Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 8

  2. మఠ్యతాళం :_ అక్షరములు 10, అంగములు 3, అంగసౌంజ్ఞ

    జతి/ తకదిన ! తక తకదిన !!                                 1_0_1
    (ఒక అక్షరము  వేలికి చొప్పున)                               ల_దృ_ల
                                                                              4_2_4

                          రూపక తాళ లక్షణమ్ :_

     శ్లో!!    కుజవారే మఖారుక్షే రూపకస్య సముద్భవః !
    రక్తవర్నో  వికారాక్షౌ రక్తమాలా విశోభితః !
    శుభ్రవస్త్రధరంచై వా  వశిష్టాశన్ ఋషిస్వయం !
    పంక్తిచందశ్చ కరుణారస కౌమారిదేవత !!

    శాల్మలీ  ద్వీపవాసి, ధృతమేక లఘు స్తధా !
    రూపకాఖ్యమిదంతాల  భరతజ్ఞో  ప్రయుజ్యతే !!
   
    తా:_ మంగళవారము  మఖా నక్షత్రము రూపతాళము  బుట్టెను. యర్రని వర్నము గలది. వికారమైన నేత్రము గలది. యర్రని మాలికల చేత ప్రకాశించునది. తెల్లని వస్త్రము ధరించినది. వసిష్టఋషి ప్రోక్తమైనది. పంక్తియనే  ఛందస్సు గలది. కరుణరసము గలది. పార్వతి అధిదేవత. శాల్మలీ ద్వీపమందు  నివాసము గలది. ఒక ధృతము ,ఒక లఘువు గలది. రూపక తాళమని  భరతము తెలిసినవారు చెప్పుచున్నారు.

    రూపకతాళం. అక్షరములు 6 అంగములు 2. అంగసౌంజ్ఞ 1

    వేలికి అక్షరం చొప్పున,                                          0_1
    జతి/ తక ! ఝెణుతక                                            2_4
                                                                              దృ_ల


                         జంపెతాళ లక్షణమ్ :_

   శ్లో!!    బుధవారే పుష్యరుక్షేజంపెతాళ సముద్భవః !
    హరిర్వర్నోచిత్ర  వస్త్రో ! ముక్తమాలయశోభితః !
    నీలవక్త్రా పంకజాక్షి ! జామదగ్నిఋషి స్వయం !
    హాస్యరస సుప్రతిష్టాత్, చందోమైషాధి దేవత !!

    అయం !! కుశద్వీపవాసి ! లఘుఅనుధృత ధృత స్తధా !
    ఇదం లోకహితార్ధాయ భరతజ్ఞో ప్రయుజ్యతే !!

    తా:_ బుధవారం  పుష్యమి  నక్షత్రమున  జంపెతాళము  పుట్టెను. పచ్చని వర్నము రంగు వస్త్రము గల్గినది. ముత్యాలహారము గలిగినది. నల్లని ముఖము గలది. పద్మములువంటి నేత్రములు కలది. జమదగ్ని ప్రోక్తమైనది. హాస్యరసము కల్గినది. సుప్రతిష్టత ఛందస్సు. మైష మనునది అధిదేవత. కుశద్వీపమందు  నివాసము. లఘు, అరాధృతము, ధృతము గల ఈ జంపెతాళము, లోకహితపు కొరకు శాస్త్రజ్ఞులచే  చెప్పబడినది.

    జంపెతాళం. అక్షరములు 10. అంగములు 3.                        అంగసౌంజ్ఞ
    వేలికి అక్షరం చొప్పున                                                              1_U_0
    జతి/ తకిటతకఝెణు ! త ! కతై !!                                               ల-అ-దృ
                                                                                                 7_1_2



                     త్రిపుట తాళ లక్షణమ్ :_ త్రిపుట

   శ్లో!!    గురువారే రుద్రరుక్షే ! త్రిపుటస్య సముద్భవః !
    శ్యేతవర్నో పింగళాక్షో ! పుష్పమాలా యశోభితః !!

    పట్టువస్త్రధరంచై వా ! కశ్చపశ్చ  ఋషిస్వయం !
    భీభత్సరసఃస్రుష్టి ! చ్చందోకౌమారి దేవతా !!

    అయం !! క్రౌంచద్వీపవాసి ! వీరమాంత్సధృతేయం !
    త్రిపుటాఖ్యాభరతజ్ఞా ప్రయుజ్యతే !!

    తా :- గురువారం ఆరుద్ర నక్షత్రంలో  త్రిపుటతాళము పుట్టెను. తెల్లని వర్నము, పచ్చని కళ్ళు, పుష్పములచే ప్రకాశించుచున్నది. పట్టువస్త్రము ధరించినది, కశ్యపఋషి  ప్రోక్తము. భీభత్సరసము కలది. కౌమారియనబడే  యధిదేవత. సృష్టి ఛందస్సు  కలది. క్రౌంచద్వీపమునందు  నివాసము. లఘువు, రెండు ధృతములు గల ఈ తాళమును  భరతజ్ఞులచేత చెప్పబడినది.

    త్రిపుటాతాళం. అక్షరములు 7. అంగములు 3. అంగసౌంజ్ఞ
    (రెండు అక్షరముల నడక )                                                     1_0_0
    జతి/ తా, ధిమితక ! తకధిమి ! తక ఝెణు !!                              ల_దృ_దృ


                       అ ట తా ళ ల క్ష ణ ము :-

   శ్లో!!    భృగువారే అస్యరుక్షే ! అటతాళ సముద్భవః !
    సువర్నోభవహ కోమలాంగో ముక్తామణి విభూషితః !
    ఆశుమాలి ప్రభాచేతి చంద్రరూపిణి !
    పట్టువస్త్రధరంచై వా ! మృడాలిని అధిదేవత !!   
    అయం !! శాకుంతల ద్వీపవాశి కశ్చపచ్చఋషి స్వయం !
    లఘులఘు ధృతద్వయం  అటతాళ ప్రకీర్తితః !!

    తా:- శుక్రవారము హస్తమి నక్షత్రమున  అటతాళము పుట్టెను. మంచి అక్షరములు కలది. బంగారువంటి వర్నము గలది. మృదువైన అవయవములు గలది. ముత్యాలహారముచేత  ప్రకాశించునది. సూర్యునితో సమానమైన కాంతిగలది. చంద్రునితో సమానమైన సౌందర్యము గలది. పట్టువస్త్రములు ధరించినది. మృగాళిని (పార్వతి) అధిదేవత. శాకుంతల ద్వీపమందు నివాసము. కశ్యపశ్చఋషి  ప్రోక్తము. రెండు లఘువులు. రెండు ధృతాలు గలది. దీనిని అటతాళమని చెప్పబడినది.   

 Previous Page Next Page