్టప్రోక్తము, ఏకతాళమునకు  ఒక లఘువు తాళజ్ఞానము తెలిసినవారు చెపుతున్నారు.


                          తాలశబ్ద నిర్వచనము :-

  శ్లో!!    తకారం శంకరప్రోక్తం ! లకారం శక్తి రుచ్యతే !
    శివశక్తి సమాయోగ ! దాలనాలిదియ్యతే !!

    తా: తకారం (త) అనే అక్షరం శంకరప్రోక్తం. శంకరునివల్ల పుట్టబడెను. *లకారం, శక్తి రుచ్యతే" లకారం (ల) అనే అక్షరం "శక్తి రుచ్యతే" శక్తి పార్వతివల్ల పుట్టినది. శివశక్తి శివునివల్లను. పార్వతి వల్లను కలసిగల్గెను.

   శ్లో!!    శివశక్త్యాత్మకం పుణ్యం ! యశస్యం భుక్తి ముక్తి దమ్ !
    దశ ప్రాణాత్మికం తాళం, యోజానాతిసతత్వవిత్ !!

    తా: శివశక్త్యాత్మకమైన  ఈ తాళము, పుణ్యము, యశస్సు, భుక్తి ముక్తిప్రదమై వెలయుచున్నది. ధీని నెరింగినవారు తత్తవేత్త యనబడును.

                                                                  తాళదశ ప్రాణములు

   శ్లో!!    కాలమార్గ క్రియాంగాని, గ్రహజాతి కళాలయాః!!
    యతిః. ప్రస్థారకశ్చేతి, తాళప్రాణదశస్మృతాః !!
    తా: కాలము, మార్గము, క్రియ, అంగము, గ్రహము. జాతి, కళ. లయ, యతి , ప్రస్థారము  ఈ పదియును  తాళంబునకు  ప్రాణములుగానున్నవి.

                                                                   కాలము _ లక్షణము :

    తాళముయొక్క  అంగముల కాలప్రమాణమును నిర్ధారణగా  చెప్పెడియంశము, కాలప్రాణ మనబడుచున్నధని చెప్పవచ్చును. ఇది సూక్ష్మకాల మనియు, స్థూలకాలమనియు, రెండు విధములు. నూరు తామరరేకులను ఒకదానిపై నొకటిచేర్చి  ఒక సూదితో  ఆ రేకులపై గుచ్చినప్పుడు  ఆ రేకులలో  ఒకరేకు  ఎంతకాలములో  సూదిదిగునో, ఆ కాలము ఒక క్షణమగును.

    అటువంటి, 8 క్షణముల కాలము                 __ 1 లవము      
           8లవముల కాలము                 __ 1 కాష్ట
           8కాష్టల కాలము                     __ 1 నిమిషము
           8నిమిషముల కాలము              __ 1 కళ
           2కళల  కాలము                     __ 1 చతుర్భాగము
           2చతుర్భాగముల కాలము          __ 1 అనుధృతము
           2అనుధృతముల కాలము           __ 1 ధృతము
           2ధృతముల కాలము                __ 1 లఘువు
           2లఘువుల కాలము                __ 1 గురువు
           3లఘువుల కాలము                __ 1 ప్లుతము
           4లఘువుల కాలము                __ 1 కాకపాదము
యని యనబడును. 1 క్షణము, 2 లవము, 3 కాష్ట. 4 నిమిషము. 5 కళ, 6 చతుర్భాగము యనుయారును, సూక్ష్మకాలములనియు, 1 ఆనుధృతము, 2 ధృతము, 3 లఘువు, 4 గురువు, 5 ప్లుతము, 6 కాకపాదము అను ఆరును స్థూలకాలములనియును అనబడును.

    మార్గము :- ఒకతాళమునందు  గానముయొక్క  గమన క్రమము *మార్గము" యని చెప్పవచ్చును. ఇది ప్రస్తుతము 4 దక్షిణ. 2 వార్తిక, 3 చిత్ర. 4 చిత్రతరం, 5 చిత్రతమ, 6 అతిచిత్రతమ యవి ఆరు విధములుగ చెప్పబడుచున్నది. మరియు ఈ ఆరును షణ్మార్గములని కూడా  చెప్పబడుచున్నవి. ఈ ఆరింటిలో  మొదటి మూడును, కృతి, కీర్తినాది ప్రబంధగానమునందు అనుసరింపబడుచున్నవి.   

 Previous Page Next Page