Previous Page Next Page 
బెస్ట్ జోక్స్ పేజి 10


    "మరి నీ రెండో భర్త?"
    "ఆయనా అంతే- సేమ్ టు సేమ్- విషం కలిపినా పాయసం తాగారు"
    "అయ్యోపాపం! మరి మీ మూడో భర్త ఎలా పోయారు?"
    "ఆయన నెత్తి పగిలి చనిపోయారు"
    "నెత్తిపగిలా? ఎలా పగిలింది?"
    "ఎన్నిసార్లడిగినా, బ్రతిమాలినా పాయసం తాగనన్నాడు మరి!"

    "వాడితో కొంచెం జాగ్రత్త! వాడు వట్టి పుస్తకాల పురుగు- బుక్స్ కనబడితే చాలు వదలడు"
    "అలాగా! ఏం బుక్స్ లైక్ చేస్తాడు?"
    "చెక్ బుక్స్-"

    ఏమేవ్ రాణీ! నువ్ రాధాకృష్ణతో ఫ్రెండ్ షిప్ చేస్తున్నావ్- జాగ్రత్త! వాడు మరీ అనుమానపు పక్షి! గతం అడుగుతాడు, ప్రస్తుతం అడుగుతాడు- భవిష్యత్తు అడుగుతాడు-"
    "అడగనీ! నేను ఎవరిదగ్గరా ఏమీ దాయను కదా! నాజీవితం- ఒక తెరచిన పుస్తకం లాంటిది-"
    "నిజమేగానీ- వాడికి రాత్రుళ్ళు బెడ్ మీద పడుకుని పుస్తకాలు చదవటం అలవాటు అదికూడా ఆలోచించుకో మరి"

    "ఏమిటే? రాకేష్ నువ్వూ తెగ తిరుగుతున్నారు? నిన్ను లవ్ చేశాడా?"
    "కాస్తాకూస్తా కాదు- చాలా గాఢంగా లవ్ చేస్తున్నాడు- నేను ఎయిత్ వండర్ నని తెగ పొగుడుతున్నాడు-"
    "కరెక్టే-ఇంతవరకూ సెవెన్ వండర్స్ ని లవ్ చేసి వదిలేశాడు- నీది ఎయిట్ నెంబర్-"
    "ఏమండీ- ఎప్పుడూ నీకు వంటరాదు- నీకు వంటరాదు అంటూ నన్ను ఎత్తిపొడుస్తారుగా! వచ్చే నెల నుంచీ వంటమనిషిని మాన్పించి నేనే బ్రహ్మాండంగా వంట చేసి చూపిస్తా! మరి నాకేమిస్తారో చెప్పండి-"
    "పిచ్చిదానా! ఇంకా నేనివ్వటమెందుకే! ఇన్సూరెన్స్ కంపెనీవాళ్ళు నేను చేసిన పది లక్షల పాలసీ మొత్తం నీకిచ్చేస్తారు-"

    ఓ ఆఫీసర్ గారు చాలా రోజుల్తరువాత ఒక బూజుపట్టిన ఫైల్ ని తీసుకొచ్చిన గుమాస్తా రామారావ్ ని చూసి జాలిపడ్డాడు.
    "ఏమోయ్ రామారావ్! ఎప్పట్నుంచో నిన్నో విషయం అడుగుదామనుకుంటూంటే నువ్ నా రూమ్ వేపే రావటం లేదు-"
    "అడగండి సార్!"
    "నువ్వు మా ఆఫీస్ లో చేరిన దగ్గర్నుంచీ ఇంతవరకూ ఒక్క రోజు కూడా శెలవు తీసుకోలేదు- ఎందుకని?'
    "చాలాసార్లు తీసుకుందామని ట్రై చేశాను సార్! కానీ మా డాక్టర్ ఒప్పుకోలేదు. లైఫ్ లాంగ్ పూర్తి విశ్రాంతి అవసరమని చెప్పాడు. రిటైరయాక ఎలాగో ఏమిటో మరి!" అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు రామారావ్.

    "డాక్టర్ గారూ! నేను శ్రీమతి సురేఖను మాట్లాడుతున్నానండీ!"
    "చెప్పండి సురేఖగారూ! ఇంత అర్దరాత్రి ఫోన్ చేశారేమిటి? ఎనీ ప్రాబ్లెమ్?"
    "అవునండీ! మా ఆయనకు కడుపు నొప్పిగా ఉంది. మీరు వెంటనే రావాలి-"
    "పొద్దున్నే వస్తాన్లేండి! ఇప్పుడొచ్చినా చేసేదేముంది? అంతవరకూ ఏదొక కడుపునొప్పి టాబ్లెట్ వేసుకోమనండి-"
    అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ మోగింది.
    "హలో డాక్టరుగారూ! మా ఆయనకు కడుపునొప్పి ఎక్కువయిపోయిందండీ! మీరు వెంటనే రావాలి-"
    "ఇప్పుడు వచ్చి ఉపయోగం ఏమీ లేదండీ! ఇంకో నాలుగ్గంటలు ఓపిక పట్టమనండి! ఈలోగా తెల్లారిపోతుంది-"
    "లాభం లేదండీ! అది అపెండిసైంటిస్ అని అనుమానంగా ఉంది- మీరు వెంటనే రావాలి"
    "భలేవారే- మీ వారి అపెండిసైటిస్ రెండేళ్ళ క్రితమే ఆపరేషన్ చేసేశాను కదండీ- రెండోసారి అపెండిసైటిస్ రాదు. అర్ధమయిందా?"
    "అయిందిగానీ మీరు మాట్లాడుతోంది నా మొదటి భర్త సంగతి! నేను మాట్లాడేది నా రెండో భర్త సంగతి"

    శంకర్రావ్ తను పెళ్ళి చేసుకోబోయే అమ్మాయికి మంచి కారెక్టర్ ఉండాలని ముచ్చట పడ్డాడు. చాలామంది అమ్మాయిలను చూశాడు గానీ అందరికీ ఏదొక లోపం ఉండడంతో కొంచెం నిరాశపడ్డాడు.
    చివరకు అనుకోకుండా ఓ మారేజ్ పార్టీలో అతనికో అందమయిన అమ్మాయితో పరిచయమయింది.
    ఆరునెలలపాటు ఆ అమ్మాయిని కలుసుకుంటూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాక తనకు ఆ అమ్మాయి సూటవుతుందన్న అభిప్రాయానికొచ్చాడు.
    ఆయనా ఇంకా ఆ అమ్మాయి గురించి పూర్తి వివరాలు  తెలుసుకోడానికి డిటెక్టివ్ సంస్థను ఆశ్రయించాడతను.
    "ఫలానా అమ్మాయి కారెక్టర్ గురించీ, నడత గురించీ, ఫామిలీ గురించీ పూర్తి వివరాలు సేకరించి ఇవ్వండి" అని కోరాడు వాళ్ళను.
    పదిరోజుల్లో వాళ్ళు అతనికి రిపోర్ట్ అందజేశారు.
    "మీరు కోరిన విధంగా ఫలానా అమ్మాయి గురించి పూర్తి వివరాలు సేకరించాము. ఆమె ప్రవర్తన, నడత, ఫామిలీ బాక్ గ్రౌండూ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నయ్! ఎటొచ్చీ ఆరునెలల క్రితం నుంచీ ఆమె ఒక చిల్లర వెధవతో తిరగటం ప్రారంభించింది. వాడు వట్టి రోగ్! ఎందుకూ పనికిరాని వెధవ! కన్న తల్లిని కూడా అనుమానించే నీచపు మెంటాలిటీ వాడిది. అలాంటి వెధవ వలలో పడటం వల్ల ఈ ఆర్నెల్లుగా ఆమె కారెక్టర్ ని కూడా అనుమానించాల్సి వస్తోంది-"
    "అవున్సార్! మీరు కోరినట్లు అన్నీ మీకు వ్యతిరేక గుణగణాలున్న అమ్మాయి సంబంధాన్నే సెలెక్ట్ చేసి తీసుకొచ్చా! మీకు సహనం ఎక్కువ- ఈ అమ్మాయికి కోపం ఎక్కువ! మీకు వెజ్ ఇష్టం! ఈ అమ్మాయికి నాన్ వెజ్ ఇష్టం- మీకు రాజీపడటమంటే నచ్చదు. ఈ అమ్మాయిది రాజీపడేతత్వం-"
    "ఇదిగో! నువ్ నన్ను సరిగ్గా అండర్ స్టాండ్ చేసుకోలేదు పెళ్ళిళ్ళ పేరయ్యా! నాకు వ్యతిరేక స్వభావంగల అమ్మాయి అంటే నా ఉద్దేశ్యం, నా లెవల్ కి వ్యతిరేకం అని!"
    "నాకింకా అర్ధం కాలా? కొంచెం వివరంగా చెప్పకూడదూ?"
    "అదేనోయ్- నేను ఒక్కపైసా కూడా ఆస్తిలేని వాడిని! నా ఉద్యోగం కూడా ఎందుకూ పనికిరాని ఉద్యోగం! అంటే ఆ అమ్మాయి ఎలా ఉండాలన్న మాట?"
    "అర్ధమయింది మహా ప్రభో- మీకు కాష్ పార్టీ గాళ్ కావాలి! అంతేకదా! కానీ గాళ్స్ తమలెవల్ కి సేమ్ లెవెల్ బాయ్స్ కావాలని అడుగుతున్నారండీ-"

    ఇద్దరి అతి తెలివిగలాళ్ళు మందుకొడుతూ మాట్లాడుకుంటున్నారు.
    "ఒరేయ్- పరగడుపున ఎన్ని పెగ్గుల బ్రాందీ తాగ్గలవో చెప్పు- చూద్దాం!" అన్నాడొకడు.
    "నాతోపెట్టుకోకరేయ్- ఆరుపెగ్గులు కొట్టి కూడా స్టడీగా ఉంటా!"
    "నీ తెలివి తగలెయ్యా! మొదటి పెగ్గులో మొదటి సిప్ కొట్టగానే నువ్వింక మిగతామందు పరగడుపున తాగినట్లెలా అవుతుందిరా?" రెండోవాడు పగలబడి నవ్వుతూ అన్నాడు.
    ఆ సాయంత్రమే అతను ఇంకో ఫ్రెండ్ తో మందుకొడుతున్నాడు.
    "చూడవోయ్- పరగడుపున నువ్వు ఎన్ని పెగ్గుల బ్రాందీ తాగ్గలవ్?" ఫ్రెండ్ నడిగాడు రెండోవాడు.
    "మూడు" అన్నాడా ఫ్రెండ్.
    "రెండోవాడు చిరాకుపడ్డాడు. "ఛ! మంచి జోక్ నాశనం చేశావ్! ఆరు పెగ్గులు అని జవాబిచ్చి ఉంటే బ్రహ్మాండమైన జోక్ పేల్చేవాడిని-"

 Previous Page Next Page