ఐశ్వర్య పదిహేనేళ్ళపాటు ఓ సంస్థలో ఉద్యోగం చేశాక సడెన్ గా ఉద్యోగం మానేసింది. కొంతకాలమయినా సమాజసేవ చేయాలనేది ఆమె ఉద్దేశ్యం. అలాగే ఓ సోషల్ సర్వీస్ సంస్థలో చేరి పనిచేయటం ప్రారంభించింది. ఆ సంస్థవాళ్ళు డొనేషన్స్ కలెక్ట్ చేయాలని నిర్ణయించడంతో ఆమె రోడ్ మీద వచ్చేపోయేవారి దగ్గర డొనేషన్స్ తీసుకుంటోంది.
హఠాత్తుగా ఆమెకు తన మాజీ ఆఫీస్ లో కొలీగ్ రాజేష్ ఎదురయ్యాడు.
ఆమెను చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడతను.
"నాకు తెలుసు ఐశ్వర్యా! ఉద్యోగం మానేస్తే ఎవరికయినా ఇలాంటి గతి తప్పదు. నా మాట విని- ఇప్పటికయినా మన బాస్ దగ్గరకొచ్చి బ్రతిమాలుకో! ఈ అడుక్కు తినే బాధ తప్పుతుంది" అన్నాడతను.
వాలెంటైన్ డే కీ, చిల్డ్రన్ డే కీ దగ్గర సంబంధం ఉంది.
వాలెంటైన్ డే నుంచి సరిగ్గా తొమ్మిది నెలలకు చిల్డ్రన్స్ డే వస్తుంది.
పతియే ప్రత్యక్షదైవం టైపు ఇల్లాలొకావిడ హోమ్ మినిష్టర్ ని కలుసుకొని భోరున ఏడ్వటం మొదలుపెట్టింది.
"సంగతేమిటో చెప్పి ఏడ్వవమ్మా!" అన్నాడు హోమ్ మినిష్టర్.
"మా ఆయన చెర్లపల్లి జైల్లో ఉన్నాడండీ! అసలే బక్కప్రాణం. దానికితోడు జైల్లో అధికారులు మా ఆయన్తో చాలా కష్టమైన పనులు చేయిస్తున్నారంట. అలా శక్తికి మించిన పని చేయిస్తే ఆయన ఏదొక రోగంవచ్చి ఛావటం ఖాయం-"
వెంటనే ఆ విషయం జైలు అధికారులతో ఫోన్లో మాట్లాడాడతను.
"అంతా కనుక్కున్నానమ్మా! మీ ఆయనకు పగలంతా వీసమెత్తు పనికూడా చెప్పటం లేదంట!" అన్నాడాయన.
"ఆ సంగతి నాకు తెలుస్సార్. నేననేది రాత్రి సంగతి- అర్ధరాత్రిళ్ళులేచి పాపం ఆయన తెల్లారుజామున వరకు సొరంగం తవ్వాల్సివస్తోందిట-"
విచారంగా నిలబడి ఉన్న ఒక లాయర్ ని తోటి లాయర్ పలుకరించాడు.
"ఏమిటలా ఉన్నారు?"
"చూస్తున్నావ్ కదా! చలి ఎంత దారుణంగా ఉందో-"
"ఉంటేనేం? ఉలెన్ కోటు వేసుకున్నారుగా?"
"అదేనయ్యా! ఈ పాడు చలివల్ల ఇవాళ నా జేబులోనే నేను చేతులు పెట్టాల్సి వచ్చింది-" కన్నీళ్ళు తుడుచుకుంటూ విచారంగా అన్నాడా లాయర్.
"నాకు ఎప్పటినుంచో మా ఫామిలీ హిస్టరీ తెలుసుకోవాలని ఎంతో కోరికగా ఉంది. కానీ రాష్ట్రమంతా తిరిగి అన్నీ తెలుసుకోవాలంటే చాలా డబ్బు ఖర్చుపెట్టాలి ఏమిటి మార్గం?" ఫ్రెండ్ నడిగాడు గోపాలం.
"దాన్దేముంది? వెరీ ఈజీ! వచ్చే ఎలక్షన్లో నిలబడు! నీతో పోటీ చేసే కాండేట్ క్షణాల్లో నీ హిస్టరీ అంతా ఎంత డబ్బయినా సరే ఖర్చుచేసి బయట పెడతాడు"
ఓ స్టూడెంట్ హడావుడిగా పిజ్జాషాప్ లో కొచ్చాడు.
"అర్జంటుగా ఒక పిజ్జా పార్శిల్ చేసివ్వు-"
"నలుగు పీసెస్ చేయమంటారా? ఆరు పీసెస్ చేయమంటారా?"
"భలేవాడివే? నలుగు చెయ్- ఆరు తినటం మనవల్లకాదు-"
"అసలు సిసలయిన మ్యూజిక్ లవర్ అంటే ఎవరు?"
"బాత్ రూమ్ లో నుంచి ఓ అమ్మాయి పాట పాడుతోంటే- బాత్ రూమ్ డోర్ బయట నిలబడి కీ హోల్ కి చెవి ఆనించి వినేవాడు-"
మీటియోరాలజీ డిపార్ట్ మెంట్ ఇంటర్ వ్యూలు నిర్వహిస్తోంది. ఉన్న నాలుగు పోస్ట్ ల కోసం నాలుగువేల మంది అప్లయ్ చేయటం ఇంటర్ వ్యూ అధికారులకు చికాకు కలిగిస్తోంది.
"ఈ జాబ్ కోసం ఎందుకింతమంది పోటీ పడుతున్నారు?" ఓ అభ్యర్ధిని అడిగాడు అధికారి.
"ఇందులో ఆశ్చర్యమేముంది సార్! ప్రపంచంలో మీ డిపార్ట్ మెంట్ ఉద్యోగాల్లో మాత్రమే రోజూ నూటికి నూరు శాతం తప్పులు చేసినా ఎవడూ పట్టించుకోడు- ఉద్యోగం పోదు-"
జడ్జీ బోనులో నిలబడ్డ వ్యక్తివేపు చూశాడు.
"పోలీస్ వచ్చే సమయానికి నువ్వేం చేస్తున్నావ్?"
"వెయిటింగ్ సర్"
"ఎవరికోసం వెయిటింగ్?"
"డబ్బు ఇవ్వాల్సినతని కోసం సార్"
"ఎవరతను?"
"నేనెవరికోసమయితే వెయిట్ చేస్తున్నానో అతను సార్"
"ఎందుకు వెయిట్ చేయమన్నాడతను?"
"నాకు డబ్బివ్వటం కోసం సార్-"
"డబ్బెందు కివ్వాల్సివచ్చాడతను?"
"నేను వెయిటింగ్ చేసినందుకు సార్-"
జడ్జీ చిరాకుగా తలపట్టుకున్నాడు.
"నీకేమయినా పిచ్చెక్కిందా? సరే ఆ సంగతొదిలేసెయ్! వెయిటింగ్ చేసే ముందు నువ్ ఏం చేశావ్?"
"అప్పుడు కూడా వెయిటింగ్ చేశాను సార్"
"అబ్బా- నాకు పిచ్చెక్కి పోతోంది. అసలు నువ్ చేసే ఉద్యోగం ఏమైనా ఉందా?"
"ఉంది సార్"
"ఏమిటది?"
"వెయిటర్ ఉద్యోగం సార్?"
ఒక ఆర్టిస్ట్ తన పెయింటింగ్స్ ఎంతకూ అమ్ముడు పోకపోయేసరికి ఆఖరి ప్రయత్నంగా బోలెడు అప్పుచేసి ఒక పెద్ద ఎగ్జిబిషన్ పెట్టాడు.
ఆఖరి రోజున ఆ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన బ్రోకర్ దగ్గర కొచ్చాడు ఆర్టిస్ట్.
"నా పెయింటింగ్స్ ఎవరికయినా నచ్చాయా?" ఆశగా అడిగాడు.
"నీకో శుభవార్త- ఒక దుర్వార్త" చెప్పాడు బ్రోకర్.
"శుభవార్తేమిటి?"
"ఒక వ్యక్తి వచ్చి ఈ చిత్రాలు గీసిన ఆర్టిస్ట్ చనిపోయాక వీటికి మంచి డిమాండ్ ఉంటుందా? అని అడిగాడు. చాలామంచి డిమాండ్ ఉంటుందని చెప్పాను. వెంటనే అతను ఎగ్జిబిషన్ లోని నీ పెయింటింగ్స్ అన్నీ కొనేశాడు-"
"మైగాడ్! నిజంగానా?" ఆనందంతో పొంగిపోయాడు ఆర్టిస్ట్.
"ఇక దుర్వార్తేమిటంటే అవి కొన్న వ్యక్తి నీ ఫామిలీ డాక్టర్-"
తలకూ చేతులకూ బాండేజ్ వేసుకుని ఓ గుమాస్తా గంట ఆలస్యంగా ఆఫీస్ కొచ్చాడు.
"ఎందుకు గంటలేటయింది?" అడిగాడు బాస్.
"మెట్ల మీద నుంచీ పడిపోయాన్సార్-"
"దానికి గంటసేపు పడుతుందా?"
ఎప్పుడూ పెళ్ళాన్ని వేధించుకు తినే ఓ భర్తారావ్ కి ఓ రోజూ భార్య, ఆమె ఆఫీస్ నుంచి ఫోన్ చేసింది.
"ఏమండీ! ఎంత గొప్ప శుభవార్తో తెలుసా? నేను కొన్న టికెట్ కి కోటి రూపాయలు లాటరీ వచ్చింది. ఇంక లైఫంతా ఎంజాయ్ మెంటే! మీరు వెంటనే మీ బట్టలు సర్దేయండి-"
"అంటే మనం ఎక్కడికైనా టూర్ వెళ్తున్నామా?" ఆనందంగా అడిగాడు భర్త.