"నాకింకా స్వేచ్చరాలేదా?" అనుకుంది.
"అమ్మా! మా అందరి చావు చూసి కూడా నీవు ఆయన వెంట వెళతావో లేక మమ్మల్ని చావోద్దని మాతో తిరిగిస్తావో నీ యిష్టం.
ఆమె జవాబివ్వలేదు.
రాఘవా అంతా గమనిస్తున్నాడు. వాళ్ళు ఒక్కొక్కరే వచ్చి మాట్లాడుతున్నారు.
"మనం వెళ్లిపోదాం రఘూ!"
"ఎక్కడికి వెళదాం? మినీ నువు నేనూ ఎక్కడున్నా ఒకటే. మనల్ని ఎవరూ విడదీయలేరు."
"నేను."
నేనూ నువు ఏమిటి? మనం ఒక రూపానికి బింబ ప్రతిబింబాలం. నేను వెలుగు నీవు నీడ. నేను రవిని, నీవు ఛాయావి. నేను పగలును, నువు రాత్రి మనల్ని ఎవరూ విడదియలేరు.
"రఘూ? ఏమిటి అంటున్నావు. "ఆమె చేతిని ఆప్యాయంగా స్పృశించాడు అతను. "మినీ యిప్పుడు నిన్ను స్పృశించాను. ఈ స్పర్శ ఇప్పుడుంది నిన్న వుంది, రేపుంది, కాలతీరమైన ప్రేమమనది.
"రాఘవా! రాఘవా!"
"ఎందుకా ఆర్తి! ఇప్పటి కేనేళ్ళు గడిచాయి. మనం యుగయుగాలు కలిసే వున్నాము. ఈ సృష్టికి అది లేదు. మధ్య లేదు, అంతం లేదు. మన ప్రేమా అంతే! నేను శివుడిని, నువు పార్వతివి, నేను బ్రహ్మను, నువు వాణివి.......నేను నారాయణుడను- నువు శ్రీదేవివి, నేను మన్మధుడిని- నువు రతివి. ఇంకా చెప్పాలంటే నేను భర్తను- నువు భార్యవి.
'మినీ నేను శబ్దాన్ని నువ్వు హక్కువి నేను వేదం నువు భాష్యం నేను జ్ఞేయం నువు జ్ఞానం.
"రాఘవా!"
"అవును మినీ! అంతా కలబద్దులం మనం కాలాతితులం, కానీ యిప్పుడు ఈ శరీరం కొంత బంధనాలకి లొంగిపోయింది. ఈ రూపంలో మనం కొన్నిటికి బద్దులం కావాలి.
"అంతేకాదు" అతనాగి మళ్ళీ అన్నాడు.
"మినీ మనం సంఘ జీవులం. ఎంత కాదన్నా యీ లోకంలో జివిస్తున్నందుకు మనం కొన్ని పాటించాలి. ఇక ఇంటి యిల్లాలు....భర్తని, పిల్లల్ని సంసారాన్ని త్యజించి తన ఆరాధకుని వెంట వెళితే లోకం ఒర్చుకోదు. చెలరేగే కోరికలు చల్లారి ఇంకా అపనిందలే చేస్తుంది. ఒక యజమానిని, అతని సంసారాన్ని వొదిలేసి తన వెంట తీసికెళితే ఆమెని లోకం మన్నించదు."
"ఫర్లేదు నువేళ్ళు, నే తిరిగి ఆ యమ జూపంలోకి వెళ్ళలేను. నీకు సుఖం లేదు. శాంతి లేదు. కర్తవ్యం, ధర్మం, నిన్ను తిరిగి బందిస్తున్నాయి. ఇదే మన యీ సమాజంలోని తేడా నాకు నీకు ఉన్న అంతరం, అది ఒక మగకి, స్త్రీ కి వున్న అంతరం" ఆమె ప్రాణం లేనట్టిగా నించుంది.
"మినీ"
"రాఘవా! నువు నాతో వచ్చేయ్. వీళ్ళకి నేను కావాలి. నాకు నువ్వు కావాలి."
అతను నవ్వేడు. "ఇది మరీ అసంభవం."
ఆ మాట వినగానే వాళ్ళంతా ఉపిరి పీల్చుకున్నారు.
"నాకో మాట యివండి!"
"మీరు నా చివరి సమయంలోనా సన్నిధిలో ఉండాలి. అంతే! అదయినా నాకు దక్కనివండి. మీ ఒడిలో తప్ప నా ప్రాణాలు పోవు. నన్ను మరణయతను పడనివకండి!" అలాగే! తెలిస్తే వస్తాను."
"ప్రామిస్!" అన్నాడు పరమశివం.
రైలు కుతేసింది......రాఘవ ట్రెయిన్ లో కూర్చున్నాడు. తన్ ప్రాణం, ప్రేమ జీవం జీవనం అన్నీ అతని కప్పగించి కేవలం శరీరం మిగిలినట్టుగా ఉంది పోయింది రుక్మిణి.
ఆ రూపం , ఆ శరీరం, ఆ మనిషి కనుమరుగయ్యే దాక అలాగే చూస్తూ ఉండిపోయింది.
అతని వెంటే తన చూపులో ఆత్మీయత, గుండెలోని ప్రేమ, మనస్సులోని ఆరాధన, బ్రతుకులోని కమ్మదనం, అర్పించినట్టుగా నించుండిపోయింది ఆమె.
అన్ని పోయినా, ప్రాణం లేని శిలలాగానయిన ఆమె తమతో ఉంటె చాలు అనుకునే ఆ "అందరూ" ఆమెతో పాటు తమ రైలు కోసం ఎదురు చూడసాగారు.
యాంత్రిక జీవనానికి బలవుతున్న రుక్మిణి.
మంచితనం
"సామి!"
ఇంటిముందు నిలుచుని కేకేశాడు వీరయ్య!
వీరయ్య కేకేవిని బయటికి వచ్చాడు రామలింగయ్య భుజం మీద కండువా సర్దుకుని
"ఏరా! ఏం పని నేను ఊరికి పోతున్నా అన్నాడతను."
వేసుకున్న జుబ్బా లోపలి జేబులోంచి డబ్బు తీసి వసారా అరుగు మీద పెట్టాడు వీరయ్య.
"డబ్బు తెచ్చినావా? ఎంతుంది? సమయానికి తెచ్చివ్నావురా? అని డబ్బందుకుని లెక్కపెట్టి "ఇన్నురుందే" అన్నాడు మళ్ళీ.
"అవును సామీ"
"ఊ ఎంతయిందో ఏమో? లెక్క చూస్తే కానీ తెలియదు గుర్తు లేదు. అయినా ఎక్కడికి పోతుందిలే. నీవు జమ యిచ్చినప్పుడల్లా లేక్కరాసి పెడుతూనే వున్నాను" అని ఆ నాకు బస్సుకు టైమైతుందేమోవస్తాను" అన్నాడు రామలింగయ్య.
"ధర్మ ప్రభువులు, మీ కాడ నా లెక్క యాడికి పోతుంది. బద్దరంగా దాస్తారని కదా యిస్తున్నాను" అన్నాడు వీరయ్య.
నవ్వాడు రామలింగయ్య. ఆ మాటలకి. మీసాలు దువ్వుకుని "ఒరే వీరయ్య! ఈసారి వచ్చినపుడు బాండు రాయించుకోరా. ఎందుకయినా మంచిది. తల్లయినా, పిల్లయినా లెక్క లెక్కే! తర్వాత ఏ వ్యత్యాసం వచ్చినా నలుగురు నన్నే అంటారు మాట పడటం కంటే మరణం మేలు అన్నారు పెద్దలు. దమ్మిడికి పోయిన మర్యాద తనువెత్తు ధనం పోసినా రాదు" అన్నాడు మళ్ళీ.
"సామీ! నా సిన్నప్పటి నుంచి మీ పుప్పు తింటుండాను. మీ కాలి కింద బతుకుతున్నాను. మీ ఎంగిలి తిని, మీ చెమట మాసిన బట్ట కట్టుకున్నాను. నేనెంత? నా దాపరికం ఎంత? నా లెక్కంతా కలిసినా మీ చేలో నారుమడిలో పండిన ఒక నారు పంటంత కాదు. మీరు నన్ను మోసం చేస్తారా?" అన్నాడు వీరయ్య.
"ఊఊ ఆ మాత్రం నమ్మకం ఉంటే చాలు బతికిపోతాను. మరీ నే వెళ్ళి వస్తాను" అని కదిలిపోయాడు రామలింగయ్య.