పెళ్ళి జరుగుతుండగానే సాంబశివాన్ని చూసి హడలిపోయింది లలిత ..... అనుక్షణం తన గొప్పతనం చూపించు కోవాలనే ఆరాటమే! మీ అందరి కంటె నేను ఎక్కువ సుమా! అన్నట్లు మాట్లాడటమే ......
మొదటి రాత్రి భర్త విశ్వరూపాన్ని చూడ గలిగింది .
బాగా తాగి వచ్చాడు సాంబశివ౦ .... తాగి కాని, అతడు ఆడదాని దగ్గరకు రాడు ..... రాక్షసుల నిజస్వరూపం నిద్రలో కనిపించినట్లు ఆ త్రాగుడు మత్తులో అతికహ్స్తం మీద కల్పించుకున్న పై పోరాలన్నీ కరిగిపోయి అసలు స్వరూపం సాక్ష్యాత్కరించింది .....
బండ బూతులు .... ఏస మాటలు .... పశువులాంటి మొరటు ప్రవర్తన .......
భయంతో జుగుప్పతో జలదరించిపోయింది లలిత ..... ఆ క్షణంలోనే అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. కానీ ఏ మార్గమూలేదు .... ఏమంటారు దీన్ని? రేపింగా ? వ్యభిచారమా? ఏమో ? ఏమంటారో పేరేదైనా కాని పెట్టాలనీ ఎవరికీ తట్టలేదేమో .......
వాసన ..... అనాగరీకపు వాసన మొరట పశుత్వపు వాసన మూర్ఘత్వపు వాసన ఆ వాసన భరించలేక పోయింది లలిత .....
లలితలోని వ్యతిర్తిక్తత ఆవిడ శరీరంలోని అణువణువునా తెలుస్తున్న కొద్దీ సంబశివనైకి మరింత సరదాగా ఉంది , .... హింసించి ఆనందించే అనాది మానవుల అంతరంగాల లోని క్రోవ్ర్యామేదో అతనిలో పాడగావిప్పి ఆడేది ......
తన చదువుతో .... సంస్కారంతో .... సౌకు మార్యంతావు జీవితాన్ని గురించి లలితా కన్నకలలకు ..... ఈ జీవితానికి సామ్యమే లేకుండా పోయింది ......
శక్తినంతా కూడదీసుకుని సహానంతో సంసారం చెయ్యాలని ఎంత ప్రయత్నించినా లలిత వల్ల కాలేదు __ ఆ ఐశ్వర్యమూ _ ఆ మొగుడు .... అవన్నీ తను అనుభవించే నరకం నుండి విముక్తి పొందటానికి అతి తేలిగ్గా వదులుకోగలవని అనిపించి౦ది.
ఏమయితే అయిందని లేచిపోవటానికి నిర్ణయించుకుంది ..... ఈ నిర్ణయానికి లలిత కాస్త ఆలస్యంగా వచ్చింది ..... ఎందుకంటే దృఢంగా వెళ్ళిపోవాలని అనుకున్నాక తాను గర్భవతివని తెలుసుకుంది లలిత ..... నెత్తిమీద పడుగు పడి నట్లయింది, నవనాడులూ కృంగిపోయాయి .
పుట్టిన పాప తన బంధంతో లలితను బందీ చేసేసింది . రోజులు గడచినకోద్దీ సాంబశివ౦ రంగులన్నీ ఒక్కొక్కటే అర్ధం కాసాగాయి లలితకు _ అరణి కసితో రగులుకు పోవటం తప్ప ఏమీ చెయ్యలేని ఆశక్తురాలు పోయింది ......
ఏ విధంగానూ లలితను జయించలేని సాంబశివానికి తన చేతిలో వున్న ఒకే ఒక ఆయుధం శిశీల అని తెలుసు __
చెప్పులు తొడుక్కుంటూన్న లలిత దగ్గరకు వచ్చింది సుశీల.
"ఎక్కడికైనా వెళ్తున్నావా అమ్మా!" అంది.
"అవును. నా ప్రెండ్ దగ్గరికి__"
"ఇవాళ ఇంటికేవరో వస్తున్నారట! నాన్న నన్ను ఉండమన్నాడు __ నేను ఒక్కదాన్నీ వాళ్ళ మధ్య ఎలా ఉండగలనమ్మా! నువ్వూ ఉండవూ?"
"నువ్వుకూడా ఉండకు _ మీ నాన్నకు ఎదిరించు __" అనలేకపోయింది లలిత ..... తండ్రిని ఎదిరించమని కూతురికి చెప్పగలిగే శక్తి లేకపోయింది . అడుగడుగునా లలిత కళ్లకు అడ్డుపడుతున్నది ఈ సంస్కారమే!
వయస్సులో ఉన్న కూతుర్ని సాంబశివ౦ పోగుచేసే స్నేహితులమధ్య వదిలి వెళ్ళలేకపోయింది లలిత .... ఆగిపోయింది __
సాంబశివ౦ లలిత దగ్గరకొచ్చి వెటకారంగా నవ్వుతూ "వెళ్ళటంలేదా?" అన్నాడు.
సుశీల కేలాగో అనిపించింది _ తల్లిని ఆపుచెయ్యమని తండ్రి పంపితేనే వచ్చింది __ ఇప్పుడు తల్లిని వెటకారం చేస్తున్నాడు _ ఎవ్వరిమాటా లక్ష్యపెట్టకుండా తల్లి వెళ్ళిపొతే బాగుండునని అనిపించింది.
ఎర్రగా చూసింది లలిత __ ఆ చూపులు బోనులో ఉన్న మృగరాజు చూపుల్లా వున్నాయి. చటుక్కున తల్లి దగ్గరగా వచ్చి అప్యాయంగా చెయ్యి పట్టుకుంది సుశీల. లలిత కూతురివైపు చూసింది. కళ్ళలో ఎరుపుకరిగిపోయింది . పేలవంగా నవ్వింది........
5
సాంబశివ౦ ఫోన్ చేసి ప్రసూనాను తన గదిలోకి పిలిపించుకున్నాడు. గడగడలాడిపోతారు. అతనికి భయపడనిది ప్రసూన ఒక్కర్తే ...... సాంబశివ౦ ఉగ్రనరసింహరూపం ప్రసూన ఎన్నడూ చూడలేదు ..... ప్రసూనముందు ఎన్నడూ ప్రసన్నమైన చిరునవ్వుతో నే ఉంటాడు సాంబశివ౦ .........
నిన్న మోహన్ ని నీ గదిలోకి పిలిపించావా?" అన్నాడు సాంబశివ౦ .......
ప్రసూన తడబడింది .... ప్రసూనగదిలోకి సాధారణంగా ఎవ్వరూ రావటానికి వీల్లేదు ..... హొటల్ ఉద్యోగస్థలల్లో ఎకౌంటే౦ట్ శేఖర్ , డాన్సర్ రేఖ మాత్రమె వస్తారు . బయటివాళ్ళు అసలురారు. రానీయరు ..... ఆనాడు ప్రసూన స్వయంగా ఆహ్వానించబట్టి మోహన్ రాగలిగాడు ...... ఆ క్షణంలో ఎవరూ ఏమీ అనకపోయినా ఆ వార్తా మాత్రం వెంటనే సాంబశివనానికి అందచేశారు .....
"మోహన్ నాకు బాగా తెలుసు ....." అంది తల వంచుకుని ప్రసూన .......
"ఎలా తెలుసు ?"
"చదువుకునే రోజుల్లో పరిచయమయింది ......"
"పరిచయం మాత్రమేనా ?"
ప్రసూన బెదురుగాచూసి తలవంచుకుంది.
లోలోపల నవ్వుకున్నాడు సా౦బశివం .....
"అతడు మన వ్యాపారానికి సహాయం చేసేలా ఒప్పించాలి .... ఈ పని నువ్వు చెయ్యగలవా?"
కుతూహలంగా చూసింది ప్రసూన .... ఏదో ఒక రకంగా మోహన్ తో సంబంధం పెంచుకోవటానికి ఉత్సాహంతో ఎగసిపడింది ప్రసూన మనసు .....
"ప్రయత్నిస్తాను ....."
"అన్నివిధాలా ప్రయత్నించు .... కష్టానికి తగిన ప్రతిఫలం .... అదే __ డబ్బు .... దొరుకుతుందని చెప్పు ....
"అలాగే!"
ప్రసూనను పపించు రేఖను పిలిపించాడు సాంబశివం ......
మోహన్ ను లోబరుచుకునేందుకు ప్రసూనను నియమించినా, సాంబశివ౦ అనుమానాలు సాంబశివానికున్నాయి. మోహన్ శ్యామ్ పై ఎటువంటి చర్యా తీసుకోడనీ, శ్యామ్ మోహన్ ను లోబరుచుకునేందుకు తురఫానుగా పనికోస్తాడనీ తెలుసతనికి . అందుకే రేఖతో 'శ్యామ్ ను చెయ్యిజారిపోనీ వ్వద్ద' ని హెచ్చరించాడు. మోహన్ కోసం ప్రసూన నియమించబడిన సంగతీ చెప్పాడు.