Previous Page
Next Page
కూచిపూడి కళాసాగరము పేజి 7
30. తక్కిణాంతకిణ్ణ తతఝొం ! తా కిటతక ఝే కిటతక తా కిటతక ఝెం !! తా
____ ___ ___
కిటతక ఝెం !! తా కిటతట ఝెం కిటతక ఝెం ! తాం త త్తాధిమితధీం గిణతతా!! తాం తత్తాధిమితదీంగిణతతా !
___ ___
తాంత త్తాధిమితదీంగిణతతా!!
జతి సంపుటీ కరణాక్షరములు :_
శ్లో!! తాళశబ్దేనజాతా స్తుపంచత్రిం శతివర్ణకాః,
తాటతోధై దధీధూధే డఢి ధూఢే ఘఘే
ణణే కకి గూగే రిరూరారే విలూవేలామ
యూయ ళా హహ్వానుస్వార యు క్తంచ
భరతశ్చేతి లక్షణమ్ !!
త, ట తోతై, ద, ది, దు, దే, డా, ఢి, దూ, డే. ఝ, ఝే, ణ, ణే, క, గీ, గూ, గే, రె, రూ, ర. రే, వి, లూ. వే. లా, మ. యూ. య, ళ, హ, హుః;__ను,
ఈ ముప్పది అయిదు శబ్దములును, వీని దీర్ఘములును, వీనికి వ్యాకరణ ప్రకారముగా గలుగు, అభేదాక్షరములును, తదనుగుణ్యమైన యెత్తులును, సంధులును, జతిప్రాణములైన శబ్దము లగుచున్నవి. ఇట్టి శబ్దములతో శ్రావ్యమైన జాతులు కూర్చియు, కల్పించియు, శబ్దోచ్చారణ గావించుచు కొలిపించవలయును. (ఈ విధముగా నాట్యాచార్యులు స్వకల్పనలుచేసి వేనవేలుగా జతులు కల్పించి ఆడుదురు. దీనినే మనోదండి విద్యయని కూచిపూడివారు చెప్పుదురు.) (జతి సంపుటీకరణాక్షరములతో విశేషముగా జతులు కల్పించవచ్చును. నాట్యాచార్యులు, ఊహాపోహ సమర్ధుడు మంచి తాళలయ జ్ఞానము కలవాడు. యైయుండవలయును.)
తా ళా ధ్యా య ము
(సప్తతాళ ప్రకరణము)
శ్లో!! ధృవమఠ్యా రూపకశ్చ ! జంపే త్రిపుటఏవచ
అటతాళేచ ! సప్తతాళ ప్రకీర్తితాః !!
సప్తతాళ క్రమము చక్కగా తెలియుచున్నది.
1. ధృవతాళ లక్షణమ్ :_
శ్లో!! త్రిశ్రీజాతి గురుశ్శై వ చతురశ్రీలఘుద్వయం !!
తిశ్రజాతి గురుపు ఒకట్టిన్ని. చతురశ్ర జాతి లఘువులు రెండున్ను
ఈ మూడు అంగములు గూడగా ధృవతాళ మాయెను.
శ్లో!! భానువారే పుష్యఋక్షే ! ధృవతాళ సముద్భవః !
శ్యేత వర్ణో విశాలాక్షి తారమాల విశోభితః !!
శుభ్రవస్త్రా ధరంచైవ ! శాండిల్యశ్చ ఋషిస్వయం !
శ్రుంగారసోనుష్టాత్ ! చందోబ్రహ్మాది దేవతః !!
అయం !! జంబుద్వీపవాసి లఘుధృత గురు స్తధా !
ఇదం లోకహితార్దాయ ! భరతజ్ఞ ప్రయుజ్యతే !!
తా:_ ఆదివారం పుష్యమి నక్షత్రము ధృవతాళము పుట్టెను. తెల్లని వర్ణము, పెద్ద నేత్రములు, ముత్యముల హారము ధరించినది. ప్రకాశమానమైన శ్వేతవస్త్రము కలది. శాండిల్యఋషి చేసినది. శృంగారరసము కలది. శ్చందస్సు, ఆనుష్టు బ్రహ్మాదిదేవత. జంబుద్వీపమున నివసించునది. లఘువు, ధృతము, రెండు లఘువులు కలిగినది. పదునాలుగు అక్షరములు కల్గి లోకహితవు కొరకు భరతజ్ఞులు చెప్పియున్నారు.
ధృవతాళం. అక్షరములు 14. అంగములు 4.
అంగసౌంజ్ఞ
1_0_1_1
ల_దృ_ల_ల
అనుకరణ : వేలికి ఒక అక్షరక చొప్పున.
జతి/. తకఝెంణు ! తక ! తధిమిత ! కిటతక
2. _: మఠ్యతాళ లక్షణము :_ మఠ్యతాళము
_________ ______
శ్లో!! లఘుధృతో లఘుశ్ఛైవ ! మఠ్యతాళ ప్రకీర్తితః
సోమవారే అస్తరుక్షే ! మఠ్యతాళ సముద్భవః !
శ్యామవర్నో మహాకాయే ! నానాభరణ భూషితః !!
రక్తవస్త్రంధరం చై వాభరద్వాజ ! ఋషిస్వయం వీరసస్య !
బ్రుహచ్చందో ! మహేశ్వరీ తథా !!
ఆయం !! ప్లక్షద్వీపవాసి, లఘుధృత లఘు స్తథా !
స్వమతి యస్తుతంతాలం ఆశ్వమేథభలం భవేత్ !!
తా:- పది అక్షరములు, లఘువు, ధృతము, లఘువు, మఠ్యతాళ స్వరూపముగా నున్నది. సోమవారం అస్తమీ నక్షత్రమున బుట్టెను. పచ్చని వర్ణము గలది. పెద్దశరీరము గలది. అనేక ఆభరణములు గలది. యర్రని వస్త్రములు ధరించినది. భారద్వాజఋషి స్వయముగా చేసినది, వీరరసము గలది. బృహతీయను ఛందస్సు కలది. మహేశ్వరి అధిదేవత. పక్షధ్వీప మందు నివాసము. లఘువు. దృతము, లఘువు కలది. బుద్ధిమంతుడు ఈ తాళమును వాయించితే ఆశ్వమేధ యాగము చేసినంత పుణ్యము వచ్చును.
Previous Page
Next Page