"మనం కాదు- మీరే! ఇంకో గంట సేపట్లో నాయిల్లు వదిలి మీ బట్టలతో బయటకు పోవాలి మీరు-"
తనిచ్చిన ఆర్డర్ ఎంతసేపటికి రాకపోయేసరికి ఓ పెద్దమనిషి వెయిటర్ మీద మండిపడ్డాడు.
"ఏమిటోయ్ ఇది? ఆ? నువ్విలాగే ఆలస్యం చేస్తే నేను రాత్రంతా ఇక్కడ పస్తుండాలా? ఆ?"
"రాత్రంతా ఎలా వుంటారు సార్! మా హోటల్ పదింటికి మూసేస్తాం కదా! లోపల ఉన్నవాళ్ళందరినీ బయటకు గెంటాకే మూసేస్తాం-"
ఇద్దరు ఫ్రెండ్స్ మందుకొడుతూ తామంటే భార్యలకు ఎంత హడలో చెప్పుకుంటున్నారు.
"చలికాలంలో నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి డోర్ బెల్ కొడతాను కదా! తలుపు తీసి నన్ను చూడగానే వణికిపోతుంది" అన్నాడొకతను.
"మా ఆవిడకు నన్ను చూస్తే మరీ భయం! నిన్నరాత్రయితే మోకాళ్ళమీద కూర్చుని బ్రతిమాలేట్లు చేశాను-"
"ఎందుకు?"
"నేను మంచం కింద దాక్కున్నా కదా! బయటకు రమ్మని ఒకటే గొడవ"
ఒక సాంస్కృతిక సంస్థ ఓ పెద్ద భవనం నిర్మించుకుని ప్ర్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించింది. ఆ భవనం పేరు రవీంద్ర అని పేరు పెట్టడం గమనించి ముఖ్యమంత్రి వారిని అభినందించాడు.
"అంత గొప్ప రచయిత అయిన రవీంద్రనాథ్ పేరు పెట్టడం చాలా మంచి నిర్ణయం" అన్నారాయన.
"రవీంద్ర అనేది ఆ రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు కాద్సార్-ఇది ఇంకొకాయన"
"అలాగా! ఈ రవీంద్ర ఏమేం రాశారు?"
"ఒకే ఒక్క చెక్కు సార్-"
కృషి బాంక్ లాంటి ఓ దివాలా కోరు బాంక్ లోకి ఓ యువతి హడావుడిగా వచ్చింది-
"నేను బాంక్ లోన్ గురించి మాట్లాడ్డానికి వచ్చాను-"
ఆమె ఆ మాట అందో లేదో బాంక్ డైరెక్టర్లందరూ ఆమె చుట్టూ మూగిపోయారు.
"ఎంతిస్తారు మేడమ్?"
న్యూస్ పేపర్లో ఒక ప్రఖ్యాత ఫిల్మ్ ఎగ్జిబిటర్ చనిపోయిన ప్రకటన వచ్చింది.
"అనేక సినిమా థియేటర్లు నిర్మించిన ప్రముఖ ఎగ్జిబిటర్ శేషారెడ్డిగారు నిన్న రాత్రి పరమపదించారు. ఆయనకు మొత్తం పాతిక సినిమా థియేటర్లు ఉన్నయ్. ఆయన అంత్యక్రియలు మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో టైమింగ్స్ లో జరుపబడును"
తన బొమ్మ వేయమని ఒకావిడ ఒక పెయింటర్ దగ్గరకొచ్చింది. అతను వప్పుకున్నాడు.
"కానీ ఒక్క విషయం! నా వళ్ళంతా రకరకాల బంగారు నగలతో నిండిపోయి ఉన్నట్లు బొమ్మలో రావాలి-" అందామె.
"వేస్తానుగానీ- నిజంగా మీవంటి మీద ఒక్క నగకూడా లేదు కదా?"
"ఆ సంగతి నాకూ తెలుసు! కానీ ఒకవేళ నేను మా ఆయన కంటే ముందు చచ్చిపోతాననుకో! అప్పుడు మా ఆయన ఎలాగూ ఇంకోదాన్ని పెళ్ళిచేసుకుంటాడు. ఆ రెండో పెళ్ళాం నా బొమ్మ చూసి ఆ నగలకోసం వెతికివెతికి ఛస్తుంది"
టెర్రరిస్ట్ లు ఒక విమానాన్ని హైజాక్ చేశారు.
అందులో జార్జ్ బుష్, టోనీబ్లెయిర్, ముష్రఫ్, లాలూప్రసాద్ యాదవ్- ఈ నలుగురే పాసింజెర్లు!
"ఇంకో గంటలో ఈ ప్లేన్ బ్లాస్ట్ అయిపోతుంది" అన్నాడు ఆ టెర్రరిస్టుల్లో ఒకడు.
అందరూ టెర్రరిస్ట్ ని బ్రతిమాలటం మొదలుపెట్టారు.
"నీకేం కావాలో చెప్పు! అడిగినవన్నీ చేస్తాం! అంతేగానీ అనవసరంగా మమ్మల్ని చంపుతే నీకేమొస్తుంది?" అన్నారు వాళ్ళతో.
టెర్రరిస్ట్ నాయకుడు ఒక్షణం ఆలోచించాడు.
"ఆల్ రైట్! విమానం బ్లాస్ట్ అవ్వటం మాత్రం ఖాయం! అయితే మా దగ్గర ఒక్క పారాచూట్ మాత్రం ఎక్ స్ట్రా ఉంది. మీ నలుగురికీ నేను ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాను. మీ నలుగురిలో ఎవరికీ ఎక్కువ ఓట్లేస్తే ఆ ఒక్క వ్యక్తికీ ఆ పారాచూట్ ఇవ్వటం జరుగుతుంది" అన్నాడతను.
వెంటనే ఎన్నికలు జరిగాయ్.
నలుగురూ సీక్రెట్ గా తమ హక్కుని వినియోగించుకున్నారు. కౌంటింగ్ లో బుష్ కి ఒక్క ఓటు, టోనీబ్లెయిర్ కి ఒక్క ఓటు వచ్చాయి. ముషరఫ్ బ్యాలెట్ పేపర్ మీద ఎలక్షన్స్ ఇంకో పదేళ్ళ వరకు బాన్ చేస్తున్నాను అని రాశాడు.
ఇక లాలూ ప్రసాద్ బాక్స్ తీసి ఓట్లు లెక్కపెట్టాడు. టెర్రరిస్ట్ నాయకుడు. రెండు లక్షల ఓట్ల మెజరిటీతో లాలూ ప్రసాద్ గెలిచాడు.
ఒక సరసాల సోగ్గాడు సినిమా కెళ్ళేసరికి పక్క సీట్లో ఓ వయ్యారి భామ కనిపించింది.
"హాయ్" అంటూ పలుకరించాడు సోగ్గాడు.
"హాయ్- నాపేరు మాయ" అంది భామ హోయలొలకబోస్తూ.
"మీపేరులాగానే మీరు చాలా అందంగా ఉన్నారు-"
"నిజంగానా?"
"ఒట్టు- ప్రామిస్!" అంటూ ఆమె చేయి లాక్కుని ప్రామిస్ చేశాడు.
"ఇంకా ఆలస్యం ఎందుకు? మా ఇంటికెళ్దామా మరి? సరదాగా గడపొచ్చు" అంది భామ.
సోగ్గాడు తబ్బిబ్బయిపోతూ ఆమె అపార్ట్ మెంట్ కి చేరుకున్నాడు. హాల్లో సోఫాలో కూర్చుని ఆమెని కిస్ చేశాక ఎదురుగ్గా ఫోటో ఫ్రేమ్ లో ఒక యువకుడి ఫోటో కనిపించిందతనికి.
"అతనెవరు? మీ ఆయనా?" అడిగాడు సోగ్గాడు.
"ఛీ! కాదు" సిగ్గుపడుతూ అంది భామ.
"మీ బ్రదరా?"
"ఫో సిల్లీ! కాదు"
"మరెవరతను?"
"పిచ్చీ! ఇంకా కనుక్కోలేదా? నేనే- సెక్స్ మార్పిడి ఆపరేషన్ అవకముందే అలా ఉండేవాడినన్నమాట-"
ఒక తాగుబోతు తనతోపాటు ఓ కుక్కను కూడా బార్ కి తీసుకెళ్ళాడు.
బేరర్ వచ్చి "అదేమిటి" పందిని బార్లోకెందుకు తీసుకొచ్చావ్?" అన్నాడు చిరాగ్గా.
తాగుబోతు ఉలిక్కిపడి కుక్కవంక కాసేపు పరీక్షగా చూసి "ఏయ్- నీకేం కళ్ళున్నయా? లేవా? ఇది కుక్క- పందికాదు" అన్నాడు కోపంగా.
బేరర్ ఇంకా చిరాకుపడ్డాడు.
"నేను మాట్లాడింది నీతో కాదయ్యా మీ కుక్కతో-"
ఒక నారీమణీ ఆమె స్నేహితురాలిని తన నాలుగోపెళ్ళికి ఆహ్వానించడానికి వచ్చింది.
"మైగాడ్! అప్పుడే నాలుగో పెళ్ళా! నేను నీ మొదటి పెళ్ళికొచ్చాను- ఇంత త్వరగా మూడు పెళ్ళిళ్ళయిపోయాయని తెలీదు- ఇంతకూ నీ మొదటి భర్త ఎలా చనిపోయాడు?" అడిగింది స్నేహితురాలు.
"పాపం! ఆయన విషం కలిపిన పాయసం తాగారు-" జాలిగా చెప్పింది నారీమణీ.