సాంబశివం దగ్గరనుండి తిన్నగా ప్రసూన దగ్గర కొచ్చింది రేఖ .......
రేఖను చూసిన కొద్దీ ఏదో చీదరగా ఉంటుంది ప్రసూనకు . అదే సమయంలో ఎందుకో జాలిగాకూడా ఉంటుంది. తనను పూసుకుని పూసుకుని తిరుగుతూ తన స్నేహితురాలినని చెప్పుకోవటం ఎంతో గర్వంగా భావించే రేఖను ఎలా విదిలించాలో అర్ధం కాదు ప్రసూనకు ......
విశాలంగా ఉండే రేఖ కన్నుల్లో ...... విలాసంగా కదిలే ఆ కనుపాపల్లో .... లోకంమీద ఏదో కసి ఎఱ్ఱగా మెరుస్తూ కనిపిస్తుంది ..... అది గుర్తించినపుడు ప్రసూనకు . రేఖమీద గౌరవం కలగదు. కాని, ఏమీ అనలేని ఏదో అసహాయత ఆవరించుకుంటుంది ప్రసూనను .......
"నువ్వు మోహన్ దగ్గరికి వెళ్తున్నావటగా?" అంది కన్నుకొడుతూ రేఖ.
ప్రసూన గతుక్కుమంది. ఏదో జుగుప్పతో మనసు ముడుచుకుపోయింది .... అంతకుముందు ఉత్సాహంతో మనసు ముడుచుకుపోయింది ...... అంతకుముందు ఉత్సాహంతో పొంగించిన విషయమే ఇప్పుడు జుగుప్పతో దహిస్తోంది...... ఒక్కొక్క విషయం చెప్పే విధానాన్ని బట్టి ఎంతగా మారిపోతుంది ? రేఖ కేమీ సమాధానం చెప్పలేదు .......
"ఏమయినా నేర్పించమంటావా?" అంది రేఖ మళ్ళీ గలగల నవ్వుతూ ......
"అక్కర్లేదు " చిరాగ్గా అంది ప్రసూన ......
ఆ మర్నాడు ఉదయంఏడుగంటలకు మోహన్ నంబర్ డయిల్ చేసింది. "హాలో!" అన్నాడు మోహన్. మోహన్ కంఠంలో మార్దవం ఉంది ..... అ అమార్ధవంలో మిళితమై ఏదో గాంభీర్య రేఖ కూడా ఉంది ..... అత్యంత స్నేహంతో ప్రసూన గొంతుకేదో అడ్డుపడినట్లయింది. వెంటనే సమాధానం చెప్పలేకపోయింది ........
"హాలో!" అన్నాడు మళ్ళీ మోహన్ "హాలో!" అంది ప్రసూన .......
"ఓ ! మీరా " నవ్వాడు మోహన్, "గుర్తుపట్టారా?"
"ఆ! ఏమిటి విశేషం?"
"ఎం లేదు __"
"ఏం లేకుండానే ఫోన్ చేశారా ?"
"ఉంది ....."
"ఏమిటది ? ఫోన్ లో చేశారా?"
"ఉంది ....."
"ఏమిటది ? ఫోన్ లో చెప్పడానికి వెళ్ళేనిదా?"
"కాదు ..... అవును ......"
"అనను మీ దగ్గరకి రమ్మ౦టారా?"
"వద్దు ......."
"మీరే నా దగ్గరకు వస్తారా?"
"మీరు రమ్మంటే ....."
"వద్దని ఎందుకంటాను ?"
"ఇవాళ సాయంత్రం వస్తాను ....."
"అల్ రైట్ ....."
ఉద్యోగంలో చేరాక జనార్ధన్ . ఇంట్లోంచి వచ్చేసి వేరుగా ఉంటున్నాడు మోహన్ .... వంటకు , ఇల్లునిర్వహించటానికీ ఒక నడివయసు మనిషిని కుదుర్చుకున్నాడు .....
సాయంత్రం అరుగంటలకు మోహన్ ఇంటిముందు సాంబశివ౦ కారులోంచి దిగింది ప్రసూన .... అ అకారునూ, కారు డ్రైవర్ నూ పరిశీలనగా చూస్తూనే చిరునవ్వుతో "రండి" అని ఆహ్వానించాడు మోహన్ .......
ఇల్లు అంత పెద్దది కాకపోయినా పొందికగా అమర్చిఉంది. సోఫాలో కూచుంది ప్రసూన ..... హేండ్ బ్యాగ్ పట్టుకున్న ప్రసూన చేతివేళ్ళు వణకటం గమనించి లోలోపల నవ్వుకున్నాడు మోహన్. ఏదో కంగారుతో .... బెదురూ చూపులతో .... ఎంతో అనందంతొంగి చూస్తోంది ఆ కళ్ళలో. ప్రసూన లో ఆ కంగారును పోగొట్టాలను కున్నాడు మోహన్ .... ఏవో కాలేజి కబుర్లు ఎత్తుకున్నాడు ..... ఆ రోజుల్లో వేసిన నాటకాలు ..... అప్పుడు జరిగిన తమాషాలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు చూపించే పార్శిటీల్లో పార్శియాలిటీలు .... అవీ ఇవీ మాట్లాడుకున్నారు .... కబుర్లలో రెండుగంటల కాలం సునాయాసంగా దొర్లిపోయింది.
"ఇప్పుడు చెప్పండి . మీరు వచ్చిన పనేమిటే? ...." ప్రసూనను పరిశీలనగా చూస్తూ అన్నాడు మోహన్.
అప్పటివరకు ఏదో మైకంలో తేలిపోతున్నట్లున్న ప్రసూన ఆ మాటలతో ఉలికిపడింది ......
"నేనా? .... నేను ...." అంది అయోమయంగా ..... మోహన్ నవ్వి "ఏ పనిమీద వచ్చారో మరచిపోయారా?" అన్నాడు.
"నన్ను సాంబశివంగారు పంపించారు ....."
"దేనికి?"
"మా వ్యాపారానికి మీ సహాయం కావాలట !" "ఎలాంటి సహాయం?"
"ఏమో?"
"చుట్ట సమ్మతమైనదైతే ఏలాగూ చేస్తాం! చటాట్విరుద్దమైనదైతే .... అలాంటి సహాయం ఎందుకు కావాలో తెలుసుకోవలసిన అవసరం నాకుంది .... అది తెలియకుండా ఎం చెప్పగలను ?"
"డబ్బిస్తానన్నారు ......"
ఒక్కసారి తీక్షణంగా చూశాడు మోహన్ ...... ఆ చూపులకు తడబడింది ప్రసూన ......
"ఈ మాటలన్నది మీరు కనుక .... అంటే నిస్సహాయ స్థితిలో ఉన్న స్రీ కనుక వదిలి పెడుతున్నాను ....."
"అంటే ..... మీరు సహాయం చేయరా?"
"మీ వ్యాపారం ఏమిటో చెప్పామంటున్నానుగా!"
"హొటల్"
"దీనికి పోలీసుల సహాయం అక్కర్లేదు అంతకు మించినదేదో ఉండాలి ....."
"నాకు తెలియదు ......
"నమ్మమంటారా ?"
"మీ ఇష్టం ......"
"కామన్ సెన్స్ ఉన్న వాడేవడు నమ్మడు. ఆ హొటల్లో పనిచేస్తున్నారు . సాంబశివంగారికి పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు. యేమీ తెలీకుండానే వున్నారా? అంతకుముందు తెలియక పోయినా, నా దగ్గరకు వస్తున్నప్పుడయినా తెలుసుకో వద్దా? ఒకవేళ తెలియకపోతే అది అమాయకత్వం కాదు, మూర్ఖత్వం ....."
ప్రసూన మాట్లాడలేదు . సాంబశివం మోహన్ దగ్గరకు వెళ్ళమనగానే ప్రసూన మనసంతా మళ్ళీ మోహన్ ని కలుసుకోబోతున్న సంభ్రంతో నిండిపోయి ఉక్కిరిబిక్కిరి అయిపోయింది మరే ఆలోచనా తోచలేదు. ఈ విషయం మోహన్ కేలా చెప్పాగలదు?